కోమలమైన ముఖం, చెరగని చిరునవ్వు బాలీవుడ్ భామ మనీషా కొయిరాలా సొంతం. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అనూహ్యంగా ఆమెకు ఏడేళ్ల క్రితం క్యాన్సర్ మహమ్మారి సోకింది. కానీ ఆ క్యాన్సర్ రక్కసితో చేసిన సుదీర్ఘ పోరాటంలో ఆమెదే పైచేయి అయింది. క్యాన్సర్ కుంగదీస్తుందంటారు. కానీ ఆ కుంగుబాటుకు నుంచి త్వరగానే బయటపడి సానుకూల ఆలోచనలతో అందరినీ అబ్బురపరిచేది. ఈ క్రమంలో బుధవారం మనీషా ఇన్‌స్టాగ్రామ్‌లో స్ఫూర్తిదాయక పోస్ట్ చేశారు. దీనికి ‘బలాన్ని తిరిగి కూడగట్టుకుంటున్నాను’ అని క్యాప్షన్ జోడించారు. అడవిలో నడుచుకుంటూ వెళ్తున్న కొన్ని ఫొటోలను ఆమె పంచుకున్నారు. ఈ సందర్భంగా రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన శక్తిమంతమైన పద్యాన్ని గుర్తు చేసుకున్నారు. ‘జీవితం అందమైనది, లోతైనది, కొన్నిసార్లు చీకటిమయంగానూ ఉంటుంది. కానీ ఏది ఏమైనా నేను శాశ్వతంగా నిద్రించేలోపు ఎన్నో బాధ్యతలు పూర్తి చేయాల్సి ఉంది’ అని రాసుకొచ్చారు. (అది వ్యవసాయం కాదు ఆడుకోవడం అంటారు)
ఆమె ఎప్పుడూ అభిమానుల మెదడులో పాజిటివ్ దృక్పథాన్ని నింపేందుకే ప్రయత్నిస్తారు. ఒక పోస్టులో ఆమె 'రహదారి నాకు గురువు' అంటారు. మరో పోస్టులో 'ఈ క్వారంటైన్‌లో మీకు సంతోషాన్ని, ప్రశాంతతను అందించే హాబీని వెతుక్కోండి' అని సూచిస్తారు. ఇలా ఆమె సోషల్ మీడియాలో చేసే పోస్టులన్నీ ఉత్తేజభరితంగా, మంచి మాట చెప్తున్నట్లుగా ఉంటాయి. కాగా 2012లో అకస్మాత్తుగా వచ్చిన అండాశయ క్యాన్సర్ ఆమె జీవితాన్ని మార్చివేసింది. జీవించేందుకు రెండో అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ ఆమె చికిత్స ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె క్యాన్సర్ ఎలా జయించిందో పేర్కొంటూ 'హౌ క్యాన్సర్ గేవ్ మి ఎ న్యూ లైఫ్' అనే పుస్తకాన్ని రాశారు. ఆమె చివరిసారిగా 'మస్కా' అనే చిత్రంలో కనిపించారు. (ఇండియా- నేపాల్ సరిహద్దు వివాదంలో హీరోయిన్!)
Comments
Please login to add a commentAdd a comment