మోదీజీ...విడి సిగరెట్లను నిషేధించండి | Cancer Survivor Writes to PM Narendra Modi for Ban on Loose Cigarettes | Sakshi
Sakshi News home page

మోదీజీ...విడి సిగరెట్లను నిషేధించండి

Published Thu, Dec 4 2014 8:01 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

Cancer Survivor Writes to PM Narendra Modi for Ban on Loose Cigarettes

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి క్యాన్సర్ బారి నుంచి బయటపడిన మాజీ కస్టమ్స్ కమిషనర్ కుమార్ లేఖ రాశారు. విడి సిగరెట్ల అమ్మకాలపై నిషేధం విధించాలంటూ ఆయన గురువారం మోదీకి లేఖలో విజ్ఞప్తి చేశారు. తనకు 2008లో క్యాన్సర్ సోకినట్లు గుర్తించారని, తన స్వరపేటికతో పాటు నాలుకను కూడా సగం తొలగించారని కుమార్ తన లేఖలో కోరారు.

క్యాన్సర్ వల్ల ఆహారం తీసుకోవడం, మాట్లాడం తనకు ఇప్పుడు అతి పెద్ద సవాల్గా మారిందని, మరో వ్యక్తికి అటువంటి దుస్థితి రాకుండా ఉండాలంటే విడిగా సిగరెట్ల అమ్మకాలపై నిషేధం విధించాలని కుమార్ లేఖలో పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement