cigarettes
-
డియర్.. నిప్పులేకుండానే కాలుద్ది జాగర్త!
ఖగపతి యమృతము తేగాభుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్పొగ చెట్టై జన్మించెనుపొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్అని గిరీశం దొరవారు ఎన్నడో సెలవిచ్చారు. ఇప్పుడు పొగపురాణాన్ని తిరగరాసుకోవాల్సి వచ్చేలా ఉన్నది. కమలపతి వడ్డన సేయగపొగచుట్టకు పన్ను పోటు బాగా ముదిరెన్రెక్కలతో ధరలు ఎగరగఅగ్గిపుల్ల లేకున్నా జేబులు కాలున్..అని కొత్తగా తోచిన పజ్జేలు రాసుకుని వాటిని పారాయణం చేసుకుంటూ గడపవలెను. దమ్ము కొట్టాలనిపించినప్పుడెల్లా.. నరాలు పట్టు తప్పి, జిహ్వ లాగి, భయం పుట్టి, వణుకుతో శరీరం కంపించి.. ఇక ఆ ఆలోచననే ధూమపాన ప్రియులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చేలా ఉన్నది మరి! ఢిల్లీ పాలకులు సిగరెట్టుల మీద పన్ను పోటును ఏకంగా 35 శాతానికి పెంచేయాలని తలపోస్తున్న తరుణంలో.. సిగరెట్టును తలచుకుంటే చాలు.. పర్సు కాలి చురుక్కు మంటుందని అనుకోవాల్సిందే.సిగరెట్టు అనగా ఏమిటి? మన లోలోపల గూడుకట్టుకుని ఉండే క్రియేటివిటీ అనే పదార్థాన్ని కరిగించి గంగాప్రవాహంలా వెలుపలికి లాక్కుని వచ్చే ధూమపరికరము కదా.. అని భాష్యం చెప్పగల మహానుభావులు మనకు చాలా మంది కనిపిస్తుంటారు. ‘భలే భలే ఓ సిగరెట్టు.. చేస్తావే బహు కనికట్టు.. చైతన్యానికి తొలిమెట్టు.. బద్ధకముంటే పని పట్టు..’ అంటూ సిగరెట్టు దమ్ము లాగి వదిలితే తప్ప తమలో జీవనోత్సాహం ఇనుమడించదని, దేహశకటం పరుగులెత్తదని నమ్మే ప్రబుద్ధ జీవులు కూడా కొందరుంటారు. పుర్రె బొమ్మ ఉన్నంత మాత్రాన చాపల్యం చావదని, చావు డప్పు మోగుతుందని తెలిసినా ధూమప్రేమ విలోమం కాదని నిరూపించే నిత్య సత్యమే సిగరెట్టు!ఉదయముననే మేల్కాంచి తమ స్నానాలగదిలోకి దూరి తమ చుట్టూ ధూపం వేస్తే తప్ప కాలకృత్యపర్వం కూడా ముగించలేని నిత్య అంకితులు కొందరుంటారు. తమ మునివేళ్ల చివరల్లోమండే అందాల్ని తమకు దూరం చేయాలనే కుట్ర ఏదో అధికారాత్మకంగా జరుగుతున్నదని అనుమానించే సత్యశంకితులు కొందరు ఉంటారు! ఎవరి సంగతి ఎలా ఉన్నప్పటికీ.. సిగరెట్టు అనే పదార్థము తాజా పరిణామముల నేపథ్యములో.. నిప్పు లేకున్ననూ మండును.. మీ బతుకును పొగించడం మాత్రమే కాదు.. తెగించి ముట్టిస్తే నోటిచివర మండుట మాత్రమే కాదు సుమీ.. జేబులోని సొమ్ములను కూడా దహించి మసిచేయును.. అనే భావన ఇప్పుడు దేశ ప్రజలలో వేళ్లూనుకొనుచున్నది!సిగరెట్టు మీది అపరిమితమైన ప్రేమతో, అది అమూల్యమైన వస్తువని గుర్తించి.. దాని విలువను ఆకసమునందలి నక్షత్రాల సరసన ఉంచినప్పుడే దానికి సద్గతి కలుగునని ఏలికలు గ్రహించడమే ఒక చిత్రమైన సంగతి. అందుకే జీఎస్టీ అను జోడింపులో కాస్త పెంపు జత చేసి 35 శాతం వడ్డించడం తగు విధాయకం అని నిర్ణయించడం తాజా తాజా సంగతి! ఇటువంటి పరిస్థితుల్లో సిగరెట్టు అను పరికరముతో దమ్ము కొట్టాలన్నా.. దాని వెంబడి శీతల పానీయములు అనబడు ద్రావకములు గుటక వేయాలన్నా.. బహు కష్టము అని ప్రజలు తెలుసుకోవడం ఒక్కటే ఇంకా పెండింగులో ఉన్నది.ఇటువంటి వికట పరిస్థితులలో.. ధూమ ప్రేమికులకు గత్యంతరమేది? అను సందేహము జనులలో జనియించుట సహజము! పరిష్కారము బహు సులభము. ఓ తెల్లటి కాగితము మీద.. సిగరెట్టును చిత్రించి.. ఓ చివరన పెదవుల బంధమును, మరో చివరన పొగ కెరటములను చిత్రించి.. జిహ్వ లాగినప్పుడెల్లా దానిని చూచుకొనుచూ యుండవలెను. అటుల జేసిన యెడల.. జూచుచూ గడిపిన యెడల.. ధూమపానాసక్తులకు అనుభవైకవేద్యమైన పురాఅనుభవము.. పునః అనుభవములోకి వచ్చి ఆత్మానందము కలుగును. మరియొక మార్గము దుర్లభము. స్వస్తి. ..ఎం. రాజేశ్వరి -
సిగరెట్ తాగడం మానేస్తున్నా.. కానీ ఇప్పటికీ..: షారూఖ్
బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ సిగరెట్‌కు బానిస.. రోజుకు ఒకటీరెండు ప్యాకెట్లు కాదు ఏకంగా వంద వరకు సిగరెట్లు కాల్చేవాడు. ఇలా అస్తమానూ సిగరెట్లు తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా? అని అటు కుటుంబం, ఇటు అభిమానులు ఎంతో కంగారుపడేవాళ్లు. ఈ వ్యసనానికి దూరం కావాలని షారూఖ్ ఎన్నోసార్లు అనుకున్నాడు. చివరాఖరకు ఆ వ్యసనంపై విజయం సాధించానంటున్నాడు. నవంబర్ 2న బర్త్‌డే జరుపుకున్న ఇతడు అభిమానులను కలుసుకునేందుకు మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ ఏర్పాటు చేశాడు.గుడ్ న్యూస్ఈ కార్యక్రమంలో షారూఖ్ మాట్లాడుతూ.. 'మీకో మంచి విషయం చెప్పబోతున్నాను. నేను సిగరెట్లు తాగడం ఆపేశాను. కానీ దమ్ము లాగడం ఆపేశాక కూడా శ్వాససమస్యలు తగ్గలేదు. ఇప్పటికీ కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడుతూనే ఉన్నాను. దేవుడి దయ వల్ల త్వరలోనే ఈ ఇబ్బంది కూడా పోయి అంతా బాగుంటుందని ఆశిస్తున్నాను' అన్నాడు. షారూఖ్ నోటి నుంచి ఈ మాటలు వినగానే అభిమానులు సంతోషంతో చప్పట్లు కొట్టారు.తిండి కూడా మానేసి..కాగా 2011లో ఓ ఇంటర్వ్యూలో షారూఖ్.. తాను రోజుకు వంద సిగరెట్లు తాగిన విషయాన్ని బయటపెట్టాడు. తిండి, నీళ్లు అన్నీ మానేసి కేవలం దమ్ము కొడుతూ కూర్చునేవాడినన్నాడు. 30 కప్పుల బ్లాక్ కాఫీ తాగి సిక్స్ ప్యాక్ మెయింటెన్ చేశానన్నాడు. అప్పట్లో ఈ కామెంట్లు తెగ వైరలయ్యాయి. ఇకపోతే షారూఖ్ ప్రస్తుతం కింగ్ అనే సినిమా చేస్తున్నాడు. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ విలన్‌గా కనిపించనున్నాడు. “I am not smoking anymore guys.” - SRK at the #SRKDay event ❤️❤️ #HappyBirthdaySRK #SRK59 #King #ShahRukhKhan pic.twitter.com/b388Fbkyc4— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) November 3, 2024 చదవండి: హీరోయిన్ ఎవరనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తున్నారు: తాప్సీ -
సిగరెట్స్ కంటే వేపింగే డేంజరా? హఠాత్తుగా శరీరం..
సిగరెట్స్ ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి చాలా మంది ఇప్పుడు వేపింగ్ వైపుకి మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా టీనేజర్స్ దీనికి బాగా ఎడిక్ట్ అవుతున్నారు. అలానే ఇక్కడొక యువతి దీనికి అడిక్ట్ అయ్యి చావు అంచులదాక వెళ్లి వచ్చింది. అదృష్టంకొద్ది ప్రాణాలతో బయటపడింది. ఆమె సిగరెట్ వేపింగ్ మాదిరిగా ప్రమాదకరమైనది కాదనుకుని చేజేతులారా ఇంతటి పరిస్థితి కొని తెచ్చుకున్నానని బాధగా చెప్పింది. అసలేంటి ఈ వేపింగ్? సిగరెట్స్ కంటే ప్రమాదకరమా..?యూకేకి చెందిన 17 ఏళ్ల అమ్మాయి వేపింగ్‌కి అడిక్ట్ అయ్యింది. దీంతో ఊపిరితిత్తుల్లో గాయమై ఒక్కసారిగా పనిచేయడం మానేశాయి. ఇది ఆమె సరిగ్గా మే11న తన స్నేహితురాలి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో జరిగింది. నిద్రలోనే శ్వాస సంబంధ సమస్యలతో శరీరం అంతా నీలం రంగంలోకి మారిపోవడం జరిగింది. దీంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షల్లో న్యూమోథోరాక్స్‌కి గురవ్వడంతో ఊపరితిత్తులు పనిచేయడం మానేశాయని చెప్పారు. వెంటనే ఆమెకు ఊపరితిత్తుల భాగాన్ని తొలగించాలని వెల్లడించారు. ఇక్కడ న్యూమోథోరాక్స్ అంటే..శరీరంలో సరిగ్గా ఊపిరితిత్తులకు బయట ఉన్న ఖాళీ ప్రదేశంలో గాలి పేరుకుపోయి ఊపరితిత్తులపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీంతో అక్కడ గాయం అయ్యి ఒక్కసారిగా ఊపిరితిత్తులు పనిచేయడం మానేస్తాయి. అలాగే రోగి శరీరం నీలం రంగులోకి మారిపోతుంది. ఈ పరిస్థితుల్లో రోగి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఈ టీనేజ్ అమ్మాయికి వైద్యులు సుమారు ఐదున్నర గంటల పాటు సర్జరీ చేసి తక్షణమే డ్యామేజ్ అయిన ఊపిరితిత్తుల భాగాన్ని తొలగించారు. ప్రస్తుతం ఆమె నెమ్మది నెమ్మదిగా కోలుకుంటోంది. తాను చాలా భయానకమైన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానని, వేపింగ్ ఇంత ప్రమాదమని అస్సలు అనుకోలేదని కన్నీటిపర్యతమయ్యింది. ఇక దాని జోలికి వెళ్లనని, జీవితం చాలా విలువైనదని దాన్ని సంతోషభరితంగా చేసుకోవాలని చెబుతోంది. ఇంతకీ ఏంటీ వేపింగ్..?వేపింగ్ అంటే..?బ్యాటరీతో నడిచే ఎలెక్ట్రానిక్ 'ఈ సిగరెట్' పరికరం నుంచి వచ్చే ఆవిరిని పీల్చడాన్ని వేపింగ్ అంటారు. 'ఈ-సిగరెట్స్' బ్యాటరీతో పని చేస్తాయి. మామూలు సిగరెట్స్‌లో పొగాకు మండి పొగ వస్తుంది. ఈ-సిగరెట్స్‌లో పొగాకు, ఫ్లేవర్స్, కెమికల్స్‌తో నిండిన లిక్విడ్ ఉంటుంది. ఈ లిక్విడ్‌ని వేడి చేస్తే పొగ / వేపర్ వస్తుంది. ఈ పొగని పీల్చడమే వేపింగ్ అంటే. ఇది సిగరెట్ కంటే ప్రమాదకారి కాదు. కానీ దీనిని స్మోకింగ్ మానడానికి ఒక మెట్టుగా మాత్రమే ఉపయోగిస్తారని చెబుతున్నారు నిపుణులు . అయితే ఇది కూడా ఆరోగ్యాని అంత మంచిది కాదనే చెబుతున్నారు. అంతేగాదు వేపింగ్ ఎడిక్షన్కి గురైతే..బాధితులు ఒక వారానికి 400 సిగరెట్లు సేవించడం వల్ల వచ్చే దుష్ఫరిణాన్ని ఎదుర్కొంటారని చెబుతున్నారు నిపుణులుదుష్పలితాలు..వేపింగ్ ఊపిరితిత్తులని డామేజ్ చేస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ని బాడీలోకి రిలీజ్ చేసి కేన్సర్ రావడానికి కారణం అవుతాయి. రోగ నిరోధక శక్తి బాగా బలహీన పడుతుంది. పిల్లలూ, టీనేజ ర్స్‌లో బ్రెయిన్ డెవలప్‌మెంట్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. స్త్రీలు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఈ-సిగరెట్స్ యూజ్ చేస్తే అబార్షన్ జరిగే ఛాన్స్ కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.(చదవండి: తుమ్ము ఎంత పనిచేసింది? ఏకంగా ప్రేగులు..) -
'ఒంటరితనం' రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రాణాంతకమా?
ఒంటరితనం అదొక రకమైన వ్యాధి అని ఎందరో వైద్యులు చెబుతున్నారు. మానసిక వ్యాధిలా మొదలై దీర్థకాలికి వ్యాధులు చుట్టుముట్టేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు. పరిశోధకులు జరిపిన అధ్యయనంలో సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదమో! అంత ప్రాణాంతకం అని హెచ్చరిస్తున్నారు. నిజానికి ఒంటరితనం అంత ప్రాణాంతకమా? ఏకంగా ధూమపానం తాగడంతో పోల్చడానికి కారణం ఏంటీ?.. తదితరాల గురించే ఈ కథనం!. ఒంటరితనం ఒంటరిగా ఉండటం అంటే.. ఒంటరితనం, ఒంటిరిగా అనే పదాలు ఒకేలా ఉన్నా రెండింటికి చాలా తేడా ఉంది. మనకు మనంగా కోరుకుని ఒంటరిగా ఉండటాన్ని ఏకాంతంగా గడపటంగా భావించొచ్చు. ఇష్టపూర్వకంగా నీతో నీవు గడపటం లాంటిది. ఇది ఆరోగ్యానికి ఒకరకంగా మంచిదే. మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఒకరకంగా మీ భావోద్వేగాలను నియంత్రించుకునే ఓ గొప్ప అవకాశం. అదే ఒంటరితనం అంటే.. మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఏదో లేదనే భావన ఉండటం. తనకంటూ ఎవ్వరూ లేరని ఫీలవుతుండటం ఒంటిరితనం కిందకు వస్తుంది. ఇది మనిషిని కుంగదీస్తుంది. చూడటానికి సాధారణంగా అనిపించినా.. ఓ భయానక వ్యాధి. చివరికి మనిషిని చనిపోయేలా కూడా ప్రేరేపిస్తుంది. అందుకనే వైద్యలు, ఆరోగ్య నిపుణులు ఒంటరితనం ప్రాణాంతకమైనదని పదేపదే ప్రజలను హెచ్చరిస్తున్నారు. పరిశోధనలే ఏం చెబుతున్నాయంటే శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనంలో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసిన వాళ్ల కంటే ఒంటరితనంతో బాధపడే వ్యక్తులు అకాల మరణానికి 50% ఎక్కువ ఉందని వెల్లడైంది. ఈ ఒంటరితనం ధూమపానం తాగినంత ప్రమాదకరమైనదని పేర్కొంది. రోజుకి 15 సిగరెట్లు తాగితే ఎంత ప్రాణాంతకం అంత ప్రమాదకరమైనది ఒంటిరితనం అని వెల్లడించింది. దీనివల్ల రోజువారి జీవనంపై ప్రభావం ఏర్పడి దీర్ఘకాలిక గుండె జబ్లులు వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ డిప్రెషన్ కారణంగా చాలామంది ఒబెసిటీ సమస్యను ఎదర్కొంటున్నట్లు అధ్యయనంలో తేలింది. అందుకోసం అని ఓ మెడిల్ ఆస్పత్రిలోని దీర్ఘకాలిక సమస్యలతో ఒంటరితనంతో బాధపడుతున్న కొంతమంది రోగులపై అధ్యయనం చేయగా..వారు కొంత సేపు తమతో ఆరోగ్యం గురించి మాట్లాడారు. ఆ తర్వాత వారి వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఎప్పటికప్పుడూ వారిని పర్యవేక్షిస్తూ వారితో స్నేహంగా మెలిగారు. వారు కూడా తెలియకుండానే వారితో కనెక్ట్ అయ్యి తమ భావోద్వేగాలన్నింటిని షేర్ చేసుకున్నారు. వాళ్లికి ఎవ్వరితోనైనా కాసేపు మాట్లాడితే తెలియని ఆనందం ఉంటుందనేలా ఆ రోగులకు అవగాహన కల్పించారు. ఆ తర్వాత ఆ రోగులు డిశ్చార్జ్ అయ్యాక కూడా వారి పరిస్థితి గురించి ఎప్పటికప్పుడూ ట్రాక్ చేస్తూనే ఉన్నారు పరిశోధకులు. ఐతే వారిలో మార్పు వచ్చి మనుషులతో కనెక్ట్ అవ్వడం ప్రారంభించారు. అలాగే ఆ రోగులు ఆస్పత్రిని సందర్శించడం కూడా తగ్గింది. ఎందుకు హానికరం అంటే.. తనకంటూ ఎవ్వరూ లేరనే వ్యథ ఆవరించి మనిషిని ఒక విధమైన సోమరి లేదా చేతకాని వాడిగా మార్చేస్తుంది. తెలియని నిరుత్సాహం వచ్చేస్తుంది. చిన్న పనులు కూడా భారంగా ఉంటాయి. అది క్రమేణ ఆ వ్యక్తిని మంచానికే పరిమితమై ఓ భయానక వ్యాధిలా మారిపోతుంది. ఏం లేకుండానే ఏదో మహమ్మారి బారినపడ్డవాడిలా త్వరతగతిన మృత్యు ఒడిలోకి వెళ్లిపోతాడు. ఇలాంటి వాళ్లు తాను నిర్లక్ష్యానికి గురవ్వుతున్నా అనే భావం నుంచి మొదలై ఎవ్వరితోనూ సంబంధాలు నెరుపుకోలేక ఇబ్బంది పడతారు. మొదట ఆ భావన తొలగించి తనకు నచ్చినా లేదా తనంటే ఇష్టపడే వ్యక్తులతో గడుపూతూ మంచి సంబంధాలను నెరుపుకుంటూ పోతే మనల్ని వద్దనుకున్నవాళ్లు సైతం మనతో చేయి కలిపేందుకు ముందుకు వస్తారు. చిత్త వైకల్యం అన్నింటికంటే ప్రమాదకరమైంది. అది బాగుంటే అన్ని బాగున్నట్లే. అలాగే రిలేషన్స్‌లో క్యాలిటీ ముఖ్యం వందల సంఖ్యలో రిలేషన్స్ ఏర్పర్చుకోనవసరం లేదు. మనం అంటే ఇష్టపడే వ్యక్తి ఒక్కరైనా చాలు. మనకు వారి వద్ద స్వాంతన దొరికితే చాలు. నచ్చిన స్నేహితుడు లేదా మీ శ్రేయోభిలాషి/మన అనుకునులే మనం మంచి కోరే వ్యక్తి ఉంటే చాలు. అందుకే ఇక్కడ మీరు ఎవరితో సన్నిహితంగా ఉంటారో వారితో మంచి నాణ్యతతో కూడిన బాండింగ్ ఏర్పర్చుకుంటే చాలు. తెలియకుండానే అన్ని రుగ్మతల నుంచి బయటపడతారు. ఆ తర్వాత మీకు మీరుగా ఏదోక వ్యాపకం ఏర్పరుచుకుని ధైర్యంగా జీవితాన్ని గడపగలిగే మనోధైర్యం వచ్చేస్తుంది. చింతకు చోటు ఇవ్వదు అది మీ చిత్తాన్ని చెదిరిపోయేలా చేసి కుంగదీస్తుంది. మీకు కాస్త ఒంటరితనంగా ఫీలయితే వెంటనే సోషల్ మీడియాలో లేదా దేవాలయానికో లేదా నచ్చిన ప్రదేశానికి వెళ్లండి కొత్త మనుషులు పరిచయలు ఏర్పడి మీకో కొత్త ఉత్తేజాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ఇటీవల ఈ కరోనా మహమ్మారి తర్వాత నుంచే ఈ ఒంటరితనం సమస్య ఎక్కువైంది. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల ఈ సమస్య మరింత ఎక్కువ ఉంది. (చదవండి: కోవిడ్‌కి గురైతే గుండె సమస్య తప్పదా? ఆరోగ్య మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు) -
బీడీ, సిగరెట్ తాగుతున్నారా? ప్రతి ఐదుగురిలో ఆ ఒక్కరు కాకండి!
మన దేశంలో 26.7 కోట్ల మంది పొగతాగడం లేదా పొగాకు ఉత్పాదనలను వినియోగిస్తున్నారు. ఆ అలవాటు కారణంగా వచ్చే క్యాన్సర్లు, పక్షవాతం, గుండెజబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలూ వంటి వాటితో మన దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 13.50 లక్షల మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తం మీద 172 కోట్ల మంది సిగరెట్లు తాగుతున్నారు. వీళ్లంతా ప్రతిరోజూ 2000 కోట్ల సిగరెట్లను కాలుస్తుంటారు. వీళ్లలో 35 ఏళ్ల వయసు పైబడి, పొగతాగే అలవాటున్న వ్యక్తులు వివిధ రకాల జబ్బుల పాలబడి, తమ ఆరోగ్యం కోసం పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా 1,77,342 కోట్లు! సొంత ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ, ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ మరీ మనం చేసే వృథా ఇది!! ఈ నెల 31న ‘ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం’ సందర్భంగా ఆరోగ్యానికి చేటు తెచ్చుకునేలా ఎన్నెన్ని అనర్థాల్ని చేజేతులారా ఆహ్వానిస్తున్నామో తెలుసుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం. పొగాకు అలవాటు రెండు రకాలుగా ఉంటుంది. చుట్ట, బీడీ, సిగరెట్ వంటివి నిప్పుతో కాలుస్తూ పొగవెలువరించే అలవాటుతో పాటు... పొగ ఏదీ లేకుండానే గుట్కా, ఖైనీ. తమలపాకుతో నమిలే జర్దారూపంలో పొగాకు నమలడం, నశ్యం రూపంలో పీల్చడం ద్వారా కూడా పొగాకుకు బానిసలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చనిపోయే ప్రతి ఐదుగురిలో ఒకరు కేవలం పొగాకు వల్లనే ప్రాణాలొదులుతున్నారు. అణువణువునా విషం... అత్యంత హానికరమైన, ఆరోగ్యానికి ప్రమాదకరమైన వాటిల్లో ప్రపంచమంతటా లీగల్‌గా అమ్మే రెండు ఉత్పాదనల్లో మరీ ప్రమాదకరమైనవి సిగరెట్లు, బీడీల వంటివి మాత్రమే. మరొకటి మద్యం. నాలుగు అంగుళాల పొడవుండే సిగరెట్లో 4,800 హానికరమైన రసాయనాలుంటాయి. అందులో మళ్లీ 70 – 72 రసాయనాలు తప్పక క్యాన్సర్‌ను కలగజేసేవే. ఒకసారి పొగతాగడం అంటూ మొదలుపెడితే... వీళ్లలో దాదాపు సగం మంది (50% మంది) దీని వల్ల వచ్చే అనర్థాలు, అనారోగ్యాల కారణంగానే మరణించే అవకాశం ఉందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రతి అవయవానికీ క్యాన్సర్ ముప్పు... వెలుపల మన తల నుంచి కాలి చివరలు మొదలుకొని దేహం లోపలా ఉన్న అన్ని అంతర్గత అవయవాల వరకు దేన్నీ వదలకుండా పొగాకు తన దుష్ప్రభావాలకు గురిచేస్తుంది. దాదాపు 30 శాతం వరకు క్యాన్సర్లకు పొగాకే కారణం. తల నుంచి లెక్క తీసుకుంటే... హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు, నోటి క్యాన్సర్లు పొగాకు కారణంగానే ఎక్కువగా వస్తాయి. నోరు మొదలుకొని... దేహంలోపలికి వెళ్లే కొద్దీ... ల్యారింగ్స్, ఈసోఫేగస్, పెద్దపేగు (కొలోన్), మలద్వార (కోలోరెక్టల్) క్యాన్సరు, బ్లడ్‌క్యాన్సర్లు, కాలేయ క్యాన్సర్లు, పాంక్రికాటిక్ క్యాన్సర్లు, బ్లాడర్ క్యాన్సర్లు... వీటన్నింటికీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పొగాకే కారణం. ఇక ప్రోస్టేట్ క్యాన్సర్‌కూ, పొగాకుకూ నేరుగానే సంబంధం ఉంది. పొగాకులోని బెంజీన్ రసాయనం ‘అక్యూట్ మైలాయిడ్ లుకేమియా’ (ఒకరకం బ్లడ్‌క్యాన్సర్)కు కారణమవుతుంది. ఈ క్యాన్సర్లతో పాటు ఇక గుండెజబ్బులు, పక్షవాతం, రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు... ఇలా శరీరంలోని ప్రతి కీలక అవయవాన్నీ పొగాకు దెబ్బతీస్తుంది. పొగమానేసిన మరుక్షణమే ప్రయోజనాలు... పొగతాగడం మానేసిన మరుక్షణం మనకు కలగాల్సిన ప్రయోజనాలు మొదలవుతాయి. చివరి సిగరెట్ తర్వాత 20 నిమిషాల్లో గుండె వేగం నార్మల్కు వస్తుంది. 12 గంటల తర్వాత దేహంలో కార్బన్‌మోనాక్సైడ్ మోతాదులు తగ్గడంతో బాటు రక్తంలో ప్రమాదకరమైన విషాల మోతాదులు తగ్గుతాయి. లంగ్స్ మూడు నెలల్లో నార్మల్కు వస్తాయి. ఏడాది తర్వాత హార్ట్ఎటాక్ వచ్చే ముప్పు (రిస్క్) సగానికి తగ్గిపోతుంది. పదిహేనేళ్లు మానేయగలిగితే... సిగరెట్ అలవాటుకు ముందు ఎలాంటి ఆరోగ్యం ఉంటుందో... అదే ఆరోగ్యం మళ్లీ సమకూరుతుంది. ఆరోగ్యాన్నీ వాతావరణాన్నే కాదు... సిగరెట్ వ్యర్థాలతో భూమిని సైతం... సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగే సమయంలో వెలువడే పొగతో ఆరోగ్యానికి, పర్యావరణానికీ ఎలాగూ ముప్పు చేకూరుతుందన్నది కనబడే సత్యం. కాకపోతే మనం విస్మరించే ఇంకో వాస్తవం ఉంది. సిగరెట్ తాగాక మిగిలిపోయే పీకల (బట్స్) బరువు 77 కోట్ల కిలోలు, అంటే 7.70 లక్షల టన్నులు. ఏటా ఇన్నేసి టన్నుల మొత్తంలో సిగరెట్ వ్యర్థాలు మనం నివాసం ఉంటున్న ఈ భూమిని కలుషితం చేస్తున్నాయి. పొగాకు ఉత్పాదనల కోసం ప్రపంచంలోనే అసహ్యకరమైన రంగు పాంటోన్ 448–సి అనేది ప్రపంచంలోనే అత్యంత అసహ్యకరమైన రంగు. దీన్ని చావును సూచించే రంగుగా కూడా చెబుతారు. ఈ రంగుతోనే సిగరెట్ ప్యాక్‌లు తయారవుతున్నప్పటికీ... పొగతాగేవారిని ఆకర్షించడం కోసం దాన్ని మరింత ఆకర్షణీయంగా చేసి వాడుతుంటారు. బానిసగా చేసుకునేది నికోటిన్... పొగాకులోని నికోటిన్... ఆ ఉత్పాదనలకు బానిసయ్యేలా చేస్తుంది. సిగరెట్‌లోని పొగపీల్చిన 10 సెకండ్లలో నికోటిన్ మెదడును చేరుతుంది. ఏదైనా సంతోషం కలిగించే పనిని చేయగానే... మెదడులో డోపమైన్ అనే రసాయనం వెలువడుతుంది. నికోటిన్ మెదడును చేరగానే వెలువడే ఈ డోపమైన్ కారణంగానే హాయిగా, రిలాక్స్డ్గా ఉన్న భావన కలుగుతుంది. ఆ అనుభూతిని తరచూ పొందేందుకు స్మోకింగ్‌ను ఆశ్రయిస్తారు. ఆ తర్వాత్తర్వాత అదే అనుభూతి కలగడం మునపటంత బలంగా లేకపోయినప్పటికీ... ఆ అనుభవం కోసం వెంపర్లాడటంతో నికోటిన్‌కు బానిసవుతారు. నికోటిన్ కోరిక ఎంత బలంగా ఉంటుందంటే... ప్రఖ్యాత మనస్తత్వ నిపుణుడు సిగ్మండ్ ఫ్రాయిడ్‌కు ‘స్క్వామస్ సెల్ కార్సినోమా ఆఫ్ పాలెట్’ అనే రకం క్యాన్సర్ సోకింది. అంగిలిలో వచ్చిన ఈ నోటిక్యాన్సర్ నుంచి విముక్తి కల్పించడం కోసం డాక్టర్లు ఆయనకు దాదాపు 30కి పైగా సర్జరీలు చేశారు. దవడను, సైనస్నూ తొలగించారు. అయినా ఆయన సిగరెట్ మానేయలేదు. చివరకు అంగిలికీ... కంటిగూడుకూ మధ్య ఉన్న క్యాన్సర్ గడ్డను శస్త్రచికిత్సతో తొలగించడం సాధ్యం కాలేదు. దాదాపు 16 ఏళ్ల పాటు పొగాకు మానేయమని ఎందరు ప్రాధేయపడ్డా ఫ్రాయిడ్ మానలేదు. ఇదీ నికోటిన్ పవర్. -డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావు, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ -
4 రోజుల్లో 500 సిగరెట్లు తాగిన అల్లరి నరేష్.. క్షీణించిన ఆరోగ్యం
-
బడ్జెట్ 23: పొగరాయుళ్లకు ఝలక్, భారీగా పెరగనున్న ధరలు!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023ని రేపు (ఫిబ్రవరి 1న) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో సమర్పించనున్నారు. మంగళవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక సర్వేను కూడా ఆర్థికమంత్రి ప్రవేశపెట్టారు. రానున్న ఎన్నికలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కార్‌కు ఇదే చివరి బడ్జెట్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. రాబోయే ఆర్థిక సంవత్సరానికి మార్గం సుగమం చేసే అనేక కొత్త పన్ను సంస్కరణలు ,రాయితీలను కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది. దీంతోపాటు పొగాకు, దాని ఉత్పత్తి ధరలు పెరిగే అవకాశం ఉందని సమాచారం. దేశవ్యాప్తంగా అలాగే సిగరెట్లపై ప్రత్యేక పన్నును శాతాన్ని పెంచ నున్నారనీ , ఇది ధరలలో పెరుగుదలకు దారి తీస్తుందని భావిస్తున్నారు. బడ్జెట్ 2023లో పెట్రోల్, డీజిల్ ధరలు,యూపీఐ, డిజిటల్ రూపాయికి సంబంధించిన ఇన్సెంటివ్‌లు ,తదితర పన్ను సంబంధిత స్కీమ్‌లపై ఎక్కువగా అంచనాలు భారీగానే ఉన్నాయి. వీటన్నిటితో పాటు పొగాకు, పొగాకు ఉత్పత్తులపై పన్నుపెరగుతుందనేది ఒక అంచనా. ముఖ్యంగా దాదాపు గత రెండేళ్లుగా సిగరెట్ ధరలు, పొగాకు ఉత్పత్తులపై పన్ను లేదు. ఈ నేపథ్యంలో ఈ సారి సిగరెట్ ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా. అయితే పొగాకుపై విధించే పన్ను, దాని ధరల నియంత్రణను జీఎస్టీ కౌన్సిల్ చూసుకుంటుంది. అయితే,ఈ సంవత్సరం బడ్జెట్ 2023లో కేంద్ర ప్రభుత్వం సిగరెట్లపై జాతీయ విపత్తు ఆకస్మిక సుంకం (ఎన్సీసీడీ) పెంచే అవకాశం ఉంది. సిగరెట్లపై విధించే మొత్తం పన్నులో వాటా 10 శాతం. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం దానిని పెంచే అవకాశం ఉంది. సిగరెట్లపై ఎన్సీసీడీ సాధారణంగా ఐటీసీ లాంటి తయారీ కంపెనీలు చెల్లిస్తాయి. ఒకవేళ ఎన్సీసీడీ భారీ పెంపు వైపు కేంద్రం మొగ్గు చూపితే, అనివార్యంగా ఆ భారాన్ని ఆయా కంపెనీలు వినియోగదారులపైనే మోపుతాయి. -
రూ.3 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లు స్వాధీనం
సాక్షి, అమరావతి: అక్రమంగా తరలిస్తోన్న రూ.3 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను విజయవాడ కస్టమ్స్ అధికారులు పల్నాడు జిల్లాలో మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. 30 లక్షల పారిస్ బ్రాండ్ సిగరెట్లను మయన్మార్ నుంచి భారత్‌లోకి అక్రమంగా తరలించినట్లు విచారణలో వెల్లడైంది. బిహార్‌లోని ముజఫరాబాద్‌లో ఓ లారీలో వీటిని లోడ్ చేసి అక్రమంగా రవాణా చేస్తుండగా కస్టమ్స్ అధికారులు నరసరావుపేట శివార్లలో తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ సిగరెట్లను గోధుమ పిండి బ్యాగుల్లో ప్యాక్ చేసి టార్పాలిన్లు కప్పి తరలిస్తున్నట్లు గుర్తించారు. వీటిపై చట్టపరమైన హెచ్చరికలు ముద్రించి లేకపోవడంతో అధికారులు లారీని జప్తు చేసి కేసు నమోదు చేశారు. కాగా, గత 6 నెలల్లో విజయవాడ కస్టమ్స్ అధికారులు.. తనిఖీల్లో రూ.1.50 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
యువత సిగరెట్లు కొనకుండా జీవితకాలం నిషేధం
వెల్లింగ్టన్: ఆరోగ్యాన్ని హరించే పొగాకు వినియోగాన్ని అరికట్టడానికి న్యూజిలాండ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం కొత్తగా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం యువత ఇకపై సిగరెట్లు కొనడానికి వీల్లేదు. వారు సిగరెట్లు కొనకుండా జీవితకాలం నిషేధం విధించారు. 2009 జనవరి 1న, ఆ తర్వాత జన్మించినవారంతా సిగరెట్లకు దూరంగా ఉండాలి. వారికి ఎవరైనా సిగరెట్లు విక్రయిస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి. కొత్త చట్టం వల్ల సిగరెట్లు కొనేవారి సంఖ్య ప్రతిఏటా తగ్గిపోతుందని, తద్వారా దేశం పొగాకు రహితంగా మారుతుందని న్యూజిలాండ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశంలో సిగరెట్లు విక్రయించేందుకు అనుమతి ఉన్న రిటైలర్ల సంఖ్యను కొత్త చట్టం కింద 6,000 నుంచి 600కు కుదించింది. సిగరెట్లలో నికోటిన్ పరిమాణాన్ని తగ్గించింది. ఉపయోగించినవారిని భౌతికంగా అంతం చేసే సిగరెట్లను విక్రయించడానికి అనుమతించడంలో అర్థం లేదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఆయేషా వెరాల్ చెప్పారు. ఇదీ చదవండి: అనంత శక్తిని ఒడిసిపట్టే... దారి దొరికింది! -
వింత స్టంట్: 50 ఏళ్ల వ్యక్తి స్మోకింగ్ చేస్తూ మారథాన్
మారథాన్ చేయడం అంత ఈజీ కాదు. అందుకు ప్రత్యేక శిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి, నిబద్ధత అవసరం. ఆరోగ్య స్పృహతో ఉన్న క్రీడాకారులు మాత్రమే ఇలాంటివి చేస్తారని అందరికీ తెలుసు. కానీ ఇక్కడొక మనిషి అందుకు విరుద్ధం. పొగ తాగుతూ... మారథాన్ చేసి అందర్నీ ఆకర్షించాడు. వివరాల్లోకెళ్తూ.....చైనాకు చెందిన అంకుల్ చెన్ అనే వ్యక్తి మారథాన్ పోటీల్లో స్మోక్ చేస్తూ మారథాన్ చేశాడు. అలా చేయడంతో అతని ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాడు. వాస్తవానికి ధూమపానం చేస్తే గుండె, ఊపితిత్తులు, కండరాలకు ఆక్సిజన్ తక్కువగా అందడంతో పరుగు పెట్టడం కష్టమవుతుంది. కానీ ఈ 50 ఏళ్ల చెన్ మాత్రం చైనాలోని జియాండేలో జరిగిన 42 కి.మీ మారథాన్‌ని ధూమపానం చేస్తూ పూర్తి చేశాడు. పైగా ఈ మారథాన్ మూడు గంటల 28 నిమిషాల్లో పూర్తి చేశాడు. అంతేగాదు పోటీలో ఉన్న 1500 మందిలో 574వ రన్నర్‌గా నిలిచాడు. చెన్ ఇలాంటి వింత స్టంట్లు చేయడం ఇది తొలిసారి కాదు. 2018 గ్వాంగ్జౌ మారథాన్, 2019 జియామెన్ మారథాన్‌లో ధూమపానం చేస్తూ పాల్గొన్నాడు. దీంతో అతని ఫోటోలు చైనా సోషల్ మాధ్యమం విబోలో తెగ వైరల్ అయ్యాయి. ఈ మేరకు నెటిజన్లు పొగ తాగకపోతే ఇంకా మెరుగైనా ప్రతిభ కనబర్చేవాడని ఒకరు, అక్షరాల అతని ఊపిరిత్తితులు బాగా పనిస్తున్నాయి అని మరోకరు కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. ఐతే ప్రస్తుతం మారథాన్ పోటీల్లో ధూమపానం చేయకూడదనే నిబంధనలు లేవు. (చదవండి: ఐదేళ్ల తర్వాత.. ఈ చిట్టిబాబుకు చెవులొచ్చాయ్! ఎలాగో తెలుసా?..) -
అక్రమంగా తరలిస్తున్న సిగరెట్ల పట్టివేత
శంషాబాద్: అక్రమంగా నిషేధిత సిగరెట్లను తరలిస్తున్న నిందితులను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో రూ. 2.98 లక్షల విలువ చేసే నిషేధిత సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. బెహరాన్ నుంచి జీఎఫ్274 విమానంలో హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి వద్ద 29,800 నిషేధిత సిగరేట్లు లభ్యమయ్యాయి. కస్టమ్స్ అధికారులు నిందితుని విచారణ చేస్తున్నారు. -
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా సిగరెట్లు పట్టివేత
-
సీఐ సహా ముగ్గురు ఎస్ఐల సస్పెన్షన్
తిరుపతి క్రైం: రక్షించాల్సిన పోలీసులే భక్షించారు. గోడౌన్ ఖాళీ చేయించి అందులో ఉన్న లక్షల విలువైన సిగరెట్లను దొంగచాటుగా అమ్ముకున్నారు. కాసులకు కక్కుర్తిపడి వాటాలు పంచుకున్నారు. తీగలాగిన డీఐజీ తిరుచానూరులో అవినీతి ఖాకీల డొంకను కదిలించారు. నాటి సీఐతో పాటు ముగ్గురు ఎస్ఐలను సస్పెండ్ చేయడమే కాకుండా సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. తిరుచానూరు పోలీసుస్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం పంచాయతీలో హైదరాబాద్‌కు చెందిన బిజి.నిశాంత్‌కు చెందిన వంద అంకణాల రెండు అంతస్తుల భవనం ఉంది. దీన్ని చెన్నైకి చెందిన ముత్తుకుమార్ లీజుకు తీసుకుని అందులో ఐటీసీ కంపెనీకి చెందిన సిగరెట్ ప్యాకెట్లు, బిస్కెట్లు, ఇతర సామగ్రిని ఉంచి వ్యాపారం చేసుకునేవారు. అయితే ముత్తుకుమార్ ఈ భవనాన్ని ఖాళీ చేయకపోవడంతో మణికంఠను ఆశ్రయించి ఆ భవనాన్ని విక్రయించాలని నిశాంత్ కోరారు. మణికంఠ ప్రైవేట్ కళాశాలలో ఎల్ఎల్బీ చదువుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. శ్రీనివాసపురంలో అదే భవనానికి ఎదురుగా ఉంటున్న డాక్టర్ రహమాన్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో భవనాన్ని విక్రయించాడు. ఖాళీ చేయించి.. సిగరెట్లు అమ్ముకుని.. రిజిస్ట్రేషన్ అనంతరం భవనాన్ని ఖాళీ చేయాలని ముత్తుకుమార్‌ను కోరగా అతను నిరాకరించడమే కాకుండా భవనం తనదేనని పత్రాలు కూడా ఉన్నాయని అడ్డం తిరిగాడు. దీంతో మణికంఠ తిరుపతికి చెందిన ఇర్ఫాన్, శ్రీనివాస్, మరికొంతమందితో కలసి ఏప్రిల్ 9న దౌర్జన్యంగా భవనాన్ని ఖాళీ చేయించారు. ఆ సమయంలో దాదాపు రూ.20 లక్షల విలువైన సిగరెట్ ప్యాకెట్లు అక్కడ ఉండడాన్ని గమనించారు. తిరుచానూరులో పనిచేస్తున్న ఎస్ఐ వీరేష్‌తో కలసి సిగరెట్ ప్యాకెట్లు విక్రయించి మణికంఠ సొమ్ము చేసుకున్నాడు. ఈ నగదును సీఐ సుబ్రమణ్యం, ఎస్ఐలు రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, మణికంఠ, ఇర్ఫాన్, శ్రీనివాస్ పంచుకున్నారు. దీనిపై ఐటీసీ కంపెనీ మేనేజర్ అజయ్ ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ చేయించారు. సీఐతో పాటు ముగ్గురు ఎస్ఐలు కూడా లాలూచీ పడినట్లు విచారణలో తేలడంతో వారిని సస్పెండ్ చేస్తూ బుధవారం అనంతపురం డీఐజీ రవిప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. -
కేజీఎఫ్–2 చూసి.. రాఖీభాయ్‌లా సిగరెట్లు కాల్చి..
కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్2 కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కేజీఎఫ్ చిత్రంతో యశ్ గ్రాఫ్ అంతకముందు.. ఆ తరువాత అనేలా మారిపోయింది. ఒక్క సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. దేశ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కేజీఎఫ్ చిత్రానికి యశ్ హీరోయిజమే మెయిన్ అట్రాక్షన్.. సినిమాలో హీరో మాటలు, ఆటిట్యూడ్, అలవాట్లు ప్రేక్షలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ సినిమాను పదే పదే చాడటానికి యువతి ఇష్టపడుతున్నారు. యష్ నటించిన కేజీఎఫ్–2 సినిమాలోని ‘రాఖీభాయ్’ పాత్రను చూసి తానూ అలాగే స్టైల్‌గా ఉండాలనుకున్న 15 ఏళ్ల బాలుడు సిగరెట్లు కాల్చి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ఆ బాలుడికి తాము విజయవంతంగా చికిత్స చేసినట్లు బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లోని సెంచరీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సిగరెట్ కాల్చడం వల్ల వచ్చే దుష్ప్రభావాల నుంచి ఊరట కలిగించడంతో పాటు ఆ బాలుడుకి గట్టిగా కౌన్సింగ్ కూడా చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలుడు రెండు రోజుల వ్యవధిలో కేజీఎఫ్–2 సినిమాను మూడుసార్లు చూశాడు. తర్వాత ఒకేసారి ఏకంగా ఒక ప్యాకెట్ సిగరెట్లు కాల్చి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. దీంతో ఆ బాలుడు తల్లిదండ్రులు సెంచరీ ఆస్పత్రికి తరలించారు. థియేటర్లలో విడుదలైన రెండోవారం ఆ సినిమా చూసిన బాలుడు అందులో ప్రధాన పాత్ర అయిన రాఖీభాయ్ స్టైల్ చూసి ప్రేరణ పొందానని.. తాను అలాగే ఉండాలని కోరుకున్నానని అందుకే సిగరెట్లు కూడా కాల్చానని వెల్లడించాడు. కాగా ఈ కేసుపై పల్మోనాలజిస్ట్ డాక్టర్ రోహిత్ రెడ్డి మాట్లాడారు. ప్రేక్షకులు ముఖ్యంగా టీనేజర్లు ‘రాకీ భాయ్’ వంటి పాత్రలతో తొందరగా ప్రభావితమవుతరాని అన్నారు. ఈక్రమంలోనే మైనర్ ధుమపానానికి అలవాటు పడి ఒకే రోజు సిగరెట్ ప్యాకెట్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని తెలిపారు. మనుషులపై సినిమాలు చాలా ప్రభావితం చేసే అంశం అని, సిగరెట్లు తాగడం. పొగాకు నమలడం, మద్యం సేవించడం వంటి చర్యలను గ్లామరైజ్ చేయకుండా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత సినీ నిర్మాతలు, నటీనటులపై ఉంటుందన్నారు. చదవండి: భయ్యా.. ఇదేమయ్యా! నిన్న బీజేపీ, నేడు కాంగ్రెస్‌లో అలాగే పిల్లలు ఏం చేస్తున్నారో, ఎలాంటి వ్యవసనాలకు అలవాటు పడుతున్నారో తల్లిదండ్రులు గమనించుకుంటూ ఉండాలన్నారు. పిల్లలు చెడు వ్యవసనాలకు బానిసలవ్వడకుండా అవగాహన కల్పించడంలో తల్లిదండ్రల పాత్ర ముఖ్యమంన్నారు. -
పొగరాయుళ్లకు నకిలీ సెగ
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ సిగరెట్లు హల్చల్ చేస్తున్నాయి. కోల్‌కతా లైన్ కేంద్రంగా ఢిల్లీ, బిహార్, రాయ్‌పూర్ నుంచి ఖరీదైన సిగరెట్ స్థానంలో నకిలీ రంగ ప్రవేశం చేస్తోంది. ఇటీవల విశాఖ రైల్వే స్టేషన్లో బండిల్స్ కొద్దీ దొరికిన ఫేక్ సిగరెట్ బండిల్స్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. బ్రాండెడ్‌కు దగ్గరగా ఉంటూ ధూమపాన ప్రియులను తక్కువ ధరలతో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఇండియన్ టొబాకో కంపెనీ(ఐటీసీ) ద్వారా మాత్రమే నాణ్యమైన పొగాకుని కొనుగోలు చేసి బ్రాండెడ్ కంపెనీలు సిగరెట్స్‌ని తయారు చేస్తుంటాయి. గతంలో ఐటీసీ గుర్తింపు పొందిన కంపెనీల సిగరెట్స్ మాత్రమే మార్కెట్లో దర్శనమిచ్చేవి. కేంద్రం విధించిన పన్ను భారంతో బ్రాండెడ్ సిగరెట్స్ ఖరీదైపోవడంతో నకిలీ సిగరెట్లు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. నకిలీ సిగరెట్ తయారీ ఇలా? బ్రాండెడ్ కంపెనీలు వాడే పొగాకులో నాసిరకం పొగాకుని అతి తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేసుకుంటారు. పొగాకుతో పాటు రంపపు పొట్టుని కూడా కలిపేసి చవగ్గా సిగరెట్స్ తయారు చేసేసి.. వాటిని మార్కెట్లోని బ్రాండెడ్ సిగరెట్స్ ప్యాకెట్స్ మాదిరిగా సిద్ధం చేసేస్తున్నారు. ఆ ప్యాకెట్స్‌పై ఎక్కడ తయారవుతున్నాయి.? వాటి కంపెనీ ఏమిటి.? అనే వివరాలు మాత్రం కనిపించవు. కొందరు తెలివిగా.. బ్రాండెడ్ ప్యాకెట్స్‌పై ఉన్న టోల్‌ఫ్రీ నంబర్లనే ముద్రించేస్తున్నారు. ఎలా వచ్చేస్తున్నాయ్..? గతంలో బంగ్లాదేశ్, నేపాల్ నుంచి నకిలీ సిగరెట్లు వచ్చేవి. ఇప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీటిని తయారు చేసేస్తున్నారు. ఢిల్లీ, బిహార్, సూరత్, రాయ్‌పూర్, చంఢీగఢ్, కోల్‌కతా వంటి నగరాల్లో అసలు బ్రాండ్లను పోలిన సిగరెట్లు తయారవుతున్నాయి. వీటిని కోల్‌కతా కేంద్రంగా వివిధ మార్గాల్లో రవాణా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోకి మాత్రం రైలు మార్గంలోనే ఎక్కువగా రవాణా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల విశాఖ డివిజన్ రాష్ట్ర పన్నుల శాఖ అధికారులు రూ. లక్షల విలువ చేసే నకిలీ సిగరెట్లను పట్టుకున్నారు. వాటిని ఎవరు ఆర్డర్ చేశారన్నది మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలింది. నకిలీ పొగ.. ప్రాణాంతకం సాధారణంగా బ్రాండెడ్ సిగరెట్లు తాగితేనే క్యాన్సర్, గుండెజబ్బులు, నరాల బలహీనతలు, ఊపిరితిత్తుల వ్యాధులు సంక్రమిస్తుంటాయి. అలాంటిది నకిలీ సిగరెట్లు తాగడం వల్ల.. ఈ వ్యాధులు వేగంగా శరీరాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్స్ తయారైన ఆరు నెలల్లోపే వినియోగించాలి. ఆ తర్వాత అందులో ఫంగస్ చేరి.. మనిషి ఆయువుని తీసేస్తుందని.. సిగరెట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. గొలుసు తెంచేందుకు ప్రయత్నిస్తున్నాం.. ఇటీవల రైల్వేస్టేషన్లో భారీగా నకిలీ సిగరెట్ డంప్‌ని స్వాధీనం చేసుకున్నాం. వీటిని తీసుకొచ్చిన వ్యాపారి ఎవరనేది ఇప్పటికీ తేలలేదు. నకిలీ సిగరెట్ల వ్యాపారంపై గట్టి నిఘా ఉంచుతున్నాం. ప్రతి రైలు నుంచి వచ్చే పార్సిళ్లను పరిశీలించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. – శ్రీనివాసరావు, రాష్ట్ర పన్నుల శాఖ విశాఖ డివిజన్ జాయింట్ కమిషనర్ -
ఆ.. నకిలీ సిగరెట్లు ఎవరివో?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ రైల్వేస్టేషన్లో పట్టుబడిన నకిలీ సిగరెట్ బండిల్స్ ఎవరివో తేల్చేపనిలో రాష్ట్ర పన్నుల శాఖ విశాఖ డివిజన్ అధికారులు తలమునకలయ్యారు. వీటిని కోల్‌కతా కేంద్రంగా తయారు చేస్తూ ఛత్తీస్‌గఢ్, బిహార్ మీదుగా వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే .. ఓ పాసింజర్ రైలులో బుధవారం అర్ధరాత్రి విశాఖకు భారీగా నకిలీ సిగరెట్ బండిల్స్ చేరుకుంటున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు విశాఖ రైల్వే స్టేషన్‌లోని 8వ నంబర్ ప్లాట్‌ఫాంపై డివిజన్ అధికారులు మాటు వేశారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన సంబంధిత సరుకు యజమానులు అక్కడినుంచి జారుకున్నారు. అయితే అర్ధరాత్రి 12 గంటలవుతున్నా ఎవరూ సరుకు కోసం రాకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్రాంతి ట్రాన్స్పోర్ట్ పేరుతో సాధారణ సామగ్రిగా బుక్ చేసిన 56 భారీ బండిల్స్‌ను జీఎస్టీ కార్యాలయానికి తరలించారు. సిగరెట్ బాక్సులపై తయారీ యూనిట్ల చిరునామా లేనట్లు గుర్తించారు. ప్రముఖ ఐటీసీ బ్రాండ్లని పోలినట్లుగానే గోల్డ్ విమల్, పారిస్, గుడ్‌టైమ్స్, టఫ్.. ఇలా విభిన్న రకాల సిగరెట్లున్నాయనీ.. వాటి ధర ఎంతనేది ఇంకా లెక్కించలేదని అధికారులు తెలిపారు. కొన్ని ప్యాకింగ్‌లపై టోల్‌ఫ్రీ నంబర్లు ముద్రించారని, అవి ప్రముఖ బ్రాండ్లపై ఉన్న టోల్‌ఫ్రీ నంబర్లేనని.. అదేవిధంగా మిగిలిన ప్యాక్‌లపై ఉన్న ఫోన్ నంబర్లు ఏవీ పనిచెయ్యడం లేదని అధికారులు వెల్లడించారు. ప్యాకింగ్‌లపై ఉన్న జీఎస్టీ ఐడీ, బార్ కోడ్లు కూడా నకిలీవేనన్నారు. నకిలీ సిగరెట్లను ముఖ్యంగా కోల్‌కతా ప్రధాన కేంద్రంగా తయారు చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఒడిశా, రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఢిల్లీలోనూ వీటి తయారీ శాఖలున్నట్లు తెలిసిందని వివరించారు. అయితే ఈ సరుకు మొత్తం ఏ వ్యాపారికి సంబంధించినది, ఒక్కరిదేనా? వేర్వేరు వ్యాపారులున్నారా అనే అంశాలపై లోతైన దర్యాప్తు నిర్వహిస్తున్నామని విశాఖ డివిజన్ జీఎస్టీ అధికారులు వెల్లడించారు. -
దారుణం: సిగరెట్లతో కాల్చి. బాత్‌టబ్‌లో పడేసి
వాషింగ్టన్: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల బుడ్డోడు ప్యాంటు తడుపుకుంటున్నాడని అతడిని చిత్రహింసలు పెట్టి చంపిందో అత్త. పూర్తి వివరాల్లోకి వెళితే.. జేమీ లైన్ జాక్సన్‌కు పన్నెండేళ్ల లోపు వయసున్న ఇద్దరు పిల్లలున్నారు. ఆమె మేనల్లుడు మిచెల్ స్టోవర్ వీరితో కలిసి ఆడుకుంటున్నాడు. తొమ్మిదేళ్ల వయసున్న ఈ పిల్లవాడు ఎక్కడ పడితే అక్కడ టాయ్‌లెట్ పోయడంతో ఆమె కోపం నషాళానికంటింది. బుడ్డోడని చూడకుండా అతన్ని గదిలోకి తీసుకు వెళ్లి చిత్ర హింసలు పెట్టింది. అతడి శరీరాన్ని సిగరెట్లతో కాల్చింది. మెడకు ప్లాస్టర్‌ను బిగుతుగా చుట్టి కిరాతకంగా ప్రవర్తించింది. తర్వాత అతడిని బట్టలో చుట్టి బాత్‌టబ్‌లో పడేసింది. అందులో నుంచి బయటకు రాలేక అతడు గిలగిలా కొట్టుకుంటున్నా ఆమె మనసు చలించలేదు. 24 గంటల నుంచి 48 గంటల వరకు అతడి బాత్టబ్లోనే వదిలేసింది. () సాక్ష్యాలను తుడిచేసే ప్రయత్నం మరోవైపు తను చేసిన నేరం బయటపడకుండా అతడి గదినంతా శుభ్రం చేసింది. ఇది చూసిన ఆమె బంధువు అనుమానం వచ్చిపోలీసులకు సమాచారం అందించాడు. కానీ పోలీసులు ఆ ఇంటికి చేరుకునేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పసివాడి ప్రాణం గాల్లో కలిసిపోయింది. అతడి చావుకు కారణమైన జాక్సన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 2న ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా హత్యానేరంతో పాటు, మరణాన్ని దాచడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, చిత్రహింసలు పెట్టడం వంటి అభియోగాల కింద ఆమెకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. స్టోవర్ శవపరీక్ష రిపోర్టులోనూ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అతడి తల, కళ్లు, మెడ, చేతులు, కాళ్లు తీవ్ర గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. మెదడులో రక్తస్రావం జరిగిందని తేలింది. ప్రైవేటు పార్ట్స్‌పై సిగరెట్‌తో కాల్చిన గుర్తులు కూడా ఉన్నట్లు రిపోర్టు పేర్కొంది. (తల్లిని, భార్యను హతమార్చిన మాజీ అథ్లెట్) -
'పొగ'కు చెక్ పెడదాం
సాక్షి, అమరావతి: స్కూళ్లు పరిశుభ్రంగా ఉండటమే కాదు.. సిగరెట్, బీడీ, గుట్కా వంటి వాటి వాసన ఉండకూడదు. పొగ పొడ సూపకూడదు. స్కూలు, దాని పరిసరాలు ఆహ్లాదంగా ఉండాలి. చిన్నతనం నుంచే పొగ అంటే చిన్నారులకు తెలియకూడదు. దాని ప్రభావానికి అసలే లోనుకాకూడదు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా స్మోక్ ఫ్రీ జోన్స్‌గా స్కూళ్లను తయారు చేయాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. కేంద్రం దీనిపై మార్గదర్శకాలు రూపొందించగా.. వాటిని అమలు చేయడంలో రాష్ట్రం ముందంజలో ఉంది. ఇప్పటికే కొన్ని స్కూళ్లను స్మోక్ ఫ్రీ జోన్లుగా అమలు చేస్తోంది. ఈ కేటగిరీల్లో పక్కాగా నిబంధనలు ► పొగ తాగే వారే కాదు.. అసలు పొగ ఆనవాళ్లు స్కూలు చుట్టూ కనిపించకూడదు. స్కూలులో పనిచేసే టీచర్లే కాకుండా స్కూలు డ్రైవర్లు పొగ తాగినా నేరమే. ► ప్రతి స్కూలులో ముఖ ద్వారం వద్ద, లోపల గోడలపైన ‘టొబాకో లేని స్కూలు’ అని బోర్డులు తగిలించాలి. స్కూలు కాంపౌండ్‌కు 100 గజాల పరిధిలో బీడీలు, సిగరెట్లు, గుట్కా దుకాణాలు కనిపించకూడదు. ► పొగతో కలిగే హాని ఎలాంటిదో తెలిపే స్టిక్కర్లు స్కూలు గోడలపై కనిపించాలి. స్కూలు ఆవరణలో ఎవరైనా పొగ తాగితే వారిపై చర్యలు తీసుకునే అధికారి, హోదా, ఫోన్ నంబరు గోడపై రాసి ఉండాలి. ► 6 మాసాలకోసారి టొబాకో నిర్మూలనపై విద్యార్థులతో టీచర్లు చర్చించాలి. ఎవరైనా పొగ తాగితే వారిపై తీసుకోవాల్సిన చర్యలను విద్యార్థులకూ తెలియజేయాలి. రోజుకు 3,500 మంది మృతి ► దేశంలో పొగాకు వాడకం కారణంగా రోజూ 3,500 మంది మృతి చెందుతున్నారు. దేశంలో 9.95 కోట్ల మంది ఏదో ఒక రూపేణా పొగాకు ఉపయోగిస్తున్నారు. 19.94 కోట్ల మంది పొగలేని పొగాకు వాడుతున్నారు. ► ఒక్కొక్కరు సగటున సిగరెట్‌కు నెలకు రూ.1,192, బీడీలపై రూ.284 వ్యయం చేస్తున్నారు. ఏటా 13 లక్షల మంది పొగాకు కారక క్యాన్సర్లతో మృతి చెందుతున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య సంస్థ సర్వేలో వెల్లడించింది. -
ఐటీసీ లాభం రూ. 2,567 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ మార్చి త్రైమాసికంలో రూ.2,567 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.3,436 కోట్లతో పోల్చుకుంటే 25 శాతం తగ్గిపోయింది. ఎక్కువ మంది అనలిస్టుల అంచనాలకు అనుగుణంగానే కంపెనీ ఫలితాలు ఉండడం గమనార్హం. కన్సాలిడేటెడ్ ఆదాయం సైతం 17% తగ్గి రూ.12,658 కోట్లుగా నమోదైంది. సిగరెట్ల అమ్మకాల రూపంలో వచ్చిన ఆదాయం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసుకుంటే రూ.6,142 కోట్ల నుంచి రూ.4,330 కోట్లకు పరిమితమైంది. ఎఫ్ఎంసీజీలో ఇతర విభాగాల పనితీరు మెరుగుపడింది. వీటి ఆదాయం మాత్రం రూ.3,068 కోట్ల నుంచి 3,379 కోట్లకు వృద్ధి చెందింది. హోటళ్ల ఆదాయం రూ.411 కోట్ల నుంచి 25 కోట్లకు తగ్గిపోగా.. అగ్రి వ్యాపారం ఆదాయం రూ.3,622 కోట్ల నుంచి రూ.3,765 కోట్లకు పెరిగింది. పేపర్‌బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్ ఆదాయం రూ.1,527 కోట్ల నుంచి రూ.1,026 కోట్లకు క్షీణించింది. -
‘ఖైదీ’ సినిమా తరహా చోరీ
సాక్షి, గుడ్లూరు: జాతీయ రహదారిపై సిగరెట్ల లోడుతో వెళ్తున్న కంటైనర్‌ను దుండగులు హైజాక్ చేశారు. కంటైనర్‌కు వాహనాలు అడ్డు పెట్టి వాటిల్లో ఉన్న దుండగలు కంటైనర్ డ్రైవర్‌ను తీవ్రంగా గాయపరిచారు. అనంతరం ఆయన కాళ్లు, చేతులు కట్టేసి చెడ్లలో పడేసి కంటైనర్‌తో వెళ్లిపోయారు. సినీ పక్కీలో సంచలనం రేపిన ఈ సంఘటన ప్రకాశం జిల్లా 16వ నంబర్ జాతీయ రహదారిపై తెట్టు–శాంతినగర్ గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరు నుంచి విజయవాడకు సిగరెట్ల లోడుతో వెళ్తున్న కంటైనర్ శాంతినగర్–తెట్టు గ్రామాల మధ్యలోకి వచ్చే సరికి కారులో వచ్చిన దొంగలు కంటైనర్‌కు తమ కారును అడ్డు పెట్టారు. డ్రైవర్ రవి కంటైనర్‌ను ఆపేశాడు. కంటైనర్‌లోకి ఎక్కిన దుండగులు డ్రైవర్‌ను తీవ్రంగా గాయపరిచి బట్టలు విప్పదీసి కాళ్లు, చేతులు గుడ్డ పేలికలతో కట్టేసి కళ్లకు గంతలు చుట్టారు. అనంతరం అతడిని రహదారి పక్కన ఉన్న చెట్లల్లో పడేసి కంటైనర్‌ను అపహరించుకెళ్లారు. తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో డ్రైవర్ పెద్దగా కేకలు వేస్తుండటంతో శాంతినగర్ గ్రామస్తులు రోడ్డుపైకి వచ్చి చెట్ల కింద పడి ఉన్న డ్రైవర్ రవిని చూసి హైవే పోలీసులు, 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న హైవే సిబ్బంది డ్రైవర్‌కు కట్టిన కట్లు విప్పదీసి 108లో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. సమచారం అందుకున్న కందుకూరు డీఎస్పీ రవిచంద్ర ఆధ్వర్వంలో గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు ఎస్ఐలు కంటైనర్ చోరీకి గురైన సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. చికిత్స పొందిన అనంతరం డ్రైవర్‌ను తెట్టు తీసుకొచ్చి విచారించారు. తెట్టు జంక్షన్లో ఉన్న సీసీ కెమెరా పుటేజీని పక్కనే ఉన్న మార్కెట్ కార్యాలయం కంప్యూటర్లో పరిశీలించారు. కంటైనర్ సింగరాయకొండ వద్ద ఉన్న ఫెరల్ డిస్టిలరీ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉందని సమాచారం రావడంతో విచారణ కోసం అక్కడికి వెళ్లారు. కంటైనర్‌ను హైజాక్ చేయడంలో సుమారు 20 మంది దుండగులు పాల్గొని ఉంటారని సమాచారం. బీహార్ గ్యాంగ్ పనేనా? బీహార్ రాష్ట్రానికి చెందిన పారంగి ముఠా సభ్యులు ఈ కేసులో ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చోరీ జరిగిన విధానం ఆధారంగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. వీరు క్రూరులని, చోరీ సమయంలో డ్రైవర్‌ను కచ్చితంగా చంపుతారని, ఇక్కడ ఉన్న నిందితుల్లో డ్రైవర్‌ను ఒకరు చంపుదామంటే మరొకరు చంపొద్దని వారించారని, చివరకు డ్రైవర్‌ను కట్టేసి కళ్లకు గంతలు చుట్టి పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఈ కేసుకు పారంగి ముఠాతో సంబంధం ఉందా..లేదా అన్నది పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమా తరహా చోరీ కంటైనర్ చోరీ తీరు ఇటీవల తమిళ నటుడు కార్తీ నటించిన ఖైదీ సినిమా తరహాలో ఉందని పోలీసు వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి చోరీకి గురైన కంటైనర్‌ను మాత్రం పోలీసులు గుర్తించగలిగారు. అందులోని సిగరెట్ బాక్స్‌లను మాత్రం ప్రస్తుతానికి గుర్తించలేకపోయారు. ఐటీసీ కంపెనీకి చెందిన సిగిరెట్ల కంటైనర్ బెంగళూరు నుంచి ఈ నెల 23వ తేదీ రాత్రి పది గంటలకు విజయవాడలోని గూడవల్లి గోల్డెన్ రాయల్ వేర్ హౌసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బయల్దేరింది. కంటైనర్ తెట్టు సమీపంలోని శాంతినగర్ వద్దకు రాగానే సుమారు 10 మంది దుండగులు కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉన్న మూడు లారీల్లో వచ్చి కంటైనర్ వెళ్లేందుకు వీల్లేకుండా ముందు, వెనుక లారీలు ఆపారు. ఆ తర్వాత కంటైనర్ డ్రైవర్ బి.రవిపై దాడి చేసి గాయపరిచి కంటైనర్‌తో పరారయ్యారు. సింగరాయకొండ ఎస్ఐ మేడా శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారంతో శనివారం వేకువ జామున 2.30 గంటల సమయంలో పెరల్ డిస్టిలరీ కంపెనీ వద్ద కంటైనర్‌ను హైవే పెట్రోలింగ్ పోలీసులు గుర్తించి ఆ సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు. అయితే అప్పటికే కంటైనర్‌లో 531 సిగిరెట్ పెట్టెలు ఉండాల్సి ఉండగా కేవలం 125 పెట్టెలు మాత్రమే ఉన్నాయి. చోరీ సొత్తు విలువ సుమారు 3.50 కోట్ల రూపాయలుగా పోలీసులు పేర్కొంటున్నారు. మిస్టరీగా కంటైనర్ చోరీ ఘటన.. కంటైనర్ చోరీ ఘటన మిస్టరీగా మారింది. చోరీ జరిగిన తీరు గమనిస్తుంటే ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. కంటైనర్‌కు జీపీఆర్ఎస్ సిస్టం ఉంది. దీని ప్రకారం కంటైనర్ ఎక్కడ ఉందో వెంటనే గుర్తించవచ్చు. కంటైనర్‌ను దుండగులు సింగరాయకొండ పట్టణం నుంచి పాకల రోడ్డు వరకు తీసుకొచ్చి మళ్లీ కావలి వైపు బయల్దేరి చివరకు పెరల్ డిస్టిలరీ కంపెనీ వద్ద వదిలి వెళ్లిపోయారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు జీపీఆర్ఎస్ విధానం ద్వారా కంటైనర్‌ను గుర్తించి వెళ్లేలోపు దుండగులు కంటైనర్‌ను ఫ్యాక్టరీ వద్ద వదిలి వేరే వాహనంలో కావలి వైపు పరారయ్యారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కంటైనర్ చోరీకి గురైన సమాచారం రిలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ అనుబంధ సంస్థ స్టెల్లార్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధికి సుమారు రాత్రి 11 గంటలకు అందింది. అంతేగాక కంటైనర్ సింగరాయకొండ వద్దే చోరీకి గురైందని వారికి పక్కా సమాచారం అందింది. -
సిగరెట్‌తో ఎముకలూ దెబ్బ తింటాయా?
నా వయసు 35 ఏళ్లు. రోజుకు రెండు పాకెట్ల సిగరెట్లు తాగుతాను. ఇటీవల నా బరువు తగ్గింది. విటమిన్ డి పాళ్లు కూడా తగ్గాయి. ఫ్రెండ్స్ మాట్లాడుతూ సిగరెట్లతో ఎముకలు కూడా బలహీనమవుతాయని అంటున్నారు. సిగరెట్ దుష్ప్రభావం ఎముకలపైన కూడా ఉంటుందా? – ఆర్. సమీర్, హైదరాబాద్ పొగతాగే అలవాటు అన్ని అవయవాల మాదిరిగానే ఎముకలపైనా దుష్ప్రభావం చూపుతుంది. సిగరెట్ల కారణంగా అనారోగ్యకరంగా బరువు తగ్గడం, విటమిన్ డి పాళ్లు తగ్గడం, ఎముకలు క్యాల్షియమ్‌ను గ్రహించడం కూడా తగ్గుతుంది. పైగా మామూలు వ్యక్తులతో పోలిస్తే స్మోకర్లలో ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు 25 శాతం ఎక్కువ. అలాగే తుంటిఎముక ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు పొగతాగే వారిలో ఎక్కువ. స్మోకింగ్ వల్ల అనేక దుష్ప్రభావాలు కనిపించి ఎముక సాంద్రత తగ్గుతుంది. అందుకు దారితీసే అంశాలివి... ∙పొగతాగే అలవాటు వల్ల హార్మోనల్ మార్పులు వచ్చి క్యాల్షియమ్‌ను ఎముకల్లోకి వెళ్లేలా చేసే పారాథైరాయిడ్ హార్మోన్ పాళ్లు, మహిళల్లో ఈస్ట్రోజెన్ పాళ్లు తగ్గుతాయి. పొగతాగే అలవాటు వల్ల విటమిన్ డి పాళ్లు తగ్గడంతో, శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గుతుంది. శరీరానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ పెరగడం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. రక్తనాళాల్లో రక్తప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటం వల్ల ‘పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్’ వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల ఎముకకూ రక్తప్రసరణ తగ్గుతుంది. పొగతాగే అలవాటు వల్ల నరాలు స్పందించే వేగం తగ్గుతుంది. దాంతో వాళ్లు పడిపోయే అవకాశాలు ఎక్కువ. పొగలోని విషపదార్థాలు ఎముక కణాలపైనా నేరుగా తమ దుష్ప్రభావం చూపుతాయి. ∙ఎముకలలోని బంతిగిన్నె కీలుతోపాటు అన్ని కీళ్లు పొగ వల్ల వేగంగా గాయపడే అవకాశాలుంటాయి. గాయాలు చాలా ఆలస్యంగా తగ్గుతాయి. భర్తకు పొగతాగే అలవాటు ఉన్నప్పుడు వారి భాగస్వామి ప్యాసివ్ స్మోకింగ్ బారినపడటం వల్ల వాళ్లకు పుట్టబోయే బిడ్డల ఎముకల బరువూ చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే మీ డాక్టర్ చెప్పినట్లుగా మీరు వెంటనే పొగతాగే అలవాటు మానేయండి. సన్నగా ఉన్నాను... ఆరోగ్యంగా బరువు పెరగడం ఎలా? నా వయసు 29 ఏళ్లు. నేను చాలా సన్నగా ఉంటాను. బరువు కేవలం 48 కేజీలు మాత్రమే. నా ఫ్రెండ్స్ అంతా నన్ను చాలా ఎగతాళి చేస్తుంటారు. నా ఎత్తు ఐదడుగుల తొమ్మిది అంగుళాలు. నేను లావు పెరగడానికి సలహాలు ఇవ్వండి. ఏమైనా మందులు వాడాలా చెప్పగలరు. – ఎ. సిద్ధార్థ, కర్నూలు కొందరు బరువు పెరగకపోవడానికి సాధారణ కారణాలు ఇవి... ∙జన్యుపరమైనవి ∙సరిగా తినకపోవడం ∙చాలా తీవ్రమైన శారీరక శ్రమ ఉన్న వృత్తిలో ఉండటం ∙అవి వ్యాయామం. ఈ సమస్యలే గాక ఇక ఆరోగ్యపరంగా కొందరికి ఆహారం తీసుకోవడం విషయంలో వైద్యపకరమైన రుగ్మతలు (ఈటింగ్ డిజార్డర్స్) ఉండటంతో కూడా బరువు పెరగరు. మీ విషయంలో సమస్య ఏమిటో తెలుసుకోడానికి ముందుగా వైద్యుడిని కలవండి. డాక్టరు మిమ్మల్ని పరీక్షించి... ∙మీలో ఏదైనా వైద్యపరమైన సమస్య ఉందేమో తెలుసుకోడానికి తగిన పరీక్షలు చేయించి వాటిని నిర్ధారణ చేస్తారు (ఉదా: ౖహె పర్ థైరాయిడిజమ్) ∙మీరు తీసుకునే ఆహరంలో పోషకాలు పాళ్లు ఎలా ఉన్నాయో అన్నదానితో పాటు మీ శారీరక శ్రమ తీరుతెన్నులను అడిగి తెలుసుకుంటారు ∙ఆ తర్వాత ఆరోగ్యకరంగా బరువు పెరిగేందుకు మీరు తీసుకోవాల్సిన ఆహారం, చేయాల్సిన వ్యాయామాల గురించి వివరిస్తారు. మీకు కొన్ని సూచనలు: ∙మీరు ఇప్పుడు తీసుకుంటున్న పరిమాణం కంటే పెద్ద పరిమాణాల్లో కనీసం మూడుసార్లయినా ఆహారం తీసుకోండి. మధ్యలో మరో మూడుసార్లు చిన్న పరిమాణాల్లో తినండి. ఇలా రోజుకు ఆరుసార్లు తినండి ∙మీరు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి. అవి కండరాల పెరుగుదలకు దోహదపడతాయి. కేవలం ఆరోగ్యకరమైన ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి లేకపోతే మీరు అతిగా తీసుకునే ప్రోటీన్ మీ అంతర్గత అవయవాలపై ప్రభావం చూపుతుంది. (ముఖ్యంగా కిడ్నీలు). అందుకే హైప్రోటీన్ డైట్ వద్దు ∙మీ ఆహారంలో పండ్లు, పెరుగు, కస్టర్డ్, మిల్క్‌షేక్‌లు నిత్యం ఉండేలా చూసుకోండి ∙ఆరుసార్లు తినే ఆహారంలో అతిగా కొవ్వులు, పోషకాలు లేకుండా ఉండే జంక్‌ఫుడ్ లేకుండా జాగ్రత్త తీసుకోండి ∙ఇక నట్స్ ఎక్కువగా తీసుకోండి ∙వెన్న, ఆల్మండ్, వేరుశెనక్కాయలు, డ్రైఫ్రూట్స్ మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి ∙మీరు వాడే నూనెకు బదులు ఆరోగ్యకరమైన ఆలివ్ ఆయిల్‌ను వాడండి ∙అతి వ్యాయామం కాకుండా పరిమితమైన వ్యాయామం తప్పక చేయండి. మీ వ్యాయామాలు ఎలా ఉండాలంటే అతిగా చేసి కొద్దిసేపట్లో ముగిసేలా కాకుండా, మెల్లగా చేస్తూ... చాలాసేపు కొనసాగేలా జాగ్రత్తపడండి. బరువు పెరగడానినిక ఉపయోగపడతాయంటూ న్యూస్పేపర్లలో, టీవీల్లో కనిపించే ప్రకటనలలోని పౌడర్ల జోలికి వెళ్లకండి. పరిమితమైన కొవ్వులు శరీర జీవకార్యకలాపాలకు అవసరం. అంత మేరకు మాత్రమే కొవ్వులు పెరిగేలా ముందుగా మీరు ఆహారాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఇక మీరు బరువు పెరిగే క్రమం కూడా చాలా మెల్లగా జరగాలి. అంతేతప్ప ఒకేసారి కాదు. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఈ–సిగరెట్లు.. అనారోగ్యం వంద రెట్లు
చాప కింద నీరులా విస్తరిస్తున్న మహమ్మారి కేన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్తమా వచ్చే అవకాశం పాఠశాలలు, కాలేజీ యువతే లక్ష్యంగా విక్రయాలు ఒక్కో ఈ–సిగరెట్ ఖరీదు రూ. 3 వేల నుంచి రూ. 30 వేలు 13 రాష్ట్రాల్లో నిషేధం... తెలంగాణలోనూ నిషేధించే అవకాశం చూడడానికి స్టైలిష్‌గా ఉంటుంది... తాగితే మాంచి అనుభూతినిస్తుంది... సాధారణ సిగరెట్ కంటే ఆకర్షిస్తుంది. పైగా వివిధ రకాల పండ్ల సువాసన వెదజల్లుతుంది. అదే ఈ–సిగరెట్. ఇప్పుడు దేశంలోనూ, రాష్ట్రంలోనూ యువతీ యువకులు ముఖ్యంగా టీనేజర్లు దీనికి ఆకర్షితులవుతున్నారు. చివరకు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం ఉండటంతో టీనేజర్లు ఎగబడుతున్నారు. సాధారణ సిగరెట్టు మాదిరిగా పొగ బయటకు రాదు. కాబట్టి తాగే వారిని గుర్తించడమూ అంత సులువుకాదు. విచిత్రమేంటంటే దశాబ్ద కాలంగా టీనేజీ పిల్లల్లో సిగరెట్లు తాగడం గణనీయంగా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు ఈ–సిగరెట్లు వచ్చి వారిని నాశనం చేస్తు న్నాయి. దాని వల్ల వచ్చే ప్రమాదాలు తెలియకపోవడంతో స్టైల్ కోసం తాగుతున్నారు. సాధారణ సిగరెట్లతో ఎంతటి దుష్ప్రభావాలున్నాయో, అంతకుమించి ఈ–సిగరెట్లతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డెంటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఒక అధ్యయన పత్రాన్ని అవి తయారు చేశాయి. ఆ వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు అందజేశాయి. ప్రపంచంలో ఈ–సిగరెట్లను 36 దేశాలు నిషేధించాయి. మన దేశంలో పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, జార్ఖండ్ రాష్ట్రాలు నిషేధిం చాయి. తెలంగాణలోనూ నిషేధించాలని వైద్య, ఆరోగ్యశాఖకు ఈ సంస్థలు ఇటీవల విన్నవించాయి. – సాక్షి, హైదరాబాద్ ఎలా పని చేస్తుంది? ఈ–సిగరెట్టు బ్యాటరీతో పనిచేస్తుంది. నికోటిన్‌తో ఉండే ద్రవ పదార్థాన్ని మండించడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఉదాహరణకు దోమలను పారదోలేందుకు కొన్ని రకాల లిక్విడ్ మందును మనం ఎలా విద్యు త్తో వాడతామో అలాగే ఇది కూడా పనిచేస్తుంది. అందులో ద్రావణం మండి ఆవిరి కలుగ జేస్తుంది. తద్వారా అది ఒకరకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ–సిగరెట్లకు అనేక పేర్లున్నాయి. ఈ–సిగ్స్, ఈ–హుక్కాస్, వేప్ పెన్స్, ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్ అని కూడా అంటారు. చూడడానికి ఇవి పెన్నుల మాదిరిగా కూడా ఉంటాయి. ఈ–సిగరెట్ల ఖరీదు ఏకంగా రూ. 3 వేల నుంచి రూ. 30 వేల వరకు మన దేశంలో విక్రయిస్తున్నారు. అయితే పెన్ను రీఫిల్ మార్చినట్లుగా అనేక సార్లు దీన్ని మార్చుకోవచ్చు. ఒకసారి రూ. 30 వేలు పెట్టి కొంటే, దాంట్లో ద్రవ పదార్థం అయిపోయినప్పుడల్లా రూ. 700 నుంచి రూ. వెయ్యి వరకు పెట్టి రీఫిల్ చేసుకోవచ్చు. అలా వంద నుంచి రెండొందలసార్ల వరకు మార్చుకునే వెసులు బాటుంది. ఇండియాలో దీనికి ఎంత మంది బానిసలయ్యారన్న దానిపై ఇంకా స్పష్టమైన డేటా లేదు. కానీ అమెరికాలో మూడు శాతం మంది పెద్దవాళ్లు ఈ–సిగరెట్లు తాగుతున్నారు. 15% మంది దాన్ని కొత్తగా ప్రయత్నించారని అధ్యయనాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోనూ టీనేజర్లు దీని బారిన పడినట్లు ఆ సంస్థలు చెబుతున్నాయి. కేన్సర్‌కు దారితీస్తుంది... సాధారణ సిగరెట్లలో పొగాకును మండిస్తారు. దానిద్వారా కార్బన్ మోనాౖMð్సడ్ తదితర రసాయనాలు మన ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి. ఈ–సిగరెట్ల ద్వారా అత్యంత ప్రమాదకరమైన బెంజిన్, ఇథైలిన్ ఆౖMð్సడ్, ఎక్రిలమైడ్ వంటి రసాయనాలు వెలువడతాయి. వాటిని పీల్చుతారు. అంతేగాక టాక్సిక్ మెటల్స్ను కూడా పీల్చుతారు. ఈ–సిగరెట్లలో ఉండే కాయిల్స్ ద్వారా ఇవి ఉత్పత్తి అవుతాయి. వీటిని పీల్చడం ద్వారా కేన్సర్, నాడీ మండల వ్యవస్థ ధ్వంసం కావడం తదితర దుష్పరిణామాలు తలెత్తుతాయి. అలాగే ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తాయి. హైబీపీ తలెత్తడం, ఒక్కోసారి కోమాలోకి వెళ్లి చనిపోవడం జరుగుతుంది. తక్కువ డోస్ ఈ–సిగరెట్లు తాగితే వాంతులు, కడుపునొప్పి తదితరాలు సంభవిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు.. ఈ–సిగరెట్లలో నికోటిన్ అనే పదార్థం ఉంటుంది. మెదడుపై అది ప్రభావం చూపుతుంది. గర్భిణీలు తాగితే మరింత ప్రమాదం. సాధారణ సిగరెట్లను మానేయడానికి ఈ–సిగరెట్లు ఉపయోగపడతాయన్న ప్రచారాన్ని కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఎక్కడా అలా జరగకపోగా, మరింతగా బానిసలవుతున్నారు. ఈ–సిగరెట్లలో ఉండే బ్యాటరీలు ఒక్కోసారి పేలి పిల్లలు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ–సిగరెట్లు తయారు చేసే ప్రధాన బ్రాండ్లు అన్నీ కూడా పొగాకు కంపెనీలే కావడం గమనార్హం. టీనేజీ పిల్లలను ఈ–సిగరెట్లు ఆకర్షించడానికి ప్రధాన కారణం... వివిధ రకాల ప్లేవర్లలో (రుచులు లేదా సువాసన) అందుబాటులో ఉండటం, ఉన్నతమైన టెక్నాలజీతో తయారు కావడం, పైగా దీనివల్ల సాధారణ సిగరెట్ల కంటే ప్రమాదం తక్కువన్న ప్రచారం ఉండటం. రాష్ట్రంలోనూ నిషేధించాలి ఈ–సిగరెట్లను నిషేధించాలని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ఇటీవల విన్నవించాం. దేశంలో వివిధ రాష్ట్రాలు నిషేధించాయని, తెలంగాణ లోనూ వీటిని నిషేధించేలా నిర్ణయం తీసుకోవాలని కోరాం. పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. – నాగ శిరీష, వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి -
అత్యంత హానికారక సిగరెట్లు ధ్వంసం
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న అత్యంత హానికారక సిగరెట్లను అధికారులు గుర్తించి ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు రూ.6.50 కోట్లు ఉంటుందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు పేర్కొన్నారు. వివరాలు... దుబాయ్‌లో తయారైన మోండ్ బ్రాండ్, ఇంగ్లాండ్‌లో తయారైన బెన్సన్ అండ్ హెడ్జెస్ సిగరెట్లు సిటీకి అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ ముఠాపై డీఆర్ఐ అధికారులు కన్నేశారు. ఈ గ్యాంగ్ సిగరెట్లను సముద్రమార్గంలో కంటైనర్ల ద్వారా ముంబైకి తీసుకువస్తున్నట్లు గుర్తించారు. ఆ కంటెయినర్లలో టేపులు ఉన్నట్లు, దుబాయ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు రికార్డు ల్లో పొందుపరిచినట్లు అనుమానించారు. తాజాగా తిమ్మాపూర్‌లోని ఇన్‌ల్యాండ్ కంటెయినర్ డిపో(ఐసీడీ)కి వచ్చిన ఈ కంటెయినర్లను డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. 15 లక్షల బెన్సన్ అండ్ హెడ్జెస్, 30.3 లక్షల మోండ్ సిగరెట్లను స్వాధీనం చేసుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. వీటిలో కొన్ని నకిలీ సిగరెట్లు కూడా ఉన్నట్లు అధికారులు తేల్చారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సూచన మేరకు రాంకీ సంస్థకు చెందిన దుండిగల్ యూనిట్లో కస్టమ్స్ అధికారులు మంగళవారం ఆ సిగరెట్లను ధ్వంసం చేశారు. పన్ను ఎగ్గొట్టడానికే... ఆరోగ్యానికి హానికరమైన, స్థానిక వ్యాపారులకు నష్టం కలిగించే ఈ సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం(కస్టమ్స్ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుండే ఈ సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన పన్ను ఉంటుంది. రూ.10 ఖరీదైన సిగరెట్‌ను దిగుమతి చేసుకుంటే దానిపై పన్ను రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ పన్నును ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠా భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతోందని డీఆర్ఐ దర్యాప్తులో తేలింది. సిటీలో ఉన్న హోల్‌సేల్ వ్యాపారులతో సంబంధాలు పెట్టుకుని వీటిని మార్కెట్లోకి తరలిస్తున్నారు. ఇతర దేశాల్లో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేది స్పష్టంగా తెలియదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్ హెల్త్ ఆఫీసర్లు పరీక్షించి ధ్రువీకరిస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకుండానే విపణిలోకి వెళ్లిపోతున్నాయని అంటున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ఆరోగ్యానికి ఎనలేని హాని చేస్తాయని హెచ్చరిస్తున్నారు. -
గుట్టుగా మట్కా..మత్తుగా గుట్కా!
గిద్దలూరు రూరల్: జిల్లా వ్యాప్తంగా యువత దురలవాట్లకు లోనై తమ బంగరు భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటున్నారు. సిగిరెట్, మట్కా, గుట్కా, ఖైనీ వంటి వ్యసనాల వలలో చిక్కుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వ్యసనాలకు బానిసవుతున్న యువకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. రాజకీయ నేతలతో పాటు అధికారులు, కళాశాలలు నిర్వహించే కొందరు చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. చెడు వ్యసనాల నుంచి బయట పడేందుకు వీలు పడక అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. గుడి, బడి, ఇళ్లు, వైద్యశాల అనే తేడా లేకుండా బహిరంగ ప్రదేశంలో సిగిరెట్లు విచ్చలవిడిగా తాగుతూ ఆరోగ్యం నాశనం చేసుకోవడమే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో నిల్చొని ఉండే వారి ఆరోగ్యాన్ని సైతం నాశనం చేసేందుకు కారకులవుతున్నారు. సిగిరెట్, మద్యానికి బానిసలవుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా మద్యం దుకాణాల వద్ద క్యూకడుతున్నారు. సిగరెట్ కాలుతూ ఆరోగ్యాన్ని కాల్చేస్తూ.. సిగరెట్టే కదా..అని సిగిరెట్ కాల్చడం మొదలు పెట్టిన వ్యక్తితో పాటు సిగిరెట్ కాల్చగా వచ్చిన పొగతో అందరి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు. నెలంతా శ్రమించి సంపాదించిన సొమ్ములో సగభాగం సిగిరెట్, మద్యం, మట్కా, గుట్కా, ఖైనీ వంటి చెడు వ్యసనాలకు ఖర్చు చేస్తూ సొమ్ముతో పాటు వారి ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువ గిద్దలూరు నియోజకవర్గంలోని గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బేస్తవారిపేట, అర్ధవీడు, కంభం ఆరు మండలాలల్లో జనవరి 2018 నుంచి అక్టోబర్ వరకు సుమారు 689 డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులే నమోదయ్యాయి. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ఎక్కువ మంది పట్టుబడుతూ జరిమానాలు చెల్లిస్తున్నారు. జరిమానాతో పాటు జైలుశిక్షలకైనా సిద్ధపడుతున్నారు. గిద్దలూరు, సంజీవరాయుడుపేట, కేఎస్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జనవరి 2018 నుంచి సుమారు 60కిపైగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న కేసులు నమోదైనట్లు వైద్యులు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది మద్యం, సిగిరెట్‌తో ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వారు ఎక్కువుగా ఉన్నారని తెలుస్తోంది. ఎక్కువ మంది ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. చిరుద్యోగి చెడు అలవాట్లకు లోనైతే? ప్రైవేటు రంగంలో పనిచేసే ఓ వ్యక్తి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం తీసుకుంటాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉంటారు. రోజుకు ఒక్కో సిగిరెట్ రూ.10 చొప్పున రెండు ప్యాకెట్లు కాలుస్తాడు. ఇందుకు రోజుకు రూ.200 ఖర్చు చేస్తుంటాడు. వారంలో రెండు రోజులు లిక్కర్‌కు రూ.2 వేలకు పైగా ఖర్చు చేస్తుంటాడు. ఈ లెక్కన సిగరెట్లు, మద్యానికి తన సంపాదనలో సగ భాగంపైనే చెడు వ్యసనాలకే ఖర్చు చేస్తున్నాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో బయట అధిక వడ్డీలకు అప్పులు చేసి కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసుకుంటున్నాడు. ముచ్చటైన కాపురం పతనం: నా భర్త అంజి జీపు డ్రైవర్‌గా పనిచేస్తూ మద్యం, సిగిరెట్ వంటి చెడు వ్యసనాలకు బానిసై సంవత్సరం ఆరు నెలల క్రితం అనారోగ్యానికి గురై చనిపోయాడు. కుటుంబ పోషణ భారం నాపై పడింది. నాలుగు ఇళ్లల్లో పొద్దున్నే పాచి పని చేసుకుంటూ మిగిలిన సమయంలో హోటల్లో పనిచేసుకుంటున్నాను. రెక్కల కష్టం మీద కుటుంబాన్ని పోషించుకుంటూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నా. నాది కొమరోలు మండలం అయ్యావారిపల్లి. 14 ఏళ్ల క్రితం పట్టణానికి చెందిన అద్దంకి అంజితో వివాహమైంది. భర్త వృత్తిరీత్యా కారు, జీపులకు డ్రైవర్‌గా పనిచేసేవాడు. భర్త బతికి ఉన్నప్పడు చెడు వ్యసనాలకు దూరం కావాలని నెత్తీ నోరు కొట్టుకుని ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదు. తీరా టైఫాయిడ్ జ్వరంతో నెల రోజులు మంచాన పడ్డాడు. వైద్యుల సూచనల మేరకు ప్రాణ భయంతో ఏడాది పాటు మద్యం, సిగిరెట్లకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ మద్యం తాగడం మొదలు పెట్టడంతో కామెర్లు వచ్చి లివర్ చెడిపోయి మృతి చెందాడు. చెడు వ్యసనాలతో చనిపోవడమే కాకుండా ఉన్న కొద్దిపాటి స్థలాన్ని అమ్మేశాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో నాలుగు ఇళ్లల్లో పాచి పనిచేసుకోవాల్సి వచ్చింది. వచ్చిన డబ్బుతో ఇద్దరు ఆడ పిల్లలను చదివించుకుంటున్నా. – అద్దంకి లక్ష్మీదేవి యువత ఆరోగ్యం నిర్వీర్యం: గిద్దలూరు ప్రాంతంలో యువత సిగిరెట్, మద్యం, ఖైనీ పొగాకు వంటి చెడు వ్యసనాలను బానిసవుతున్నారు. ఆరోగ్యాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. చాలా వరకు యువత చెడు వ్యసనాలకు బానిసలై అనారోగ్యానికి గురవుతున్నారు. మా వద్దకు వైద్యం కోసం వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రాణభయం కల్పిస్తున్నా వారిలో ఎటువంటి మార్పు రావడం లేదు. నోటి క్యాన్సర్, కిడ్నీలు పాడవడం, ఊపిరితిత్తులు పాడవుతున్నాయి. రోగాల బారినపడి చిన్న వయసులోనే మృత్యువాత పడుతున్న సంఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. – డి.హరినాథరెడ్డి, డాక్టర్ ఇప్పటికే భర్తను కోల్పోయా: చెడు వ్యసనాలకు లోనై గతేడాది భర్తను కోల్పోయా. ఇక నా కన్న కొడుకు వంతు వచ్చింది. ప్రస్తుతం పట్టణంలోని అర్బన్ కాలనీలో ఉంటున్నా. మాస్వగ్రామం మండలంలోని తాళ్లపల్లి. కొన్నేళ్ల నుంచి పట్టణంలో కాపురం ఉంటున్నాం. భర్త గుండమయ్య చెడు వ్యసనాలతో రెండు కిడ్నీలూ చెడిపోవడంతో మృత్యువాతపడ్డాడు. భర్త ఆరోగ్యం కోసం తాళ్లపల్లిలో ఉన్న ఇంటి స్థలం రూ.లక్షకు అమ్మి వచ్చిన డబ్బుతో భర్త ఆరోగ్యానికి ఖర్చు చేశా. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. భర్త చనిపోయినా చేతికి అంది వచ్చిన కుమారుడు ఉన్నాడనే ఆశ కూడా మిగల్లేదు. కుమారుడు రంగస్వామి సైతం మద్యంకు బానిసై ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. సిగిరెట్, గుట్కా, ఖైనీ, మందు.. ఇలా అన్ని వ్యసనాలూ ఉన్నాయి. ఎంత బానిసయ్యాడంటే మంచంలో ఉన్నా సరే నాకు మందు తీసుకురా..అంటూ సతాయిస్తున్నాడు. నా బాధ ఏ తల్లికీ రాకుడదు. కన్న కొడుకు రంగస్వామి రెండు కిడ్నీలూ పాడవడంతో పాటు లివర్ దెబ్బతింది. వణుకుడు జబ్బుతో బాధ పడుతున్నాడు. రంగస్వామి బాధ చూడ లేక ఇటీవల ఊరి వద్ద ఉన్న ఎకరా పొలం అమ్మగా మా భాగం కింద వచ్చిన రూ.25 వేల డబ్బులు కాస్తా నంద్యాలలోని శాంతిరామ్ వైద్యశాలలో వైద్యం కోసం ఖర్చు చేశా. మందు తాగితే చనిపోతావని వైద్యులు చెప్పినా బతకాలనే ఆశ కన్నా మందు తాగాలనే ఆశ వాడికి ఎక్కువైంది. నిత్యం మందు, సిగరెట్ తాగడంతో కిడ్నీలు పాడై లివర్ సైతం నాశనమైందని వైద్యులు చెప్పారు. నరాల బలహీనతతో సక్రమంగా నిలబడలేకపోతున్నాడు. మందుకు బానిసై నా భర్త, కన్న కొడుకు జీవితం నాశనం చేసుకోవడమే కాకుండా నా జీవితాన్ని కూడా నాశనం చేశారు. భర్త చనిపోయి కన్న కొడుకు మంచాన పడి ఇన్ని కష్టాల మధ్య ఉన్న నాకు ప్రభుత్వం నుంచి వచ్చే వితంతు పెన్షన్ రానివ్వకుండా మా వార్డు కౌన్సిలర్ వెంకటస్వామి అడ్డుపడుతున్నాడు. పెన్షన్ రావాలంటే రూ.2 వేలు డిమాండ్ చేస్తున్నాడు. నాకు తెలియకుండా ఎమ్మెల్యే, అ«ధికారులు ఎలా ఇస్తారంటూ చెప్పడం చాలా అన్యాయంగా ఉంది. – గుజ్జా రమణమ్మ -
గాలి పీల్చితే.. 7 సిగరెట్లు తాగినట్లే..
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో గాలి పీల్చితే రోజుకు 7.7 సిగరెట్లు తాగినట్లే. అదే మన ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో ఒక రోజు శ్వాస తీసుకుంటే 4 సిగరెట్లు తాగినట్లే. దేశంలోని మిగతా పెద్ద నగరాల్లో కూడా గాలి స్వచ్చత అంతంత మాత్రమే. వీటిలో నివసిస్తున్న సగటు వ్యక్తి రోజుకు రెండు నుంచి ఎనిమిది సిగరెట్లు కాల్చుతున్నట్లే లెక్క. అవును. వాయు కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు ఏప్రిల్‌లో ‘షూట్ ఐ స్మోక్’ అనే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను పారిస్‌లో విడుదల చేశారు. ఈ యాప్ ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లోని గాలి స్వచ్చతను సిగరెట్ పొగతో పోల్చి అంచనాలను చూపుతుంది. ఇలా భారత్‌లోని కీలక నగరాల గాలి స్వచ్చత తీవ్ర స్థాయిలో దిగజారినట్లు ఈ యాప్ తెలుపుతోంది. కాగా, కేంద్ర కాలుష్య నివారణ సంస్థ(సీపీసీబీ) మాత్రం ఈ యాప్ అంచనాలు సరైనవి కావంటూ కొట్టి పారేసింది. విదేశాల్లో చేసిన పరిశోధనల ఆధారంగా భారత్‌లో వాయు కాలుష్యాన్ని సిగరెట్ పొగతో పోల్చి చెప్పడం సరికాదని పేర్కొంది. దేశంలో గాలి కాలుష్యానికి సంబంధించిన డేటాను మాత్రమే అధికారికంగా సీపీసీబీ మాత్రమే విడుదల చేస్తుందని తెలిపింది. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీని పేర్కొన్న విషయం తెలిసిందే. సంస్థ రిపోర్టు ప్రకారం ప్రపంచంలోని అత్యంత కాలుష్యమైన తొలి 20 నగరాల్లో భారత్‌కు చెందినవి 14 ఉన్నాయి.