ఐటీసీ
బ్రోకరేజ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్
ప్రస్తుత మార్కెట్ ధర: రూ.325
టార్గెట్ ధర: రూ.382
ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాలు అంచనాలకనుగుణంగానే ఉన్నాయి. నికర లాభం రూ.2,385 కోట్లకు పెరిగింది. ఇక నికర అమ్మకాలు 13 శాతం వృద్ధితో రూ.8,623 కోట్లకు పెరిగాయి. సిగరెట్ల అమ్మకాలు తగ్గినప్పటికీ ధరల పెంపు కారణంగా సిగరెట్ల వ్యాపారం 13 శాతం వృద్ధి చెంది రూ.4,116 కోట్లకు పెరిగింది. ఆశీర్వాద్, సన్‌ఫీస్ట్ తదితర బ్రాండెడ్ ప్యాకేజ్‌డ్ ఫుడ్స్ అమ్మకాలు జోరుగా ఉండటంతో ఎఫ్‌ఎంసీజీ వ్యాపారం 17% వృద్ధితో రూ.2,078 కోట్లకు పెరిగింది.
అగ్రి బిజినెస్ 10 శాతం, పేపర్ బోర్డ్స్ అండ్ ప్యాకేజింగ్ విభాగం 19 శాతం వృద్ధి చెందగా హోటళ్ల వ్యాపారం ఫ్లాట్‌గా ఉంది. ఏడాది కాలంలో కంపెనీ ఆదాయం 14 శాతం, నికర లాభం 17 శాతం చొప్పున పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 25 రెట్ల ధరలో ప్రస్తుతం ఈ షేర్ ట్రేడవుతోంది. సిగరెట్ల వ్యాపారంలో మార్కెట్ లీడర్ అయినప్పటికీ, ప్యాకేజ్‌డ్ ఫుడ్స్, బ్రాండెడ్ దుస్తులు, పర్సనల్ కేర్ తదితర సెగ్మంట్లలో అమ్మకాలు జోరుగా ఉన్నాయి.