Angel Broking
-
యువతకు ఉచిత శిక్షణ..3,474 మందికి ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎన్ఐఐటీ), ఏంజెల్‌వన్ సంయుక్త భాగస్వామ్యంలో 3,474 మంది యువతకు ఉపాధి కల్పించినట్లు ప్రకటన విడుదల చేశారు. ఈ రెండు సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమంలో భాగంగా బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీఓ), బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వంటి రంగాల్లో నైపుణ్యాలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం ప్రతిభ చూపిన వారికి ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.భారత్‌లో టెక్నాలజీపరంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. కానీ యువతలో అందుకు తగిన నైపుణ్యాలు మెరుగవడం లేదు. దాంతో సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు సాధించడం పెద్ద సవాలుగా మారుతుంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన ‘ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024’ ప్రకారం..యువతకు కొలువులు దక్కకపోవడానికి ప్రధానం కారణం సరైన విద్య, నైపుణ్యాలు లేకపోవడమేనని తేలింది. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ఎన్ఐఐటీ, ఏంజెల్‌వన్ బ్రోకింగ్ సంస్థ సంయుక్తంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది.ఇదీ చదవండి: వేడి టీ పడి ఒళ్లంతా గాయాలు.. రూ.12.5 కోట్ల దావాఈ కార్యక్రమంలో పాల్గొన్న 18-28 ఏళ్ల మధ్య వయసు గల యువతకు ఉచితంగా ఆన్లైన్ కోర్సులను నేర్పిస్తున్నారు. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్) ద్వారా శిక్షణా మాడ్యూళ్లను అందిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ కోసం పురుషులతో పోలిస్తే 58% మంది మహిళలే అధికంగా తమ వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మొత్తం అభ్యర్థుల్లో 71% మంది (3,474 మంది లబ్ధిదారులు) క్వెస్ కార్ప్, సీ-టెక్, ఫిన్‌డ్రైవ్ సర్వీసెస్, హెచ్డీబీ ఫైనాన్షియల్, డీబీఎస్ మింటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థల్లో ఉద్యోగం పొందినట్లు ఎన్ఐఐటీ, ఏంజెల్ వన్ ప్రకటన విడుదల చేశాయి. మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీ, కర్ణాటక వంటి వివిధ రాష్ట్రాల్లోని యువత ఈ కార్యక్రమంలో భాగమయ్యారని తెలిపాయి. 3,750 మందికి నైపుణ్యాలు అందించి వారికి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా ఈ కార్యక్రమం రూపొందించినట్లు పేర్కొన్నాయి. -
ఏంజెల్ బ్రోకింగ్ సీఈఓ 'దినేష్ ఠక్కర్' రూ.5 కోట్ల సూపర్ కారు (ఫోటోలు)
-
హెచ్‌పీసీఎల్, ఏంజెల్ బ్రోకింగ్.. భేష్
స్వల్ప ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు తదుపరి జోరందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 168 పాయింట్లు పెరిగి 39,918కు చేరగా.. నిఫ్టీ 63 పాయింట్లు బలపడి 11,734 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా ఓవైపు ఇంధన రంగ పీఎస్‌యూ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్), మరోపక్క ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కంపెనీల షేర్లూ భారీ లాభాలతో దూకుడు చూపుతున్నాయి. వివరాలు చూద్దాం.. హెచ్‌పీసీఎల్ సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు ప్రతిపాదించినట్లు చమురు రిఫైనరీ దిగ్గజం హెచ్‌పీసీఎల్ తాజాగా పేర్కొంది. ఈ అంశంపై వచ్చే నెల 4న(బుధవారం) సమావేశంకానున్న కంపెనీ బోర్డు చర్చించనున్నట్లు తెలియజేసింది. అదేరోజు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసిక ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్- జూన్)లో హెచ్‌పీసీఎల్ నికర లాభం 157 శాతం దూసుకెళ్లి రూ. 2,253 కోట్లకు చేరగా.. నికర అమ్మకాలు మాత్రం 47 శాతం క్షీణించి రూ. 37,559 కోట్లకు పరిమితమైన విషయం విదితమే. కాగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హెచ్‌పీసీఎల్ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 189 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 190 వరకూ పెరిగింది. ఏంజెల్ బ్రోకింగ్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో ఇటీవల జోరు చూపుతున్న ఏంజెల్ బ్రోకింగ్ కౌంటర్‌కు మరోసారి డిమాండ్ నెలకొంది. కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ బల్క్‌డీల్ ద్వారా కంపెనీలో 0.53 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడం దీనికి కారణమైంది. షేరుకి రూ. 321.73 ధరలో 4.3 లక్షల ఈక్విటీ షేర్లను సొంతం చేసుకున్నట్లు ఎన్ఎస్ఈ డేటా పేర్కొంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఏంజెల్ బ్రోకింగ్ షేరు 12.5 శాతం దూసుకెళ్లి రూ. 367 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 17 జంప్‌చేసి రూ. 379ను తాకింది. గత నాలుగు రోజుల్లో ఏంజెల్ బ్రోకింగ్ షేరు 52 శాతం ర్యాలీ చేసింది. ఇందుకు క్యూ2 ఫలితాలు దోహదం చేస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. క్యూ2లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా దాదాపు రూ. 75 కోట్ల నికర లాభం ఆర్జించిన విషయం విదితమే. -
కొటక్ మహీంద్రా- ఏంజెల్ బ్రోకింగ్ హైజంప్
ఆటుపోట్ల మధ్య మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 111 పాయింట్లు పుంజుకుని 40,256 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 33 పాయింట్లు బలపడి 11,801 వద్ద కదులుతోంది. కాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ప్రయివేట్ రంగ దిగ్గజం కొటక్ మహీంద్రా బ్యాంక్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క ఇదే కాలంలో ఏంజెల్ బ్రోకింగ్ సైతం ఆకర్షణీయ పనితీరు చూపడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. కొటక్ మహీంద్రా బ్యాంంక్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో కొటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం దాదాపు 27 శాతం ఎగసి రూ. 2,185 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 17 శాతం పెరిగి రూ. 3,913 కోట్లను అధిగమించింది. అయితే లోన్‌బుక్ 4 శాతం క్షీణించి రూ. 2.04 లక్షల కోట్లను తాకగా.. డిపాజిట్లు 12 శాతంపైగా పెరిగి రూ. 2.61 లక్షల కోట్లకు చేరాయి. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 4.61 శాతం నుంచి 4.52 శాతానికి స్వల్పంగా నీరసించాయి. ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 9.6 శాతం క్షీణించి రూ. 369 కోట్లకు పరిమితమయ్యాయి. స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏలు) 0.15 శాతం తగ్గి 2.55 శాతానికి చేరగా.. నికర ఎన్పీఏలు సైతం 0.23 శాతం తక్కువగా 0.64 శాతంగా నమోదయ్యాయి. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 22 శాతం వృద్ధితో రూ. 2,947 కోట్లను తాకింది. దీంతో వరుసగా రెండో రోజు కొటక్ బ్యాంక్ షేరు జోరు చూపుతోంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 10 శాతం దూసుకెళ్లి రూ. 1,559 సమీపంలో ట్రేడవుతోంది. ఏంజెల్ బ్రోకింగ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఏంజెల్ బ్రోకింగ్ నికర లాభం రూ. 74 కోట్లకు జంప్ చేసింది. ఒక త్రైమాసికంలో ఇది అత్యధిక లాభంకాగా.. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్- జూన్)లో రూ. 48 కోట్ల లాభం నమోదైంది. మొత్తం ఆదాయం 29 శాతం పెరిగి రూ. 318 కోట్లను తాకింది. రోజువారీ సగటు టర్నోవర్ 107 శాతం పుంజుకుని రూ. 1281 బిలియన్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. ఇబిట్ మార్జిన్లు 6.3 శాతం బలపడి 49 శాతాన్ని అధిగమించినట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఏంజెల్ బ్రోకింగ్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 16.5 శాతం దూసుకెళ్లి రూ. 290 సమీపంలో ట్రేడవుతోంది. -
ఇకపై కన్జూమర్ గూడ్స్, సిమెంట్ స్పీడ్
కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, గ్రామీణ గృహ నిర్మాణంపై దృష్టి పెట్టడంతో కన్జూమర్ డ్యురబుల్స్, సిమెంట్ రంగాలకు డిమాండ్ పెరిగే వీలున్నట్లు ఒక ఇంటర్వ్యూలో ఏంజెల్ బ్రోకింగ్ ఈక్విటీ వ్యూహకర్త జ్యోతి రాయ్ పేర్కొన్నారు. ఇంకా మార్కెట్లు, ఐపీవోలు, కంపెనీలపట్ల పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం.. మార్కెట్లు బలపడొచ్చు మార్కెట్లు తగ్గినప్పుడల్లా కొనుగోళ్లు చేపట్టవచ్చని భావిస్తున్నాం. గత నెలలో తయారీ రంగ పీఎంఐ 2012 జనవరి తదుపరి 56.8కు చేరింది. ఇది ఆర్థిక రికవరీని సూచిస్తోంది. ప్రభుత్వం అన్‌లాక్‌లో భాగంగా పలు నిబంధనలు సడలించడంతో కొద్ది నెలలపాటు సెంటిమెంటు బలపడే వీలుంది. అయితే ఆర్థిక వ్యవస్థను తిరిగి ఓపెన్ చేయడం ద్వారా కోవిడ్-19 కేసులు పెరిగే వీలుంది. ఇదే విధంగా కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ ఆలస్యంకావచ్చు. యూఎస్ ప్రభుత్వం సహాయక ప్యాకేజీపై వెనకడుగు వేయవచ్చు. ఇలాంటి అంశాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపే వీలుంది. ఐపీవోల జోరు గత మూడు నెలల్లోనే 10 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టాయి. దీంతో రానున్న కాలంలో ప్రైమరీ మార్కెట్ వెలుగులో నిలవనుంది. ఇందుకు జోరుమీదున్న స్టాక్ మార్కెట్లు సహకరించనున్నాయి. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న స్పెషాలిటీ కెమికల్స్ రంగం స్వల్ప కాలంలో అంత జోరు చూపకపోవచ్చు. పలు కంపెనీల షేర్ల ధరలు భారీగా లాభపడటమే దీనికి కారణం. అయితే దీర్ఘకాలంలో ఈ రంగంపట్ల సానుకూలంగా ఉన్నాం. ఈ రంగంలో అతుల్, పీఐ ఇండస్ట్రీస్, గలాక్సీ సర్ఫక్టాంట్స్ను పరిశీలించవచ్చు. క్యూ2పై అంచనాలు ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఆటో, సిమెంట్, ఐటీ, ఫార్మా, కెమికల్స్ రంగాలు పటిష్ట పనితీరు చూపే అవకాశముంది. వివిధ కంపెనీలు ప్రకటించే భవిష్యత్ ఆర్జన అంచనాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుంది. ప్రస్తుతం పండుగల సీజన్ కారణంగా స్వల్ప కాలంలో డిమాండ్ పుంజుకోవచ్చు. -
ఏంజెల్ బ్రోకింగ్.. వీక్ లిస్టింగ్
దేశంలో నాలుగో పెద్ద బ్రోకింగ్ సేవల కంపెనీ ఏంజెల్ బ్రోకింగ్.. ఇన్వెస్టర్లను నిరాశపరుస్తూ స్టాక్ ఎక్స్ఛేంజీలలో డిస్కౌంట్లో లిస్టయ్యింది. ఐపీవో ధర రూ. 306తో పోలిస్తే ఎన్ఎస్ఈలో 10 శాతం నష్టంతో రూ. 275 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. తదుపరి రూ. 297 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 257 వద్ద కనిష్టానికీ చేరింది. ప్రస్తుతం రూ. 17 నష్టంతో రూ. 289 వద్ద కదులుతోంది. రూ. 600 కోట్లు గత నెల 24న ముగిసిన పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఏంజెల్ బ్రోకింగ్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 180 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 306 ధరలో 58.8 లక్షల షేర్లను 12 సంస్థలకు కేటాయింంచింది. ఏంజెల్ బ్రోకింగ్‌లో ఇన్వెస్ట్ చేసిన యాంకర్ సంస్థలలో గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా, మెక్వారీ ఫండ్ సొల్యూషన్స్, ఇన్వెస్కో ట్రస్టీ, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తదితరాలున్నాయి. వెరసి ఐపీవో ద్వారా రూ. 600 కోట్లు సమకూర్చుకుంది. బ్యాక్‌గ్రౌండ్.. టెక్నాలజీ ఆధారిత ఫైనాన్షియల్ సర్వీసులను ఏంజెల్ బ్రోకింగ్ అందిస్తోంది. ప్రధానంగా బ్రోకింగ్, అడ్వయజరీ, మార్జిన్ ఫండింగ్, షేర్ల తనఖాపై రుణాలు తదితరాలను క్లయింట్లకు సమకూర్చుతోంది. 7.7 లక్షల మంది యాక్టివ్ కస్టమర్లను కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. 6.3 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. క్లయింట్ల రీత్యా దేశంలోనే నాలుగో పెద్ద బ్రోకింగ్ సంస్థగా ఏంజెల్ నిలుస్తోంది. జూన్‌కల్లా కంపెనీ నెట్‌వర్త్ రూ. 639 కోట్లను అధిగమించింది. ఏంజెల్ బ్రోకింగ్.. ఈ ఏడాది అంటే 2020లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన 8వ కంపెనీ కావడం గమనార్హం! -
ఏంజెల్ బ్రోకింగ్‌కు యాంకర్ నిధులు
దేశంలో నాలుగో పెద్ద బ్రోకింగ్ సేవల కంపెనీ ఏంజెల్ బ్రోకింగ్ పబ్లిక్ ఇష్యూ నేటి నుంచి ప్రారంభమైంది. గురువారం(24న) ముగియనున్న ఇష్యూలో భాగంగా ఒక్కో షేరుకీ రూ. 305-306 ధరల శ్రేణిని కంపెనీ ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థలు రూ. 300 కోట్ల విలువైన వాటాను విక్రయించనున్నాయి. దీనికి అదనంగా మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ఏంజెల్ బ్రోకింగ్ జారీ చేయనుంది. తద్వారా రూ. 600 కోట్లను సమీకరించాలని ఆశిస్తోంది. ఏంజెల్ బ్రోకింగ్ ఐపీవోకు కనీస లాట్ 49 షేర్లు. అంటే ఆసక్తి కలిగిన రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 49 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యాంకర్ పెట్టుబడులు ఐపీవోలో భాగంగా ఏంజెల్ బ్రోకింగ్ తాజాగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 180 కోట్లు సమకూర్చుకుంది. షేరుకి రూ. 306 ధరలో 58.8 లక్షల షేర్లను 12 సంస్థలకు కేటాయింంచింది. ఏంజెల్ బ్రోకింగ్‌లో ఇన్వెస్ట్ చేసిన యాంకర్ సంస్థలలో గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా, మెక్వారీ ఫండ్ సొల్యూషన్స్, ఇన్వెస్కో ట్రస్టీ, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తదితరాలున్నాయి. బ్యాక్‌గ్రౌండ్.. టెక్నాలజీ ఆధారిత ఫైనాన్షియల్ సర్వీసులను ఏంజెల్ బ్రోకింగ్ అందిస్తోంది. ప్రధానంగా బ్రోకింగ్, అడ్వయజరీ, మార్జిన్ ఫండింగ్, షేర్ల తనఖాపై రుణాలు తదితరాలను క్లయింట్లకు సమకూర్చుతోంది. 7.7 లక్షల మంది యాక్టివ్ కస్టమర్లను కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. 6.3 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. క్లయింట్ల రీత్యా దేశంలోనే నాలుగో పెద్ద బ్రోకింగ్ సంస్థగా ఏంజెల్ నిలుస్తోంది. జూన్‌కల్లా కంపెనీ నెట్‌వర్త్ రూ. 639 కోట్లను అధిగమించింది. ఏంజెల్ బ్రోకింగ్.. ఈ ఏడాది అంటే 2020లో పబ్లిక్ ఇష్యూకి వస్తున్న 8వ కంపెనీ కావడం గమనార్హం! -
ఏంజెల్ బ్రోకింగ్ ఐపీవో ధర రూ. 305-306
దేశంలో నాలుగో పెద్ద బ్రోకింగ్ సేవల కంపెనీ ఏంజెల్ బ్రోకింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు ఒక్కో షేరుకీ రూ. 305-306 ధరల శ్రేణిని ఖరారు చేసింది. ఇష్యూ ఈ నెల 22న(మంగళవారం) ప్రారంభమై 24న(గురువారం) ముగియనుంది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు, కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సంస్థలు రూ. 300 కోట్ల విలువైన వాటాను విక్రయించనున్నాయి. దీనికి అదనంగా మరో రూ. 300 కోట్ల విలువైన షేర్లను ఏంజెల్ బ్రోకింగ్ జారీ చేయనుంది. తద్వారా రూ. 600 కోట్లను సమీకరించాలని ఆశిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్.. పబ్లిక్ ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు సైతం ఏంజెల్ బ్రోకింగ్ షేర్లను విక్రయించనుంది. తద్వారా ఈ నెల 21న నిధులు సమకూర్చుకోనుంది. ఐపీవోకు కనీస లాట్ 49 షేర్లు. అంటే ఆసక్తి కలిగిన రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 49 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కాగా.. టెక్నాలజీ ఆధారిత ఫైనాన్షియల్ సర్వీసులను ఏంజెల్ బ్రోకింగ్ అందిస్తోంది. ప్రధానంగా బ్రోకింగ్, అడ్వయజరీ, మార్జిన్ ఫండింగ్, షేర్ల తనఖాపై రుణాలు తదితరాలను క్లయింట్లకు సమకూర్చుతోంది. 7.7 లక్షల మంది యాక్టివ్ కస్టమర్లను కలిగి ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. 6.3 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. క్లయింట్ల రీత్యా దేశంలోనే నాలుగో పెద్ద బ్రోకింగ్ సంస్థగా ఏంజెల్ నిలుస్తోంది. జూన్‌కల్లా కంపెనీ నెట్‌వర్త్ రూ. 639 కోట్లను అధిగమించింది. ఏంజెల్ బ్రోకింగ్.. ఈ ఏడాది అంటే 2020లో పబ్లిక్ ఇష్యూకి వస్తున్న 8వ కంపెనీ కావడం గమనార్హం! -
ఐపీఓకు ఏంజెల్ బ్రోకింగ్!
న్యూఢిల్లీ: ప్రముఖ షేర్ బ్రోకరేజ్ కంపెనీ, ఏంజెల్ బ్రోకింగ్ త్వరలో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నది. ఐపీఓ సంబంధిత పత్రాలను ఈ కంపెనీ ఇటీవలనే మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓలో భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు ఇంతే విలువ గల ప్రమోటర్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో ఆఫర్ చేస్తా రు. మొత్తం మీద ఈ కంపెనీ ఐపీఓ సైజు రూ.600 కోట్ల రేంజ్లో ఉండొచ్చని అంచనా. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను వర్కింగ్ క్యాపిటల్, ఇతర సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తా రు. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ వ్యవహరిస్తాయి. 1,800పైగా నగరాలు, పట్టణాల్లో 110 బ్రాంచ్‌ల ద్వారా ఏంజెల్‌బ్రోకింగ్ పూర్తి స్థాయిలో రిటైల్ బ్రోకింగ్ సేవలందిస్తోంది. ఈ ఏడాది జూన్ నాటికి కంపెనీ వద్ద 11లక్షల యాక్టివ్ బ్రోకింగ్ ఖాతాలుండగా, రూ. 11,302 కోట్ల క్లయింట్ ఆసెట్స్ను నిర్వహిస్తోంది. -
షేర్ల విలువేమీ తక్కువగా లేదు!
ఏంజిల్ బ్రోకింగ్ సీఈఓ వినయ్ అగర్వాల్ మార్కెట్ల విలువ సంతృప్త స్థాయిలోనే ఉంది ⇒ ‘యూపీ’తో ర్యాలీ చేసినా... నిలదొక్కుకోవాలి ⇒ అందుకు కంపెనీల రాబడులు తోడవ్వాల్సి ఉంది ⇒ టెక్నాలజీతో మార్కెట్ల పరిస్థితి మారుతుంది ⇒ మా దగ్గర గంటలో ఖాతా తెరిచి ట్రేడింగ్ కూడా చెయ్యొచ్చు (హైదరాబాద్, సాక్షి బిజినెస్ బ్యూరో) యూపీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎవరూ ఊహించనంత మెజారిటీని బీజేపీ సొంతం చేసుకుంది. ఇంతటి సునామీని నిజానికి మార్కెట్లు కూడా ఊహించలేదు. దీంతో మంగళవారం భారీ ర్యాలీ ఉండవచ్చనేది నిపుణుల అంచనా. అయితే... మార్కెట్లు ఇప్పటికే విలువ పరంగా ఒకవిధమైన గరిష్ఠ స్థాయిలో ఉన్నాయనేది బ్రోకరేజీ సంస్థ ఏంజిల్ బ్రోకింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) వినయ్ అగర్వాల్ అభిప్రాయం. కంపెనీల ఆర్థిక ఫలితాలు వెలువడి... వాటి రాబడులు పెరిగితే అప్పుడు మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉండవచ్చన్నది ఆయన అభిప్రాయం. ఒకరకంగా యూపీ ఫలితాలతో మార్కెట్లు ర్యాలీ చేసినా... మళ్లీ దిగువకు పయనించే అవకాశాలే ఎక్కువ ఉన్నట్లు సంకేతాలిచ్చారు. ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికిచ్చిన ఇంటర్వూ్యలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ముఖ్యాంశాలివీ... ► యూపీ ఫలితాలతో మార్కెట్లు ఎలా ఉండొచ్చు? నిజానికి యూపీలో బీజేపీ గెలుస్తుందన్న విషయాన్ని మార్కెట్లు ఇప్పటికే డిస్కౌంట్ చేసుకున్నాయి. కాకపోతే ఈ స్థాయి విజయాన్ని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. కాబట్టి కొంత ర్యాలీ ఉంటుంది. ► ఈ ర్యాలీ ఏ మేరకు ఉండొచ్చు? అది చెప్పలేం. ఎందుకంటే మన మార్కెట్లు విలువ పరంగా ఇప్పటికే సంతృప్త స్థాయిల వద్ద ఉన్నాయి. ఒకవేళ ఇంకా బాగా పెరిగాయనుకోండి. అమెరికా మార్కెట్ల మాదిరి మన ఇన్వెస్టర్లలోనూ భయాలు మొదలవుతాయి. ఎందుకంటే మార్కెట్లు కంపెనీల రాబడులకు తగ్గట్టే ఉండాలి. లేదంటే ఎ ప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన తప్పదు. ► మీరు అడ్వయిజరీ సేవలందిస్తున్నారా? ► మీ ఫండ్ రాబడి ఎలా ఉండొచ్చు? చిన్న ఇన్వెస్టర్లకు అడ్వయిజరీ సేవలందించటమే మా ప్రత్యేకత. మా సంస్థను దినేష్ ఠక్కర్ ఏర్పాటు చేసింది కూడా ఆ ఉద్దేశంతోనే. చిన్న ఇన్వెస్టర్లకు సరైన అడ్వయిజరీ సేవలందటం లేదని, వారు మార్కెట్లో నష్టపోతున్నారని గ్రహించబట్టే ఆయన ఈ సేవల్ని ఆరంభించారు. ఇక మా మ్యూచ్‌వల్ ఫండ్ గడిచిన మూడేళ్లుగా 15% రాబడినందిస్తోంది. వచ్చే రెండేళ్లూ 12–15% మధ్య రాబడి ఉండొచ్చు. ► విశాఖలో ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) వ్యాలీ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు కదా? లాభమేమైనా ఉందా? చిన్న సంస్థలను ప్రోత్సహించే ఈవెంట్లలో మేం కేపీఎంజీ భాగస్వామిగా ఉన్నాం. అందు లో భాగంగానే హాజరయ్యా. టెక్నాలజీతో మార్కె ట్ల స్థితిగతుల్ని కూడా మార్చేయొచ్చన్నది నా అభిప్రాయం. ► టెక్నాలజీ పరంగా ముందుండటానికి మీరేం చేస్తున్నారు? ఇప్పటికే ఖాతా ఓపెనింగ్‌లో టెక్నాలజీని వాడుతున్నాం. అందరికన్నా ముందే ఆధార్‌ను యాక్సెస్ చేసుకున్నాం. దానిద్వారా గంటలో ట్రేడింగ్ ఖాతా తెరవటమే కాక, ట్రేడింగ్ చేసుకునే అవకాశమిస్తున్నాం. ఇంకా రోబో అడ్వయిజరీ సేవల్ని ఆరంభించాం. ఇది కస్టమర్ స్థితిగతుల్ని అర్థం చేసుకుని మరీ సలహాలిస్తుంది. అలొకేషన్‌ను విశ్లేషించటం, గత పెట్టుబడుల్ని ట్రాక్ చేయటం... అన్నీ చేస్తుంది. ► ఫిన్‌టెక్‌తో క్యాపిటల్ మార్కెట్లలో రాబోయే మార్పులేంటి? ఫిన్‌టెక్ వల్ల కస్టమర్ల గుర్తింపు తేలికవుతుంది. ఇక బ్యాంకింగ్ వ్యవస్థలాంటి మధ్యవర్తి లేకుండా వ్యక్తి నుంచి వ్యక్తికి నగదు బదిలీ చేయటం వల్ల నిధులు క్షణాల్లో బదిలీ అవుతాయి. విశ్వాసం పెరుగుతుంది. ఇక మార్కెట్లలో సెటిల్మెంట్లు కూడా రియల్‌టైమ్‌లో జరుగుతాయి. ఇవన్నీ ఫిన్టెక్తోనే సాధ్యమని నా నమ్మకం. -
స్టాక్స్ వ్యూ
టీసీఎస్స బ్రోకరేజ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్ ప్రస్తుత ధర: రూ.2,475 టార్గెట్ ధర: రూ.3,350 ఎందుకంటే: టీసీఎస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్ధిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆదాయ పరంగా నిరాశపరిచిన ఫలితాలు నికర లాభంలో మాత్రం అంచనాలను మించాయి. కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా కంపెనీ ఆదాయం తగ్గింది. రూ.24,219 కోట్ల ఆదాయం ఆర్జించింది. 2013-14 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో ఆర్జించిన ఆదాయం(రూ.21,551 కోట్లు)తో పోల్చితే ఇది 12 శాతం అధికం. అయితే గత ఆర్థిక సంవత్సరం క్యూ3 క్వార్టర్‌తో పోల్చితే 1 శాతం తగ్గింది. ఇంగ్లాండ్, ఇతర యూరోప్ దేశాలు, ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా దేశాల్లో వృద్ధి స్వల్పంగా తగ్గింది. నికర లాభం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 9% వృద్ధితో రూ.5,906 కోట్లకు పెరిగింది. ఐపీఓకు వచ్చి పదేళ్లైన సందర్భంగా ఉద్యోగులకు రూ.2,628 కోట్ల బోనస్‌ను ఇవ్వనున్నది. దీంతో నికర లాభం రూ.3,713 కోట్లకు పరిమితమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఐటీ పరిశ్రమ 12-14 శాతం వృద్ధి సాధిస్తుందని నాస్కామ్ అంచనా వేసింది. దీని కంటే అధిక వృద్ధినే సాధించగలమని కంపెనీ ధీమా వ్యక్తం వేస్తోంది. కొత్త క్లయింట్ల సంఖ్య, క్లయింట్ల నుంచి ఆర్డర్ల సంఖ్య పెరుగుతోంది. డీసీబీ బ్యాంక్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.119 టార్గెట్ ధర: రూ.160 ఎందుకంటే: వ్యాపార వృద్ధి పటిష్టంగా ఉండటంతో గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు అంచనాలను మించాయి. నికర వడ్డీ ఆదాయం 30 శాతం వృద్ధితో రూ.130 కోట్లకు, ఇతర ఆదాయం 38 శాతం వృద్ధితో రూ.46 కోట్లకు చేరాయి. పన్ను కేటాయింపుల రద్దు కారణంగా నికర లాభం 61 శాతం వృద్ధితో రూ.63 కోట్లకు పెరిగింది.. 2008-09లో రూ.88 కోట్లు, 2009-10లో రూ.79 కోట్లు చొప్పున నష్టాలు పొందిన ఈ బ్యాంక్ మెల్లగా లాభాల బాట పడుతోంది. 2014-15లో రూ.191 కోట్ల నికరలాభం ఆర్జించింది. 2008-09లో రూ.306 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.186 కోట్లకు తగ్గాయి. మూడేళ్లలో బ్యాలెన్స్ షీట్‌ను రెట్టింపు చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్న బ్యాంక్ ఆ దిశగా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. రెండేళ్లలో 50 కొత్త శాఖలను ఏర్పాటు చేసింది. మూడేళ్లలో మరో 100 శాఖలను ఏర్పాటు చేయనున్నది. దీంతో మొత్తం బ్యాంక్ శాఖల సంఖ్య 250కు పెరగనున్నది. రెండేళ్లలో రుణ వృద్ధి 26 శాతం వృద్ధితో రూ16,572 కోట్లకు పెరుగుతుందని అంచనా. నికర వడ్డీ ఆదాయం నిలకడగా పెరుగుతుండడం, రుణ నాణ్యతను సుస్థిరంగా కొనసాగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, మొండి బకాయిలు తదితర అంశాలకు కేటాయింపులు తక్కువగా ఉండడం సానుకూలాంశాలు. -
మా గ్యాస్ రిలయన్స్ తీసుకుంటోందా? తేల్చండి
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి బేసిన్లో ఓఎన్జీసీకి చెందిన క్షేత్రాల్లోని గ్యాస్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ తీసుకుంటున్నదా అనే అంశాన్ని నిర్ధారించడానికి అంతర్జాతీయ నిపుణుడిని నియమించాలని కోరుతూ చమురు శాఖకు లేఖ రాసినట్లు ఓఎన్జీసీ డెరైక్టర్ (ఎక్స్‌ప్లోరేషన్) ఎస్కే వర్మ తెలిపారు. మంగళవారంనాడిక్కడ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేజీ-డీ6 బ్లాకుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ తవ్వకాలు జరుపుతున్న నాలుగు బావులు ఓఎన్జీసీ క్షేత్రానికి కొన్ని వందల మీటర్ల సమీపంలోనే ఉన్నాయన్నారు. ఈ కారణంగానే ఒకే రిజర్వాయర్ నుంచి రెండు సంస్థలూ గ్యాస్‌ను తీసుకుంటున్నాయా అనే ఆందోళన నెలకొందని చెప్పారు. అయితే ఒఎన్జీసీ తన క్షేత్రంలో ఇంకా ఉత్పత్తి ప్రారంభించాల్సివుంది. దాంతో తన గ్యాస్‌లో కొంత రిలయన్స్ వెలికితీసివుండవచ్చన్న భయాలు ఓఎన్జీసీకి ఏర్పడ్డాయి. గ్యాస్ ధర పెంపుతో భారీ లబ్ధి గ్యాస్ ధర వచ్చే నెల నుంచి దాదాపు రెట్టింపు కానుండటంతో ఓఎన్జీసీకి రూ. 16 వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. గ్యాస్ ధర ఒక డాలరు పెరిగితే సంస్థకు ఏటా రూ.4 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఓఎన్జీసీ కొత్త సీఎండీ దినేశ్ కే షరాఫ్ మంగళవారం న్యూఢిల్లీలో తెలిపారు. ప్రస్తుతం 4.2 డాలర్లుగా ఉన్న మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ గ్యాస్ ధరను ఏప్రిల్ 1 నుంచి 8 డాలర్లకు పెంచడం వల్ల తమ సంస్థ నికర లాభం రూ.9,600 కోట్ల మేరకు వృద్ధిచెందుతుందని చెప్పారు. -
టాటా పవర్
ఎందుకంటే: ప్రైవేట్ రంగ దిగ్గజ విద్యుత్ కంపెనీల్లో ఒకటైన ఈ కంపెనీ షేర్ రూ.142 స్థాయిల నుంచి రూ.80కు పడిపోయింది. పలు అనుకూలమైన అంశాలు సమీప భవిష్యత్తులో ఈ కంపెనీ షేర్ పెరుగుదలకు దోహద పడనున్నాయి. ఇండోనేసియా బొగ్గు గనుల్లో 30% వాటా విక్రయించాలని యాజమాన్యం నిర్ణయించడం దీంట్లో మొదటిది. ఈ వాటా విక్రయం కారణంగా కంపెనీకి రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. దీంతో కంపెనీ రుణ భారం గణనీయంగా తగ్గనున్నది. ఏడాదికి వడ్డీ భారం రూ.300 కోట్లు తగ్గుతాయి. రైట్స్ ఇష్యూ ద్వారా రూ.2,000 కోట్లు సమీకరించాలని గత వారంలో కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ నిర్ణయించింది. ఇది రెండోది. ఈ నిధుల కారణంగా కూడా రుణ భారం తగ్గనున్నది. ముంద్రా ప్రాజెక్ట్ విషయంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(సెర్క్) ఇచ్చిన ఉత్తర్వులు ఈ కంపెనీకి ప్రయోజనం కలిగించడం మూడవది. ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆర్థిక ఫలి తాలు అంచనాలను మించనున్నాయి. ప్రస్తుతం 9,000 మెగావాట్లుగా ఉన్న కంపెనీ కెపాసిటీ ఐదేళ్లలో 25 వేల మెగావాట్లకు పెరగనున్నది. వీటన్నింటి దృష్ట్యా ప్రస్తుత ధర వద్ద కొనుగోళ్లకు ఈ షేర్ ఆకర్షణీయంగా ఉందని భావిస్తున్నాం. ఏడాది కాలానికి టార్గెట్ ధరను నిర్ణయించాం. -
ఐటీసీ
బ్రోకరేజ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.325 టార్గెట్ ధర: రూ.382 ఎందుకంటే: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాలు అంచనాలకనుగుణంగానే ఉన్నాయి. నికర లాభం రూ.2,385 కోట్లకు పెరిగింది. ఇక నికర అమ్మకాలు 13 శాతం వృద్ధితో రూ.8,623 కోట్లకు పెరిగాయి. సిగరెట్ల అమ్మకాలు తగ్గినప్పటికీ ధరల పెంపు కారణంగా సిగరెట్ల వ్యాపారం 13 శాతం వృద్ధి చెంది రూ.4,116 కోట్లకు పెరిగింది. ఆశీర్వాద్, సన్‌ఫీస్ట్ తదితర బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అమ్మకాలు జోరుగా ఉండటంతో ఎఫ్ఎంసీజీ వ్యాపారం 17% వృద్ధితో రూ.2,078 కోట్లకు పెరిగింది. అగ్రి బిజినెస్ 10 శాతం, పేపర్ బోర్డ్స్ అండ్ ప్యాకేజింగ్ విభాగం 19 శాతం వృద్ధి చెందగా హోటళ్ల వ్యాపారం ఫ్లాట్‌గా ఉంది. ఏడాది కాలంలో కంపెనీ ఆదాయం 14 శాతం, నికర లాభం 17 శాతం చొప్పున పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 25 రెట్ల ధరలో ప్రస్తుతం ఈ షేర్ ట్రేడవుతోంది. సిగరెట్ల వ్యాపారంలో మార్కెట్ లీడర్ అయినప్పటికీ, ప్యాకేజ్డ్ ఫుడ్స్, బ్రాండెడ్ దుస్తులు, పర్సనల్ కేర్ తదితర సెగ్మంట్లలో అమ్మకాలు జోరుగా ఉన్నాయి.