న్యూఢిల్లీ: ప్రముఖ షేర్ బ్రోకరేజ్ కంపెనీ, ఏంజెల్ బ్రోకింగ్ త్వరలో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నది. ఐపీఓ సంబంధిత పత్రాలను ఈ కంపెనీ ఇటీవలనే మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓలో భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు ఇంతే విలువ గల ప్రమోటర్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్‌ఎస్) విధానంలో ఆఫర్ చేస్తా రు. మొత్తం మీద ఈ కంపెనీ ఐపీఓ సైజు రూ.600 కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.
ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను వర్కింగ్ క్యాపిటల్, ఇతర సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తా రు. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎడిల్‌వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ వ్యవహరిస్తాయి. 1,800పైగా నగరాలు, పట్టణాల్లో 110 బ్రాంచ్‌ల ద్వారా ఏంజెల్‌బ్రోకింగ్ పూర్తి స్థాయిలో రిటైల్ బ్రోకింగ్ సేవలందిస్తోంది. ఈ ఏడాది జూన్ నాటికి కంపెనీ వద్ద 11లక్షల యాక్టివ్ బ్రోకింగ్ ఖాతాలుండగా, రూ. 11,302 కోట్ల క్లయింట్ ఆసెట్స్‌ను నిర్వహిస్తోంది.
ఐపీఓకు ఏంజెల్ బ్రోకింగ్!
Published Thu, Sep 6 2018 1:24 AM | Last Updated on Thu, Sep 6 2018 1:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment