చెన్నై: మూడు లక్షలకు పైగా విదేశీ సిగరెట్లను దొంగరవాణా చేసేందుకు ప్రయత్నిస్తుండగా తమిళనాడులో అధికారులు బ్యాన్ చేశారు. వీటి విలువ దాదాపు రూ32.70 లక్షలు. ఆదివారం ఆరుగురు ప్రయాణీకులు షార్జా నుంచి కోయంబత్తూరుకు విమానం ద్వారా చేరుకున్నారు. వీరిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు చేయగా వారి వద్ద దాదాపు లక్ష ఫారిన్ బ్రాండెడ్ సిగరెట్లు బయటపడ్డాయి.
దీంతో అధికారులు విస్తు పోయారు. అరేబియా ప్లైట్ ద్వారా వచ్చిన వీరు ఆరుగురు కూడా మాములుగా వెళ్లే తనిఖీ మార్గం ద్వారా కాకుండా గ్రీన్ చానెల్ ద్వారా వెళ్లేందుకు ప్రయత్నించడమే కాకుండా తమ వద్ద ఏమీ లేవంటూ అబద్ధం చెప్పబోయారు. వీరిపై కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. ఇలాంటి చర్యకు పాల్పడటానికి కారణాలేమిటీ, దీని వెనుక ఎవరెవరున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు అధికారులు విచారణ ప్రారంభించారు.
మూడు లక్షల ఫారిన్ సిగరెట్లు బ్యాన్
Published Sun, Jul 12 2015 8:21 PM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM
Advertisement