న్యూఢిల్లీ:క్యాన్సర్ కారకమైన పొగాకు నియంత్రణపై ఎన్ని చర్యలు చేపడుతున్నా వాటివల్ల పెద్ద ఉపయోగం చేకూరలేదని దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రియదర్శన్ అభిప్రాయపడ్డారు. గత రెండు సంవత్సరాల నుంచి సినిమా థియేటర్లలో 30 సెకన్ల టొబాకో నియంత్రణ ప్రకటనలు ఇస్తున్నా.. ఇప్పటివరకూ దానివల్ల ప్రయోజనం మాత్రం శూన్యంగా మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రకటనలతో రాబోవు తరానికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నా.. పొగాకు బారినుంచి ప్రజలను రక్షించాలంటే సిగరెట్ల అమ్మకాన్ని మొత్తంగా నిలిపివేయాలని ఆయన పేర్కొన్నారు.
పొగాకు నియంత్రణపై సినిమా ప్రకటనల ద్వారా సత్ఫలితాలు వస్తాయని ఆలోచించిన..దానికి అనుగుణంగా థియేటర్లలో ప్రకటనలను ప్రవేశపెట్టారు. అనంతర అనేక ప్రకటనలను థియేటరల్లో ప్రవేశపెడుతున్నా వాటి వల్ల ప్రయోజనం మాత్రం నామమాత్రంగానే మిగిలిపోతోంది.