ముట్టిస్తే... మూతి కాలుతుంది! | wat pressure On Cigarette lovers | Sakshi
Sakshi News home page

ముట్టిస్తే... మూతి కాలుతుంది!

Published Sun, Apr 12 2015 3:09 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

ముట్టిస్తే... మూతి కాలుతుంది! - Sakshi

ముట్టిస్తే... మూతి కాలుతుంది!

సిగరెట్ ప్రియులపై వ్యాట్ పోటు
సాక్షి, హైదరాబాద్: భోజనం చేశాం... సరదాగా ఒక దమ్ము కొడదామని అనుకుంటున్నారా? అయితే మీ జేబులను ఒక సారి సరి చూసుకోండి. లేకపోతే గుల్ల కాక తప్పదు. ఎందుకంటే రాష్ర్ట్ర ప్రభుత్వం సిగరెట్లపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను 10 శాతం పెంచేసింది. ఇప్పటికే ఉన్న 20 శాతానికి ఇది అదనం. అంటే ఇప్పటి నుంచి 30 శాతం అన్నమాట గురూ..

సిగరెట్ల తయారీకి అవసరమైన పొగాకు పండించే రైతుకు సరైన ధర ఇవ్వరు గానీ, దానితో తయారు చేసే సిగరెట్లపై పన్నులు పెంచేస్తారు.. అని అనుకుంటున్నారా? ఏం చేస్తాం. ప్రభుత్వానికి తన రోజు వారీ ఖర్చులకూ డబ్బులు లేవంట. బాబు గారు సింగపూర్, జపాన్, చైనా వెళ్లడానికి విమాన ఖర్చులకూ అప్పులు చేసే పరిస్థితి ఏర్పడిందంట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement