ఆ సిగరెట్లే యువకులను ఆకర్షిస్తున్నాయ్!
సిగరెట్లు తాగడమంటే యువకుల్లో అదో రకమైన జోష్ ఉంటుంది. సిగరెట్టు తాగడంలో స్టైల్ ను అనుకరించడానికి మెంథాల్ సిగరెట్లతో ఆరంభించి రెగ్యులర్ సిగరెట్లకు షిఫ్ట్ కావడం సహజంగా అలవాటుగా మారడం చూస్తునే ఉంటాం. రెగ్యులర్ సిగరెట్ల కంటే తక్కువ హానికరమనే అభిప్రాయం యువకుల్లో ఉంటుందని కెనడాలోని వాటర్లూ యూనివర్సిటి నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది.
ఓ రకమైన ఘాటు ఉండే మెంథాల్ సిగరెట్లు.. రెగ్యులర్ సిగరెట్ల కంటే ప్రమాదకరమని పరిశోధనలో తెలిసింది. మెంథాల్ సిగరెట్లు తాగే యువకులు ఎక్కువ కాలం తాగేందుకే మొగ్గు చూపుతున్నారని.. ఆ సిగరెట్లు అతిగా పొగతాగేందుకు దారి తీస్తోందని పరిశోధకులు తెలిపారు. అదనపు రుచి చేర్చే బ్రాండెడ్ సిగరెట్లు నిషేధానికి కొత్త చట్టాలను తేవాల్సిన అవసరం ఉందని వాటర్లూ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.