
డెయిరీ మార్కెట్‌లోకి ఐటీసీ!
ముంబై: సిగరెట్లు, వంటనూనెలు, సబ్బులు, బిస్కెట్లు వంటి తదితర ఉత్పత్తులను తయారుచేసే ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ కంపెనీ ఐటీసీ డెయిరీ మార్కెట్‌లోకి అడుగు పెడుతోంది. త్వరలో నెయ్యితో తమ తొలి డెయిరీ ప్రాడక్ట్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తామని ఐటీసీ ఎఫ్‌ఎంసీజీ బిజినెస్ ప్రెసిడెంట్ సంజీవ్ పూరి తెలిపారు. నెయ్యి తర్వాత పాలు, వెన్న, జున్ను, చాక్లెట్స్ వంటి ఉత్పత్తులను కూడా వినియోగదారులకు అందిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే డెయిరీ ప్రొడక్షన్ విస్తరణకు అనువైన ప్రాంతాలను గుర్తించామన్నారు. రానున్న కాలంలో ఐటీసీ ఫుడ్ ప్రాడక్ట్స్‌పై రూ.25,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనుందని తెలిపారు.