Fast-Moving Consumer Goods (FMCG)
-
కేరళకు వరుసకట్టిన మ్యాగీ, బిస్కెట్లు, చాక్లెట్లు
న్యూఢిల్లీ : ప్రకృతి విలయతాండవానికి కేరళ అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాలకు కనీస అవసరాలు కరువయ్యాయి. వీరిని ఆదుకోవడానికి పెద్ద ఎత్తున్న విరాళాలు తరలివస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలు కూడా తమ వంతు సహాయ సహకారంగా ఆహారం, మంచినీళ్లు, కనీస వస్తువులను కేరళకు తరలిస్తున్నాయి. ఐటీసీ, కోకా కోలా, పెప్సీ, హిందూస్తాన్ యూనిలివర్ వంటి 12కు పైగా ఎఫ్ఎంసీజీ కంపెనీలు వచ్చే రెండు రోజుల్లో మరింత ఆహారాన్ని, మంచినీటిని, కనీస వస్తువులను సరఫరా చేస్తామని వాగ్దానం చేసినట్టు కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ చెప్పారు. దిగ్గజ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల అధికారులతో నిన్న జరిగిన భేటీ అనంతరం, ఈ విషయాన్ని ప్రకటించారు. కేరళకు సహాయం చేసేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని, ఒక్కొక్కరూ సాయం చేయడం కంటే.. అందరూ కలిసి చేయడం ఎంతో మంచిదని ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్‌కు మంత్రి సూచించారు. హిదూస్తాన్ యూనిలివర్ ఇప్పటికే 9500 కేసుల ఉప్పు, 29వేల కేసుల గోధుమలు, 1000 కేసుల కెచప్, 250 కేసుల స్పైసస్ మిక్స్ మసాలా ఇతర ఉత్పత్తులను సరఫరా చేసింది. నెస్లే ఇండియా 90వేల ప్యాకెట్ల మ్యాగీ, 2 లక్షల ప్యాకెట్ల మచ్, 1100 ప్యాకెట్ల కాఫీ, యూహెచ్‌టీ మిల్క్‌ను అందించింది. అదనంగా మరో 40వేల ప్యాకెట్ల మ్యాగీ, లక్షల ప్యాకెట్ల మంచ్, 1100 ప్యాకెట్ల కాఫీ, యూహెచ్‌టీలను సరఫరా చేయనున్నట్టు పేర్కొంది. వీటితో పాటు 30వేల ప్యాకెట్ల రెడీ-టూ-డ్రింక్ మిలో, 10వేల ప్యాక్‌ల సెరిగోలను సరఫరా చేయనుంది. ఐటీసీ కూడా 3.30 లక్షల ప్యాకెట్ల బిస్కెట్లను, 2000 బాటిళ్ల సావ్లాన్, 3000 ప్యాకెట్ల డైరీ వైటర్న్, 9000 ప్యాకెట్ల లిక్విడ్ హ్యాండ్ వాష్, 7000 సోపులను పంపనున్నట్టు తెలిపింది. కోకా కోలా ఇప్పటికే 1.4 లక్షల లీటర్ల మంచినీటిని పంపింది. అదనంగా మరో లక్ష లీటర్ల ప్యాక్ చేసిన మంచినీటిని, దానిలోనే 20వేల బాటిళ్లను కేరళకు తరలించనున్నట్టు వెల్లడించింది. పెప్సీకో కూడా 6.78 లక్షల లీటర్ల ప్యాక్ చేసిన మంచినీటిని, 10వేల కేజీల క్వాకర్ ఓట్స్‌ను సరఫరా చేసింది. బ్రిటానియా కూడా ఇప్పటికే 2.10 లక్షల ప్యాకెట్ల బిస్కెట్లనును కొచ్చికి అందించింది. 1.25 లక్షల ప్యాకెట్లను మలప్పురం, వయనాడ్‌కు తరలించింది. వచ్చే రెండు రోజుల్లో మరో 1.25 లక్షల ప్యాకెట్ల బిస్కెట్లను కేరళ ప్రజలకు పంపించనున్నట్టు పేర్కొంది. 3000 బన్స్, 10000 ప్యాకెట్ల బిస్కెట్లను మధురైకు సరఫరా చేయనున్నట్టు వెల్లడించింది. ఎంటీఆర్ ఫుడ్ 35వేల ప్యాకెట్ల రెడీ టూ ఈట్‌ను వయనాడ్‌కు పంపించింది. డాబర్ కూడా 30 వేల నుంచి 40వేల వరకు టెట్రా-ప్యాక్ జ్యూస్‌లను, జీఎస్కే ఇండియా రూ.10 లక్షల విలువైన రిలీఫ్ మెటీరియల్స్‌ను, 10 లక్షల హార్లిక్స్ ప్యాకెట్లను, 10 లక్షల క్రోసిన్ టాబ్లెట్లను.. మెరికో 30 టన్నుల ఓట్స్‌ను కేరళ ప్రజలకు పంపించాయి. -
హెచ్‌యూఎల్‌కు బ్యాడ్ న్యూస్
సాక్షి, ముంబై: స్టాక్మార్కెట్లో వరుస లాభాలతో దూసుకుపోతున్న ఐటీసీ షేరు జోరుతో సంస్థ అత్యంత విలువైన ఎఫ్‌ఎంసీజీగా ఐటీసీ అవతరించింది. అలాగే దేశీయంగా అత్యంత విలువైన కంపనీల్లో నాల్గవదిగా నిలిచింది. శుక్రవారం నాటి మార్కెట్లో ఐటీసీ షేరు ర్యాలీ కావడంతో సంస్థ మార్కెట్ క్యాప్ భారీగా పుంజుకుంది. ఐటీసీ షేర్లు 5.24 శాతం పెరిగి 302.20 వద్ద ముగిశాయి. ఇంట్రా డేలో 6.91 శాతం పెరిగి 307 రూపాయల వద్ద ఐటీసీ షేరు ఆల్‌టైం గరిష్టస్థాయిని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.3,69,259 కోట్లకు పెరిగింది. తద్వారా మరో ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్‌ను వెనక్కి నెట్టింది. హెచ్‌యూఎల్ మార్కెట్ క్యాప్ రూ.3,58,798.88 కోట్లతో పోలిస్తే ఐటీసీ విలువ 10,460 కోట్ల రూపాయలు పెరిగింది. జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికానికి ఐటీసీ నికర లాభం 10 శాతం పెరిగి రూ .2,818.68 కోట్లకు చేరింది. సిగరెట్ అమ్మకాలు క్షీణించినప్పటికీ వ్యవసాయ వ్యాపార వృద్ధి, ఇతర ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో మంచి వృద్ధి సాధించింది. దీంతో భారీ లాభాలను ఆర్జించింది. ఈ ఫలితాల నేపథ్యంలో నిన్నటి బుల్ మార్కెట్లో ఇన్వెస్టర్లు ఐటీసీ కౌంటర్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఈ కొనుగోళ్లతో భారీగా లాభపడింది. గత ఏడు సెషన్లుగా వరుసగా లాభపడుతున్న ఐటీసీ షేరు మొత్తం 13 శాతానికిపై ఎగిసింది. కాగా మార్కెట్వాల్యూలో టీసీఎస్ 7,43,930 కోట్ల రూపాయలతో ప్రథమ స్థానంలో ఉండగా, రిలయన్స్ 7,15,772 కోట్ల రూపాయలతో రెండవ స్థానంలోనూ, 5,82,045కోట్ల రూపాయలతో హెచ్డీఎఫ్సీ మూడవ స్థానంలో నిలిచాయి. -
‘ఎఫ్ఎంసీజీ’కి ధర దడ!
న్యూఢిల్లీ: పెరుగుతున్న ముడిచమురు ధరలు సామాన్యులకే కాదు, ఎఫ్ఎంసీజీ కంపెనీలను సైతం ఆందోళనకు గురి చేసేదే!. ముడి చమురు ధరలు ఒక్కటే కాదు, కరెన్సీ విలువ ఆటుపోట్లను కూడా గమనిస్తున్నామంటూ బడా ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్తాన్ యూనిలీవర్ చెబుతూనే, దీన్ని ఒక రిస్క్‌గా అభివర్ణించడం గమనార్హం. ఎఫ్ఎంసీజీ కంపెనీలు తయారు చేసే ఉత్పత్తులకు ముడి పదార్థాల్లో ముడి చమురు కీలకం. పామోలిన్ ఆయిల్ ధరలు అనుకూలంగానే ఉండగా, ముడి చమురు ధరలు మాత్రం గత ఏడాది కాలంలో 50 శాతం పెరిగి బ్యారల్ 72 డాలర్ల స్థాయికి చేరాయి. ముడి చమురు ధరలు పెరిగితే వాటి ఉప ఉత్పత్తులైన లైనియర్ ఆల్కిల్ బెంజేన్ (ఎల్ఏబీ), హై డెన్సిటీ పాలీ ఎథిలీన్ (హెచ్డీపీఈ) ధరలు కూడా పెరుగుతాయి. ఈ రెండూ ఎఫ్ఎంసీజీ కంపెనీలకు కీలకమైన ముడి పదార్థాలు. ముడి చమురు ధరలు పెరగడం కారణంగా తయారీ వ్యయం పెరుగుతుందని, దాంతో ఎఫ్ఎంసీజీ కంపెనీలపై తమ ఉత్పత్తుల ధరలు పెంచాల్సిన ఒత్తిడి ఏర్పడుతుందని ఈక్వినామిక్స్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ వ్యవస్థాపకుడు జి.చొక్కలింగం పేర్కొన్నారు. ధరల పెంపు ద్వారా కంపెనీలు మార్జిన్లు పడిపోకుండా చూసుకోగలవు. సహేతుక స్థాయిలోనే... ఎల్ఏబీని డిటర్జెంట్ తయారీకి వినియోగిస్తారు. హెచ్డీపీఈని ఉపయోగించి ప్యాకింగ్ మెటీరియల్‌ను తయారు చేస్తారు. సబ్బుల నుంచి డిటర్జెంట్ వరకు, క్రీములు, షాంపూలు, హెయిర్ ఆయిల్, టూత్‌పేస్ట్ ఇలా అన్ని ఉత్పత్తుల ప్యాకింగ్‌కు దీన్నే వినియోగిస్తుంటారు. కంపెనీల ఉత్పత్తుల మొత్తం తయారీ వ్యయంలో ప్యాకింగ్ ఖర్చు 15–25 శాతం వరకు ఉంటుంది. హెచ్‌యూఎల్ ఇప్పటికే 2.5 శాతం వరకు ధరల పెంపును ఏప్రిల్, జూన్ క్వార్టర్లో అమలు చేసింది. ముఖ్యంగా డిటర్జెంట్ ధరలను పెంచింది. రానున్న త్రైమాసికాల్లో అన్ని విభాగాల్లో ధరలను పెంచే అవకాశం కనిపిస్తోంది. ‘‘సహేతుక స్థాయిలోనే ధరలు పెంచాలన్నది మా విధానం. అన్ని ప్యాక్‌లపై ఒకే స్థాయిలో ధరల పెంపు ఉండ దు. మొత్తం మీద పరిస్థితులను పరిగణనలోకి తీసు కుని, ధరలు, విలువ మధ్య సమానతను దృష్టిలో ఉంచుకుని, రేట్ల పెంపు చేపడతాం’’ అని హెచ్‌యూఎల్ చైర్మన్, ఎండీ సంజీవ్ మెహతా తెలిపారు. బడా కంపెనీలకు ఇదో అవకాశం ‘‘వచ్చే రెండు మూడు త్రైమాసికాల్లో డిమాండ్ కారణంగా అమ్మకాలపై ప్రభావం ఉండకపోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. దీంతో కంపెనీల చేతిలో ఇప్పుడు ధరలను నిర్ణయించే శక్తి ఉంది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి సమస్యలు పెరుగుతాయి’’ అని షేర్‌ఖాన్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ కౌస్తుభ్ పవస్కార్ తెలిపారు. ఎడెల్వీజ్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అబ్నీష్ రాయ్ మాట్లాడుతూ... ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్ల కారణంగా చిన్న స్థాయి కంపెనీల నుంచి మార్కెట్ వాటాను హస్తగతం చేసుకునేందుకు పెద్ద కంపెనీలకు అవకాశమని పేర్కొన్నారు. ‘‘కంపెనీలు ధరల్ని సహేతుకంగానే పెంచితే ఇదో అవకాశం. అవి మార్జిన్లను కాపాడుకోవడమే కాకుండా, కస్టమర్లు సైతం వాటికి దూరం కారు. అయితే, కచ్చితంగా ధరల పెంపు భారీగా ఉండకూడదు. కానీ, చిన్న సంస్థల విషయంలో ఈ పరిస్థితి పూర్తిగా భిన్నం. ధరల్ని తక్కువగా ఉండేలా చూడటమే వాటి వ్యూహం. ఈ తరహా సమయాల్లో చిన్న సంస్థలు కార్యకలాపాలను తగ్గించుకుంటాయి. ఇది పెద్ద సంస్థలకు అనుకూలంగా మార్కెట్‌ను విడిచిపెట్టడమే’’ అని అబ్నీష్ రాయ్ అన్నారు. రేట్లు ఎంత మేర పెరగవచ్చు..! గోద్రెజ్ కన్సూమర్, డాబర్, మారికో, ఇమామి, బజాజ్ కార్ప్, జ్యోతి ల్యాబొరేటరీస్ సంస్థలు వచ్చే కొన్ని నెలల్లో ధరల్ని 4–5 శాతం స్థాయిలో పెంచొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే, ఏషియన్ పెయింట్స్, ఇతర రంగుల తయారీ పరిశ్రమలు ధరల్ని ఎక్కువగా పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రంగుల పరిశ్రమకు ప్రధాన ముడి పదార్థాలు పెట్రోలియం నుంచి వచ్చేవే. -
జూన్ క్వార్టర్‌పై గంపెడాశలు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం టీసీఎస్‌తో జూన్ త్రైమాసిక ఫలితాల సీజన్ ఆరంభం కానుంది. దేశ కార్పొరేట్ రంగం ఈ సారి రెండంకెల స్థాయిలో ఫలితాల వృద్ధిని నమోదు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతేడాది జూన్ త్రైమాసికంలో వృద్ధి తక్కువ స్థాయిలో నమోదు కావడమే మెరుగైన అంచనాలకు బలం. టీసీఎస్ ఫలితాలు ఈ నెల 10న వెల్లడవుతాయి. అదే రోజు ప్రైవేటు రంగ ఇండస్ఇండ్ బ్యాంకు సైతం ఫలితాలు ప్రకటించనుంది. ఆటోమొబైల్స్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా తదితర రంగాల కంపెనీల నుంచి ఆశాజనక ఫలితాలు రావచ్చనే అంచనాలున్నాయి. ఆదాయం, లాభాల్లోనూ రెండంకెల పెరుగుదల ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సగటు వృద్ధి ఆదాయంలో 12.1 శాతం, లాభాల్లో 13.5 శాతం ఉంటుందని అంచనా. ఆటోమొబైల్స్ అన్ని రకాల వాహన విభాగాల్లో స్థిరమైన అమ్మకాల వృద్ధితో ఆటోమొబైల్ కంపెనీలు మంచి ఫలితాలను ప్రకటించనున్నాయని అంచనా. కస్టమర్లలో వాహనాలను మార్చే ధోరణి, ధరల పెరుగుదల కూడా వీటికి కలసిరానుంది. ఏప్రిల్–జూన్ కాలంలో వాహనాల అమ్మకాలు 13–60 శాతం స్థాయిలో పెరిగాయి. బజాజ్ ఆటో, మారుతి సుజుకి, టాటా మోటార్స్ దేశీయ కార్యకలాపాలపై మంచి ఆదాయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ప్రైవేటు రంగ బ్యాంకులు, ముఖ్యంగా కార్పొరేట్ రుణాలపై ఎక్కువగా దృష్టి పెట్టిన యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు కొత్త ఎన్పీఏలను తక్కువగా ప్రకటించొచ్చని భావిస్తున్నారు. గత త్రైమాసికాల్లో అధిక ఎన్పీఏలను చూపించడమే కారణం. దీనికితోడు రిటైల్ రుణాల్లో వృద్ధితో ఇవి మంచి ఫలితాలను ప్రకటించొచ్చని అంచనా. క్యాపిటల్ గూడ్స్ ప్రభుత్వ నిధులతో కొనసాగుతున్న ప్రాజెక్టుల రూపేణా మద్దతుతో క్యాపిటల్ గూడ్స్ కంపెనీలు మంచి ఫలితాలను నమోదు చేయనున్నాయి. ఎల్అండ్టీ తన ఆర్డర్లలో వృద్ధి 12–15 శాతం ఉంటుందని గతంలో అంచనాలను ప్రకటించింది. కనుక ఈ స్థాయిలో ఆర్డర్ల రాక ఉందా అన్నది గమనించాలి. పవర్‌గ్రిడ్ గత క్వార్టర్ల స్థాయిలోనే వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా. సిమెంట్ జూన్ త్రైమాసికంలో సిమెంట్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. కనుక కంపెనీలు మరీ ఆశాజనక ఫలితాలను నమోదు చేయకపోవచ్చని భావిస్తున్నారు. పెద్ద కంపెనీల అమ్మకాల వృద్ధి మాత్రం 5 నుంచి 18 శాతం మధ్యలో ఉండనుంది. కంపెనీలు గతేడాది ఇదే కాలంలో పోలిస్తే 4 నుంచి 21 శాతం మధ్యలో ఆదాయాల్లో పెరుగుదల చూపే అవకాశం ఉంది. ఐటీ... టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి దిగ్గజ కంపెనీలు డాలర్ మారకంలో 2–3 శాతం మేర ఆదాయ వృద్ధికే పరిమితం కానున్నాయి. యూరో, పౌండ్, డాలర్ మధ్య మారకం రేట్లలో అననుకూల పరిస్థితులతో డాలర్‌తో పోలుస్తూ రూపాయి సగటు ధర సీక్వెన్షియల్‌గా 4 శాతం తక్కువగా ఉంటుందని అంచనా. మెటల్స్... నాన్ ఫెర్రస్ కంపెనీలతో పోలిస్తే ఫెర్రస్ మెటల్ కంపెనీలు మంచి ఫలితాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. నాన్ ఫెర్రస్ కంపెనీలు వ్యయాల పరంగా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కోల్ ఇండియా ఆదాయంలో మాత్రం 15 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నారు. టెలికం... డేటా వినియోగం పెరిగినప్పటికీ సగటున ఓ వినియోగదారుడి ద్వారా వచ్చే నెలవారీ ఆదాయం కనిష్టానికి పడిపోవడం, తదితర ఒత్తిళ్లతో పెద్దగా వృద్ధికి అవకాశాల్లేవన్నదే అంచనా. ఫార్మా ఫార్మా కంపెనీలు దేశీయ వ్యాపారంపై రెండంకెల వృద్ధిని నమోదు చేయనున్నాయి. కారణం గతేడాది జూన్ క్వార్టర్లో వృద్ధి తక్కువ స్థాయిలో ఉండడంతో ఆ క్వార్టర్‌తో పోలిస్తే ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. అమెరికా వ్యాపారం ఫ్లాట్ నుంచి కాస్తంత సానుకూలంగానే ఉండొచ్చని అంచనా. అయితే, రూపాయి విలువ క్షీణతతో రెండంకెల స్థాయిలో వృద్ధిని నమోదు చేయనున్నాయి. ఎఫ్ఎంసీజీ ఎఫ్ఎంసీజీ కంపెనీల జూన్ త్రైమాసికం ఫలితాలను గతేడాది ఇదే కాలంలో పోల్చే పరిస్థితి లేదు. ఎందుకంటే గతేడాది జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి రానుండడంతో జూన్ క్వార్టర్లో సరుకుల నిల్వలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత రెండు త్రైమాసికాల్లో ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాల్లో ఆశాజనక వృద్ధి నమోదు కాగా, జూన్ త్రైమాసికంలోనూ ఇదే కొనసాగుతుందని భావిస్తున్నారు. ప్రధాన సూచీలో భాగమైన హెచ్‌యూఎల్, ఐటీసీ మాత్రం పరిమిత స్థాయిలో వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా. -
ఐటీసీ లాభం 10% అప్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 2,932 కోట్లకు పెరిగింది. అంతక్రితం నాలుగో త్రైమాసికంలో లాభం రూ. 2,669 కోట్లు. సమీక్షా కాలంలో ఐటీసీ అమ్మకాలు రూ. 10,706 కోట్లు. 2016–17 క్యూ4లో ఆదాయం రూ. 14,883 కోట్లు. జీఎస్‌టీపరమైన మార్పుల కారణంగా ఆదాయాలను పోల్చి చూడటానికి లేదని ఐటీసీ తెలిపింది. క్యూ4లో మొత్తం వ్యయాలు రూ. 6,996 కోట్లు. అంతక్రితం నాలుగో త్రైమాసికంలో ఇవి రూ. 11,364 కోట్లు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి రూ. 5.15 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని సంస్థ బోర్డు సిఫార్సు చేసింది. బుధవారం బీఎస్ఈలో ఐటీసీ షేర్లు 1.47 శాతం పెరిగి రూ. 285.95 వద్ద క్లోజయ్యింది. -
‘ఎఫ్ఎంసీజీ’కి ‘గ్రామీణ’ ఊతం
ముంబై: గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగుపడుతుండటం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ కంపెనీలకు ప్రయోజనకరంగా ఉండగలదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. 2018–19లో సదరు సంస్థల లాభాలు 300–400 బేసిస్ పాయింట్లు పెరిగి 11–12 శాతం స్థాయిలో నమోదు కాగలవని అంచనా వేసింది. 2018 ఆర్థిక సంవత్సరంలో ఇది 8 శాతమే. కొత్త ఉత్పత్తులు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగుపడుతుండటం తదితర అంశాలు ఎఫ్ఎంసీజీ రంగ లాభాల వృద్ధికి దోహదపడగలవని క్రిసిల్ తెలిపింది. కనీస మద్దతు ధరలను (ఎంఎస్పీ) కేంద్రం పెంచడం, సానుకూల రుతుపవనాలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర విభాగాల్లో ఉపాధి మెరుగుపడటం వంటి అంశాలతో ఆదాయాలు మెరుగుపడతాయని.. దీంతో వినిమయానికి డిమాండ్ పెరుగుతుందని వివరించింది. ‘ఎఫ్ఎంసీజీ రంగం మొత్తం ఆదాయాల్లో గ్రామీణ ప్రాంతాల వాటా 40–45 శాతం మేర ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరం సానుకూల కారణాలతో ఈ విభాగం నుంచి ఆదాయాలు 15–16 శాతం పెరగొచ్చు. 2018లో ఇది 10 శాతమే‘ అని క్రిసిల్ తెలిపింది. ఇక పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ మాత్రం స్థిరంగా 8 శాతం మేర కొనసాగవచ్చని పేర్కొంది. మధ్య స్థాయి సంస్థలకు మరింత సానుకూలం .. జీఎస్టీ విధానంలో సమర్ధమంతంగా వ్యాపారాల నిర్వహణ కారణంగా మధ్య స్థాయి సంస్థల లాభాల వృద్ధి 15–17 శాతం మేర ఉండగలదని, పెద్ద సంస్థల లాభాలు 11–12 శాతంగా ఉండవచ్చని క్రిసిల్ నివేదికలో వివరించింది. మరోవైపు పోటీ, జీఎస్‌టీపరమైన అంశాల కారణంగా చిన్న కంపెనీలు ఒక మోస్తరు వృద్ధి మాత్రమే సాధించగలవని పేర్కొంది. పెద్ద, మధ్య స్థాయి సంస్థలు ఇతర సంస్థల కొనుగోళ్లు, కొత్త ఉత్పత్తులతో వ్యాపార వృద్ధికి ప్రయత్నిస్తాయని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేఠి చెప్పారు. పేరొందిన బ్రాండ్స్ ఉన్న చిన్న సంస్థలను కొంచెం ఎక్కువ వెచ్చించైనా సరే పెద్ద కంపెనీలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పుష్కలంగా నిధులుండటం, వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణలో సమర్థంగా వ్యవహరిస్తుండటం వంటి అంశాల కారణంగా ఇతర సంస్థల కొనుగోళ్లకు అవి కొంత ఎక్కువ పెట్టుబడి పెట్టగలవని పేర్కొన్నారు. -
బడ్జెట్ ఎక్కువగా మేలు చేసింది వీరికేనట..!
సాక్షి, న్యూఢిల్లీ: రూరల్ ఫ్రెండ్లీ బడ్జెట్‌గా ప్రభుత్వం ప్రకటించిన 2018 ఆర్థిక బడ్జెట్లో ఎఫ్ఎంసీజీ రంగానికే ఎక్కువ బూస్ట్ లభించిందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలపై దృష్టిపెట్టి, లాభపడుతున్న కన్జ్యూమర్, ఎఫ్ఎంసీజీ కంపెనీలు ప్రస్తుత బడ్జెట్‌తో మరింత భారీగా లాభపడనున్నాయి. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీలతో అసంఘటిత రంగం కుదేలవుతుండగా.. బడ్జెట్ ప్రోత్సాహకాలతో భారీ ఎఫ్ఎంసీజీ కంపెనీలు మరింత పుంజుకోనున్నాయి. అలాగే దిగుమతులపై సుంకం పెంచడం కూడా ఈ కంపెనీలకు లాభదాయకం. అంతేకాదు దిగుమతి సుంకం పెంపు స్థానిక కంపెనీలకు, ఉత్పత్తులకు ఊతమివ్వనుంది. తద్వారా ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నారు. ప్రధాన కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టోర్స్ అన్నీ పల్లెల్లోకి విస్తరించాయి. ఇప్పటికే గ్రామీణ మార్కెట్‌పై దిగ్గజ కంపెనీలు ఆకర్షణీయ ఉత్పత్తులను అందుబాటులోకి తేవడంతోపాటు, మంచి ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ వినియోగదారుడు లోకల్‌బ్రాండ్ కంటే నేషనల్ బ్రాండ్ వైపు మొగ్గుచూపుతారని భావిస్తున్నారు. దీనికి తోడు ప్రధానంగా 2022నాటికి రైతులు ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంతో ఉన్నామని ఆర్థికమంత్రి ప్రకటించారు. అలాగే పంటలకు కనీస మద్దతు ధర 150 శాతం పెరగనుందని వెల్లడించారు. దీంతో గ్రామీణుల వినిమయ శక్తిని ఇప్పటికే విస్తరించిన ఈ కంపెనీలు సొమ్ము చేసుకుంటాయని అంచనా. -
ధరల తగ్గింపు: ఫ్లాట్‌గా ఎఫ్ఎంసీజీ
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ తగ్గింపు రేట్ల అమలుపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అధ్యక్షులు వనజా సర్నా సీరియస్‌గా స్పందించడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీలు వెంటనే చర్యలకు దిగాయి. దేశీయమేజర్ ఎఫ్ ఎంసీజీ కంపెనీలన్నీ ఎంఆర్పీధరలను తక్షణమే కచ్చితంగా అమలు చేయాలని సీబీఈసీ అధ్యక్షులు సోమవారం ఒక లేఖ రాశారు. జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని.. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఆయా ఉత్పత్తులపై జీఎస్టీ సవరించిన రేట్లను అమలు చేయనున్నట్టు ప్రకటించాయి. తాజా జీఎస్టీ నోటిఫికేషన్ కింద వివిధ కంపెనీలను తమ ఉత్పత్తుల ధరలను తగ్గించి విక్రయించనున్నట్టు వెల్లడించాయి. ముఖ్యంగా ఐటీసీ ,డాబర్ హెచ్‌యూఎల్, మారికో లాంటి కంపెనీలు సవరించిన ఎమ్ఆర్పి రేట్ల జాబితా వెల్లడించాయి. డీయొడరెంట్స్, హెయిర్ జెల్ హెయిర్ క్రీమ్స్, బాడీ కేర్ వంటి ఉత్పత్తులపై ఎంఆర్‌పిని తగ్గించిందని మారికో సిఎఫ్వో వివేక్ కర్వ్ ప్రకటించారు. అదేవిధంగా, హెచ్‌యూఎల్ ప్రతినిధి మాట్లాడుతూ, బ్రూ గోల్డ్ కాఫీ 50 గ్రాముల ప్యాక్ ధర రూ. 145 నుంచి 111 రూపాయలకు ను తగ్గించిందన్నారు. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించేందుకు తాము కట్టుబడిఉన్నామన్నారు. షాంపులు, స్కిన్ కేర్, ఇతర సౌందర్యసాధనాలపై 9శాతం తగ్గించిన ధరలను అమలు చేయన్నుట్టు డాబర్ సీఎఫ్ఓ లలిత్ మాలిక్ ప్రకటించారు. తెలిపింది. మరోవైపు ఈ ప్రకటన నేపథ్యంలో బుధవారం నాటి మార్కెట్ లో పలు ఎఫ్ఎంసీజీ కంపెనీ కౌంటర్లు ఫ్లాట్‌గా ట్రేడ్అవుతున్నాయి. కాగా జీఎస్టీ కౌన్సిల్తాజాగా 178 అంశాలపై జీఎస్టీ వడ్డీరేటును 29శాతంనుంచి 18 శాతానికి తగ్గించింది. అలాగే అనేక అంశాలపై 18 శాతం నుంచి 12 శాతానికి, 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. చూయింగ్ గమ్, చాక్లెట్లు, కాఫీ, కస్టర్డ్ పౌడర్, డెంటల్ పరిశుభ్రత ఉత్పత్తులు, సారాంశాలు, తర్వాత గొరుగుట, దుర్గంధం, డిటర్జెంట్ మరియు వాషింగ్ పవర్, రేజర్స్ మరియు బ్లేడ్లు, కత్తులు, బ్యాటరీలు, గాగుల్స్, వాచీలు జీఎస్టీ 18శాతంగా ఉంది. కండెన్స్డ్ మిల్, శుద్ధి చేసిన చక్కెర, పాస్తా కరివేపాకు, డయాబెటిక్ ఫుడ్, వెదురు / చెరకు ఫర్నిచర్ పన్ను రేటు 12 శాతానికి తగ్గించింది. నవంబరు15నుంచి ఈ సవరించిన రేట్లు అమల్లోకి వస్తాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రేట్లు తగ్గిస్తున్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు
న్యూఢిల్లీ: పలు ఉత్పత్తులపై వస్తు, సేవల పన్ను తగ్గిన నేపథ్యంలో ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించే దిశగా ఎఫ్ఎంసీజీ కంపెనీలు కూడా రేట్లు తగ్గిస్తున్నాయి. జీఎస్టీ భారం తగ్గిన ఉత్పత్తుల ధరలను తగ్గించినట్లు ఐటీసీ, డాబర్, హెచ్‌యూఎల్, మారికో తదితర సంస్థలు తెలిపాయి. తగ్గించిన కొత్త పన్ను రేట్లకు అనుగుణంగా పలు ఉత్పత్తుల ధరలను తగ్గించినట్లు ఐటీసీ ప్రతినిధి తెలిపారు. ‘బ్రూ గోల్డ్ కాఫీ 50 గ్రాముల ప్యాక్ ధరను రూ. 145 నుంచి రూ.111కి తగ్గించాం. మరిన్ని మార్పులేమైనా ఉంటే తెలియజేస్తాం‘ అని హెచ్‌యూఎల్ వర్గాలు వివరించాయి. డియోడరెంట్స్, హెయిర్ జెల్స్, హెయిర్ క్రీమ్స్, బాడీ కేర్ తదితర ఉత్పత్తులపై రేట్లు తగ్గించినట్లు మారికో సీఎఫ్‌వో వివేక్ కర్వే తెలిపారు. ‘కొత్తగా తయారయ్యే ఉత్పత్తులపై తగ్గింపు ధరలే ముద్రించి ఉంటాయి. ఇప్పటికే ఉన్న స్టాక్స్‌పై తగ్గించిన ఎంఆర్పీ స్టిక్కర్స్ అంటించి విక్రయించడం లేదా విక్రేతల ద్వారా అదనంగా డిస్కౌంట్లు ఇవ్వడం ద్వారా జీఎస్టీ రేట్ల తగ్గుదల ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయిస్తున్నాం‘ అని ఆయన వివరించారు. డాబర్ ఇండియా షాంపూలు, చర్మ సంరక్షణ ఉత్పత్తులు మొదలైనవాటి ధరలను 9 శాతం మేర తగ్గించినట్లు డాబర్ ఇండియా వెల్లడించింది. ధరల తగ్గింపు పరిమాణాన్ని పరిశీలిస్తున్నట్లు పతంజలి తెలిపింది. డిటర్జెంట్లు, షాంపూలు, సౌందర్య సాధనాలు సహా 178 ఉత్పత్తులపై ఈ నెల 15 నుంచి జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గిన సంగతి తెలిసిందే. -
ప్రపంచంలో అతిపెద్ద బ్రాండు మాదే!
సాక్షి, న్యూఢిల్లీ : దేశీ ఉత్పత్తులతో పతంజలి మార్కెట్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తమ ఫాస్ట్-మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) కంపెనీ పతంజలి 2018-19 నాటికి యునీలివర్‌ను, మిగతా వాటిని అధిగమిస్తుందని యోగా గురు బాబా రాందేవ్ అన్నారు. 2020-21 నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఎఫ్ఎంసీజీ బ్రాండుగా అవతరిస్తుందని తెలిపారు. వచ్చే రెండేళ్లలో పతంజలి రూ.1 లక్షల కోట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుతం హరిద్వార్‌లో రూ.15వేల కోట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని, తేజ్‌పూర్‌లో రూ.25వేల కోట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పతంజలి కలిగి ఉందన్నారు. నోయిడా, నాగ్‌పూర్, ఇండోర్, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా పతంజలి ఉత్పత్తి సెంటర్లు రాబోతున్నాయని తెలిపారు. ఆయిల్, ఉప్పు వంటి వాటిని తయారుచేయడానికి 50 చిన్న యూనిట్లను పతంజలి కలిగి ఉందని బాబా రాందేవ్ ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకవేళ తాము రూ.1 లక్షల కోట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని చేరుకుంటే, మొత్తం మార్కెట్ సైజు రూ.10 లక్షల కోట్లలో 10 శాతమని తెలిపారు. 2018-19 కల్లా యునిలీవర్, ఇతర టాప్ మోస్ట్ బ్రాండులను పతంజలి అధిగమిస్తుందని, 2020-21 నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఎఫ్ఎంసీజీ బ్రాండుగా అవతరించాలని చూస్తున్నట్టు బాబా రాందేవ్ చెప్పారు. బాబా రాందేవ్, ఆయన అసోసియేట్ ఆచార్య బాలక్రిష్ణ కలిసి తక్కువ సమయంలోనే అతిపెద్ద ఎఫ్ఎంసీజీ గ్రూప్ పతంజలిని ఓ స్థాయిలో నిల్చోబెట్టారు. త్వరలోనే తమ గ్రూప్ జీన్స్, ట్రౌజర్స్, కుర్తాలు, షర్ట్లు, స్పోర్ట్స్‌వేర్, యోగా వేర్లను విక్రయించబోతున్నట్టు తెలిపారు. -
అమెజాన్ భారీ డిస్కౌంట్లు వాటిపైనే!
సాక్షి, న్యూఢిల్లీ : అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో కూడా పండుగ సీజన్ ప్రారంభమైంది. నేటి నుంచి గ్రేట్ ఇండియన్ సేల్‌ను ప్రారంభించింది. 24వ తేదీ వరకు జరిగే ఈ ఫెస్టివల్ కంపెనీ బిగ్ డీల్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ సారి ఫుడ్, గ్రోసరీలో భారీ మొత్తంలో డిస్కౌంట్లకు అమెజాన్ తెరతీసింది. ఈ-కామర్స్ గ్రోసరీ స్పేస్‌లో భారీ ఎత్తున్న పోటీ నెలకొనడంతో ఫుడ్, గ్రోసరీలో భారీ మొత్తంలో డిస్కౌంట్లను అమెజాన్ అందిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఆహారోత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మేందుకు ప్రభుత్వం అనుమతి కల్పించిన సంగతి తెలిసిందే. అమెజాన్ నేటి నుంచి ప్రారంభించిన గ్రేట్ ఇండియన్ సేల్‌లో 40 శాతం డిస్కౌంట్లను ఆహారోత్పత్తులపై ఆఫర్ చేస్తుంది. అంతేకాక మేకప్, బ్యూటీ ఉత్పత్తులపై 35 శాతం వరకు, బేబీ కేర్ ఉత్పత్తులపై 70 శాతం వరకు, లాండ్రీ, పర్సనల్ కేర్ ఉత్పత్తులపై 50 శాతం వరకు డిస్కౌంట్లకు అమెజాన్ తెరతీసింది. కస్టమర్లను గెలుచుకోవడం కోసం ఈ పండుగ సీజన్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులపై ప్రమోషన్లను ఆఫర్ చేస్తున్నట్టు అమెజాన్ ఇండియా కేటగిరీ మేనేజ్మెంట్ డైరెక్టర్ సౌరభ్ శ్రీవాత్సవ చెప్పారు. గ్రేట్ బ్రాండులపై గ్రేట్ డీల్స్‌ను తమ కస్టమర్లకు అందించడానికి విక్రయదారులతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. గ్రోసరీ, పర్సనల్ కేర్, బేబీ ఉత్పత్తులపై కస్టమర్లు ఎక్కువ మొత్తంలో ఆదా చేసుకోవచ్చని తెలిపారు. -
సెన్సెక్స్ 322 పాయింట్లు జంప్
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌లోనూ మంచి లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 322 పాయింట్ల మేర జంప్ చేసింది. నిఫ్టీ సైతం 100 పాయింట్లకు పైగా పైకి నమోదైంది. 321.86 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ 31,770 వద్ద ముగియగా.. ఇంట్రాడేలో 9,900 పైకి ఎగిసిన నిఫ్టీ, చివర్లో ఆ మార్కుకు మూడు పాయింట్ల దూరంలో 9,897 వద్ద క్లోజైంది. నేటి మార్కెట్లో సిప్లా, టాటా మోటార్స్, టెక్ మహింద్రాలు ఎక్కువగా లాభపడగా.. ఎన్టీపీసీ, ఆసియన్ పేయింట్స్, పవర్ గ్రిడ్లు బాగా నష్టపోయాయి. ఎఫ్‌సీజీ, బ్యాంకు స్టాక్స్ నేటి మార్కెట్లు మంచిగా లాభపడినట్టు విశ్లేషకులు చెప్పారు. బలహీనమైన తొలి త్రైమాసిక ఫలితాలతో కోల్ ఇండియా 2 శాతం మేర నష్టపోయింది. కొరియా, అమెరికా భౌగోళిక రాజకీయ టెన్షన్లు కాస్త సద్దుమణగడంతో అటు యూరోపియన్ మార్కెట్లు పైకి ఎగిశాయి. అంతేకాక డాలర్ పైకి ఎగియడం ప్రారంభమైంది. డాలర్ పెరుగుతుండటంతో ఇటు బంగారం ధరలు సతమతమవుతున్నాయి. నేటి ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 246 రూపాయల నష్టంలో 28,834 రూపాయలుగా నమోదయ్యాయి. ఒక్క బంగారం మాత్రమే కాక ఇటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా పడిపోయింది. మూడు వారాల కనిష్టానికి వెళ్లిన రూపాయి విలువ, ట్రేడింగ్ ఆఖరికి 5 పైసలు బలహీనపడి 64.17గా నమోదైంది. -
హెచ్‌యూఎల్ లాభం 9 శాతం అప్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనీలీవర్ (హెచ్‌యూఎల్) నికరలాభం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో 9.28 శాతం పెరిగి రూ. 1,283 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ లాభం రూ. 1,174 కోట్లు. తాజాగా ముగిసిన త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు 4.98 శాతం వృద్ధితో రూ. 8,662 కోట్ల నుంచి రూ. 9,094 కోట్లకు పెరిగాయి. మొత్తం ఆదాయం రూ. 8,910 కోట్ల నుంచి రూ. 9,335 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో మంగళవారం హెచ్‌యూఎల్ షేరు ధర స్వల్ప పెరుగుదలతో రూ. 1,058 వద్ద ముగిసింది. -
సెన్సెక్స్ మరో రికార్డు
ముంబై: దలాల్ స్ట్రీట్ లో రికార్డుల వర్షం కొనసాగుతోంది. ముఖ్యంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడం,గ్లోబల్ మార్కెట్లు సానుకూల ధోరణి నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కొత్త గరిష్టాలను అందుకున్నాయి. దేశీయంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యమివ్వడంతో అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. సెన్సెక్స్ 32,132 వద్ద, నిఫ్టీ 9,920 వద్ద ఆల్‌టైమ్ 'హై' లను నమోదు చేశాయి. దీంతోపాటు డాలర్ మారకంలో రూపాయి, బంగారం ధరలు కూడా పాజిటివ్ నోట్‌తో లాభాలతో ట్రేడ్ అవుతూ వుండటం విశేషం. అటు బ్యాంక్ నిఫ్టీ సైతం 71 పాయింట్లు ఎగసి 24,009ని అధిగమించింది. అంతేకాదు మార్కెట్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా మార్కెట్ క్యాప్ లో రూ. 5లక్షల కోట్లను క్రాస్ చేసింది. ఐటీ 1.4 శాతం, మెటల్ 0.9 శాతం, ఆటో 0.5 శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు టుబాకో పై జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ బలహీనంగా ఉంది. ముఖ్యంగా ఐటీసీ 3శాతం నష్టపోయింది. దీంతో మార్కెట్లు కొద్దిగా వెనుకంజలో ఉన్నాయి. విప్రో, వేదాంతా, అదానీ పోర్ట్స్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ, టెక్‌మహీంద్రా, ఇన్ఫోసిస్, ఆర్ఐఎల్, హిందాల్కో, హెచ్‌సీఎల్ టెక్ లాభపడుతుండగా, ఐటీసీ, గెయిల్, ఐవోసీ, యాక్సిస్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, హెచ్‌యూఎల్, అరబిందో నష్టాల్లో ఉన్నాయి. రూపాయి 0.09 పైసల లాభంతో రూ. 64.36వద్ద, పసిడి రూ.41 పుంజుకుని పది గ్రా. రూ.28,037 వద్ద కొనసాగుతోంది. -
రెండు ఎంఆర్పీ రేట్లతో ప్రయోజనం
♦ ఉత్పత్తుల రేట్లు పెరిగాయా, ♦ తగ్గాయా అన్నది తెలుస్తుంది ♦ ఎఫ్ఎంసీజీ కంపెనీల అభిప్రాయం న్యూఢిల్లీ: జూన్ చివరి నాటికి అమ్ముడుపోని సరుకులపై జీఎస్టీకి ముందు, జీఎస్టీ తర్వాత రేట్లను పేర్కొని విక్రయించుకునే అవకాశం వల్ల నిల్వలు ఖాళీ చేసుకునేందుకు వీలవుతుందని ఎఫ్ఎంసీజీ కంపెనీలు అభిప్రాయపడ్డాయి. మార్కెట్లో పారదర్శకత కూడా వస్తుందని పేర్కొన్నాయి. జీఎస్టీ కారణంగా ఉత్పత్తుల ధరలు పెరిగాయా లేక తగ్గాయా అన్నది వినియోగదారులు తెలుసుకునేందుకు తోడ్ప డుతుందని అన్నాయి. అమ్ముడు పోని ప్యాకేజ్డ్ ఉత్పత్తులపై సవరించిన ధరల ట్యాగ్‌ను వేసుకుని మూడు నెలల పాటు విక్రయించుకునేందుకు అనుమతిస్తూ కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి మాత్రం ఒకటే ఎంఆర్పీ(గరిష్ట చిల్లర ధర) ఉండాలని ప్రభుత్వం నిర్ధేశించింది. దీంతో ఈ నిర్ణయాన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు స్వాగతించాయి. ధరలపై స్పష్టత: ఈ వెసులుబాటు జీఎస్టీ సాఫీగా అమలయ్యేందుకు వీలు కల్పిస్తుందని పతంజలి కంపెనీ పేర్కొంది. ఎంఆర్పీ విషయంలో వర్తకులు, తయారీదారుల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగిస్తుందని తెలిపింది. వినియోగదారులు సైతం జీఎస్టీ వల్ల ధరలు పెరిగాయా, తగ్గాయా అన్నది తెలుసుకోగలుగుతారని పేర్కొంది. సవరించిన ధరలతో తమ ఉత్పత్తులను ఇప్పటికే విడుదల చేయడం ప్రారంభమైందని హెచ్‌యూఎల్ తెలిపింది. -
జీఎస్టీ ఎఫెక్ట్.. వీటి రేట్లు తగ్గాయ్
తగ్గించిన హెచ్‌యూఎల్, హీరోమోటో న్యూఢిల్లీ జీఎస్టీ అమల్లోకి రావడంతో కొన్ని వస్తువుల ధరలు తగ్గుతుండటం, కొన్ని పెరుగుతుండటం తెలిసిందే. తాజాగా ఈ తగ్గింపు జాబితాలోకి హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్), హీరో మోటోకార్ప్ చేరాయి. జీఎస్టీ వల్ల తమకు లభించే పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయిస్తున్నట్లు పేర్కొన్నాయి. హెచ్‌యూఎల్ ఇలా... ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్... 250 గ్రాముల బరువుండే రిన్ సబ్బు ధరను రూ.3 తగ్గించింది. రూ.18 నుంచి రూ.15కు చేర్చింది. అదేవిధంగా రూ.10 విలువైన సర్ఫ్ ఎక్సెల్ సబ్బు పరిమాణాన్ని 95 గ్రాముల నుంచి 105 గ్రాములకు పెంచింది. ఇంకా స్నానం సబ్బు డోవ్ బరువును కూడా 33 శాతం పెంచుతున్నట్లు హెచ్‌యూఎల్ వెల్లడించింది. ‘జూలై 1 నుంచి డీలర్లకు పంపే కొన్ని ఉత్పత్తులపై మేం ప్రకటించిన ధరలు, పరిమాణాలకు సంబంధించిన మార్పులు అమల్లోకి వస్తాయి’ అని హెచ్‌యూఎల్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఇతర ఉత్పత్తులపై ఏవైనా మార్పులుంటే త్వరలో తెలియజేస్తామని ఆయన చెప్పారు. కాగా, సబ్సులు, డిజర్జెంట్ పౌడర్, టిష్యూ పేపర్, న్యాప్కిన్స్ ఇతరత్రా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను 18 శాతం జీఎస్టీ శ్లాబ్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. హీరోమోటో రూ.400–1,800 కట్ దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ భారీగా అమ్ముడయ్యే తమ వాహనాల రేట్లను రూ.400–1,800 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, రాష్ట్రాలను బట్టి(జీఎస్టీ ముందు, తర్వాత పన్ను రేట్లకు అనుగుణంగా) ఈ ధరల తగ్గింపులో వ్యత్యాసాలు ఉంటాయని కంపెనీ పేర్కొంది. కొన్ని మార్కెట్లలో(రాష్ట్రాలు) ప్రీమియం వాహన మోడళ్లపై ధర రూ.4,000 వరకు కూడా తగ్గుతుందని కంపెనీ వివరించింది. కాగా, కార్ల కంపెనీలు మారుతీ సుజుకీ, టయోటా కిర్లోస్కర్, టాటామోటార్స్ జేఎల్ఆర్, బీఎండబ్ల్యూ... జీఎస్టీ అమలు నేపథ్యంలో రేట్లను రూ.2,300–రూ.2 లక్షల మేర తగ్గిస్తున్నట్లు శనివారం ప్రకటించిన విషయం విదితమే. మారుతీ చాలావరకూ తమ మోడళ్లపై 3 శాతం వరకూ ధర తగ్గించింది. అయితే, పాక్షిక హైబ్రిడ్ టెక్నాలజీ ఉన్న సియాజ్, ఎర్టిగా డీజిల్ వెర్షన్ల రేట్లను మాత్రం రూ.లక్ష పైగానే పెంచుతున్నట్లు ప్రకటించింది. -
జీఎస్టీ ఎఫెక్ట్: ఎఫ్ఎంసీజీ షేర్ల జోరు
ముంబై: జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన పన్ను రేట్లకు అనుగుణంగా సోమవారంనాటి మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనయ్యింది. కొన్ని ముఖ్యమైన ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ధరలు తగ్గనున్న నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ షేర్లు ర్యాలీ జరపగా, పన్ను రేట్లు అధికంగా కానున్నందున సిమెంటు షేర్లు క్షీణించాయి. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా పెరిగి 30,712 పాయింట్ల గరిష్టస్థాయికి చేరి, అటుతర్వాత 30,517 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది. చివరకు క్రితం ట్రేడింగ్ రోజుతో పోలిస్తే 106 పాయింట్ల లాభంతో 30,571 పాయింట్ల వద్ద ముగిసింది. 9,499–9,428 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 10 పాయింట్ల లాభంతో 9,438 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్లోఎఫ్ఎంసీజీ షేర్లకు వున్న అధిక వెయిటేజీ వల్ల ఈ సూచి పెరుగుదల 0.35%కాగా, నిఫ్టీ లాభం 0.11 శాతానికే పరిమితంకావడం గమనార్హం. ఐటీసీ 6 శాతం జూమ్...: ముఖ్యంగా ప్రధాన ఎఫ్ఎంసీజీ షేరు ఐటీసీ 6 శాతం మేర ర్యాలీ జరిపి చరిత్రాత్మక గరిష్టస్థాయి రూ. 303 వద్ద ముగిసింది. హిందుస్తాన్ యూనీలీవర్ 1 శాతంపైగా ఎగిసి కొత్త గరిష్టస్థాయి రూ. 1,020 వద్ద క్లోజయ్యింది. ఇతర ఎఫ్ఎంసీజీ షేర్లు నెస్లే, బ్రిటానియా, మారికో, డాబర్ ఇండియాలు కూడా పెరిగాయి. బీఎస్ఈ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 3 శాతంపైగా ఎగిసింది. సెన్సెక్స్–30 షేర్లలో ఎల్ అండ్ టీ, అదాని పోర్ట్స్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్‌లు 1–2 శాతం మధ్య పెరిగాయి. -
హెచ్‌యూఎల్ లాభం 6% అప్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్తాన్ యూనీలీవర్ (హెచ్‌యూఎల్) నికరలాభం మార్చితో ముగిసిన త్రైమాసికంలో 6.19 శాతం పెరిగి రూ. 1,183 కోట్లకు చేరింది. కంపెనీ 2016 మార్చితో ముగిసిన క్వార్టర్లో రూ. 1,114 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఆదాయం కూడా 6.39 శాతం పెరిగి రూ. 8,430 కోట్ల నుంచి రూ. 8,969 కోట్లకు పెరిగింది. బుధవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ. 10 చొప్పున తుది డివిడెండును సిఫార్సుచేసింది. ఫలితాల నేపథ్యంలో హెచ్‌యూఎల్ షేరు 0.82 శాతం పెరిగి రూ. 1,006 వద్ద ముగిసింది. ఇది జీవితకాల గరిష్టస్థాయి. నోట్ల రద్దు దెబ్బ నుంచి రికవరీ... డీమోనిటైజేషన్ తర్వాత ప్రస్తుతం ఎఫ్ఎంసీజీ మార్కెట్ కుదుటపడిందని, క్రమేపీ కోటుకుంటున్నదని హెచ్‌యూఎల్ సీఎఫ్ఓ పీబీ బాలాజీ చెప్పారు. డీమోనిటైజేషన్ కారణంగా బాగా దెబ్బతిన్న గ్రామీణ మార్కెట్ కూడా రికవరీ అవుతున్నదని, అయితే నోట్ల రద్దుకు మునుపు వున్నంతస్థాయికి ఇంకా ఇది చేరలేదని ఆయన కాన్ఫెరెన్స్ కాల్లో వివరించారు. ఈ ఏడాది రుతుపవనాలు బావుంటాయన్న అంచనాలు వెలువడుతున్నందున, పట్టణ ప్రాంతాలకంటే గ్రామీణ ప్రాంతాలు ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల కొనుగోలులో వెనుకబడి వుంటాయని భావించడం లేదన్నారు. నాల్గవ త్రైమాసికంలో వివిధ విభాగాల్లో హెచ్‌యూఎల్ అమ్మకాల తీరును ఆయన వివరిస్తూ సర్ఫ్, విమ్ లిక్విడ్ వంటి బ్రాండ్లు పటిష్టమైన పనితీరును కనబర్చాయని, దాంతో హాంకేర్ విభాగంలో మంచి వృద్ధి సాధించామన్నారు. పర్సనల్ వాష్, పర్సనల్ ప్రొడక్టుల విభాగం కూడా ముగిసిన త్రైమాసికంలో పుంజుకున్నదని అన్నారు. అయితే ఫుడ్ ఉత్పత్తుల వ్యాపారం వృద్ధి, గతేడాదితో పోలిస్తే తక్కువగానే వుందని, కానీ కిసాన్బ్రాండ్ మాత్రం మంచి వృద్ధి సాధించిందన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బుధవారం బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేరు 1% లాభంతో రూ.1,006 వద్ద ముగసింది. -
రికార్డుల హోరు
♦ సెన్సెక్స్ 30,500 పైన, నిఫ్టీ 9,500 పైన ♦ రుతు పవనాలు, ప్రోత్సాహకర ఫలితాల జోష్ ♦ ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఆటో రంగాల జోరు ముంబై: మంగళవారం స్టాక్ మార్కెట్లో రికార్డులు హోరెత్తిపోయాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ రికార్డు గరిష్టస్థాయికి పెరగడంతో పాటు అదేస్థాయి వద్ద ముగియడం విశేషం. చరిత్రలో తొలిసారిగా 30,500 పాయింట్ల స్థాయిని అధిగమించిన బీఎస్ఈ సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 260 పాయింట్లు ఎగిసి 30,582 పాయింట్ల వద్ద ముగిసింది. అదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 9,500 పాయింట్ల శిఖరాన్ని తొలిసారిగా అధిరోహించి 9,512 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ 67 పాయింట్లు ర్యాలీ జరిపింది. మే 11న ఈ రెండు సూచీలు సాధించిన రికార్డు స్థాయిల్ని తాజాగా అధిగమించాయి. ఈశాన్య రుతుపవనాలు అండమాన్ నికోబార్ ద్వీపాల్ని సాధారణతేదీకంటే మూడు రోజులు ముందుగానే తాకాయన్న వార్తలతో కొనుగోళ్ల జోరు మొదలయ్యింది. మరోవైపు టీసీఎస్ బైబ్యాక్ ఆఫర్ ఈ నెల 18న మొదలవుతుందని ప్రకటించడం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వెల్లడించిన ఫలితాల్ని మార్కెట్ మెచ్చడం వంటి అంశాలు రోజంతా ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు పురిగొల్పాయి. అలాగే గత రాత్రి అమెరికా సూచీలు కూడా కొత్త రికార్డుస్థాయిలో ముగియడం కూడా ఇక్కడి సెంటిమెంట్‌ను బలపర్చింది. భారత ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక వృద్ధి దశలోకి ప్రవేశించిందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక కూడా మార్కెట్‌కు ఊతం ఇచ్చింది. మెటల్స్ మినహా... క్రితం రోజు ర్యాలీ జరిపిన మెటల్ షేర్లు మినహా దాదాపు అన్ని రంగాలకు చెందిన షేర్లూ ర్యాలీలో పాలుపంచుకున్నాయి. రుతువపనాలు వచ్చేశాయన్న వార్తలతో ఎఫ్ఎంసీజీ షేర్లు హిందుస్తాన్ యూనీలీవర్, ఐటీసీ షేర్లు 2 శాతంపైగా ఎగిసాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మార్చితో ముగిసిన త్రైమాసికానికి నికరలాభాన్ని ప్రకటించడంతో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ తదితర బ్యాంకింగ్ షేర్లు పెరిగాయి. రెండు రోజుల్లో బైబ్యాక్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీసీఎస్ షేరు 2 శాతం ఎగిసింది. పెరిగిన షేర్లలో హీరో మోటో, మారుతి, విప్రో, భారతి ఎయిర్‌టెల్‌లు వున్నాయి. ఒడిదుడుకుల భయాలూ ఉన్నాయ్..! కాగా భవిష్యత్తు పనితీరుపట్ల ఆపోహలున్న ఐటీ, ఫార్మా, టెలికం రంగాలు కూడా తాజా ర్యాలీలో పాలుపంచుకోవడం ఆందోళన కల్గిస్తున్నదని, దీంతో వచ్చే కొద్ది రోజుల్లో మార్కెట్ ఒడిదుడుకులకు లోనుకావొచ్చని ఆయన అంచనావేశారు. -
రికార్డ్ల 'వర్షం' ..!
♦ కొత్త శిఖరాలకు స్టాక్ సూచీలు ♦ మెరుగైన వర్షపాత అంచనాలతో కొనుగోళ్ల సునామీ ♦ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ స్టాక్ సూచీల రికార్డ్‌లు ♦ తొలిసారి 9,400 పాయింట్లపైకి నిఫ్టీ..90 పాయింట్ల లాభం ♦ 315 పాయింట్ల లాభంతో 30,248కి సెన్సెక్స్ వర్షపాత అంచనాలు మెరుగుపడి, ఎల్‌నినో భయాలు తొలగడంతో స్టాక్ మార్కెట్లో కొనుగోళ్ల సునామీ చోటు చేసుకుంది. దీంతో స్టాక్ సూచీలు కొత్త శిఖరాలకు ఎగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ రెండూ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్లను సృష్టించాయి. నిఫ్టీ తొలిసారిగా 9,400 పాయింట్లపైకి ఎగబాకింది. 90 పాయింట్ల లాభంతో 9,407 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 315 పాయింట్ల లాభంతో 30,248 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో ఈ రెండు స్టాక్ సూచీలు జీవిత కాల గరిష్ట స్థాయిలను– సెన్సెక్స్ 30,272 పాయింట్లను, నిఫ్టీ 9,415 పాయింట్లను తాకాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ఈ జోరు కొనసాగుతుంది... ఎల్ నినో ప్రభావం తగ్గుతుందని, వర్షాలు గతంలో వేసిన అంచనాల కంటే అధికంగానే కురుస్తాయని వాతావరణ శాఖ వెల్ల డించడం మార్కెట్‌ను కొత్త శిఖరాలకు చేర్చిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. వర్షాలు బాగా కురిస్తే, భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని, ఎఫ్ఎంసీజీ, కన్సూమర్ డ్యూరబుల్స్ రంగాలు జోరుగా వృద్ధి సాధిస్తాయని తెలియజేశారు. ఈ జోరు కొనసాగుతుందని. నిఫ్టీ 9,500 పాయింట్లకు చేరుతుందని బొనంజా పోర్ట్‌ఫోలియో విశ్లేషకులు, పరేఖ్ అంచనా వేశారు. అంచనాల కంటే ముందుగానే నిఫ్టీ 9,600 పాయింట్లకు చేరవచ్చని ఏంజెల్బ్రోకింగ్కు చెందిన సమీత్ చవాన్ చెప్పారు. వచ్చే ఏడాది జూన్‌కల్లా నిఫ్టీ 10,000 పాయింట్లకు చేరుతుందని గోల్ట్‌మన్ శాక్స్ అంచనా వేస్తోంది. షేర్ల సమ్‌గతులు... ♦ వర్షపాత అంచనాలు మెరుగుపడడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జోరుగా ఉండనున్నదన్న ఇన్వెస్టర్లు భావించారు. దీంతో ఎరువుల, ఎఫ్ఎంసీజీ షేర్లు కళకళలాడాయి. రాష్ట్రీయ కెమికల్స్, ఫ్యాక్ట్, మద్రాస్ ఫెర్టిలైజర్స్, చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ 7 శాతం వరకూ లాభపడ్డాయి. ♦ ఈ ఏడాది ఇప్పటిదాకా బీఎస్ఈ సెన్సెక్స్ 14% వరకూ లాభపడింది. ♦ ప్రధాన సూచీలతో పాటు ఎన్ఎస్ఈలో 129 షేర్లు, బీఎస్ఈ 500, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లోని 40 షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ♦ మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో 22 షేర్లు లాభాల్లో, 8 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ♦ గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నికర లాభం 72 శాతం తగ్గినప్పటికీ, భారతీ ఎయిర్టెల్ 8 శాతం లాభపడి రూ.373 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే. ♦ హిందుస్తాన్ యూనిలివర్4.6 శాతం, హెచ్డీఎఫ్సీ 3.2 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.5 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.1 శాతం, బజాజ్ ఆటో 1.7 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.6 శాతం, మారుతీ సుజుకీ 1.5 శాతం, సిప్లా 1.4 శాతం, టాటా మోటార్స్ 1.2 శాతం చొప్పున పెరిగాయి. ♦ ఇక నష్టపోయిన షేర్ల విషయానికొస్తే... విప్రో 1.6 శాతం క్షీణించింది. ఏషియన్ పెయింట్స్ 1.1 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.9 శాతం, టీసీఎస్ 0.8 శాతం, గెయిల్ 0.8 శాతం చొప్పున నష్టపోయాయి. ఎందుకు పెరిగాయంటే.. మెరుగుపడిన వర్షపాత అంచనాలు: గతంలో వెలువరించిన అంచనాల కంటే అధికంగానే ఈ ఏడాది వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విబాగం(ఐఎండీ) మంగళవారం వెల్ల డించింది. 96 శాతం వర్షపాతం ఉండగలదన్న గతంలోని అంచనాలను తాజాగా వంద శాతానికి పెంచింది. దీంతో ఎల్‌నినో భయాలు తగ్గి కొనుగోళ్ల జోరు పెరిగింది. విదేశీ కొనుగోళ్ల జోరు: గత రెండు వారాలుగా అమ్మకాలు జరుపుతున్న విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ నికర కొనుగోళ్లు జరపడం సెంటిమెంట్‌ను మరింత పెంచింది. మంగళవారం రూ.333 కోట్లు, బుధవారం రూ.893 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. హెవీ వెయిట్స్ ర్యాలీ: సెన్సెక్స్, నిఫ్టీల్లో అధిక వెయిటేజీ ఉన్న హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలివర్, ఐటీసీ షేర్లు మంచి లాభాలను సాధించాయి. జోరుగా దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు: ఈ నెలలో గత వారం వరకూ విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు జరుపుతుండగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.2,000 కోట్ల మేర కొనుగోళ్లు జరపడం సానుకూల ప్రభావం చూపింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్ స్కీమ్‌లు గత నెలలో రూ.9,400 కోట్లు నికరంగా వెచ్చించాయి. విదేశీ మార్కెట్ల కిక్: ప్రధాన ఆసియా స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. మంగళవారం అమెరికా మార్కెట్ లాభాల్లో ముగియడం కలసివచ్చింది. ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమేను ట్రంప్ ప్రభుత్వం ఆకస్మికంగా తొలగించంతో యూరప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 2 లక్షల కోట్ల డాలర్లకు 2% చేరువలో.. స్టాక్ సూచీల రికార్డ్ స్థాయి జోరుతో ఇన్వెస్టర్ల సంపద భారీగా ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం క్యాపిటలైజేషన్ 2 లక్షల కోట్ల డాలర్లకు 2% దూరంలోనే ఉంది. ఇన్వెస్టర్ల సంపద రూ. 1,26,61,536 కోట్లకు (1.95 లక్షల కోట్ల డాలర్లకు) ఎగసింది. -
ఎఫ్ఎంసీజీ కంపెనీల ఆశలు..
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో ఎక్కువగా ప్రభావితమైన ఎఫ్ఎంసీజీ కంపెనీలు బడ్జెట్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. వినియోగదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్‌ను పెంచే విధంగా బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ఉద్దీపన చర్యలు వినియోగదారుల నమ్మకాన్ని పెంచే ఉద్దీపన చర్యలు బడ్జెట్లో ఉంటాయని భావిస్తున్నాం. క్రియాశీలక సంస్కరణలు మధ్యతరగతి, గ్రామీణ ప్రజల చేతుల్లో కొనుగోలు శక్తి పెంచడం ద్వారా డిమాండ్ పుంజుకుంటుంది. దీంతో ఎఫ్ఎంసీజీ రంగం వృద్ధి పరంగా పట్టాలెక్కుతుంది. – వివేక్ గంభీర్, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఎండీ వృద్ధి ఆధారిత బడ్జెట్ వినియోగాన్ని, ప్రజల పెట్టుబడులను, డిజిటైజేషన్‌ను, పన్నుల పరిధిని పెంచడం ద్వారా అధిక వృద్ధి సాధించే విధంగా బడ్జెట్ ఉంటుంది. గార్, పీఓఈఎం, జీఎస్టీ వంటి విధానాలపై బడ్జెట్‌తో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అయితే, ఇతర అన్ని బడ్జెట్ల మాదిరిగా లోటును అడ్డుకట్ట వేయడం, అధిక వృద్ధిని సాధించడం అన్నది ప్రస్తుతానికి సవాలే. కనీస పన్ను మినహాయింపు వంటి పలు చర్యలు ఉంటాయని అంచనా వేస్తున్నాం. – ఎన్‌హెచ్ బన్సాలీ, ఇమామీ సీఎఫ్‌వో ఆయుర్వేద ఉత్పత్తులపై తక్కువ పన్ను ఆయుర్వేద ముడి పదార్థాలతో తయారు చేసిన వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం సంతోషకరం. చాలా వరకు ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఇటీవలి కాలంలో ఈ విభాగంలోకి అడుగుపెట్టాయి. ఆయుర్వేద ముడి పదార్థాలతో తయారయ్యే ఉత్పత్తులను జీఎస్టీలో చాలా తక్కువ పన్ను రేటులోకి తీసుకొస్తారని ఆశిస్తున్నాం. – ప్రదీప్ చోలాయిల్, చోలాయిల్ లిమిటెడ్ (మెడిమెక్స్ తయారీ) ఎండీ -
చివరి ట్రేడింగ్‌లో మార్కెట్లు అదుర్స్
ఎన్నో ఒడిదుడుకుల అనంతరం 2016 చివరి ట్రేడింగ్ సెషన్లో దేశీయ మార్కెట్లు అదరగొట్టాయి. సెన్సెక్స్ 260.31 పాయింట్ల లాభంతో 26626.46 వద్ద , నిఫ్టీ 82.20 పాయింట్ల లాభంతో 8185.80 వద్ద ముగిశాయి. బ్యాంకు నిఫ్టీ పుంజుకోవడంతోపాటు జనవరి నెల డెరివేటివ్ సిరీస్ నేటి నుంచి ప్రారంభం కావడంతో మార్కెట్లు లాభపడ్డాయని విశ్లేషకులు చెప్పారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం, అమెరికా ఎన్నికల్లో ట్రంప్ నెగ్గడం వంటి ఎన్నో ప్రపంచ అనూహ్య పరిణామాల నేపథ్యంలోనూ ఈ ఏడాదిలో నిఫ్టీ 3 శాతం, బీఎస్ఈ ఇండెక్స్ 2 శాతం లాభాలను ఆర్జించినట్టు తెలిపారు. 2016 లాభాలతో 2015 రికార్డు స్థాయి పతనాల నుంచి కోలుకున్నామని పేర్కొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన జీఎస్టీ బిల్లు ఆమోదం పొందడం దేశీయ మార్కెట్లలో సెంటిమెంట్‌ను బలపర్చిందన్నారు. కానీ హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రభుత్వ ప్రకటన ఆర్థిక వృద్ధిపై ఆందోళనలను నెలకొలుపుతుందన్నారు. కానీ ఫిబ్రవరిలో జరగబోయే మానిటరీ పాలసీ సమీక్షలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వడ్డీరేట్లకు కోత పెడుతుందనే అంచనాలు కొత్త ఏడాదిలో అంచనాలను పెంచుతున్నాయన్నారు. ప్రస్తుతం మార్కెట్లు సౌకర్యవంతమైన జోన్లోనే ఉన్నాయని చెప్పారు. వచ్చే నెలల్లో వచ్చే బడ్జెట్‌పై మార్కెట్లు పాజిటివ్ సంకేతాల కోసం ఎదురుచూస్తున్నాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. -
ప్రపంచ స్థాయి భారతీయ బ్రాండ్లు రూపొందిస్తాం
న్యూఢిల్లీ: 2030 నాటికి ఎఫ్ఎంసీజీ విభాగం ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ఐటీసీ ప్రపంచ స్థాయి భారతీయ బ్రాండ్ల రూపకల్పనపై దృష్టి సారించింది. క్లాస్మేట్స్, సన్‌ఫీస్ట్, ఆశీర్వాద్ బ్రాండ్ల విజయం ఇచ్చిన ఉత్సాహంతో... ప్రస్తుత విభాగాలతో పాటు తాజా పండ్లు, కూరగాయలు, సముద్ర ఉత్పత్తుల వంటి నూతన విభాగాల్లోకి విస్తరించే లక్ష్యాలతో ఉంది. ప్రస్తుతం క్లాస్మేట్స్, సన్‌ఫీస్ట్, ఆశీర్వాద్ బ్రాండ్లు రూ.1,000 నుంచి రూ.3,000 కోట్ల ఆదాయ స్థాయిలో ఉన్నాయి. ప్రపంచ స్థాయి భారతీయ బ్రాండ్లతోపాటు, ఈ దేశానికి మేధో పరమైన ఆస్తులు సృష్టించాలన్నదే తమ అభిలాష అని ఐటీసీ సీఈవో సంజీవ్‌పూరి తెలిపారు. ఈ లక్ష్యం దిశగా తమ పని ప్రారంభించినట్టు చెప్పారు. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విభాగం నుంచి ఆహారం, విద్య, స్టేషనరీ, అగర్బత్తి వరకు అన్నింటా ప్రపంచ స్థాయి ఉత్పాదనలు రూపొందించడం ద్వారా తమ లక్ష్యాలను చేరుకుంటామని ఆయన వివరించారు. ప్రస్తుత విభాగాల్లో బలోపేతం కావడమే కాకుండా నూతన విభాగాల్లోకీ ప్రవేశిస్తామన్నారు. 2015–16లో ఐటీసీ ఎఫ్ఎంసీజీ మొత్తం ఆదాయం రూ.28.410 కోట్లుగా ఉండగా ఇందులో ఒక్క సిగరెట్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.18,686 కోట్లు. వచ్చే కొన్నేళ్లలో ఎఫ్ఎంసీజీ విభాగంలో రూ.25 వేల కోట్ల పెట్టుబడి ద్వారా 2030 నాటికి రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని చేరుకుంటామని ఐటీసీ గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. మాకు ఎన్నో బలాలున్నాయ్... ఎఫ్ఎంసీజీ విభాగంలో గట్టి పోటీనిచ్చేందుకు తమకు ఎన్నో బలాలున్నాయని పూరి తెలిపారు. భారీ స్థాయిలో అగ్రి వ్యాపార విభాగం, పాక శాస్త్ర నిపుణులు, సంప్రదాయ బ్రాండ్ విలువ, మార్కెటింగ్ తదితరమైనవి తమ బలాలుగా పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ విభాగంలో ఇప్ప టి వరకు 350 పేటెంట్ల కోసం దరఖాస్తు చేసినట్టు చెప్పారు. ఈ బలాలతో ఎఫ్ఎంసీజీ రంగంలో వేగంగా వృద్ధి చెందగలమనే ఆశాభావాన్ని ఆయ న వ్యక్తం చేశారు. ఐటీసీకి 25 బ్రాండ్లు ఉన్నాయ ని, కొన్నింటిలో నంబర్1, కొన్నింటిలో నంబర్ 2, 3 స్థానాల్లో ఉండగా... అన్నింటా నంబర్ 1 స్థానానికి చేరుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు. -
ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు
ముంబై: ఫెడ్ రేట్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 16 పాయింట్ల నష్టంతో వద్ద, నిఫ్టీ ఒక పాయింట్ లాభంతో 8777 వద్ద క్లోజ్ అయింది. ప్రారంభంలో వంద పాయింట్లకు పైగా లాభపడిన సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. జపాన్ బ్యాంక్ ప్రకనటతో తిరిగి150 పాయింట్ల మేరకు లాభపడ్డాయి. ఇలా ఆరంభంనుంచి తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగిన మార్కెట్లు ఉన్నట్టుండి పెరిగిన అమ్మకాలతో మార్కెట్లు నష్టాలబాట పట్టాయి. చివరికి ఫ్లాట్ గా ముగిశాయి. ముఖ్యంగా ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ సెక్టార్ , ఎఫ్ఎంసీజీ సెక్టార్లు నష్టపోగా మెటల్స్, రియల్టీ, ఆటో రంగాలు మార్కెట్లను ఆదుకున్నాయి. , ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ బీఐ టాప్ లూజర్స్ గా నిలిచాయి. -
ఎయిర్ ఫ్యూరిఫయర్ వ్యాపారంలోకి యూనిలీవర్!
లండన్: ఎఫ్ఎంసీజీ దిగ్గజ కంపెనీ యూనిలీవర్ తాజాగా ఎయిర్ ఫ్యూరిఫయర్ వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నది. ఇందులో భాగంగా యూనిలీవర్ స్వీడన్‌కు చెందిన ఎయిర్ ఫ్యూరిఫికేషన్ సర్వీసులను అందించే ‘బ్లూఎయిర్’ కంపెనీని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది. బ్లూఎయిర్.. స్టాక్‌హోమ్ కేంద్రంగా తన కార్యకలాపాలను 1996లో ప్రారంభించింది. దీని టర్నోవర్ గతేడాది 106 మిలియన్ డాలర్లుగా ఉంది. -
300 పాయింట్ల నష్టంలో మార్కెట్లు
ముంబై: స్వల్ప లాభాలతో ప్రారంభమైన బుధవారం నాటి స్టాక్ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. మిడ్ సెషన్ నుంచీ అమ్మకాలు మరోసారి ఊపందుకోవడంతో దాదాపు 300 పాయింట్లకు పైగా నష్టపోయింది. 275 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, నిఫ్టీ 95 పాయింట్లనష్టంతో కొనసాగుతున్నాయి. దీంతో ఇప్పటికే 28,000 మైలురాయి దిగువకు చేరిన సూచీ తాజాగా 27,800 స్థాయిని కూడా కోల్పోయింది. అట నిఫ్టీ కూడా బాటలో 8600 స్థాయి దిగువకు పతనమైంది. ప్రధానంగా బ్యాంకింగ్, ఫార్మా, ఆటో, రియల్టీ రంగాలు దెబ్బకొడుతున్నాయి. సెలక్టెడ్ ఎఫ్ఎంసీజీ, ఐటీ, హెల్త్ కేర్, బ్యాంకింగ్ స్టాక్స్‌లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి. అయితే భారీ లాభాలతో టాటా కెమికల్స్ ఆల్ టైమ్ ని హైని తాకింది. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా క్యూ 1 లో రూ. 962 కోట్ల నికర లాభాలను నమోదు చేయడంతో 3 శాతానికి పైగా లాభ పడింది. అనంతరం నష్టాల్లోకి జారుకుని 2.09 నష్టంతో 1,450 దగ్గర ఉంది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ పాజిటివ్ గా ఉంది. ఈ ఏడాదిలో ఫెడరల్ రిజర్వు రేట్లను పెంచనున్న సంకేతాలు వెలువడుతుండటంతో, రూపాయి విలువ బలపడుతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. -
అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో మార్కెట్లు
ముంబై : స్వల్ప లాభాలతో ప్రారంభమైన బుధవారం నాటి స్టాక్ మార్కెట్లు, నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెలక్టెడ్ ఎఫ్ఎంసీజీ, ఐటీ, హెల్త్ కేర్, బ్యాంకింగ్ స్టాక్స్‌లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 54.91 పాయింట్లు కోల్పోయి 28,030 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 20.35 పాయింట్లు కోల్పోయి 8700 కీలక మార్కుకు దిగువన 8657 వద్ద ట్రేడ్ అవుతోంది. అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, మహింద్రా అండ్ మహింద్రా, కోల్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు టాప్ గెయినర్లుగా ఉండగా.. బీహెచ్ఈల్, గెయిల్, ఇన్ఫోసిస్, ఐటీసీ, టీసీఎస్ నష్టాలను చవిచూస్తున్నాయి. భారతీ ఇన్ఫ్రాటెల్ 1.7 శాతం పడిపోయి నిఫ్టీలో టాప్ లూజర్‌గా కొనసాగుతోంది. అయితే ప్రారంభంలో సెన్సెక్స్ 21 పాయింట్లు, నిఫ్టీ 2 పాయింట్లు లాభంలో ట్రేడ్ అయింది. అనంతరం అమ్మకాల ఒత్తిడి ప్రారంభం కావడంతో మార్కెట్లు పడిపోయాయి. కార్పొరేట్ ఆదాయాలపై ఇన్వెస్టర్ ఫోకస్ కొనసాగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆటో మేజర్ కంపెనీ మహింద్రా అండ్ మహింద్రా తన తొలి త్రైమాసిక ఫలితాలను నేడు విడుదల కానున్నాయి. అదేవిధంగా ఇండియన్ హోటల్స్, జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంకు, మింద కార్పొ, మదర్సన్ సుమీ, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ వంటి కంపెనీ ఫలితాలు కూడా నేడే రానున్నాయి. మరోవైపు ఆసియన్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 16పైసలు బలపడి 66.68గా ఓపెన్ అయింది. ఈ ఏడాదిలో ఫెడరల్ రిజర్వు రేట్లను పెంచనున్న సంకేతాలు వెలువడుతుండటంతో, రూపాయి విలువ బలపడుతుందని మార్కెట్ విశ్లేషకుడు ఎన్ఎస్ వెంకటేష్ చెప్పారు. నేటి ట్రేడింగ్‌లో డాలర్ మారకం విలువతో రూపాయి 66.85-67.05 మధ్య కొనసాగొచ్చని అంచనావేస్తున్నారు. -
క్యూ1 ఆర్థిక ఫలితాలు...
ఇమామి లాభం 35 శాతం డౌన్ ఎఫ్ఎంసీజీ కంపెనీ ఇమామి నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ1లో 35 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.87 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.57 కోట్లకు పడిపోయింది. నికర అమ్మకాలు మాత్రం రూ.537 కోట్ల నుంచి 20 శాతం వృద్ధి చెంది రూ.643 కోట్లకు పెరిగాయి. బీఎస్ఈలో ఇమామి షేర్ స్వల్పంగా పెరిగి రూ.1,148 వద్ద ముగిసింది. రామ్‌కో సిమెంట్స్ లాభం రూ.156 కోట్లు రామ్‌కో సిమెంట్స్ ఈ క్యూ1లో రూ.156 కోట్ల నికర లాభం(స్టాండోలోన్) సాధించింది. గత క్యూ1లో సాధించిన నికర లాభం రూ.99 కోట్లతో పోలిస్తే 57 శాతం వృద్ధి సాధించినట్లు సంస్థ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.947 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.972 కోట్లకు పెరిగింది. రామ్‌కో సిమెంట్స్ షేర్ బీఎస్ఈలో 3 శాతం క్షీణించి రూ.536 వద్ద ముగిసింది. బెర్జర్ పెయింట్స్ రూ.1 డివిడెండ్ బెర్జర్ పెయింట్స్ నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 55 శాతం వృద్ధి చెందింది. గత క్యూ1లో రూ.75 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.117 కోట్లకు పెరిగిందని బెర్జర్ పెయింట్స్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,126 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.1,246 కోట్లకు పెరిగింది. ప్రతి ఐదు షేర్లకు రెండు షేర్లను బోనస్‌గా ఇవ్వాలన్న ప్రతిపాదనకు వాటాదారులు ఆమోదం తెలిపారని వివరించింది. ఒక్కో షేర్‌కు రూ.1 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. బీఎస్ఈలో బెర్జర్ పెయింట్స్ షేర్ 2 శాతం క్షీణించి రూ.235కు పడిపోయింది. టాటా టెలి నష్టాలు మరింత పెరిగాయ్ టాటా టెలిసర్వీసెస్(మహారాష్ట్ర) నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మరింతగా పెరిగాయి. గత క్యూ1లో రూ.82 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ1లో రూ.127 కోట్లకు పెరిగాయని టాటా టెలి తెలిపింది. మొత్తం ఆదాయం రూ.751 కోట్ల నుంచి 2 శాతం క్షీణించి రూ.735 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ముంబై, గోవా టెలికం సర్కిళ్లలో ఈ కంపెనీ మొబైల్ సర్వీసులందజేస్తోంది. బీఎస్ఈలో కంపెనీ షేర్ ఒక శాతం తగ్గి రూ.6 వద్ద ముగిసింది. 30 శాతం పెరిగిన తాన్లా లాభం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో తాన్లా సొల్యూషన్స్ నికర లాభం క్రితంతో పోలిస్తే 30% పైగా పెరిగి రూ.4 కోట్లను నమో దు చేసింది. టర్నోవరు స్వల్పంగా తగ్గి రూ.102 కోట్ల నుంచి రూ.98 కోట్లకు వచ్చి చేరింది. గతి లాభం 20 శాతం అప్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎక్స్‌ప్రెస్ డిస్ట్రిబ్యూషన్, సప్లై చైన్ సేవల్లో ఉన్న గతి లిమిటెడ్ జూన్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం క్రితంతో పోలిస్తే 20 శాతం పెరిగి రూ.12 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ 2 శాతం అధికమై రూ.429 కోట్లకు చేరింది. ఎబిటా 8 శాతం ఎగసి రూ.37 కోట్లుగా ఉంది. -
మార్కెట్లోకి హావెల్స్ వాటర్ హీటర్లు
ధరలు రూ.11 వేల నుంచి రూ.14 వేలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీ హావెల్స్.. అత్యాధునిక శ్రేణికి చెందిన వాటర్ హీటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో ఉష్ణోగ్రతల స్థాయిని వెల్లడించేందుకు ఎల్ఈడీ ద్వారా రంగు మారేలా అధునాతన ఫీచర్‌ను పొందుపరిచింది. అంటే నీరు సాధారణం నుంచి గరిష్టంగా 75 డిగ్రీల వేడికి చేరినప్పుడు వాటర్ హీటర్ రంగు నీలం నుంచి జేగుర్ (అంబర్) రంగుకు మారుతుంది. అడోనియా సిరిస్ కింద డిజైన్ చేసిన ఈ హీటర్లు డిజిటల్ టెంపరేచర్ ఇండికేటర్లోనూ లభ్యమవుతాయని గురువారం విడుదల చేసిన ప్రకటనలో కంపెనీ తెలియజేసింది. వీటిని రాజస్థాన్‌లోని నిమ్రానా ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది. ధరలు రూ.11 వేల నుంచి రూ.14 వేల మధ్య ఉన్నాయి. -
పతంజలి బెంగ మాకు లేదు
రామ్ దేవ్ బాబా పతంజలి అమ్మకాల వృద్ధితో ఇతర ఎఫ్ఎమ్ సీజీ ప్లేయర్లు ఆందోళన చెందుతోంటే.. పరాగ్ మిల్క్ కంపెనీ మాత్రం ధీమాగా ఉంది. ముఖ్యంగా పతంజలి మిల్క్ ఉత్పత్తుల వల్ల తమకు అంతా మంచే జరుగుతుందని పరాగ్ మిల్క్ ఫుడ్స్ చెబుతోంది. మార్కెట్లో దూసుకుపోతున్న పతంజలి నుంచి తమకు ఎలాంటి ముప్పు ఉండదనీ , పైపెచ్చు తమ బిజినెస్ పెరగడానికి పతంజలి ఉత్పత్తులు దోహదం చేస్తున్నాయని పేర్కొంది. పుణేకు చెందిన విభిన్నమైన డెయిరీ ఉత్పత్తుల ఈ కంపెనీ, గోవర్థన్ బ్రాండ్ లో ఆవు పాలతో తయారుచేసిన నెయ్యిని విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలు లూజ్ అన్ బ్రాండెడ్, సమ్మిళిత నెయ్యి నుంచి ఆవు పాల నెయ్యి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, ఇది పతంజలితో పాటు తమకు ఎంతో సహకరిస్తుందని పరాగ్ మిల్క్ ఫుడ్స్ సీఎఫ్ఓ భరత్ కేడియా తెలిపారు. గేదె పాల నెయ్యి కంటే ఆవు పాల నెయ్యికి సాధారణంగా ప్రీమియం లభ్యమవుతుంటోంది. ధరల విషయంలో పతంజలి సంస్థ తమకు పోటీగా రావట్లేదని, కొన్నిసార్లు ఆ కంపెనీ ప్రొడక్ట్ లు తమ ధరలతో సమానంగా లేదా ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొంది. పతంజలి కంటే తక్కువ ధరలకే తమ ఆవు పాల నెయ్యి మార్కెట్లో లభ్యమవుతుందని కేడియా తెలిపారు. కంపెనీ సీఏజీఆర్(కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు) రెవెన్యూ వృద్ధి కూడా గడిచిన ఐదేళ్లలో 17 శాతం నమోదైందని చెప్పారు. అంతకముందు ఈ వృద్ధి 12-13 శాతంగా ఉంది. శుక్రవారం విడుదలైన జనవరి-మార్చి త్రైమాసిక రెవెన్యూ ఫలితాల్లో 20 శాతం వృద్ధిని తాము నమోదు చేశామని, ఆపరేటింగ్ మార్జిన్లను 120 బేసిక్ పాయింట్లను పెంచుకుని 9.7శాతంగా నమోదుచేసినట్టు కంపెనీ పేర్కొంది. -
కోల్గేట్ నుంచి సెన్సిటివ్ క్లోవ్ టూత్ పేస్ట్
హైదరాబాద్: ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్న కోల్గేట్ పామోలివ్ తాజాగా సెన్సిటివ్ క్లోవ్ టూత్‌పేస్ట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. లవంగం నూనె, పొటాషియం నైట్రేట్‌తో తయారైన ఈ ఉత్పాదన దంతాల్లోకి లోతుగా చేరుకుని సూక్ష్మ ప్రదేశాలను శుభ్రపరుస్తుందని కంపెనీ తెలిపింది. 80 గ్రాముల ప్యాక్ ధర రూ.105 ఉంది. -
కొత్త విభాగాల్లోకి తత్వ హెల్త్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్న తత్వ హెల్త్ అండ్ వెల్నెస్ కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. ఇటీవలే కేసరి బ్రాండ్ పేరుతో కుంకుమ పువ్వు అమ్మకాలను ప్రారంభించిన ఈ సంస్థ త్వరలో డ్రై ఫ్రూట్స్ విపణిలోకి ప్రవేశిస్తోంది. వివిధ దేశాల నుంచి నాణ్యమైన రకాలను సేకరించి ఇక్కడ విక్రయిస్తామని తత్వ హెల్త్ ఎండీ సచిన్ జైన్ తెలిపారు. సాఫ్రాన్ టీ, మిల్క్‌ను సైతం ప్రవేశపెడతామని చెప్పారు. హైదరాబాద్ మార్కెట్లో కేసరి బ్రాండ్ ఉత్పత్తులను విడుదల చేసిన సందర్భంగా నేషనల్ సేల్స్ మేనేజర్ కె.గురుప్రసాద్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. కుంకుమ పువ్వు అత్యధికంగా పండే ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుని దేశీయంగా విక్రయిస్తున్నట్టు తెలిపారు. దక్షిణాదిన కుంకుమ పువ్వును తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినియోగిస్తారని వివరించారు. భారత్‌లో సాఫ్రాన్ అమ్మకాల్లో 70-80 శాతం నకిలీదేనని అన్నారు. కశ్మీర్లో ఈ ఉత్పాదన సాగు పెంచేందుకు స్పైస్ బోర్డ్‌కు ప్రతిపాదన చేశామన్నారు. -
వరుస లాభాలకు బ్రేక్..
♦ 257 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ♦ నిఫ్టీ 69 పాయింట్లు డౌన్ ♦ అంతర్జాతీయ ట్రెండ్ ప్రభావం ♦ ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు ముంబై: అంతర్జాతీయ ట్రెండ్ ప్రభావంతో భారత్ మార్కెట్ వరుసలాభాలకు బ్రేక్‌పడింది. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 257 పాయింట్లు పతనమై 26,763 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇంత భారీగా క్షీణించడం మూడు వారాల్లో ఇదే ప్రధమం. ఎన్ఎస్ఈ నిఫ్టీ 69 పాయింట్ల క్షీణతతో 8,204 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. వచ్చేవారం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సమీక్షా సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు బలహీనపడినందున, ఇక్కడ లాభాల స్వీకరణ జరిగిందని విశ్లేషకులు చెప్పారు. ప్రధాన ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, తైవాన్లకు సెలవుకాగా, జపాన్, సింగపూర్ సూచీలు క్షీణతతో ముగియడం, యూరప్ సూచీలు 1 శాతం తగ్గుదలతో ప్రారంభంకావడం భారత్ మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. ఇన్ఫోసిస్ దెబ్బ... ప్రపంచ ట్రెండ్‌కు తోడు ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లాభాలపై వార్నింగ్ ఇవ్వడం కూడా సూచీల భారీ క్షీణతకు కారణం. ఆ షేరు గ్యాప్‌డౌన్‌తో మొదలుకావడంతో మిగతా ఐటీ షేర్లు కూడా బలహీనపడ్డాయి. అధిక వీసా వ్యయాలు, వేతనాల భారంతో క్యూ1లో తమ లాభాల మార్జిన్లు 2% వరకూ తగ్గవచ్చంటూ ఇన్ఫోసిస్ ప్రకటించింది. దీంతో ఈ షేరు 4 శాతంపైగా క్షీణించి రూ. 1,185 వద్ద ముగిసింది. టీసీఎస్ 1.5 శాతం తగ్గింది. మరోవైపు ఇటీవల జోరుగా పెరిగిన ఎఫ్ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. దాంతో ఐటీసీ, హిందుస్తాన్ యూనీలీవర్‌లు 2-3% మధ్య తగ్గాయి. డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ,బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 1-2% మధ్య పడిపోయాయి. ఇక కోల్ ఇండియా, ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, సిప్లాలు 1-2% మధ్య పెరిగాయి. -
వెలుగులో ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు
♦ బ్యాంకింగ్, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ ♦ స్వల్పంగా పెరిగిన స్టాక్ సూచీలు ముంబై: ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లలో తాజా కొనుగోళ్లు జరగడంతో బుధవారం స్టాక్ సూచీలు స్వల్పంగా పెరిగాయి. క్యూ4లో జీడీపీ వృద్ధి రేటు మార్కెట్ అంచనాల్ని మించి 7.9 శాతం నమోదుకావడంతో ట్రేడింగ్ ప్రారంభంలో సూచీలు వువ్వెత్తున ఎగిసాయి. అటుతర్వాత బ్యాంకింగ్, పీఎస్‌యూ, మెటల్ షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభంలో 150 పాయింట్ల మేర పెరిగి 25,857 పాయింట్ల గరిష్టస్థాయికి చేరింది. కానీ చివరకు 46 పాయింట్ల పెరుగుదలతో 26,714 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోసారి 8,200 పాయింట్ల స్థాయిని దాటిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 20 పాయింట్ల పెరుగుదలతో 8,180 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సమీప భవిష్యత్తులో మార్కెట్ కన్సాలిడేట్ అవుతుందని, తీవ్రంగా క్షీణించే ప్రమాదం లేదని విశ్లేషకులు చెప్పారు. జీడీపీ వేగంగా వృద్ధిచెందడం, కార్పొరేట్ల ఫలితాలు మెరుగ్గా వుండటంతో భారత్ మార్కెట్ మరింత ఆకర్షణీయంగా మారిందని మోర్గాన్‌స్టాన్లీ విశ్లేషకుడు జోనాథన్ గార్నర్ అన్నారు. వర్థమాన మార్కెట్ల నుంచి భారత్ విడివడిందని, ఫెడ్ వడ్డీ రేటు పెంపు ప్రభావం భారత్‌పై పెద్దగా వుండదని ఆయన వివరించారు. సెన్సెక్స్ 30 షేర్లలో 14 షేర్లు లాభపడగా, 16 క్షీణతతో ముగిసాయి. పెరిగిన షేర్లలో ఐటీసీ, హెచ్‌యూఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఆదాని పోర్ట్స్, ఆసియన్ పెయింట్స్, భారతి ఎయిర్టెల్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, లుపిన్లు వున్నాయి. తగ్గిన షేర్లలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, బీహెచ్ఈఎల్, టాటా మోటార్స్, సిప్లా, వేదాంతలు వున్నాయి. ప్రధాన ఆసియా మార్కెట్లలో తైవాన్ మినహా మిగిలినవన్నీ స్వల్పంగా తగ్గాయి. మార్చికల్లా 30,000 పాయింట్లకు సెన్సెక్స్: మోర్గాన్‌స్టాన్లీ ముంబై: రానున్న నెలల్లో ప్రపంచ మార్కెట్లను అధిగమించి భారత్ స్టాక్ మార్కెట్ పెరుగుతుందని, వచ్చే ఏడాది మార్చికల్లా బీఎస్ఈ సెన్సెక్స్ 30,000 పాయింట్ల స్థాయిని తిరిగి చేరుకుంటుందని ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. బుల్ మార్కెట్ కొనసాగితే మార్చికి సూచీ 30,000 పాయింట్లకు పెరుగుతుందని, లేదంటే కనీసం 27,500 పాయింట్ల వరకూ చేరవచ్చన్నది అంచనావేస్తున్నట్లు మోర్గాన్ స్టాన్లీ ఇండియా ఈక్విటీ హెడ్ రిథిమ్ దేశాయ్ బుధవారంనాడిక్కడ మీడియాకు చెప్పారు. 2015 మార్చిలో 30,028 పాయింట్ల చరిత్రాత్మక గరిష్టస్థాయిని చేరిన సెన్సెక్స్, అప్పటి నుంచి కరెక్షన్కు లోనవుతున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ల ఫలితాలు మెరుగుపడటం, వడ్డీ రేట్ల కోతలు, కార్పొరేట్ రుణ పరిస్థితి మరింత హీనమయ్యే అవకాశం లేకపోవడం వంటి అంశాలతో భారత్ మార్కెట్ ఇతర ప్రపంచ మార్కెట్లకంటే జోరు చూపిస్తుందని ఆయన అన్నారు. -
హెచ్‌యూఎల్ లాభం రూ.1,090 కోట్లు
♦ స్వల్పంగా పెరిగిన నికర అమ్మకాలు ♦ ఒక్కో షేర్‌కు రూ.9.5 తుది డివిడెండ్ న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం, హిందుస్తాన్ యునిలివర్(హెచ్‌యూఎల్) గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,090 కోట్ల నికర లాభం (స్టాండోలోన్)ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) నాలుగో క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం(రూ.1,018 కోట్లు)తో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని హిందుస్తాన్ యునిలివర్ పేర్కొంది. ఇక నికర అమ్మకాలు రూ.7,555 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.7,809 కోట్లకు పెరిగాయని హెచ్‌యూఎల్ చైర్మన్ హరిశ్ మన్వాణి చెప్పారు. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేర్‌పై గత ఆర్థిక సంవత్సరానికి రూ.9.5 తుది డివిడెండ్‌ను చెల్లించనున్నామని పేర్కొన్నారు. కాగా గత ఏడాది నవంబర్‌లో ఒక్కో షేర్‌కు రూ.6.5 మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించామని వివరించారు. పలు విభాగాల్లో రెండంకెల వృద్ధి: పలు సమస్యలు, ప్రతి ద్రవ్యోల్బణ వ్యయ వాతావరణంలోనూ మంచి పనితీరు కనబరిచామని హరిశ్ చెప్పారు. దేశీయ కన్సూమర్ బిజినెస్ 4 శాతం వృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఎక్సైజ్ సుంకం ప్రోత్సాహకాలను ప్రభుత్వం తొలగించడం, ధరలను స్వల్పంగా తగ్గించడం వంటి అంశాల వల్ల వృద్ధి కొంత దెబ్బతిన్నదని వివరించారు. వ్యయాలు రూ.6,428 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.6,566 కోట్లకు పెరిగాయని, తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ2, క్యూ3లలో నికర లాభం క్షీణించినా, క్యూ4లో మాత్రం స్వల్పవృద్ధితో నికర లాభం పెరిగిందని హరిశ్ పేర్కొన్నారు. క్యూ4లో సబ్బులు, డిటర్జెంట్ల సెగ్మెంట్ ఆదాయం రూ.3,674 కోట్ల నుంచి 2 శాతం వృద్ధితో రూ.3,753 కోట్లకు పెరిగిందని తెలిపారు. కమోడిటీ ధరలు తగ్గడంతో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందించడంలో భాగంగా ఈ సెగ్మెంట్ ఉత్పత్తుల ధరలను తగ్గించామని వివరించారు. ఇక వ్యక్తిగత ఉత్పత్తుల విభాగం ఆదాయం రూ.2,250 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.2,312 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. పానీయాల విభాగంలో ఆదాయం రూ.976 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.1,036 కోట్లకు పెరిగిందని తెలిపారు. లిప్టన్ గ్రీన్ టీ పటి ష్టమైన వృద్ధిని సాధించగా, బ్రూ కాఫీ రెండంకెల వృద్ధిని సాధించిందని తెలిపారు. ప్యాకేజ్డ్ ఫుడ్స్ విభాగం ఆదాయం రూ.477 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.533 కోట్లకు పెరిగిందని వివరించారు. కెచప్‌లు, జామ్‌లకు సంబంధించిన కిసాన్ బ్రాండ్, ఇన్స్టంట్ సూప్... నోర్ ఉత్పత్తుల విక్రయాలు మంచి వృద్ధిని సాధించాయని పేర్కొన్నారు. రివర్స్ ఆస్మోసిస్ సెగ్మెంట్లో ప్యూర్ ఇట్ బ్రాండ్ రెండంకెల వృద్ధి సాధించిందన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేర్ రూ.840-869 కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 0.8 శాతం నష్టంతో రూ.846 వద్ద ముగిసింది. -
దక్షిణాదిలో హావెల్స్ తొలి ప్లాంట్
♦ 50 ఎకరాల్లో బెంగళూరులో ఏర్పాటు ♦ రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి ♦ స్మార్ట్ సొల్యూషన్స్ విభాగంలోకి ప్రవేశం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎఫ్ఎంసీజీ విభాగంలో ఉన్న హావెల్స్ ఇండియా... దక్షిణాదిలో తన తొలి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. రూ.వెయ్యి కోట్లకు పైగా పెట్టుబడితో బెంగళూరు శివార్లలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. 50 ఎకరాల్లో రానున్న ఈ ప్లాంట్‌లో స్మార్ట్ ఉపకరణాలను తయారు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. కర్ణాటక ప్రభుత్వం నుంచి సింగిల్ విండో విధానంలో ప్లాంట్ నిర్మాణ అనుమతులు కూడా మంజూరైనట్లు తెలియవచ్చింది. ఈ ప్లాంట్ ఏర్పాటు ద్వారా సుమారు 3 వేల మందికి నేరుగా ఉద్యోగాలు రానున్నాయి. ప్రస్తుతం హావెల్స్ సంస్థ హావెల్స్, క్యాబ్ట్రీ, స్టాండర్డ్, సిల్వేనియా బ్రాండ్ల పేరిట ఎల్ఈడీ లైట్లు, ఫ్యాన్లు, మోటార్లు, స్విచ్చులు.. ఇలా 17 రకాల వ్యాపార విభాగాల్లో ఉత్పత్తులను తయారు చేస్తోంది. ప్రస్తుతం హావెల్స్ సంస్థకు 7 ప్రాంతాల్లో 12 ప్లాంట్లున్నాయి. దేశంలో హరిద్వార్, బద్ది, నోయిడా, సాహిబాబాద్, ఫరీదాబాద్, అల్వార్, నిమ్రానా ప్రాంతాల్లో తయారీ యూనిట్లున్నాయి. గతేడాది మార్చి నాటికి హావెల్స్ ఇండియా రూ.8 వేల కోట్ల టర్నోవర్‌ను చేరుకుంది. స్మార్ట్ సొల్యూషన్ విభాగంలోకి... ఇంటిగ్రేటెడ్ ఆటోమేషన్, స్మార్ట్ సొల్యూషన్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు హావెల్స్ ఇండియా ప్రకటించింది. అంటే మొబైల్ యాప్ ద్వారా ఎలక్ట్రికల్ ఉపకరణాలను నియంత్రించే వీలుంటుందన్నమాట. హావెల్స్ బ్రాండ్లలో ఒకటైన క్యాబ్ట్రీ ఉపకరణాలతో ఈ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నామని, డొమెస్టిక్, కమర్షియల్ రెండు విభాగంల్లోనూ ఇవి లభ్యమవుతాయని హావెల్స్ ఇండియా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ యాదవ్ శుక్రవారమిక్కడ విలేకరులతో చెప్పారు. ప్రముఖ ఆటోమేషన్ కంపెనీ హెచ్డీఎల్తో ఒప్పందం చేసుకొని ఈ ఉపకరణాలను తయారు చేస్తున్నట్లు చెప్పారాయన. ‘‘దేశంలో మొత్తం ఆటోమేషన్, స్మార్ట్ సొల్యూషన్ పరిశ్రమ విలువ వార్షికంగా రూ.వెయ్యి కోట్ల వరకూ ఉంది. దీన్లో 10 శాతం మార్కెట్ వాటాను లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే రూ.100 కోట్ల ఆదాయం ఆర్జించాలనేది ఈ ఏడాది మా లక్ష్యం’’ అని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకునే ఉపకరణాలకు మంచి డిమాండ్ ఉంటుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ పంకజ్, ఆటోమేషన్ ప్రొడక్ట్స్ హెడ్ మనీశ్, కార్పొరేట్ కమ్యూనికేషన్ హెడ్ అనిల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎఫ్ఎంసీజీల ‘వరుణ’ యాగం!
ఈ ఏడాది సాధారణ వర్షపాతం అంచనాలపై ఆశలు... గ్రామీణ డిమాండ్‌తో అమ్మకాలు పెంచుకునే ప్రణాళికలు రెండేళ్లుగా సరిగ్గా వర్షాలు కురవక కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న తరుణంలో వరుణుడి కరుణ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్న వైనం ఒకవైపు. కార్పొరేట్లు కూడా ఇప్పుడు వర్షాల కోసమే వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కరువు కారణంగా అమ్మకాలు తగ్గి.. తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ఎఫ్‌ఎఫ్‌సీజీ కంపెనీలు(సబ్బులు, పేస్టులు, బిస్కెట్లుతదితర వేగంగా అమ్ముడయ్యే వినియోగ ఉత్పత్తుల తయారీదార్లు) వర్షాలపై చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఈసారి సాధారణ వర్షపాతం(రుతుపవనాలు) నమోదవుతుందని భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో రెండేళ్లుగా నిద్రాణంగా ఉన్న గ్రామీణ డిమాండ్ తమ అమ్మకాల వృద్ధిని పెంచుతుందని భావిస్తున్నాయి. అంతా చెబుతున్నట్లు వరుణుడు గనుక కరుణిస్తే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో తమ అమ్మకాలు పుంజుకోవడం ఖాయమనేది మారికో, డాబర్, గోద్రెజ్ కన్సూమర్ వంటి ఎఫ్‌ఎఫ్‌సీజీ కంపెనీల అభిప్రాయం. అమ్మకాలపై కరువు కాటు... వరుసగా రెండేళ్లు కరువు పరిస్థితుల కారణంగా గ్రామీణ భారతంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి.. తమ గ్రామీణ అమ్మకాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని గోద్రెజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్(జీసీపీఎల్) బిజినెస్ హెడ్(భారత్, సార్క్ దేశాలు) సునీల్ కటారియా పేర్కొన్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు తీవ్ర కరువును ఎదుర్కొంటున్నాయి. కొన్నిచోట్ల గుక్కెడు నీటికి కూడా కటకటలాడుతున్న పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. గతేడాది వర్షాలు అరకొరగానే కురవడంతో తమ పల్లె ప్రాంతాల్లో వృద్ధి తీవ్రంగా మందగించిందని.. ఇది అక్కడ డిమాండ్‌ను కూడా పడిపోయేలా చేసిందని డాబర్ ఇండియా సీఎఫ్ఓ లలిత్ మాలిక్ చెప్పారు. రెండేళ్లుగా వరుస కరువును ఎదుర్కొన్న కొన్ని రాష్ట్రాల్లో స్వల్పకాలానికి గ్రామీణ వినియోగం పెద్దగా పుంజుకొనే అవకాశం లేదని మారికో ఎండీ, సీఈఓ సౌగత గుప్తా వ్యాఖ్యానించారు. కరువుతో పాటు పంటలకు ధరలు కూడా తగ్గడంతో 2011-14 మధ్య మొత్తం గ్రామీణ డిమాండ్ తీవ్రంగా తగ్గిందని కటారియా చెబుతున్నారు. తమ మొత్తం అమ్మకాల్లో 30 శాతం వాటా గ్రామీణ మార్కెట్‌దే కావడంతో ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురుస్తాయన్న అంచనాలు నిజమవ్వాలని ఎఫ్ఎంసీజీ కంపెనీలు కోరుకుంటున్నాయి. భారత వాతావరణ శాఖ ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసిన విషయం విదితమే. డిమాండ్ ఉంది, కానీ... జూన్-సెప్టెంబర్ కాలంలో సాధారణ రుతుపవనాలు వస్తే గనుక.. ద్వితీయార్థంలో వినియోగదారుల సెంటిమెంట్ పుంజుకోవడంతోపాటు తమ అమ్మకాల్లో కూడా ఇది ప్రతిబింబిస్తుందని కటారియా అభిప్రాయపడ్డారు. మరోపక్క, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టడానికి ప్రభుత్వం తాజా బడ్జెట్లో తీసుకున్న చర్యలు కూడా ఈ ఏడాది రానున్న రోజుల్లో ఎఫ్ఎంసీజీ అమ్మకాలను పెంచనుందని ఆయన పేర్కొన్నారు. ‘వాస్తవానికి గ్రామీణ భారతంలో డిమాండ్ నిద్రాణ స్థితిలో ఉంది. చేతిలో తగినంతగా సొమ్ము లేకపోవడంతో ప్రజలు తమ కొనుగోళ్లను వాయిదావేసుకుంటూ వస్తున్నారు. అయితే, కొనాలన్న ఆకాంక్ష మాత్రం పోలేదు. అందుకే ఈ సారి వర్షాలు సరిగ్గా కురవడం చాలా కీలకం కానుంది. రుతుపవనాలు బాగుంటే డిమాండ్ ఒక్కసారిగా ఎగబాకి, అమ్మకాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది’ అని కటారియా విశ్లేషించారు. ఈ అంచనాల నేపథ్యంలో గ్రామీణ భారత్‌లో తమ పంపిణీ పరిధిని కూడా భారీగా పెంచే పనిలో డాబర్ ఉంది. ప్రస్తుతం 14,000 గ్రామాలకు కంపెనీ పంపిణీ నెట్వర్క్ ఉండగా, దీన్ని 45,000 గ్రామాలకు చేర్చే ప్రక్రియ కొనసాగుతున్నట్లు డాబర్ సీఎఫ్ఓ మాలిక్ పేర్కొన్నారు. సవాళ్లు నెలకొన్నప్పటికీ, తాము కూడా వినూత్న ఉత్పత్తులతో గ్రామీణ మార్కెట్లో వాటా పెంచుకోవడంపై దృష్టిసారిస్తూనే ఉన్నామని కటారియా వెల్లడించారు. -
ఉత్పత్తి ఆగినా.. సరిపడినంత సరుకుంది: ఐటీసీ
న్యూఢిల్లీ: ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ మార్కెట్లో సరిపడినంత సిగరెట్ స్టాక్ అందుబాటులో ఉందని ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ పేర్కొంది. పొగాకు ఉత్పత్తుల ప్యాకేజింగ్ స్పేస్‌లో 85 శాతాన్ని పెద్ద పెద్ద హెచ్చరిక గుర్తుల ప్రదర్శనకు ఉపయోగించాలనే కొత్త నిబంధనల (ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వ చ్చాయి) నేపథ్యంలో ఐటీసీ కంపెనీ తన ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. నిబంధనల అమలుకు ఇంకా తాము సంసిద్ధమవ్వలేదని, ఈ అంశంపై స్పష్టత వచ్చే వరకు ఫ్యాక్టరీలు కార్యకలాపాలు జరగవని ఐటీసీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. హెచ్చరిక గుర్తుల ప్యాకేజింగ్ స్పేస్ సగటు అంతర్జాతీయంగా 31 శాతంగా, టాప్-5 పొగాకు ఉత్పత్తి దేశాల్లో (చైనా, బ్రె జిల్, అమెరికా, మలావి, జింబాంబ్వే) 20%గా ఉందని తెలిపారు. -
ఐటీసీ చేతికి టెక్నికో ఆగ్రి సైన్సెస్
డీల్ విలువ రూ.121 కోట్లు కోల్‌కతా: బయోటెక్నాలజీ వ్యాపార సంస్థ అయిన టెక్నికో ఆగ్రి సెన్సైస్ ఇండియా(టెక్నికో ఇండియా) కంపెనీని ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ కొనుగోలు చేసింది. టెక్నికో ఆగ్రి సెన్సైస్‌కు చెందిన పూర్తి ఈక్విటీ వాటాను ఆస్ట్రేలియాకు చెందిన టెక్నికో పీటీవై లిమిటెడ్ నుంచి రూ.121 కోట్లకు కొనుగోలు చేశామని ఐటీసీ కంపెనీ బీఎస్ఈకి నివేదించింది. ఈ వాటా కొనుగోలు కారణంగా ఇప్పటిదాకా టెక్నికో పీటీవై లిమిటెడ్‌కు అనుబంధ కంపెనీగా ఉన్న టెక్నికో ఇండియా ఇక నుంచి ఐటీసీ అనుబంధ కంపెనీగా మారుతుందని వివరించింది. ఈ కంపెనీ కొనుగోలు వల్ల తమ వ్యాపారం మరింతగా మెరుగవుతుందని, నిర్వహణ సామర్థ్యాలు కూడా పెరుగుతాయని ఐటీసీ వెల్లడించింది. -
‘విక్స్ యాక్షన్ 500 ఎక్స్ ట్రా’ విక్రయాలు బంద్
న్యూఢిల్లీ: దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందటానికి తరుచూ ఉపయోగించే ‘విక్స్ యాక్షన్ 500 ఎక్స్ట్రా’ ఇక మెడికల్ షాపుల నుంచి కనుమరుగు కానున్నది. ఎఫ్ఎంసీజీ సంస్థ ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ (పీ అండ్ జీ) తన ప్రముఖ బ్రాండ్ ‘విక్స్ యాక్షన్ 500 ఎక్స్ట్రా’ తయారీ, అమ్మకాలను తక్షణం నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం 344 ఫిక్డ్స్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్‌పై నిషేధించిన నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. -
మార్కెట్లకు చేదు మాత్ర..
ఫార్మా, ఎఫ్ఎంసీజీ స్టాక్స్‌లో అమ్మకాలు ♦ సెన్సెక్స్ 253 పాయింట్లు, ♦ నిఫ్టీ 78 పాయింట్లు డౌన్ ముంబై: హెల్త్‌కేర్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్‌లో లాభాల స్వీకరణతో దేశీ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలు చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఆరువారాల గరిష్టం నుంచి 253 పాయింట్లు కోల్పోయి 24,551కి పతనమైంది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా కీలకమైన 7,500 పాయింట్ల కన్నా దిగువకు పడిపోయింది. 78 పాయింట్ల నష్టంతో 7,461 వద్ద క్లోజయ్యింది. క్రితం రోజున వెలువడిన సానుకూల ద్రవ్యోల్బణ గణాంకాలు సైతం మార్కెట్‌కు ఊతమివ్వలేకపోయాయి. గోవా ప్లాంటులో ఔషధాల తయారీలో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి అమెరికా ఎఫ్‌డీఏ నుంచి నోటీసులతో లుపిన్ షేరు ఏకంగా 7.59 శాతం క్షీణించింది. ఇక కీలకమైన ఔషధాల విక్రయాలపై నిషేధం కారణంగా ఫైజర్ షేర్లపై ఒత్తిడి కొనసాగింది. కంపెనీ షేర్లు మరో 3.15% తగ్గాయి. ప్రొక్టర్ అండ్ గాంబుల్ షేరు కూడా 2.21% పడింది. ఈ పరిణామాలతో హెల్త్‌కేర్ సూచీ 3%క్షీణించింది. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు ఒక మోస్తరుగానే ట్రేడయ్యాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్ తమ దేశ ఆర్థిక వ్యవస్థపై నిరాశాజనక అంచనాలు వెలువరించడంతో ఆసియా మార్కెట్లు బలహీనపడ్డ ప్రభావాలు.. యూరప్ మార్కెట్లపైనా కనిపించాయి. నేడు హెచ్‌సీజీ పబ్లిక్ ఇష్యూ... క్యాన్సర్ కేర్ నెట్వర్క్ సంస్థ హెల్త్‌కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ (హెచ్‌సీజీ) దాదాపు రూ. 650 కోట్ల సమీకరణ కోసం తలపెట్టిన ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) బుధవారం ప్రారంభం కానుంది. మార్చి 18న ముగిసే ఐపీవోకు సంబంధించి ప్రైస్ బ్యాండ్‌ను రూ. 205-218 శ్రేణిలో కంపెనీ నిర్ణయించింది. గరిష్ట స్థాయిలో కంపెనీ రూ. 650 కోట్లు సమీకరించవచ్చు. -
డెయిరీ మార్కెట్లోకి ఐటీసీ!
ముంబై: సిగరెట్లు, వంటనూనెలు, సబ్బులు, బిస్కెట్లు వంటి తదితర ఉత్పత్తులను తయారుచేసే ఎఫ్ఎంసీజీ దిగ్గజ కంపెనీ ఐటీసీ డెయిరీ మార్కెట్లోకి అడుగు పెడుతోంది. త్వరలో నెయ్యితో తమ తొలి డెయిరీ ప్రాడక్ట్‌ను మార్కెట్లోకి తీసుకువస్తామని ఐటీసీ ఎఫ్ఎంసీజీ బిజినెస్ ప్రెసిడెంట్ సంజీవ్ పూరి తెలిపారు. నెయ్యి తర్వాత పాలు, వెన్న, జున్ను, చాక్లెట్స్ వంటి ఉత్పత్తులను కూడా వినియోగదారులకు అందిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే డెయిరీ ప్రొడక్షన్ విస్తరణకు అనువైన ప్రాంతాలను గుర్తించామన్నారు. రానున్న కాలంలో ఐటీసీ ఫుడ్ ప్రాడక్ట్స్‌పై రూ.25,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనుందని తెలిపారు. -
హెచ్‌యూఎల్‌కు గ్రామీణ మార్కెట్ల దెబ్బ
♦ నికర లాభంలో స్వల్ప వృద్ధి ♦ 5 శాతం పెరిగిన అమ్మకాలు న్యూఢిల్లీ : ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనిలివర్ నికర లాభంపై గ్రామీణ మార్కెట్లలో డిమాండ్ లేకపోవడం ప్రభావం చూపించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలానికి రూ.1,059 కోట్ల నికర లాభం(స్టాండోలోన్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.1,057 కోట్ల నికర లాభం సాధించామని వివరించింది. గ్రామీణ మార్కెట్లో డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండడం వల్ల నికర లాభంలో పెద్ద మార్పు లేదని పేర్కొంది. అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే 4 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. గత క్యూ1లో రూ.7,571 కోట్లుగా ఉన్న నికర అమ్మకాలు 5 శాతం వృద్ధితో రూ.7,973 కోట్లకు పెరిగాయని వివరించింది. మందగమనంగా ఉన్న పరిస్థితుల్లో కూడా పట్టణ ప్రాంతాల్లో అమ్మకాలు ఆరోగ్యకరంగా ఉన్నాయని కంపెనీ చైర్మన్ హరీష్ మన్వాని చెప్పారు. నిర్వహణ మార్జిన్లు మెరుగుపడ్డాయని తెలిపారు. గ్రామీణ మార్కెట్లు పుంజుకోవడం, కమోడిటీ ధరలు ప్రస్తుతమున్న స్థాయిల్లోనే ఉండడం వంటి అంశాలపై భవిష్యత్ అమ్మకాలు ఆధారపడి ఉన్నాయని వివరించారు. లాభదాయకతను కొనసాగించడానికి వ్యయాలను నియంత్రించడం, మార్కెట్ అభివృద్ధి వంటి అంశాలపై దృష్టిసారిస్తున్నామని కంపెనీ సీఎఫ్ఓ పి. బి. బాలాజీ పేర్కొన్నారు. తమ మొత్తం అమ్మకాల్లో గ్రామీణ అమ్మకాలు 35 శాతమని వివరించారు. గత నెలలో మార్కెట్ల నుంచి ఉపసంహరించిన నోర్ బ్రాండ్ ఇన్స్టంట్ నూడుల్స్‌ను తగిన ఆమోదాలు పొందిన తర్వాత మళ్లీ మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ కంపెనీ షేర్ 2.3 శాతం క్షీణించి రూ.891 వద్ద ముగిసింది. -
సెన్సెక్స్‌కు 114 పాయింట్లు నష్టం
♦ వరుసగా మూడో రోజూ నష్టాల్లోనే ♦ 34 పాయింట్లు నష్టపోయి 8,329కు నిఫ్టీ అంతర్జాతీయ మార్కెట్లు రికవరీ బాట పట్టినప్పటికీ మన స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల్లోనే ముగిసింది. వరుసగా మూడో రోజు కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 114 పాయింట్లు నష్టపోయి 27,574 పాయింట్ల వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 8,329 పాయింట్ల వద్ద ముగిశాయి. వాహన, ఆయిల్, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోగా, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా షేర్ల నుంచి మార్కెట్‌కు మద్దతు లభించింది. క్యాపిటల్ గూడ్స్ షేర్ల జోరు... మే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నేడు(శుక్రవారం) వెలువడనున్న నేపథ్యంలో భెల్, ఎల్ అండ్ టీ తదితర క్యాపిటల్ గూడ్స్ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, హీరోమోటొకార్ప్, భారతీ ఎయిర్టెల్, లుపిన్ షేర్లు లాభాల బాట పట్టాయి. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో టీసీఎస్ షేర్‌తో పాటు ఇతర ఐటీ షేర్లు-ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కూడా తగ్గాయి. వేదాంత టాటా మోటార్స్ , బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, ఎన్టీపీసీలు 1-5 శాతం రేంజ్లో తగ్గాయి. చైనా షాంఘై ఎక్స్ఛేంజ్ రికవరీ ఆసియా మార్కెట్లను బుధవారం వణికించిన చైనా షాంగై ఇండెక్స్ గురువారం శాంతించింది. ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలతో ఈ సూచీ 5.6% లాభపడింది. ఈ సూచీ ఒక్క రోజు ఇంత పెరగడం ఆరేళ్లలో ఇదే మొదటిసారి. మూడు వారాల్లో ఇన్వెస్టర్లు 3.2 లక్షల కోట్ల డాలర్లు నష్టపోయిన ఉదంతంపై దర్యాప్తు జరుపుతామని ప్రభుత్వం ప్రకటించడం ప్రభావం చూపింది. -
మళ్లీ 28 వేలు దాటిన సెన్సెక్స్
వరుసగా మూడో వారమూ లాభాల్లో స్టాక్ మార్కెట్ - 147 పాయింట్ల లాభంతో 28,093 పాయింట్లకు సెన్సెక్స్ - 40 పాయింట్ల లాభంతో 8,485 పాయింట్లకు నిఫ్టీ బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ షేర్ల దన్నుతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల బాట పట్టింది. బీఎస్ఈ సెన్సెక్స్ మళ్లీ 28,000 పాయింట్ల పైన ముగిసింది. భారీగా నిధులు ఖర్చయ్యే స్కీమ్‌లను ప్రభుత్వం ప్రకటించడం, ఆర్థిక వ్యవస్థ పట్ల ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆశావహ వ్యాఖ్యలు సెంటిమెంట్‌కు ఊపునిచ్చాయి. సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 28,093 పాయింట్ల వద్ద, నిఫ్టీ 40 లాభపడి 8,485 పాయింట్ల వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయిమారకం బలపడడం కూడా ప్రభావం చూపింది. గ్రీస్ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై పెద్దగా ఉండకపోవచ్చన్న అంచనాలతో ట్రేడింగ్ చివరి వరకూ కొనుగోళ్లు జరిగాయి. అయితే చైనా మార్కెట్ పతనం కారణంగా లోహ, మైనింగ్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆద్యంతం ఒడిదుడుకులు... సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైనప్పటికీ, పై స్థాయిల్లో లాభాల స్వీకరణ, ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం వంటి కారణాల వల్ల తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. ఇంట్రాడేలో 28,135 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ చివరకు 147 పాయింట్ల లాభంతో 28,093 పాయింట్ల వద్ద ముగిసింది. 8,424-8,498 పాయింట్ల కనిష్ట, గరిష్ట స్థాయిల మధ్య కదలాడిన నిఫ్టీ చివరకు 40 పాయింట్ల లాభంతో 8,485 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారంలో సెన్సెక్స్ 281 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. స్టాక్ మార్కెట్ సూచీలు చెరో 1 శాతం లాభపడ్డాయి. వరుసగా మూడో వారమూ స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. లాభ నష్టాల్లో... 30 సెన్సెక్స్ షేర్లలో 20 షేర్లు లాభాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ 2.5%లాభపడింది. సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా పెరిగిన షేర్ ఇదే. ఇదే బాటలో హీరోమోటొకార్ప్ 1.7%, లుపిన్ 1.6%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.6%, భెల్ 1%, టీసీఎస్ 0.9%, ఎన్టీపీసీ 0.8%, బజాజ్ ఆటో 0.7%, సిప్లా 0.7%, యాక్సిస్ బ్యాంక్ 0.6%, ఎల్ అండ్ టీ 0.6%, ఎస్బీఐ 0.5 % చొప్పున పెరిగాయి. వేదాంత 1.9 శాతం, కోల్ ఇండియా 1.6 శాతం, టాటా స్టీల్ 1.1 శాతం, విప్రో0.9 శాతం, టాటా మోటార్స్ 0.7 శాతం, హిందాల్కో 0.5 శాతం, గెయిల్ 0.5 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.3 శాతం చొప్పున తగ్గాయి. 1,526 షేర్లు లాభాల్లో, 1,454 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,363 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.12,976 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,47,281 కోట్లుగా నమోదైంది. బజాజ్ ఫైనాన్స్.. నెలలో 30 శాతం అప్... బజాజ్ ఫైనాన్స్ బీఎస్ఈలో ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిని(రూ.5,596) తాకిం ది. నెలలో ఈ షేర్ 30% ఎగసింది. గత నెల 3న రూ.4,317 వద్ద ఉన్న ఈ షేర్ ఈ నెల 3న రూ. 5,557 వద్ద ముగిసింది. గత నెలలో ఈ కంపెనీ క్విప్ విధానంలో 32.7 లక్షల ఈక్విటీ షేర్లు జారీ చేసి రూ.1,400 కోట్లు సమీకరించింది. -
ఇమామి చేతికి కేశ్‌కింగ్
డీల్ విలువ రూ.1,651 కోట్లు న్యూఢిల్లీ: హెయిర్, స్కాల్ప్‌కేర్ బ్రాండ్ కేశ్‌కింగ్‌ను రూ.1,651 కోట్లకు ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఇమామి కొనుగోలు చేసింది. కేశ్‌కింగ్ కొనుగోలుతో ఆయుర్వేద హెయిర్, స్కాల్ప్‌కేర్ సెగ్మెంట్లోకి ప్రవేశిస్తున్నామని ఇమామి డెరైక్టర్ హర్ష వి.అగర్వాల్ చెప్పారు. తమ వృద్ధి వ్యూహంలో భాగంగా కేశ్‌కింగ్‌ను కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఈ బ్రాండ్ కొనుగోలుకు అవసరమైన నిధులను తమ వద్ద మిగులుగా ఉన్న నగదు నిల్వలు, స్వల్ప, దీర్ఘకాలిక రుణాల ద్వారా ఒక నెలలోపు సమీకరిస్తామని కంపెనీ సీఈఓ (ఫైనాన్స్, స్ట్రాటజీ, బిజినెస్ డెవలప్మెంట్) ఎన్, హెచ్ భన్సాలి చెప్పారు. కొత్త కేటగిరీల్లోకి ప్రవేశించడానికి ఇమామి, దేశీ యంగా, అంతర్జాతీయంగా బ్రాండ్లను కొనుగోలు చేస్తోంది. కేశ్‌కింగ్ బ్రాండ్‌ను 2009లో సంజీవ్ జునేజా మార్కెట్లోకి తెచ్చారు. ఈ బ్రాండ్‌కింద తల నూనె, హెర్బల్ షాంపూ, కండీషనర్, ఆయుర్వేదిక్ క్యాప్సూల్స్‌ను అందిస్తున్నారు. కేశ్‌కింగ్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. -
మళ్లీ మ్యాట్ భయాలు
మ్యాట్ ఆందోళన మళ్లీ తెరపైకి రావడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాల పాలైంది. దీనికి కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం కూడా జతవడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 112 పాయింట్లు నష్టపోయి 27,531 పాయింట్ల వద్ద, నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి 8,339 పాయింట్ల వద్ద ముగిశాయి. రిఫైనరీ, రియల్టీ, ఎఫ్ఎంసీజీ షేర్లు పతనమయ్యాయి. రూపాయి క్షీణించడం, మే డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగింపుకు రావడం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు పొజిషన్లను తగ్గించుకున్నారని ట్రేడర్లు పేర్కొన్నారు. 30 షేర్ల సెన్సెక్స్‌లో 17 షేర్లు నష్టపోయాయి. 1,497 షేర్లు నష్టాల్లో, 1,157 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,436 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో, రూ. 14,363కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ. 3,02,273కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 115 కోట్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.124 కోట్ల చొప్పున నికర కొనుగోళ్లు జరిపారు. -
ఎఫ్ఎంసీజీ రంగంలో విస్తరిస్తాం..
జీసీపీ సీఎండీ మహేంద్రన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎఫ్ఎంసీజీ రంగంలో దేశంలో పెద్ద ఎత్తున విస్తరిస్తామని గ్లోబల్ కన్జూమర్ ప్రొడక్ట్స్(జీసీపీ) తెలిపింది. కన్ఫెక్షనరీ, పానీయాలు, స్నాక్స్ విభాగాల్లో విభిన్న ఉత్పత్తులను ప్రవేశపెడతామని సంస్థ సీఎండీ అరుముగం మహేంద్రన్ బుధవారం తెలిపారు. కంపెనీ తొలి ఉత్పాదన అయిన లవ్‌ఇట్ చాకొలేట్లను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పండ్ల రసాలు, ప్యాకేజ్డ్ వాటర్, టీ, కాఫీ తదితర ఉత్పత్తులు త్వరలో మార్కెట్లోకి రానున్నాయని వివరించారు. వచ్చే ఐదేళ్లలో రూ.1,250 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. గోద్రెజ్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్ మాజీ ఎండీ అయిన మహేంద్రన్ కంపెనీకి గోల్డ్‌మన్ శాక్స్, మిత్సుయి వెంచర్స్ రూ.315 కోట్ల నిధులను అందించాయి. మంగళూరులో ఒకటి, హైదరాబాద్‌కు చెందిన రెండు తయారీ కంపెనీలతో కాంట్రాక్ట్ ఒప్పందాన్ని జీసీపీ కుదుర్చుకుంది. తొలుత దక్షిణాది రాష్ట్రాలపై కంపెనీ దృష్టిసారిస్తుంది. రెండేళ్లలో దేశవ్యాప్తంగా విస్తరించడంతోపాటు ఇతర దేశాలకూ ఉత్పత్తులను ఎగుమతి చేయనుంది. గోద్రెజ్ గ్రూప్‌లో 18 ఏళ్లపాటు వివిధ హోదాల్లో మహేంద్రన్ పనిచేశారు. రెండేళ్ల క్రితం గోద్రెజ్‌కు రాజీనామా చేశారు. కాగా, ఏటా 20 శాతం వృద్ధి నమోదు చేస్తున్న రూ.7,000 కోట్ల చాకొలేట్ పరిశ్రమలో దక్షిణాది రాష్ట్రాల వాటా 30 శాతముంది. -
నేపాల్ భూకంప ప్రభావం లేదు: భారత కంపెనీలు
న్యూఢిల్లీ: నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా అక్కడ తమ కార్యకలాపాలపై పెద్దగా ప్రతికూల ప్రభావమేమీ పడలేదని భారతీయ కంపెనీలు పేర్కొన్నాయి. తమ ఫ్యాక్టరీ భవనానికి కొద్దిగా బీటలు వచ్చాయి తప్ప.. ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకోలేదని ఎఫ్ఎంసీజీ సంస్థ డాబర్ వెల్లడించింది. భూకంపం తర్వాత తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కోకకోలా ఇండియా తెలిపింది. ఐటీసీ వర్గాలు కూడా తమ ప్లాంట్లకు ఎలాంటి నష్టంవాటిల్లలేదని తెలిపాయి. -
లాభాల్లో నుంచి నష్టాల్లోకి
ట్రేడింగ్ చివరి గంటలో బ్లూచిప్ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో అప్పటిదాకా లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఫెడ్ నిర్ణయం సానుకూలంగా ఉండటంతో బీఎస్ఈ సెన్సెక్స్ మధ్యాహ్నం వరకూ 350 పాయింట్లు లాభ పడింది. చివర్లో లాభాల స్వీకరణ కారణంగా అమ్మకాలు వెల్లువెత్తాయి. బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, వాహన, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. చివరకు సెన్సెక్స్ 152 పాయింట్ల నష్టంతో 28,470 పాయింట్ల వద్ద, నిఫ్టీ 51 పాయింట్ల నష్టం(0.59%)తో 8,635 వద్ద ముగిసింది. 21 సెన్సెక్స్ షేర్లకు నష్టాలు నొప్పి నివారణ జనరిక్ ఔషధం(సెలెబ్రెక్స్)కి అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి లభించడంతో ల్యుపిన్ షేర్ 2.5 శాతం లాభపడి రూ.1,922 వద్ద ముగిసింది. నొముర బ్రోకరేజ్ సంస్థ కొనచ్చన్న రేటింగ్ ఇవ్వడంతో జస్ట్ డయల్ షేర్ 10 శాతం వృద్ధితో రూ.1,403కు పెరిగింది. 30 సెన్సెక్స్ షేర్లలో 21 షేర్లు నష్టాల్లో, 9 షేర్లు లాభాల్లో ముగిశాయి. 1,730 షేరు నష్టాల్లో, 1,104 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,835 కోట్లుగా, ఎన్ఎస్ఈలో రూ.18,596 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.3,85,459 కోట్లుగా నమోదైంది. ఒక్క జపాన్ మార్కెట్ మినహా మిగిలిన ఆసియా దేశాల మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. ఎన్ఎస్ఈ క్వాలిటీ 30 ఇండెక్స్ న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) గురువారం క్వాలిటీ 30 ఇండెక్స్‌ను ప్రారంభించింది. ఎన్ఎస్ఈ గ్రూప్ సంస్థ అయిన ఇండియా ఇండెక్స్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్(ఐఐఎస్పీ) ఈ క్వాలిటీ 30 ఇండెక్స్‌ను రూపొందించింది. ఎన్ఎస్ఈలో లిస్టైన భారీ పెట్టుబడులున్న, లావాదేవీలు అధికంగా జరిగే వంద కంపెనీల నుంచి 30 కంపెనీలను ఎంచుకున్నామని ఐఐఎస్పీ పేర్కొంది. ఈక్విటీపై వచ్చిన అధిక రాబడి, ఈక్విటీకి, రుణానికి నిష్పత్తి తక్కువగా ఉండడం, మూడేళ్లలో నికర లాభంలో వృద్ధి.. వంటి అంశాల ఆధారంగా వచ్చిన క్వాలిటీ స్కోర్‌ను బట్టి ఈ వంద కంపెనీల నుంచి 30 క్వాలిటీ కంపెనీలను ఎంపిక చేశామని వివరించింది. పెట్టుబడులు పెట్టడానికి ఒక బెంచ్‌మార్క్‌గా ఈ క్వాలిటీ ఇండెక్స్ ఇన్వెస్టర్లకు ఉపయోగపడుతుందని పేర్కొంది. -
ఆన్లైన్లో పర్సనల్ కేర్ జోరు..
2020 నాటికి 5 బిలియన్ డాలర్లకు అమ్మకాలు - హై ఎండ్ కాస్మెటిక్స్, చర్మ సంరక్షణ ఉత్పత్తులకు డిమాండ్ - ఎఫ్ఎంసీజీ విక్రయాల్లో మూడో వంతు ఈ-కామర్స్ సైట్ల నుంచే నాలుగైదేళ్ల క్రితం దాకా భారత్‌లో ఈ-కామర్స్ ఒక మోస్తరు స్థాయిలోనే ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో అత్యంత వేగంగా విస్తరించింది. అంతకంతకూ పెరుగుతోంది. ముందుగా మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు మాత్రమే పరిమితం అవుతుందని పరిశ్రమ వర్గాలు భావించినప్పటికీ.. ఎప్పటికప్పుడు కొంగొత్త ఉత్పత్తులు ఆన్లైన్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్సనల్ కేర్ ఉత్పత్తుల సంస్థలు ఆన్లైన్ మాధ్యమం వైపు మరింతగా దృష్టి సారిస్తున్నాయి. టెక్నాలజీ దిగ్గజం గూగుల్, కన్సల్టెన్సీ సంస్థ బెయిన్ అండ్ కంపెనీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం 2020 నాటికి ఆన్లైన్లో సౌందర్య సంరక్షణ, శిశు సంరక్షణ ఉత్పత్తులు మొదలైన వాటి అమ్మకాలు 5 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 30,000 కోట్లు) ఉంటాయని అంచనా. అప్పటికి ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాలు 100 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 6 లక్షల కోట్లు) చేరనున్నాయి. ఇందులో ఆన్లైన్ అమ్మకాల వాటా స్వల్పంగా అయిదు శాతం స్థాయే అయినప్పటికీ.. ఈ మాధ్యమం ప్రాధాన్యాన్ని తక్కువ చేసి చూడలేమని కంపెనీలు భావిస్తున్నాయి. రాబోయే అయిదు నుంచి ఏడేళ్ల వ్యవధిలో ఎఫ్ఎంసీజీ సంస్థల అమ్మకాల్లో సుమారు 10 శాతం వాటా ఈ-కామర్స్ ద్వారానే రాబోతోందని పరిశ్రమవర్గాల మరో అంచనా. అందుకే .. ఈ మాధ్యమంపై ఎఫ్ఎంసీజీ కంపెనీలు మరింతగా దృష్టి సారిస్తున్నాయి. సౌందర్య సాధనాల సంస్థ లోరియల్‌కి సంబంధించి ప్రధాన బ్రాండ్స్ లోరియల్ ప్యారిస్, గార్నియర్ విక్రయాల్లో 1 శాతం వాటా ఆన్లైన్ అమ్మకాలదే ఉంటోంది కంపెనీకి చెందిన. మేబెలీన్ బ్రాండ్ మేకప్ శ్రేణి టర్నోవరులో 3 శాతం వాటా ఆన్‌లైన్‌దే ఉంది. దీంతో జార్జియో అర్మానీ, ఈవ్స్సెయింట్లారెంట్, ల్యాంకోమ్ వంటి లగ్జరీ సౌందర్య సాధనాలు, లా రోష్-పొసే, విషీ వంటి కాస్మెటిక్స్‌ను కూడా ఆన్లైన్లో అందుబాటులోకి తేనున్నట్లు లోరియల్ వర్గాలు తెలిపాయి. కొత్తగా ప్రవేశించిన జపాన్ కాస్మెటిక్స్ కంపెనీ షీసీడో చాలా వేగంగా ఆన్లైన్ వైపు మళ్లింది. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరులో మాత్రమే స్టోర్స్ ఉన్నప్పటికీ.. ఆన్లైన్ మాధ్యమం ద్వారా మరింత మంది కొనుగోలుదార్ల వద్దకు చేరవచ్చన్న ఉద్దేశంతో ఉంది. షీసీడో తాజాగా జెడ్ఏ బ్రాండ్ కింద కొత్తగా మేకప్ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లోనూ ప్రవేశపెట్టే యోచనలో ఉంది. కారణాలివీ.. ఎఫ్ఎంసీజీ సంస్థలు ఆన్లైన్ వైపు చూడటానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. మొబైల్ ఫోన్లలో కూడా ఇంటర్నెట్ లావాదేవీలు పెరుగుతుండటం ఒకటి కాగా డిజిటల్ మాధ్యమం ద్వారా మరింత మంది కస్టమర్లకు చేరువయ్యేందుకు అవకాశం ఉండటం మరొక కారణం. ఇతరత్రా మాధ్యమాలతో పోలిస్తే ఆన్లైన్లో విక్రయానికి ఉంచే ఉత్పత్తులను చూసి, కొనుగోలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. లగ్జరీకి డిమాండ్.. సాధారణంగా ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో దొరకని ప్రత్యేక, లగ్జరీ ఉత్పత్తులకు ఆన్లైన్లో మంచి డిమాండ్ ఉంటోంది. హై ఎండ్ కాస్మెటిక్స్, చర్మ సంరక్షణ ఉత్పత్తులు మొదలైన వాటి అమ్మకాలు ఆఫ్‌లైన్‌లో కంటే ఆన్లైన్లోనే ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఇవి కాకుండా కొనుగోలుదారులకు సౌకర్యం కోణంలో ఆన్లైన్లో కొన్ని రకాల ఉత్పత్తులకు డిమాండ్ ఉంటోంది. పురుషుల సౌందర్య సాధనాలు, శిశు సంరక్షణ ఉత్పత్తులు మొదలైనవి ఇందులో ఉంటున్నాయి. ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా జరుగుతున్న కొనుగోళ్లలో సుమారు పాతిక శాతం వాటా వీటిదే ఉంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో మొత్తం ఎఫ్ఎంసీజీ మార్కెట్ విక్రయాల్లో మూడో వంతు.. డిజిటల్ మాధ్యమం నుంచే రాబోతోందని విశ్లేషకులు తెలిపారు. దీన్ని గుర్తించే మారికో, గోద్రెజ్ కన్జూమర్ వంటి సంస్థలు తమ ఈ-కామర్స్ వెబ్సైట్ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ-కామర్స్ ప్రాథమిక స్థాయిలోనే ఉన్నప్పటికీ మొబైల్స్ ద్వారా లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో అమ్మకాలు మరింత మెరుగుపడగలవని మారికో అంటోంది. గోద్రెజ్ వంటి సంస్థలు సొంత పోర్టల్స్ ఏర్పాటుకంటే ఈ-కామర్స్ మార్కెట్‌ప్లేస్‌లతో జట్టు కట్టేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. -
ఎస్అండ్పీ వార్నింగ్-మార్కెట్లో అమ్మకాలు
- సెన్సెక్స్ 256 పాయింట్లు డౌన్ - 78 పాయింట్లు తగ్గిన నిఫ్టీ - క్షీణించిన బ్యాంకింగ్, ఆయిల్, ఎఫ్ఎంసీజీ షేర్లు - మార్కెట్ అప్డేట్ ముంబై: కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు మరో ఐదు రోజుల్లో వెల్లడికానున్న నేపథ్యంలో భారత్ రేటింగ్ పట్ల ప్రసిద్ధ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) హెచ్చరికలు జారీచేయడంతో సోమవారం ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. ప్రపంచ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ ఫలితంగా ట్రేడింగ్ తొలిదశలో బీఎస్ఈ సెన్సెక్స్ 29,362 పాయింట్ల స్థాయికి పెరిగినప్పటికీ, అటుతర్వాత కొన్ని బ్లూచిప్ షేర్లలో అమ్మకాలు వె ల్లువెత్తడంతో 29,913 పాయింట్ల వద్దకు పతనమయ్యింది. చివరకు క్రితం ముగింపుకంటే 256 పాయింట్ల క్షీణతతో 29,975 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 78 పాయింట్ల తగ్గుదలతో 8,755 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ద్రవ్య పరిస్థితి బలహీనంగా వుండటం, ఆదాయస్థాయిలు కనిష్టంగా కొనసాగడం వల్ల భారత్ సార్వభౌమ రేటింగ్‌కు విఘాతం ఏర్పడుతున్నదంటూ ఎస్ అండ్ పీ హెచ్చరించింది. ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లలో అమ్మకాలు జరిగాయి. ప్రధాన షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్, గెయిల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, ఎస్బీఐ, ఇన్ఫోసిస్‌లు 2-2.5 శాతం మేర తగ్గాయి. విలీనానికి అనుమతి కాంపిటీషన్ కమిషన్ అనుమతి లభించడంతో కొటక్ మహీంద్రా, ఐఎన్జీ వైశ్యా బ్యాంకుల షేర్లు పెరిగాయి.బొగ్గు గనుల వేలంలో గరిష్టంగా 3 బొగ్గు బ్లాకులను దక్కించుకున్నందున, హిందాల్కో ఇండస్ట్రీస్ షేరు ట్రేడింగ్ తొలిదశలో 3 శాతంపైగా ర్యాలీ జరిపి రూ. 161.8 స్థాయికి చేరినప్పటికీ, ముగింపులో లాభాల స్వీకరణతో రూ. 154.8 స్థాయికి తగ్గి ముగిసింది. సెన్సెక్స్‌లోని 24 షేర్లు క్షీణించగా, 6 షేర్లు మాత్రం పెరిగాయి. ఎక్సేంజీల్లో వ్యాపార లావాదేవీలు గత శుక్రవారంతో పోలిస్తే తగ్గాయి. బీఎస్ఈ నగదు విభాగంలో టర్నోవర్ రూ. 3,570 కోట్లకు తగ్గగా, ఎన్ఎస్ఈ నగదు విభాగం టర్నోవర్ రూ. 17,304 కోట్లకు పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.602 కోట్ల నికర కొనుగోళ్లు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ164 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. -
హెచ్‌యూఎల్ లాభం 18% అప్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2014-15, క్యూ3)లో రూ.1,252 కోట్ల స్టాండెలోన్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో రూ.1,062 కోట్లతో పోలిస్తే లాభం 17.87 శాతం పెరిగింది. ప్రధానంగా క్యూ3లో కంపెనీ కొన్ని ఆస్తులను విక్రయించడం, ఉత్పాదక వ్యయాలు తగ్గుముఖం పట్టడం వంటివి లాభాల జోరుకు దోహదం చేశాయి. ఆస్తుల అమ్మకం రూపంలో రూ.407 కోట్ల అసాధారణ ఆదాయం లభించినట్లు బీఎస్ఈకి వెల్లడించిన సమాచారంలో కంపెనీ తెలిపింది. హెచ్‌యూఎల్ మొత్తం ఆదాయం క్యూ3లో 7.69 శాతం ఎగసి రూ.7,037 కోట్ల నుంచి రూ.7,579 కోట్లకు చేరింది. పట్టణ ప్రాంత అమ్మకాల్లో మందగమనం... దేశీ మార్కెట్లో డిమాండ్ ఇంకా మందకొడిగానే ఉన్న నేపథ్యంలో మూడో తైమాసికంలో అమ్మకాల వృద్ధి కాస్త తగ్గిందని.. అయితే, ముడి చమురు ధరల భారీ పతనం కారణంగా ఉత్పాదక వ్యయాలు దిగొచ్చినట్లు హెచ్‌యూఎల్ సీఎఫ్ఓ పీబీ బాలాజీ చెప్పారు. పట్టణ ప్రాంత అమ్మకాలతో పోలిస్తే.. గ్రామీణ విక్రయాలు జోరందుకున్నాయన్నారు. మరోపక్క, ఈసారి చలికాలం ఆరంభం జాప్యం కావడం కూడా చర్మసంరక్షణ ఉత్పత్తుల అమ్మకాలపై ప్రభావం చూపినట్లు ఆయన తెలిపారు. * క్యూ3లో సబ్బులు, డిటర్జెంట్ల విభాగ ఆదాయం 5.95% వృద్ధితో రూ.3,398 కోట్లకు చేరింది. * పర్సనల్ ప్రొడక్టుల విభాగం నుంచి రూ.2,455 కోట్ల ఆదాయం సమకూరింది. క్రితం క్యూ3తో పోలిస్తే 6.53 శాతం పెరిగింది. * పానీయాల విభాగం ఆదాయం 8.19 శాతం పెరిగి రూ.920 కోట్లకు చేరింది. * ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తుల విభాగం 12.64 శాతం వృద్ధిచెంది రూ.420 కోట్లుగా నమోదైంది. * డిసెంబర్ క్వార్టర్లో పన్ను చెల్లింపుల వ్యయాలు రెట్టింపై రూ.519 కోట్లకు ఎగబాకాయి. 5% పైగా పడిన షేరు.. మందకొడి అమ్మకాలు, ఫలితాలు మార్కెట్వర్గాల అంచనాలకు అనుగుణంగా లేకపోవడంతో కంపెనీ షేరు ధర సోమవారం బీఎస్ఈలో 5.27 శాతం క్షీణించి రూ.892.80 వద్ద ముగిసింది. ఈ ఒక్కరోజులోనే హెచ్‌యూఎల్ మార్కెట్ విలువలో రూ. 10,740 కోట్లు ఆవిరైంది. రూ.1,93,133 కోట్లకు పడిపోయింది. మరోపక్క, ఈ నెలలో ఇప్పటిదాకా 24% షేరు ఎగబా కడంతో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కూడా షేరు పతనానికి కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. -
చివర్లో లాభాలు
* వారం రోజుల గరిష్టానికి సెన్సెక్స్ * 8,300 పైన నిఫ్టీ మార్కెట్ అప్డేట్ పారిశ్రామికోత్పత్తి, రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలపై ఆశావహ అంచనాలతో దేశీ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో సెషన్లోనూ లాభపడ్డాయి. సోమవారం దాదాపు రోజంతా నష్టాల్లోనే ట్రేడయినా చివరి గంటన్నర వ్యవధిలో లాభాలు నమోదు చేశాయి. క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లలో కొనుగోళ్లతో సెన్సెక్స్ 127 పాయింట్లు పెరిగి వారం రోజుల గరిష్ట స్థాయిలో ముగిసింది. అటు నిఫ్టీ కూడా కీలకమైన 8,300 మార్కును దాటి .. 38 పాయింట్ల లాభంతో 8,323 వద్ద ముగిసింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో కొనుగోళ్ల మద్దతుతో క్రితం ముగింపు కన్నా అధికంగా 27,524 వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత లాభాల స్వీకరణతో 27,324 స్థాయికి పడిపోయింది. అయితే, మధ్యాహ్నం సెషన్లో మళ్లీ కోలుకుని చివరికి 27,585 వద్ద ముగిసింది. జనవరి 5 నాటి 27,842 క్లోజింగ్ తర్వాత ఇదే అత్యధికం. దీంతో సెన్సెక్స్ వరుసగా మూడు రోజుల్లో 676 పాయింట్లు పెరిగినట్లయింది. మొత్తం మీద బీఎస్ఈలో 1,651 స్టాక్స్ లాభాల్లోనూ, 1,253 స్టాక్స్ నష్టాల్లోనూ ముగిశాయి. టర్నోవరు రూ. 3,285 కోట్ల నుంచి రూ. 3,019 కోట్లకు తగ్గింది. మరోవైపు ఎన్ఎస్ఈ స్టాక్స్ విభాగంలో రూ. 14,485 కోట్లు, డెరివేటివ్స్‌లో రూ. 1,73,407 కోట్లు టర్నోవరు నమోదైంది. ఇక అంతర్జాతీయంగా చూస్తే ఆసియా దేశాల్లో చాలా మటుకు సూచీలు నష్టపోయాయి. ఉద్దీపన ప్యాకేజీలు యూరో దేశాల సమస్యలు తీర్చలేకపోవచ్చన్న ఆందోళనలు ఇందుకు కారణం. జపాన్ మార్కెట్లో ట్రేడింగ్ జరగలేదు. మరోవైపు, యూరప్ సూచీల్లో లాభాల్లో ముగిశాయి. -
విదేశీ అంశాల దెబ్బ
అంతర్జాతీయ అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. క్యూ2 జీడీపీ క్షీణించడం ద్వారా ఇటలీ మాంద్యంలోకి జారుకోగా, జర్మనీ తయారీ రంగం బలహీనపడింది. మరోవైపు ఉక్రెయిన్-రష్యాల మధ్య ఆందోళనలు మళ్లీ పెరగడంతో ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టపోయాయి. వెరసి దేశీయంగానూ ఇన్వెస్టర్లు అమ్మకాలకే కట్టుబడ్డారు. తొలి నుంచీ నష్టాలలో కదిలిన సెన్సెక్స్ మిడ్ సెషన్ నుంచీ మరింత బలహీనపడింది. చివరి గంటలో పెరిగిన అమ్మకాలతో 243 పాయింట్లు నష్టపోయింది. 25,665 వద్ద ముగిసింది. దీంతో గత రెండు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ రెండు రోజుల్లో 427 పాయింట్లు పుంజుకున్న సంగతి తెలిసిందే. ఇక నిఫ్టీ కూడా 75 పాయింట్లు పతనమై 7,672 వద్ద నిలిచింది. విదేశీ అంశాలకుతోడు డాలరుతో మారకంలో రూపాయి 5 నెలల కనిష్టానికి పడటం కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని నిపుణులు పేర్కొన్నారు. రూపాయి 65 పైసలు కోల్పోయి 61.50కు చేరింది. ఇన్ఫోసిస్ అండ మిగులు నిధులతో షేర్ల బైబ్యాక్ చేపట్టాలని కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు కోరిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ మరో 2% ఎగసింది. ఈ బాటలో భెల్, ఎంఅండ్ఎం కూడా నిలిచాయి. -
ఎఫ్ఎంసీజీలో 10% వృద్ధి
గోద్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ సీవోవో సునీల్ మార్కెట్లోకి ప్రొటెక్ట్ శ్రేణి ఉత్పత్తులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేగంగా విక్రయమయ్యే వినియోగ వస్తువుల (ఎఫ్ఎంసీజీ) రంగం దేశంలో రూ.2.25 లక్షల కోట్లకు చేరుకుందని గోద్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ తెలిపింది. ప్రస్తుతం ఈ రంగం పనితీరు గతేడాది కంటే బాగుందని కంపెనీ సీవోవో సునీల్ కటారియా తెలిపారు. దేశీయ మార్కెట్లోకి ప్రొటెక్ట్ శ్రేణిలో అయిదు రకాల ఉత్పత్తులను మంగళవారమిక్కడ ఆవిష్కరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 10 శాతం వాటా లక్ష్యం: ప్రొటెక్ట్ శ్రేణిలో చేతులను శుభ్రం చేసుకునేందుకు వాడే నాలుగు రకాల ఉత్పత్తులతోపాటు దోమల నుంచి శరీరాన్ని రక్షించే స్ప్రే ‘బజ్ ఆఫ్’ ఉన్నాయి. వీటి ధరలు రూ.50 నుంచి ప్రారంభమవుతాయి. చిన్న పిల్లలు నురగను ఇష్టపడతారని, అందుకే భారత్‌లో తొలిసారిగా ఫోమ్ హ్యాండ్ వాష్‌ను ప్రవేశపెట్టినట్టు క ంపెనీ తెలిపింది. -
హెచ్‌యూఎల్ లాభం 872 కోట్లు
ముంబై: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) జనవరి-మార్చి(క్యూ4) కాలంలో రూ. 872 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ. 787 కోట్లతో పోలిస్తే ఇది 11% అధికం. ఇదే కాలానికి అమ్మకాలు కూడా 9% ఎగసి రూ. 6,936 కోట్లకు చేరాయి. గతంలో రూ. 6,367 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. స్టాండెలోన్ ఫలితాలివి. వాటాదారులకు షేరుకి రూ. 7.50 చొప్పున తుది డివిడెండ్‌ను చెల్లించనుంది. ఈ కాలంలో మొత్తం వ్యయాలు రూ. 5,555 కోట్ల నుంచి రూ. 6,082 కోట్లకు పెరిగాయి. సమస్యాత్మక వాతావరణంలోనూ పోటీతో కూడిన లాభదాయక వృద్ధిని సాధించగలిగామని కంపెనీ చైర్మన్ హరీష్ మన్వని వ్యాఖ్యానించారు. సబ్బుల అమ్మకాల జోరు క్యూ4లో సబ్బులు, డిటర్జెంట్ల అమ్మకాలు దాదాపు 10% పుంజుకుని రూ. 3,497 కోట్లను తాకగా, వ్యక్తిగత ఉత్పత్తుల విభాగం ఆదాయం 8%పైగా పెరిగి రూ. 1,983 కోట్లయ్యింది. ఇక బెవరేజెస్ విభాగం నుంచి 7.5% అధికంగా రూ. 869 కోట్ల ఆదాయం సమకూరగా, ప్యాకేజ్డ్ ఫుడ్ అమ్మకాలు దాదాపు 13% వృద్ధితో రూ. 420 కోట్లకు చేరాయి. 9% ఎగసిన దేశీ క న్జూమర్ బిజినెస్ కారణంగా మార్కెట్లను మించుతూ పటిష్ట పనితీరును చూపగలిగామని కంపెనీ సీఎఫ్‌వో ఆర్.శ్రీధర్ పేర్కొన్నారు. వరుసగా 8వ క్వార్టర్లోనూ డిమాండ్ మందగించినట్లు తెలిపారు. కాగా, బ్రాండ్లు, కొత్త ఉత్పత్తులపై పెట్టుబడులు పెంచినట్లు మన్వని చెప్పారు. వ్యయాల అదుపుతోపాటు, కార్యకలాపాల మెరుగుకు తీవ్రంగా కృషి చేసినట్లు తెలిపారు. తద్వారా దీర్ఘకాలంపాటు వృద్ధిని నిలుపుకోవడమేకాకుండా, మార్జిన్లను పెంచుకోగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. పూర్తి ఏడాదికి గడిచిన ఆర్థిక సంవత్సరం(2013-14)లో హెచ్‌యూఎల్ నికర లాభం రూ. 3,839 కోట్ల నుంచి రూ. 3,955 కోట్లకు పెరిగింది. మొత్తం అమ్మకాలు కూడా రూ. 26,317 కోట్ల నుంచి రూ. 28,539 కోట్లకు ఎగ శాయి. ఇది దాదాపు 9% వృద్ధి. ఇకపై కూడా పరిశ్రమ సగటును మించి వృద్ధిని సాధించగలమని భావిస్తున్నట్లు శ్రీధర్ చెప్పారు. డవ్, లక్స్ వంటి సబ్బుల అమ్మకాల ద్వారా మార్జిన్లు 30 బేసిస్ పాయింట్లు బలపడ్డాయని పేర్కొన్నారు. వీటితోపాటు చర్మ రక్షణ, ఆహార, పానీయాల విభాగాలు సైతం పుంజుకున్నట్లు తెలిపారు. పానీయాల విభాగంలో తాజ్ మహల్, రెడ్ లేబుల్, 3రోజెస్, బ్రూ గోల్డ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో కిసాన్, క్వాలిటీ వాల్స్, మాగ్నమ్, లాండ్రీ విభాగంలో సర్ఫ్, రిన్ వంటి బ్రాండ్లు అమ్మకాల వృద్ధికి దోహదపడినట్లు శ్రీధర్ పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేరు యథాతథంగా రూ. 581 వద్ద ముగిసింది. -
ఐటీసీకి ఎఫ్ఎంసీజీ అండ
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ అక్టోబర్-డిసెంబర్(క్యూ3)లో రూ. 2,385 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఇదే కాలం(అక్టోబర్-డిసెంబర్’12)లో ఆర్జించిన రూ. 2,052 కోట్లతో పోలిస్తే ఇది 16%పైగా వృద్ధి. ఇందుకు ఎఫ్ఎంసీజీ, వ్యవసాయ బిజినెస్ విభాగాల అమ్మకాలు పుంజుకోవడం సహకరించింది. నికర అమ్మకాలు సైతం 13% పెరిగి రూ. 8,623 కోట్లకు చేరాయి. గతంలో రూ. 7,627 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి.ఎఫ్ఎంసీజీలో భాగమైన ప్యాకేజ్డ్ ఫుడ్స్ కేటగిరీ నష్టాల నుంచి బయటపడి రూ. 10.3 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు కంపెనీ తెలిపింది. గతంలో ఈ కేటగిరీ కింద రూ. 24 కోట్ల నికర నష్టాలు నమోదైనట్లు వెల్లడించింది. ఇక వ్యవసాయ విభాగం నుంచి 19% అధికంగా రూ. 205 కోట్ల లాభం సమకూరగా, అమ్మకాలు రూ. 1,786 కోట్లకు చేరాయి. ఈ బాటలో హోటళ్ల (ఆతిథ్యం) బిజినెస్ నుంచి రూ. 62 కోట్ల నికర లాభం, రూ. 315 కోట్ల ఆదాయం లభించింది. కాగితం, ప్యాకేజింగ్ బిజినెస్ నుంచి రూ. 1,257 కోట్ల ఆదాయాన్ని సాధించగా, రూ. 232 కోట్ల నికర లాభాన్ని పొందింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు ధర నామమాత్ర నష్టంతో రూ. 325 వద్ద ముగిసింది. -
6,200 దిగువకు నిఫ్టీ
వరుసగా రెండో రోజుకూడా మార్కెట్లు నష్టపోయాయి. మంగళవారం 16 పాయింట్లు తగ్గిన నిఫ్టీ తాజాగా 41 పాయింట్లు కోల్పోయింది. వెరసి 6,200 దిగువన 6,161 వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్ కూడా వారం రోజుల్లో లేని విధంగా 146 పాయింట్లు క్షీణించి 20,709 వద్ద నిలిచింది. ప్రధానంగా రియల్టీ, ఎఫ్ఎంసీజీ, ఆటో 3-1% మధ్య నీరసించాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో ఫలితాల వెల్లడికి ముందుగానే ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరిస్తున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో సెంటిమెంట్ బలహీనపడిందని తెలిపారు. ఈ నెలాఖరులో సమావేశంకానున్న ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీల ఉపసంహరణపై నిర్ణయాన్ని వెలువరించవచ్చునన్న అంచనాలు కూడా మార్కెట్లలో అమ్మకాలకు కారణమవుతున్నాయని చెప్పారు. యూనిటెక్ 10% పతనం: నోయిడాలోని విలాసవంత హౌసింగ్ ప్రాజెక్ట్‌కోసం 2007లో ఎల్ఐసీ నుంచి రూ. 200 కోట్ల రుణాలపై వడ్డీ చెల్లింపుల్లో విఫలమైందన్న వార్తలతో యూనిటెక్ షేరు ఒక దశలో 15% వరకూ పతనమైంది. చివరికి 10% నష్టంతో రూ. 15.65 వద్ద ముగిసింది. అక్టోబర్‌లో రుణ మార్కెట్ల జోష్ రూ. 7,280 కోట్లు సమీకరించిన కంపెనీలు ప్రైమరీ మార్కెట్ ద్వారా కంపెనీలు అక్టోబర్‌లో రూ. 7,279 కోట్లను సమీకరించాయి. సెప్టెంబర్ నెలలో సమీకరించిన రూ. 3,847 కోట్లతో పోలిస్తే ఇవి 89% అధికం. అయితే వీటిలో రుణ(డెట్) మార్కెట్ల నుంచి అత్యధికంగా రూ. 7,195 కోట్లను సమీకరించగా, ఈక్విటీ షేర్ల అమ్మకం ద్వారా రూ. 84 కోట్లు మాత్రమే లభించాయి. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం(2013 -14) తొలి ఏడు నెలల(ఏప్రిల్-అక్టోబర్) కాలంలో కంపెనీలు సమీకరించిన మొత్తం రూ. 18,636 కోట్లకు చేరింది. గతేడాది(2012-13) ఇదే కాలంలో ప్రైమరీ మార్కెట్ల ద్వారా కంపెనీలు రూ. 9,484 కోట్లను మాత్రమే సమకూర్చుకోగలిగాయి. -
బ్యాంకింగ్ స్టాక్స్.. టాప్‌గన్స్!
మూడేళ్ల నుంచి భారత్ స్టాక్ మార్కెట్ ర్యాలీ జరిపినపుడల్లా ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు సహకరిస్తుండగా, ప్రస్తుత అప్‌ట్రెండ్‌కు మాత్రం బ్యాంకింగ్ షేర్లు నేతృత్వం వహిస్తున్నాయి. ఇతర రంగాల తోడ్పాటుతో స్టాక్ సూచీలు ఆల్‌టైమ్ రికార్డుస్థాయిని సాధించడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినా విఫలమయ్యాయి. కానీ సూచీల్లో 30 శాతం వెయిటేజీ వున్న బ్యాంకింగ్ షేర్లు పరుగులు తీయడంతో బీఎస్ఈ సెన్సెక్స్ ఈ దఫా చరిత్రాత్మక గరిష్టస్థాయిని నమోదుచేయగలిగింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఆ రికార్డుకు కేవలం అరశాతం దూరంలో వుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఆగస్టు 28న 5,118 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమైన తర్వాత రెండు నెలల్లో అత్యంతవేగవంతంగా ఆ సూచీ 23 శాతం ర్యాలీ జరిపితే, ఆ ప్రధాన సూచీని తలదన్నుతూ బ్యాంక్ నిఫ్టీ 38.82 శాతం పెరిగింది. ఇన్వెస్టర్లు భయపడుతున్నట్లు బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిల శాతం ఆందోళనకరంగా పెరగలేదన్న అంశం ఇటీవలి ఆర్థిక ఫలితాల్లో వెల్లడికావడంతో ఈ షేర్ల ర్యాలీ సాధ్యపడిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇవే భయాలతో ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకూ బ్యాంకింగ్ షేర్లు నిలువునా పతనమయ్యాయి. కానీ ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో ప్రైవేటు బ్యాంకులు యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐల నిరర్థక ఆస్తులు నామమాత్రంగానే వుండటంతో పాటు వాటి వడ్డీ ఆదాయంలో 6-10 శాతం మధ్య వృద్ధి సాధించగలిగాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇంకా ఎస్బీఐ ఫలితాలు వెల్లడికావాల్సివుంది. అయితే ఇతర పీఎస్‌యూ బ్యాంకులు వెలువరించిన ఫలితాల్లో ఎన్పీఏల శాతం ప్రైవేటు బ్యాంకులంత తక్కువగా లేకపోయినా, ఇన్వెస్టర్ల అంచనాలకు కాస్త తక్కువగానే వుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్పీఏలైతే తగ్గాయి కూడా. ఈ బ్యాంకు లాభం అనూహ్యంగా రెట్టింపయ్యింది. దాంతో ఈ షేరు అక్టోబర్ 30న ఒకేరోజున 21 శాతం ర్యాలీ జరపగలిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ గెయినర్.... బ్యాంక్ నిఫ్టీలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన 12 బ్యాంకులుండగా, గత రెండు నెలల ర్యాలీలో అన్నింటికంటే ఎక్కువగా బ్యాంక్ ఆఫ్ ఇండియా షేరే 77.7 శాతం ఎగిసి రూ. 126 నుంచి రూ. 224 స్థాయికి చేరింది. తర్వాతి స్థానం యస్ బ్యాంక్ది. అయితే ప్రమోటర్ల మధ్య ఏర్పడిన వివాదం కారణంగా ఇతర ప్రైవేటు రంగ బ్యాంకు షేర్లకంటే ఎక్కువగా నష్టపోవడంతో ఈ షేరు రికవరీ (75%) అధికంగా వుంది. లార్జ్‌క్యాప్ బ్యాంకింగ్ షేర్లలో యాక్సిస్ బ్యాంక్ 55% పెరగ్గా, ఐసీఐసీఐ బ్యాంక్ 49% ర్యాలీ జరిపింది. ఈ షేర్ల ర్యాలీకి ఆర్థిక ఫలితాలు ఆశావహంగా వుండటం ఒకటే కారణం కాదని, అటు విదేశీ ఇన్వెస్టర్లు, ఇటు దేశీయ సంస్థల పోర్ట్‌ఫోలియోల్లో బ్యాంకింగ్ షేర్లు క్రమేపీ తక్కువైనందున, హఠాత్తుగా ఈ షేర్లలో కొనుగోళ్లు మొదలయ్యాయని మార్కెట్ విశ్లేషకులు వివరిస్తున్నారు. సెప్టెంబర్ క్వార్టర్లో మొండి బకాయిల శాతం బాగా పెరగవచ్చన్న అంచనాలున్న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ షేరు మాత్రం బ్యాంక్ నిఫ్టీకంటే వెనుకబడి వుంది. ఈ షేరు 29.88% పెరి గింది. దాదాపుగా ఆల్‌టైమ్ గరిష్టస్థాయి వద్ద ట్రేడవుతున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పెరుగుదల శాతం సహజంగానే పరిమితంగా వుంది. కొద్ది సంవత్సరాలుగా ముఖ్య సూచీల ప్రధాన ర్యాలీలో పాలుపంచుకున్న ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు ఈ 8 వారాలుగా నిఫ్టీకంటే వెనుకబడ్డాయి. వీటి లాభాల వృద్ధిని ముందుగానే మార్కెట్ డిస్కౌంట్ చేసుకున్నందున, ఇవి ఫలితాల వెల్లడి తర్వాత ఇన్వెస్టర్లను ఆకర్షించలేకపోయాయి. ఈ రెండు నెలల్లో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ 7.4%, టీసీఎస్ 14.8 % చొప్పున పెరగ్గా, ఐటీసీ 15.7% ఎగిసింది. ఇక స్టాక్ సూచీల్లో 10% వెయిటేజీ వున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు పెరుగుదల 18.7 శాతమే. ఈ 4 షేర్లకు కలిపి నిఫ్టీలో 37% వరకూ వెయిటేజీ వుంది. బ్యాంకింగ్ షేర్లతో పోటీపడి పెరిగిన షేరు ఇన్ఫ్రా రంగానికి చెందిన ఎల్అండ్టీ ఆసరాతో నిఫ్టీలో ఈ ర్యాలీ సాధ్యపడింది. -
హెచ్‌యూఎల్ లాభం 13% అప్
ముంబై: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ నికర లాభం రెండో త్రైమాసికంలో 13 శాతం పెరిగి రూ. 914 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో లాభం రూ. 807 కోట్లు. మరోవైపు, ఆదాయాలు రూ. 6,155 కోట్ల నుంచి రూ. 6,747 కోట్లకు పెరిగినట్లు సంస్థ బీఎస్ఈకి శనివారం తెలిపింది. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1 ముఖ విలువ గల షేరుపై రూ. 5.50 మధ్యంతర డివిడెండ్‌ను హెచ్‌యూఎల్ ప్రకటించింది. అలాగే, భవిష్య అలయన్స్ చైల్డ్ న్యూట్రిషన్ ఇనీషియేటివ్స్ సంస్థను పూర్తి అనుబంధ సంస్థగా మార్చుకునేందుకు అదనంగా మరిన్ని షేర్లలో ఇన్వెస్ట్ చేయాలని సంస్థ నిర్ణయించింది. -
ఐటీసీ లాభం 21 శాతం జూమ్
న్యూఢిల్లీ: దేశీ ఎఫ్ఎంసీజీ అగ్రగామి ఐటీసీ.. ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2013-14, క్యూ2)లో కంపెనీ నికర లాభం 21 శాతం దూసుకెళ్లి రూ.2,231 కోట్లకు ఎగసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1,836 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం కూడా రూ.7,146 కోట్ల నుంచి రూ.7,776 కోట్లకు పెరిగింది. 8.81 శాతం వృద్ధి చెందినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రధాన విభాగమైన ఎఫ్ఎంసీజీ వ్యాపారం మెరుగైన పనితీరు కంపెనీకి క్యూ2లో లాభాల జోరుకు తోడ్పాటునందించింది. ఎంఫ్ఎంసీజీ(సిగరెట్లు, ఇతరత్రా) విభాగం ఆదాయం క్యూ2లో రూ.5,076 కోట్ల నుంచి రూ.5,686 కోట్లకు పెరిగింది. 12 శాతం వృద్ధి చెందింది. ఇక ఇదే విభాగంలో కీలకమైన సిగరెట్ల వ్యాపార ఆదాయం 10 శాతం ఎగసి రూ.3,724 కోట్లకు చేరింది. నాన్ ఎఫ్ఎంసీజీ విభాగం(హోటళ్లు, అగ్రి, పేపర్‌బోర్డు, పేపర్, ప్యాకేజింగ్) ఆదాయం మాత్రం స్వల్పంగా 3.08 శాతం క్షీణించి రూ.3,198 కోట్లుగా నమోదైంది. కాగా, ఐటీసీ షేరు ధర శుక్రవారం బీఎస్ఈలో 0.74 శాతం క్షీణించి రూ.340 వద్ద స్థిరపడింది. -
అవరోధ శ్రేణి 19,337-19,525
అధికశాతం షేర్లు నిలువునా పతనం అవుతున్నా, కొద్ది నెలల నుంచి స్టాక్ సూచీలు గరిష్టస్థాయిలో స్థిరపడేందుకు ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ షేర్లు సహకరిస్తూ వచ్చాయి. క్రితం వారం ఐటీ మినహా ఎఫ్ఎంసీజీ, ఆయిల్ షేర్లు కూడా కరెక్షన్ బాట పట్టడంతో స్టాక్ సూచీల్లో కూడా పతనవేగం పెరిగింది. రూపాయి క్షీణతను అదుపుచేయడానికి రిజర్వుబ్యాంక్, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చర్యలేవీ ఫలితాల్ని ఇవ్వకపోవడంతో బ్యాంకింగ్, రియల్టీ, ఇన్ఫ్రా రంగాల షేర్లను సంస్థాగత ఇన్వెస్టర్లు ఆఫ్‌లోడ్ చేస్తున్నారు. 1998లో ఆగ్నేయాసియా దేశాల్లో సంభవించిన కరెన్సీ సంక్షోభ(కరెన్సీ విలువలు నిలువునా పతనంకావడం) ఛాయలు, ప్రస్తుతం భారత కరెన్సీ మార్కెట్లో కన్పిస్తున్నాయి. అప్పట్లో ఆయా దేశాలతో పాటు మన స్టాక్ మార్కెట్లో కూడా ఎన్నో కీలక రంగాలకు చెందిన పెద్ద షేర్లు పెన్నీ(కారు చౌకగా లభించే) షేర్లుగా మారిపోయాయి. అదేతరహాలో ఇప్పటి మార్కెట్ పతనం కొనసాగుతోంది.