ఐటీసీ చేతికి టెక్నికో ఆగ్రి సైన్సెస్
డీల్ విలువ రూ.121 కోట్లు
కోల్‌కతా: బయోటెక్నాలజీ వ్యాపార సంస్థ అయిన టెక్నికో ఆగ్రి సెన్సైస్ ఇండియా(టెక్నికో ఇండియా) కంపెనీని ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ కొనుగోలు చేసింది. టెక్నికో ఆగ్రి సెన్సైస్‌కు చెందిన పూర్తి ఈక్విటీ వాటాను ఆస్ట్రేలియాకు చెందిన టెక్నికో పీటీవై లిమిటెడ్ నుంచి రూ.121 కోట్లకు కొనుగోలు చేశామని ఐటీసీ కంపెనీ బీఎస్‌ఈకి నివేదించింది. ఈ వాటా కొనుగోలు కారణంగా ఇప్పటిదాకా టెక్నికో పీటీవై లిమిటెడ్‌కు అనుబంధ కంపెనీగా ఉన్న టెక్నికో ఇండియా ఇక నుంచి ఐటీసీ అనుబంధ కంపెనీగా మారుతుందని వివరించింది. ఈ కంపెనీ కొనుగోలు వల్ల తమ వ్యాపారం మరింతగా మెరుగవుతుందని, నిర్వహణ సామర్థ్యాలు కూడా పెరుగుతాయని ఐటీసీ వెల్లడించింది.