
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 2,932 కోట్లకు పెరిగింది. అంతక్రితం నాలుగో త్రైమాసికంలో లాభం రూ. 2,669 కోట్లు. సమీక్షా కాలంలో ఐటీసీ అమ్మకాలు రూ. 10,706 కోట్లు. 2016–17 క్యూ4లో ఆదాయం రూ. 14,883 కోట్లు. జీఎస్‌టీపరమైన మార్పుల కారణంగా ఆదాయాలను పోల్చి చూడటానికి లేదని ఐటీసీ తెలిపింది.
క్యూ4లో మొత్తం వ్యయాలు రూ. 6,996 కోట్లు. అంతక్రితం నాలుగో త్రైమాసికంలో ఇవి రూ. 11,364 కోట్లు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1 ముఖ విలువ గల షేరు ఒక్కింటికి రూ. 5.15 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని సంస్థ బోర్డు సిఫార్సు చేసింది. బుధవారం బీఎస్‌ఈలో ఐటీసీ షేర్లు 1.47 శాతం పెరిగి రూ. 285.95 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment