సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ తగ్గింపు రేట్ల అమలుపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అధ్యక్షులు వనజా సర్నా సీరియస్‌గా స్పందించడంతో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు వెంటనే చర్యలకు దిగాయి. దేశీయమేజర్ ఎఫ్ ఎంసీజీ కంపెనీలన్నీ ఎంఆర్‌పీధరలను తక్షణమే కచ్చితంగా అమలు చేయాలని సీబీఈసీ అధ్యక్షులు సోమవారం ఒక లేఖ రాశారు. జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని.. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఆయా ఉత్పత్తులపై జీఎస్‌టీ సవరించిన రేట్లను అమలు చేయనున్నట్టు ప్రకటించాయి.
తాజా జీఎస్‌టీ నోటిఫికేషన్ కింద వివిధ కంపెనీలను తమ ఉత్పత్తుల ధరలను తగ్గించి విక్రయించనున్నట్టు వెల్లడించాయి. ముఖ్యంగా ఐటీసీ ,డాబర్ హెచ్‌యూఎల్, మారికో లాంటి కంపెనీలు సవరించిన ఎమ్ఆర్‌పి రేట్ల జాబితా వెల్లడించాయి. డీయొడరెంట్స్, హెయిర్ జెల్ హెయిర్ క్రీమ్స్, బాడీ కేర్ వంటి ఉత్పత్తులపై ఎంఆర్‌పిని తగ్గించిందని మారికో సిఎఫ్‌వో వివేక్ కర్వ్ ప్రకటించారు. అదేవిధంగా, హెచ్‌యూఎల్ ప్రతినిధి మాట్లాడుతూ, బ్రూ గోల్డ్ కాఫీ 50 గ్రాముల ప్యాక్ ధర రూ. 145 నుంచి 111 రూపాయలకు ను తగ్గించిందన్నారు. జీఎస్‌టీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించేందుకు తాము కట్టుబడిఉన్నామన్నారు. షాంపులు, స్కిన్ కేర్, ఇతర సౌందర్యసాధనాలపై 9శాతం తగ్గించిన ధరలను అమలు చేయన్నుట్టు డాబర్ సీఎఫ్‌ఓ లలిత్ మాలిక్ ప్రకటించారు. తెలిపింది. మరోవైపు ఈ ప్రకటన నేపథ్యంలో బుధవారం నాటి మార్కెట్ లో పలు ఎఫ్‌ఎంసీజీ కంపెనీ కౌంటర్లు ఫ్లాట్‌గా ట్రేడ్‌అవుతున్నాయి.
కాగా జీఎస్‌టీ కౌన్సిల్‌తాజాగా 178 అంశాలపై జీఎస్‌టీ వడ్డీరేటును 29శాతంనుంచి 18 శాతానికి తగ్గించింది. అలాగే అనేక అంశాలపై 18 శాతం నుంచి 12 శాతానికి, 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. చూయింగ్ గమ్, చాక్లెట్లు, కాఫీ, కస్టర్డ్ పౌడర్, డెంటల్ పరిశుభ్రత ఉత్పత్తులు, సారాంశాలు, తర్వాత గొరుగుట, దుర్గంధం, డిటర్జెంట్ మరియు వాషింగ్ పవర్, రేజర్స్ మరియు బ్లేడ్లు, కత్తులు, బ్యాటరీలు, గాగుల్స్, వాచీలు జీఎస్టీ 18శాతంగా ఉంది. కండెన్స్డ్ మిల్, శుద్ధి చేసిన చక్కెర, పాస్తా కరివేపాకు, డయాబెటిక్ ఫుడ్, వెదురు / చెరకు ఫర్నిచర్ పన్ను రేటు 12 శాతానికి తగ్గించింది. నవంబరు15నుంచి ఈ సవరించిన రేట్లు అమల్లోకి వస్తాయని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment