GST rates
-
రత్నాభరణాలపై జీఎస్టీ తగ్గింపు?
రత్నాభరణాల పరిశ్రమలో ఉత్పత్తవుతున్న వస్తువులపై జీఎస్టీని తగ్గించాలని ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) ప్రభుత్వాన్ని కోరింది. జీఎస్టీకి సంబంధించి రాబోయే బడ్జెట్లో తీసుకోబోయే నిర్ణయాలపై వివిధ విభాగాల నుంచి ప్రభుత్వం వినతులు కోరింది. అందులో భాగంగా జీజేసీ రత్నాభరణాల ఉత్పత్తిపై జీఎస్టీని తగ్గించాలని తెలిపింది.ఈ సందర్భంగా జీజేసీ ఛైర్మన్ రాజేశ్ రోక్డే మాట్లాడుతూ..‘జెమ్స్ అండ్ జువెలరీ రంగం ఉత్పత్తి చేస్తున్న వస్తువులపై జీఎస్టీ(GST)ని 1 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరాం. ప్రస్తుతం అది 3 శాతంగా ఉంది. జీఎస్టీని తగ్గిస్తే వినియోగదారులపై వ్యయ భారం తగ్గుతుంది. రాబోయే బడ్జెట్లో వ్యాపారాలకు, తయారీ రంగానికి ఊతమిచ్చేలా పన్నుల హేతుబద్ధీకరణ ఉండాలని తెలియజేశాం. వరుసగా పెరుగుతున్న బంగారం రేట్లకు అనుగుణంగా ప్రస్తుత జీఎస్టీ రేటు అంతకంతకూ పెరుగుతోంది. ఇది పరిశ్రమకు, అంతిమ వినియోగదారులకు భారంగా మారుతోంది. సహజ వజ్రాలు, ల్యాబ్‌లో తయారు చేసే వజ్రాలకు మధ్య తేడా గుర్తించేలా పకడ్బందీ విధానాలు ఉండాలి. ప్రస్తుతం సహజ వజ్రాలు(Natural diamonds), ప్రయోగశాలలో తయారు చేసే వజ్రాలపై ఒకే జీఎస్టీ రేటు ఉంది. ల్యాబ్‌లో తయారు చేసే వజ్రాలపై జీఎస్టీ తగ్గించాలి’ అన్నారు.ఇదీ చదవండి: అమెజాన్ తొలి రాకెట్ ప్రయోగం.. స్పేస్ఎక్స్కు ముప్పు?ఆభరణాల కొనుగోలుపై ఈఎంఐజ్యువెలరీ పరిశ్రమకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని, రాష్ట్రాల వారీగా స్పెషల్ నోడళ్లను ఏర్పాటు చేయాలని జీజేసీ ప్రభుత్వాన్ని కోరింది. ఆభరణాల కొనుగోలుపై ఈఎంఐను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో కోరుతున్నట్లు జీజేసీ తెలిపింది. వచ్చే సమావేశాల్లో ఈమేరకు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. పన్ను రేటు తగ్గింపు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అధికారిక కొనుగోళ్లు పెరుగుతాయని జీజేసీ వైస్ ఛైర్మన్ అవినాష్ గుప్తా అన్నారు. ఆర్థిక వ్యవస్థలో నిరుపయోగంగా ఉన్న గృహ బంగారాన్ని వెలికితీసే కొత్త విధానాలు ప్రవేశపెట్టాలని తెలిపారు. -
జీఎస్టీ నిబంధనలు పాటించని 30 విభాగాలు గుర్తింపు
పన్ను పరిధిని విస్తరించడానికి, జీఎస్టీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొత్త విధానాలను అన్వేషిస్తోంది. పన్ను ఎగవేతను గుర్తించి, అధికారికంగా నమోదుకాని డీలర్లను దాని పరిధిలోకి తీసుకురావడానికి గుజరాత్ రాష్ట్ర జీఎస్టీ యంత్రాంగం 30 బిజినెస్-టు-కన్స్యూమర్ (బీ2సీ) విభాగాలను గుర్తించింది. చాలా మంది రిజిస్టర్డ్ ట్రేడర్లు తమ ఆదాయాన్ని తక్కువగా నివేదిస్తున్నారని జీఎస్టీ అధికారులు తెలిపారు. మరికొందరు తమ వివరాలు నమోదు చేయకుండా పరిమితికి మించి సంపాదిస్తున్నారని చెప్పారు. అలాంటి వారిని కట్టడి చేసేలా 30 బీ2సీ విభాగాలను గుర్తించినట్లు చెప్పారు.ప్రభుత్వం గుర్తించిన బీ2సీ సెక్టార్లకు సంబంధించి అద్దె పెళ్లి దుస్తుల వ్యాపారులు, పాదరక్షలు, సెలూన్లు, నాన్ క్లినికల్ బ్యూటీ ట్రీట్మెంట్స్, ఐస్ క్రీం పార్లర్లు, టెక్స్టైల్ విక్రేతలు, పొగాకు వ్యాపారులు, బ్యాటరీ వ్యాపారులు, మొబైల్ ఫోన్, యాక్సెసరీస్ డీలర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, కృత్రిమ పూలు అమ్మకం దారులు, అలంకరణ ఉత్పత్తుల విక్రేతలు, కోచింగ్ క్లాసుల నిర్వాహకులు ఉన్నట్లు తెలిపారు.పరిమితి దాటినా నమోదవ్వని వివరాలు..రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 12 లక్షల మంది రిజిస్టర్డ్ డీలర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే వీరి వాస్తవ సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. జీఎస్టీ నిబంధనల ప్రకారం పన్నుదారులను దీని పరిధిలోకి తీసుకురావడంపై దృష్టి సారించామన్నారు. బీ2సీ విభాగంలో చాలా మంది పన్ను చెల్లింపుదారులు వారి పూర్తి ఆదాయాన్ని నివేదించడం లేదన్నారు. కొందరు సరైన బిల్లులను జారీ చేయకుండా లావాదేవీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. చాలా మంది వ్యాపారుల టర్నోవర్ జీఎస్టీ పరిమితిని మించినప్పటికీ వివరాలు నమోదు చేయడం లేదన్నారు. పన్ను ఎగవేతను తగ్గించడమే లక్ష్యంగా కొన్ని విధానాలను ప్రవేశపెట్టబోతున్నట్లు వివరించారు.ఇదీ చదవండి: అంబానీ జెట్ పైలట్ల జీతం ఎంతంటే..రెండు నెలల్లో రూ.20 కోట్లు..గత రెండు నెలలుగా గుజరాత్ వ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహించి రాష్ట్ర జీఎస్టీ విభాగం రూ.20 కోట్ల పన్ను ఎగవేతను గుర్తించింది. పన్ను పరిధిని విస్తరించడానికి దేశవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. సరైన బిల్లింగ్ లేకుండా లావాదేవీలు నిర్వహిస్తున్న వారి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. రిజిస్టర్ కాని డీలర్లకు సరుకులు సరఫరా చేసే రిజిస్టర్డ్ ట్రేడర్లు కూడా ప్రభుత్వ పరిశీలనలోకి వస్తారని తెలియజేస్తున్నారు. -
పెరిగిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (GST) వసూళ్లు 2024 డిసెంబర్లో స్థూలంగా (2023 ఇదే నెలతో పోల్చి) 7.3 శాతం పెరిగి రూ.1.77 లక్షల కోట్లకు చేరాయి. సమీక్షా నెల్లో దేశీయ లావాదేవీల నుంచి జీఎస్టీ వసూళ్లు 8.4 శాతం పెరిగి రూ.1.32 లక్షల కోట్లకు చేరగా, దిగుమతుల పైన వచ్చే పన్నుల వసూళ్లు దాదాపు 4 శాతం పెరిగి రూ.44,268 కోట్లకు చేరాయి. డిసెంబర్లో రిఫండ్స్(Refunds) భారీగా నమోదుకావడం గమనార్హం.ఇదీ చదవండి: 2024లో కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..రిఫండ్స్ 31 శాతం పెరిగి రూ.22.490 కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్లను సవరించిన తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు 3.3 శాతం పెరిగి రూ.1.54 లక్షల కోట్లకు చేరాయి. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ. 32,836 కోట్లు. స్టేట్ జీఎస్టీ రూ. 40,499 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.47,783 కోట్లు. సెస్సు(Cess) రూ.11,471 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో రూ.2.10 లక్షల కోట్లు నమోదయ్యాయి. ఈ వసూళ్ల ఇప్పటి వరకూ ఒక రికార్డు. -
పాప్‌కార్న్‌పై జీఎస్టీ.. నెట్టింట చర్చ
పాప్‌కార్న్‌లోని చక్కెర, మసాలా స్థాయుల ఆధారంగా విభిన్న పన్ను స్లాబ్‌లను అమలు చేయడంపట్ల నెట్టింట తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇటీవల రాజస్థాన్‌లోని జసల్మేర్‌లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్(GST Council) సమావేశంలో జీఎస్టీను హేతుబద్దీకరించేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా పాప్‌కార్న్(Popcorn)లోని చక్కెర, మసాలా స్థాయులను అనుసరించి విభిన్న రేట్లను నిర్దేశించారు.సాల్ట్, మసాలాలతో కూడిన నాన్ బ్రాండెడ్ పాప్‌కార్న్‌పై 5 శాతం జీఎస్టీ, ప్రీ ప్యాకేజ్డ్, బ్రాండెడ్ పాప్‌కార్న్‌పై 12 శాతం, కారామెల్ పాప్‌కార్న్, చక్కెర కంటెంట్ ఉన్న పాప్‌కార్న్‌పై 18 శాతం జీఎస్టీను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రేట్లు వెంటనే అమలు చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఆదివారం పాప్‌కార్న్ కొనుగోలు చేసివారు వాటిపై జీఎస్టీ(GST) విధించడాన్ని చూసి ఆశ్చర్యపోయారు.Complexity is a bureaucrat’s delight and citizens’ nightmare. https://t.co/rQCj9w6UPw— Prof. Krishnamurthy V Subramanian (@SubramanianKri) December 22, 2024ఇదీ చదవండి: ‘గూగులీనెస్’ అంటే తెలుసా? సుందర్ పిచాయ్ వివరణఅదనపు చక్కెర, మసాలాలతో కూడిన ఉత్పత్తులపై వేర్వేరుగా పన్ను విధిస్తున్నట్లు కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి తెలిపారు. ఏదేమైనా ఈ నిర్ణయం వల్ల ప్రతిపక్ష రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు, ప్రభుత్వ మద్దతుదారుల నుంచి కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. నెట్టింట ఈ వ్యవహారంపై తీవ్రంగానే చర్చ జరుగుతోంది. జీఎస్టీ హేతుబద్దీకరణ పేరుతో సాధారణ పౌరులపై పన్నుల రూపంలో భారీగా ఆర్థిక భారం మోపుతున్నట్లు విమర్శకులు వాదిస్తున్నారు. -
ఈ వస్తువులపై భారీగా పెరగనున్న జీఎస్టీ!
గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST) అమలులోకి వచ్చిన ఏడు సంవత్సరాల తర్వాత.. మొదటిసారి పన్ను రేట్లలలో భారీ మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపైన తుది నిర్ణయం ఈనెల 21న జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వెలువడుతుంది.పన్ను రేటు హేతుబద్దీకరణలో భాగంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల మీద మాత్రమే కాకుండా శీతలపానీయాల మీద జీఎస్టీని 28 శాతం నుంచి 35 శాతానికి పెంచే అవకాశం ఉంది. రెడీమేడ్ వస్త్రాలపై కూడా జీఎస్టీ రేటు పెరుగుతుందని.. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ అధ్యక్షతన జరిగిన జీవోఎం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు 5, 12, 18, 28 శాతం అనే నాలుగు అంచెల పన్ను శ్లాబులు మాత్రమే ఉండేవి. త్వరలో 35 శాతం కొత్త రేటు కూడా శ్లాబులో చేరనున్నట్లు సమాచారం.రూ.1,500 విలువైన రెడీమేడ్ దుస్తులపై 5 శాతం, రూ.1,500 నుంచి రూ.10,000 మధ్య ధర ఉన్న దుస్తులపై 18 శాతం, రూ. 10వేలు కంటే ఎక్కువ ధర ఉన్న వస్త్రాల మీద 28 శాతం జీఎస్టీ విధించనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు కొత్తగా 148 ఉత్పత్తులపై ట్యాక్స్ విధించనున్నట్లు జీవోఎం సూచించింది. సౌందర్య సాధనాలు, గడియారాలు, బూట్లు వంటి వాటిపై కూడా ట్యాక్స్ పెంచే అవకాశం ఉందని జీవోఎం ప్రతిపాదించింది.ఇదీ చదవండి: రూ.2000 నోట్లపై ఆర్బీఐ అప్డేట్..జిఎస్టి కౌన్సిల్ డిసెంబర్ 21న జైసల్మేర్‌లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై కూడా కీలక ప్రతిపాదనలు వెల్లడించే అవకాశం ఉంది. కార్లు, వాషింగ్ మెషిన్స్ వంటివి 28 శాతం జీఎస్టీ కింద ఉన్నాయి. వీటిని 35 శాతం శ్లాబులోకి చేరుస్తారా? లేదా.. 28 శాతం వద్దనే ఉంచుతారా అనే విషయాలు 21వ తేదీ తెలుస్తుంది. -
కొత్త ట్యాక్స్ కోడ్: రేపటి భారతదేశ నిర్మాణం కోసం..
2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనికోసం కొత్త ట్యాక్స్ కోడ్ అవసరమని నిపుణులు బడ్జెట్‌కు ముందే చెప్పారు. ఆర్ధిక వ్యవస్థను శక్తివంతం చేస్తూ.. నికర రాబడిని పెంచడం వంటివి అవసరం. 2025-26 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో దీనికి సంబంధించిన విషయాలను వెల్లడించనున్నారు.''ది న్యూ టాక్స్ కోడ్: రేపటి భారతదేశాన్ని నిర్మించడానికి ఆలోచనలు" అనే సెమినార్‌ను థింక్ చేంజ్ ఫోరమ్ (TCF) నిర్వహించింది. ఈ సెమినార్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ మాజీ చైర్మన్ పీసీ ఝా, పాలసీ అడ్వైజరీ & స్పెషాలిటీ సర్వీసెస్ పార్టనర్ అండ్ లీడర్ రాజీవ్ చుగ్, మేనేజింగ్ పార్టనర్ సూరజ్ మాలిక్, సీనియర్ పార్టనర్ రజత్ మోహన్ మొదలైనవారు పాల్గొన్నారు.జీఎస్టీ కింద చాలా పన్ను రేట్లు ఉండటం మంచి పరిస్థితి కాదు. జీఎస్టీ అనేది ఒక పన్ను రేటుగా మాత్రమే ఉండాలి. కానీ.. మన దేశంలో ఒక పన్ను రేటును కలిగి ఉండటం సాధ్యం కాదు. కాబట్టి మూడు పన్ను రేట్లను పరిశీలించే అవకాశం ఉంది. అవి 5 శాతం, 16 శాతం & 28 శాతం. 16 శాతం అనేది.. 12 శాతం, 18 శాతానికి బదులుగా రానుందని పీసీ ఝా చెప్పారు.పన్నుల వ్యవస్థలో ప్రస్తుత నిబంధనలను సరళీకృతం చేయాల్సిన అవసరాన్ని సమర్ధిస్తూ.. పన్ను రేట్ల తగ్గింపు పౌరులు.. కంపెనీల చేతుల్లో ఆదాయం పెరగడానికి దారి తీస్తుందని, తద్వారా ఆర్ధిక వృద్ధి పెరుగుతుందని రాజీవ్ చుగ్ పేర్కొన్నారు. సెమినార్లో పాల్గొన్న ప్రముఖులందరూ కూడా పన్ను చట్టాలలో మార్పుల అవసరని తమ అభిప్రాయాలను వెల్లడించారు. -
రూ.8 వేలకోట్ల ఎగవేతకు ప్రణాళిక.. సూత్రధారి అరెస్ట్
దేశంలో జీఎస్టీ ఎగవేత మోసాలు ఎక్కువవుతున్నాయి. రూ.5,000 కోట్లు-రూ.8,000 కోట్ల విలువైన జీఎస్టీని ఎగవేసేందుకు 246 బోగస్ కంపెనీలను సృష్టించిన ముఠా గుట్టు రట్టయింది. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన అస్రఫ్ ఇబ్రహీం కలవాడియా(50) సహా ఎనిమిది మంది వ్యక్తులపై పుణె పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బృందం నకిలీ పత్రాలు, సంస్థలను సృష్టించి మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్లు గుర్తించారు.పుణెలోని కోరేగావ్ పార్క్ పోలీసుల కథనం ప్రకారం..సూరత్‌కు చెందిన అస్రఫ్ ఇబ్రహీం కలవాడియా (50) సహా ఎనిమిది మంది వ్యక్తులు భారీగా జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 246 బోగస్ కంపెనీలు సృష్టించి ఈ చర్యకు పూనుకున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏకంగా రూ.5000 కోట్లు-రూ.8000 కోట్లు వరకు నష్టం జరుగుతుంది. సెప్టెంబర్ 2018-మార్చి 2024 మధ్య వివిధ కంపెనీలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిగింది. పుణెకు చెందిన హడప్సర్లోని శివ చైతన్య కాలనీ చిరునామాతో రిజిస్ట్రర్ అయిన పఠాన్ ఎంటర్ప్రైజెస్ రూ.20.25 కోట్ల జీఎస్టీను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. దాంతో జీఎస్టీ సిబ్బంది ఫిర్యాదు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) జోనల్ యూనిట్ అధికారులు పుణె పోలీసుల సహకారంతో కలవాడియాను ఎరవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సంఘటనలో తనకు సహకరించిన మరో ఏడుగురు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు.ఆటోరిక్షా డ్రైవర్ పేరుతో కంపెనీ నమోదుపఠాన్ షబ్బీర్ ఖాన్ అన్వర్ ఖాన్ అనే వ్యక్తి పాన్‌కార్డుతో పఠాన్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థను నమోదు చేశారు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోని ఖుంబర్వాడ ప్రాంతానికి చెందిన పఠాన్ ఆటోరిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పాన్‌కార్డులో నమోదైన చిరునామాతో పోలీసులు తన ఇంటికి వెళ్లేసరికి అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. తనకు ఈ వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. నిందితులు చట్ట విరుద్ధంగా పఠాన్ పాన్‌కార్డు వాడి కంపెనీ నమోదు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.ఇదీ చదవండి: డిఫెన్స్ ఉత్పత్తులు ఎగుమతయ్యే టాప్ 3 దేశాలుసెక్యూరిటీగార్డు పేరుతో బ్యాంకు ఖాతాతదుపరి విచారణలో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జీత్ కుకాడియా అనే పేరుతో బ్యాంక్ ఖాతా తెరిచారు. కుకాడియా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ నేరంతో తనకు సంబంధం లేదని ఆయన తెలిపారు. బ్యాంకు స్టేట్మెంట్లు, కాల్ రికార్డులను పరిశీలించిన తర్వాత ఈ ఘటనకు కలవాడియాను ప్రధాన సూత్రధారిగా గుర్తించామని సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ప్రకాశ్ తెలిపారు. ముంబైలోని మీరా భయాందర్‌లోని ఒక హోటల్లో కలవాడియాను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తన వద్ద నుంచి సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, సిమ్ కార్డ్‌లు, చెక్ బుక్‌లు, డెబిట్ కార్డ్‌లు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పన్ను ఎగవేత కోసం మోసపూరిత లావాదేవీలు జరిపేందుకు నకిలీ పత్రాలను ఉపయోగించినట్లు కలవాడియా అంగీకరించాడని ప్రకాశ్ వివరించారు. -
వీటిపై జీఎస్టీ తగ్గింపు.. భారీగా తగ్గనున్న ధరలు
జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం (GoM) కొన్ని వస్తువుల ధరల మీద జీఎస్టీ తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో 20-లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్, సైకిళ్స్, ఎక్సర్సైజ్ నోట్బుక్లు ఉన్నాయి. ఇదే సమయంలో రిస్ట్ వాచీలు, బూట్లపైన జీఎస్టీ పెంచినట్లు అధికారి తెలిపారు.బీహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆధ్వర్యంలో జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం తీసుకున్న రేట్ రీజిగ్ నిర్ణయం రూ. 22,000 కోట్ల ఆదాయానికి దారి తీస్తుందని అధికారులు తెలిపారు.20 లీటర్లు అంతకంటే ఎక్కువ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని మంత్రుల బృందం ప్రతిపాదించింది. మంత్రుల బృందం సిఫార్సును జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించినట్లయితే.. రూ.10,000 కంటే తక్కువ ధర ఉన్న సైకిళ్లపై జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గుతుంది.ఎక్సర్సైజ్ నోట్‌బుక్‌లపై కూడా జీఎస్టీ 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించనున్నట్లు మంత్రుల బృందం ప్రతిపాదించింది. రూ.15,000 కంటే ఎక్కువ ధర కలిగిన బూట్లు మీద, రూ. 25,000 ఎక్కువ ధర కలిగిన రిస్ట్ వాచీలపై జీఎస్టీ 18 శాతం నుంచి 28 శాతానికి పెంచనున్నారు.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీసమావేశంలో రేట్ల హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం తీసుకున్న నిర్ణయాలు.. సామాన్యులకు ఉపశమనం కలిగించనున్నాయి. ఈ సమావేశంలో 100 కంటే ఎక్కువ వస్తువులకు సంబంధించి జీఎస్టీ రేట్లను చర్చించారు. అయితే 18 శాతం శ్లాబులో ఉన్న హెయిర్ డ్రైయర్లు, హెయిర్ కర్లర్లపై ఉన్న జీఎస్టీని మళ్ళీ 28 శాతం శ్లాబులోకి చేర్చనున్నట్లు బృందం వెల్లడించింది.జీఎస్టీ అనేది ప్రస్తుతం 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం అనే నాలుగు శ్లాబుల్లో ఉంది. ఇందులో కొన్ని వస్తువులు తక్కువ శ్లాబులో.. మరికొన్ని ఎక్కువ శ్లాబులో ఉన్నాయి. మరికొన్ని వస్తువులకు జీఎస్టీ మాత్రమే కాకుండా.. అదనంగా సెస్‌ను కూడా విధిస్తున్నారు. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, సీనియర్ సిటిజన్ భీమా కవరేజీకి జీఎస్టీలో మినహాయింపు ఉండవచ్చు. -
జీఎస్టీ శ్లాబుల క్రమబద్ధీకరణపై 25న చర్చ
జీఎస్టీలో ప్రస్తుతమున్న వివిధ రకాల శ్లాబుల క్రమబద్ధీకరణ, రేట్ల తగ్గింపుపై మంత్రుల బృందం ఈ నెల 25న భేటీ కానుంది. గోవాలో మంత్రుల బృందం సమావేశం అవుతున్నట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మంత్రుల బృందం (జీవోఎం) చివరిసారి ఆగస్టు 22న సమావేశం కాగా, ఈ నెల 9న జీఎస్టీ కౌన్సిల్‌కు ఈ అంశంపై స్థాయీ నివేదిక సమర్పించింది.కొన్ని రకాల వస్తు, సేవల పన్ను రేట్లలో మార్పులు చేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయాలపై పన్ను అధికారులతో కూడిన ఫిట్మెంట్ కమిటీ నుంచి మంత్రుల బృందం నివేదిక కోరడం గమనార్హం. ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28 రేట్లు అమల్లో ఉన్నాయి. నిత్యావసర వస్తువులను తక్కువ శ్లాబులో, విలాస వస్తువులను అధిక శ్లాబులో ఉంచారు. 12 శాతం, 18 శాతం స్థానంలో ఒక్కటే పన్ను ఉండాలన్న ప్రతిపాదన ఉంది. పశ్చిమబెంగాల్, కర్ణాటక రాష్ట్రాలు శ్లాబులను కుదించడం పట్ల సానుకూలంగా లేవు. జీఎస్టీ శ్లాబుల్లో ఎలాంటి మార్పులు ఉండొద్దన్నది ఈ రాష్ట్రాల వాదనగా ఉంది. ఇదీ చదవండి: పెరుగుతున్న ఈఎంఐ కల్చర్! -
జీఎస్టీ తగ్గింపు.. కౌన్సిల్ కీలక నిర్ణయాలు
జీఎస్టీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొన్ని క్యాన్సర్ మందులపై రేట్లను తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక వైద్య ఆరోగ్య బీమాపై రేటు తగ్గింపు అంశం వాయిదా పడింది. నవంబర్‌లో జరిగే తదుపరి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు.జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సీతారామన్.. కొన్ని క్యాన్సర్ ఔషధాలపై జీఎస్టీ రేట్లను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. అలాగే నామ్కీన్ స్నాక్స్పైన కూడా జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించినట్లు వెల్లడించారు. రీసెర్చ్ ఫండ్‌పై జీఎస్టీ మినహాయిస్తూ నిర్ణయం తీసుకోగా కారు సీట్లపై జీఎస్టీని 18 నుంచి 28 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.గత ఆరు నెలల్లో ఆన్లైన్ గేమింగ్ ద్వారా వచ్చే ఆదాయం 412 శాతం పెరిగి రూ. 6,909 కోట్లకు చేరుకుందని ఆర్థిక మంత్రి తెలిపారు. దీంతో పాటు గత ఆరు నెలల్లో క్యాసినోల ద్వారా ఆదాయం 34 శాతం పెరిగిందన్నారు. ఆరోగ్య బీమాపై జీఎస్టీ రేటు తగ్గింపుపై కొత్త మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిందని, ఇది అక్టోబర్ చివరి నాటికి తమ నివేదికను సమర్పిస్తుందని సీతారామన్ చెప్పారు. -
జీఎస్టీ శ్లాబులు తగ్గింపు..?
జీఎస్టీ శ్లాబులను మరింత సరళతరం చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ ఛైర్మన్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నిర్మాణాన్ని క్రమబద్ధీకరించేందుకు ప్రస్తుతం అమలవుతున్న నాలుగు శ్లాబులను మూడుకు తగ్గించేలా చర్చలు సాగుతున్నాయని చెప్పారు.ఈ సందర్భంగా సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం అమలవుతున్న జీఎస్టీ శ్లాబుల విధానంలో చాలా వస్తువుల వర్గీకరణపై వివాదాలున్నాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పన్ను చెల్లింపులను మరింత సరళతరం చేసేందుకు ప్రస్తుతం ఉన్న నాలుగు జీఎస్టీ శ్లాబులను మూడుకు తగ్గించేలా చర్చలు జరుగుతున్నాయి. జులై 2017లో జీఎస్టీను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆదాయ వృద్ధి మెరుగుపడింది’ అన్నారు.ఇదీ చదవండి: ఈఎస్ఐ పథకంలోకి భారీగా చేరిన ఉద్యోగులుకేంద్ర బడ్జెట్ 2024-25 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..‘జీఎస్టీ ప్రయోజనాలను పెంచడం కోసం పన్ను నిర్మాణాన్ని మరింత సరళీకృతం చేసేందుకు ప్రయత్నిస్తాం. జీఎస్టీ పరిధిని ఇతర రంగాలకు విస్తరిస్తాం’ అని చెప్పారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రాబడుల్లో స్థిరమైన వృద్ధి నమోదైంది. ఏప్రిల్ 2024లో ఆల్ టైమ్హై రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ప్రస్తుతం జీఎస్టీ శ్లాబులు 5%, 12%, 18%, 28%గా ఉన్నాయి. -
వాహనాల ధర ఎందుకు పెరుగుతుందో తెలుసా..?
పుణే, బిజినెస్ బ్యూరో: కాలుష్యాన్ని కట్టడి చేసే పేరిట అతి నియంత్రణలు, అధిక స్థాయి జీఎస్టీలను అమలు చేయడం వల్లే వాహనాల రేట్లకు రెక్కలు వచ్చాయని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. బ్రెజిల్ వంటి దేశాల్లో మోటార్‌సైకిళ్లపై పన్నులు 8–14 శాతం శ్రేణిలో ఉండగా దేశీయంగా మాత్రం అత్యధికంగా 28 శాతం జీఎస్టీ ఉంటోందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనాల ధరలను తగ్గించే పరిస్థితి ఉండటం లేదని, దీంతో నిర్వహణ వ్యయాలైనా తగ్గే విధంగా వాహనాలను రూపొందించడం ద్వారా కొనుగోలుదారులకు కొంతైనా ఊరటనిచ్చే ప్రయత్నం జరుగుతోందని బజాజ్ చెప్పారు. 125 సీసీ పైగా సామర్ధ్యం ఉండే స్పోర్ట్స్ మోటార్‌సైకిళ్ల విభాగంలో తమకు ముప్ఫై రెండు శాతం మేర వాటా ఉందని, దీన్ని మరింతగా పెంచుకునే దిశగా డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదం తరహాలో డబుల్ ఇంజిన్ కారోబార్ (కార్యకలాపాలు) వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రాజీవ్ చెప్పారు.బజాజ్ పల్సర్ 400 ధర రూ. 1,85,000బజాజ్ ఆటో తాజాగా పల్సర్ ఎన్ఎస్ 400జీ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. ప్రారంభ ఆఫర్ కింద దీని ధర రూ. 1,85,000గా (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటుంది. డెలివరీలు జూన్ మొదటివారం నుంచి ప్రారంభమవుతాయని సంస్థ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు. స్పోర్ట్స్ సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు పల్సర్ బైకులు 1.80 కోట్ల పైచిలుకు అమ్ముడైనట్లు బజాజ్ వివరించారు. పరిమిత కాలం పాటు వర్తించే ఆఫర్ కింద కొత్త పల్సర్‌ను రూ. 5,000కే బుక్ చేసుకోవచ్చు. నాలుగు రంగుల్లో ఇది లభిస్తుంది. శక్తివంతమైన 373 సీసీ ఇంజిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, ఎల్రక్టానిక్ థ్రోటిల్ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. సీఎన్జీ మోటార్‌సైకిల్‌ను జూన్ 18న ఆవిష్కరించనున్నామని రాజీవ్ చెప్పారు. ఇది ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ అన్నారు. -
గరిష్ఠాలను చేరిన జీఎస్టీ వసూళ్లు.. 2017 నుంచి ఇదే టాప్!
భారతదేశ జీఎస్టీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా వసూళ్లు నమోదయ్యాయి. ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ కలెక్షన్లు రూ.2.10 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటివరకు అత్యధికంగా 2023 ఏప్రిల్‌లో రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ఏడాది ప్రాతిపదికన ఈ వసూళ్లలో 12.4 శాతం వృద్ధి నమోదైందని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.2024 మార్చిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.78 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. నెలవారీగా 13.4 శాతం వృద్ధిచెంది ఏప్రిల్‌లో అత్యధికంగా జీఎస్టీ రూ.2.10 లక్షలకోట్లకు చేరింది. రిఫండ్లను లెక్కించిన తర్వాత ఏప్రిల్ 2024లో నికర జీఎస్టీ ఆదాయం రూ.1.92 లక్షల కోట్లుగా ఉంటుంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 17.1% వృద్ధి నమోదైంది.2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం నెలకు సగటున రూ.1.8 లక్షల కోట్లకు చేరుతుందని సీబీడీటీ కస్టమ్స్ ఛైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 2022-23లో నెలవారీగా సగటు జీఎస్టీ వసూళ్లు రూ.1.51 లక్షల కోట్లుగా నమోదైంది. 2023-24లో సగటును రూ.1.68 లక్షల కోట్లకు చేరింది. 2017 జులైలో జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్నెలలో అత్యధిక వసూళ్లు రికార్డవుతున్నాయి.👉 #GST revenue collection for April 2024 highest ever at Rs 2.10 lakh crore👉 #GST collections breach landmark milestone of ₹2 lakh crore 👉 Gross Revenue Records 12.4% y-o-y growth👉 Net Revenue (after refunds) stood at ₹1.92 lakh crore; 17.1% y-o-y growthRead more… pic.twitter.com/Ci7CE7h35o— Ministry of Finance (@FinMinIndia) May 1, 2024 -
ఎల్ఐసీకి రూ.806 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) జీఎస్టీ నుంచి రూ.806 కోట్లకు సంబంధించిన డిమాండ్ ఆర్డర్ కమ్ పెనాల్టీ నోటీసును అందుకున్నట్లు సంస్థ రిగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఇందులో రూ.365 కోట్లు జీఎస్టీ చెల్లింపులుకాగా, రూ.405 కోట్లు జరిమానా, రూ.36 కోట్లు వడ్డీతో కలిపి మొత్తం రూ.806 కోట్లకు పైగా చెల్లించాలని తెలిపింది. ఇందుకు సంబంధించి జనవరి 1న నోటీసు అందినట్లు సంస్థ చెప్పింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ నోటీసులు అందినట్లు సమాచారం. నిర్దేశించిన గడువులోగా ఆర్డర్‌కు వ్యతిరేకంగా అప్పీల్ దాఖలు చేయనున్నట్లు ఎల్ఐసీ పేర్కొంది. ప్రస్తుతం వచ్చిన నోటీసులతో ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని సంస్థ అధికారులు తెలిపారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, రీఇన్సూరెన్స్ నుంచి పొందిన ఐటీసీ రివర్సల్, జీఎస్టీఆర్కు చెల్లించిన ఆలస్య రుసుంపై వడ్డీ, అడ్వాన్స్‌పై వడ్డీ కలిపి సంస్థకు రూ.806 కోట్లకు నోటీసులు పంపించినట్లు తెలిసింది. -
జీఎస్టీ వసూళ్లు రూ.1.64 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు డిసెంబర్లో రూ.1.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022 ఇదే నెలతో పోలిస్తే ఈ విలువ 10 శాతం అధికం. ఏప్రిల్–డిసెంబర్ 2023 మధ్య జీఎస్టీ వసూళ్లు 12 శాతం పెరిగి రూ.14.97 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో వసూళ్లు సగటున 12 శాతం వృద్ధితో రూ.1.66 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరంలో తీరిది... ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో చరిత్రాత్మక స్థాయిలో రూ.1.87 లక్షల కోట్ల అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. మే, జూన్ నెలల్లో వరుసగా రూ.1.57 లక్షల కోట్లు, రూ.1.61 లక్షల కోట్లు ఒనగూరాయి. జూలై వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు. ఆగస్టు వసూళ్లు రూ. 1.59 లక్షల కోట్లుకాగా, సెప్టెంబర్‌లో రూ. 1.63 లక్షల కోట్ల జీఎస్టీ రాబడి నమోదయ్యింది. ఇక అక్టోబర్ విషయానికి వస్తే. వసూళ్లు భారీగా రూ.1.72 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2017 జూలైలో ప్రారంభం తర్వాత ఇవి రెండవ భారీ స్థాయి వసూళ్లు (2023 ఏప్రిల్ తర్వాత). నవంబర్‌లో వసూళ్లు రూ.1.67 లక్షల కోట్లు. ఎకానమీ క్రియాశీలత, పన్నుల ఎగవేతలను అడ్డుకునేందుకు కేంద్రం చర్యలు, వసూళ్ల వ్యవస్థలో సామర్థ్యం పెంపు, పండుగల డిమాండ్ జీఎస్టీ భారీ వసూళ్లకు కారణమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రానున్న నెలల్లో సైతం ఇదే ధోరణి కొనసాగుతుందన్న విశ్వాసాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం ఆదాయం రూ.1,64,882 ఇందులో సీజీఎస్టీ రూ.30,443 ఎస్జీఎస్టీ రూ.37,935 ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 84,255 సెస్ రూ.12,249 -
రూ.750 కోట్లు జీఎస్టీ బకాయి.. జొమాటో, స్విగ్గీలకు నోటీసులు
దిగ్గజ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) నోటీసులు జారీ చేసినట్లు మీడియా కథనాలు వచ్చాయి. ఈ కథనాల ప్రకారం.. జొమాటో, స్విగ్గీ వరుసగా రూ.400 కోట్లు, రూ.350 కోట్ల విలువైన జీఎస్టీ నోటీసులు అందుకున్నాయి. ఫుడ్ డెలివరీ అనేది ఒక సర్వీస్ కాబట్టి దాని ట్యాక్స్‌స్లాబ్‌కు తగినట్లు జొమాటో, స్విగ్గీ జీఎస్టీ చెల్లించాలని డీజీజీఐ తెలిపింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు జొమాటో, స్విగ్గీ డెలివరీ ఫీజు పేరుతో కస్టమర్ల నుంచి కొంత డబ్బు వసూలు చేస్తాయి. 'డెలివరీ ఛార్జీ' అనేది ఇంటింటికీ ఆహారాన్ని తీసుకెళ్లే డెలివరీ భాగస్వాములు భరించే ఖర్చు. కంపెనీలు ఆ ధరను కస్టమర్ల నుంచి సేకరించి వారి డెలివరీ భాగస్వాములకు అందిస్తాయి. అయితే ఈ విషయంలో జీఎస్టీ అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2022లో స్విగ్గీ, జొమాటో తమ ఆర్డర్లపై 5 శాతం రేటుతో పన్ను వసూలు చేసి జమ చేయాలనే నిబంధనలు ఉన్నాయి. అంతకు ముందు జీఎస్టీ కింద నమోదైన రెస్టారెంట్లు మాత్రమే పన్ను వసూలు చేసి జమ చేసేవి. గత నెలలో స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ల ప్లాట్‌ఫారమ్ చార్జీను రూ.2 నుంచి రూ.3కి పెంచింది. జొమాటో షేర్లు బుధవారం 1.07 శాతం నష్టపోయి రూ.115.25 వద్ద ముగిశాయి. -
GST Council: పేదల నుంచే జీఎస్టీ గరిష్ఠ వసూళ్లు
సాధారణ ప్రజలపై వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వారి ఆదాయ, వ్యయ విధానాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. పరోక్ష పన్నుల వల్ల దేశం, సమాజం ఎంతో ప్రభావితం చెందుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆదాయ వనరులు పెంచుకొనేందుకు పరోక్ష పన్నులపై ఆధారపడుతోంది. ప్రభుత్వ ఉత్పత్తుల అమ్మకం, గ్రాంట్లు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్‌లు, వ్యవసాయ ఆధారిత రాబడి, ప్రభుత్వ కాంట్రాక్టులు, పర్యాటకం, హాస్పటాలిటీ..వంటివి కేంద్రానికి ఎన్ని ఆదాయ మార్గాలున్నా అన్నింటిలో జీఎస్టీ వాటాయే అధికం. దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. రాబడిలో వృద్ధి ఆశాజనకంగా ఉంది. సగటున నెలకు సుమారు రూ.1.6 లక్షల కోట్లకుపైనే ఖజానాకు జమ అవుతోంది. తాజాగా అక్టోబర్ నెలకుగాను రూ.1.72లక్షల కోట్లు జీఎస్టీ వసూలైంది. అయితే ఇది రెండో అత్యధిక జీఎస్టీ వసూళ్లుగా నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.1.87లక్షల కోట్లలో గరిష్ఠస్థాయికి చేరింది. ప్రపంచమంతా అధిక ద్రవ్యోల్బణం, యుద్ధం, అనిశ్చితి భయాలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్‌లో ఆర్థిక కార్యకలాపాల నమోదు పరిమాణం పెరుగుతోంది. అందుకు సంకేతంగా రికార్డుస్థాయిలో జీఎస్టీ వసూలవుతుంది. అయితే ఇది ఇండియాతో పాటు ప్రపంచానికీ సానుకూల సంకేతమే. కానీ మొత్తం జీఎస్టీ రాబడిలో అధికభాగాన్ని సమకూరుస్తున్నది మాత్రం పేదలేనని ఆక్స్‌ఫామ్ నివేదించింది. ఇదీ చదవండి: పోస్ట్ ద్వారా 2,000 నోట్ల మార్పిడి కరోనా సమయంలో కుంటుపడిన ఆర్థిక వ్యవస్థ కొవిడ్ అనంతరం పుంజుకుంటుంది. కానీ లాక్డౌన్ సమయంలో అన్ని రంగాలు కుదేలయ్యాయి. చిన్నగా పరిస్థితులు మెరుగవగానే ఒక్కొక్కటిగా ధరలు పెంచడం ప్రారంభించాయి. ఖాళీగా ఉన్న రోజుల్లోని లోటును సైతం భర్తీ చేసేలా సామాన్యులపై ధరల భారాన్నిమోపాయనే వాదనలు ఉన్నాయి. దాంతో కిరాణా సామగ్రి నుంచి పెట్రో ఉత్పత్తుల వరకు పెరిగిన ధరల భారాన్ని భరిస్తున్న పేద కుటుంబాలే దేశ ఖజానాను నింపుతున్నాయి. కరోనా పరిణామాలు, ద్రవ్యోల్బణం ప్రభావంతో వినిమయ వస్తువుల ధరలన్నీ రెండేళ్లుగా పరుగులు తీస్తున్నాయి. ఆహారం, దుస్తులు, ఇంధనం, ఉక్కు సహా అన్నింటి ధరలూ పెరిగాయి. అధిక జీఎస్టీ వసూళ్లకు దారితీసిన అసలు పరిణామమిదేనని కొందరు చెబుతున్నారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన అమెరికాలో సైతం ద్రవ్యోల్బణ భయాలున్నాయి. గ్లోబల్‌గా ఉన్న మిగతా పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంది. దేశీయంగా వినియోగిస్తున్న వస్తువులు, దిగుమతులు చేసుకుంటున్న వస్తువులపై విధిస్తున్న జీఎస్టీ అనేది విలువ ఆధారిత పన్ను. ఆ వస్తువులు పరిమాణం పెరుగుతున్న కొద్దీ జీఎస్టీ రాబడులూ పెరుగుతుంటాయి. దానికితోడు ధరల పెరుగుదలతో పతాకస్థాయి జీఎస్టీ వసూళ్లవుతున్నాయి. ఇటీవలి కాలంలో మన దిగుమతులు, ఎగుమతులకంటే వేగంగా పెరుగుతున్నాయి. గతేడాది 6 శాతం ఎగుమతులు పెరిగితే, దిగుమతులు మాత్రం 16.5 శాతం హెచ్చయ్యాయి. వస్తువుల వినియోగం, పెరుగుతున్న ధరల వల్ల జీఎస్టీ నంబర్లు భారీగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అది పేదలపాలిట భారంగా మారుతుంది. సంపన్నులు వినియోగించే వస్తు సేవలపై పన్ను రేట్లు అధికంగా, పేదలు ఉపయోగించే వాటిపై తక్కువగా ఉంటాయి. వస్తువులకు అధిక ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్న సంపన్నులు జీఎస్టీ చెల్లించడం సులువే. కానీ కొన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో, సంఘటిత, అసంఘటిత రంగాల్లోని ప్రజలు వారికి కేటాయించిన జీఎస్టీ చెల్లించాలంటే అవస్థలు పడాల్సిందే. అయితే ధనికుల కంటే పేద కుటుంబాల సంఖ్య అధికంగా ఉండడంతో జీఎస్టీ భారంలో ఎక్కువ వాటాను పేదలే భరిస్తున్నారని ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. పేదలు వినియోగించే వాటిలో ఎక్కువగా నిత్యావసర వస్తువులే అధికంగా ఉంటాయి. ధరలు పెరిగినా వీటికి డిమాండ్ తగ్గదు. దాంతో ఈ వస్తువులు, సేవలకు తక్కువ పన్ను రేట్లు ఉన్నప్పటికీ జీఎస్టీ భారంలో ఎక్కువ వాటా కలిగి ఉంటుంది. ఇదీ చదడండి: ఉద్యోగ నియామకాలపై జొమాటో కీలక వ్యాఖ్యలు ఉదాహరణకు ప్యాకింగ్, లేబుళ్లు వేసిన ఆహార ఉత్పత్తులపై అయిదు శాతం జీఎస్టీ ఉంది. ఇందులో పాల ఉత్పత్తులు, గోధుమపిండి వంటివి వస్తాయి. స్టీల్(18 శాతం), సిమెంటు(28 శాతం) వంటి నిర్మాణ సామగ్రిపై అధిక పన్ను భారాన్ని పేదలే భరిస్తున్నారు. సంపన్నులు వినియోగిస్తున్న వస్తువుల తయారీకి ఖర్చు అధికమైనా, ధరలను పెంచేందుకు కంపెనీలు కొంత ఆలోచించి నిర్ణయం తీసుకుంటాయి. ఫలితంగా వాటి ధరలు నెమ్మదిగానే పెరుగుతుంటాయి. మరోవైపు, ధనికులు చెల్లించే ఆదాయపు పన్ను రేట్లను పెంచడం కూడా పూర్తిగా సరికాదు. ఎందుకంటే గరిష్ఠ ఆదాయ పన్ను స్లాబులో ఉన్నవారిపై సెస్, సర్ఛార్జీలతో కలిపి విధిస్తున్న రేటు ఇప్పటికే చాలా ఎక్కువ. అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితి పరిస్థితుల్లో ప్రస్తుతం మార్కెట్లు తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కొంటుంది. దాంతో విదేశీ సంస్థాగత పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. ఈ తరుణంలో ప్రైవేటు పెట్టుబడులు అంతంతమాత్రంగా ఉన్నాయి. దానికితోడు కార్పొరేట్ పన్ను రేట్లు పెంచడమూ సత్పలితాలను ఇవ్వదు. గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడంలేదు. పెట్రోలియం ఉత్పత్తులకు జీఎస్టీ వర్తించదు. కానీ ముడిచమురు ధరలు, ఇంధనాలపై కేంద్రం విపరీతంగా విధించే ఎక్సైజ్ సుంకంతో పాటు, రాష్ట్రాలు వడ్డించే విలువ జోడింపు పన్ను(వ్యాట్) ఉంటుంది. ఇవన్నీ కలిసి రవాణా ఖర్చుల్ని పెంచుతాయి. రవాణా సేవలపై 18శాతం జీఎస్టీ పడుతుంది. అధిక రవాణా వ్యయం ప్రతి రంగంలోనూ ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. రోడ్లు, వంతెనల పనుల కాంట్రాక్టులపై 12శాతం జీఎస్టీ ఉంది. ఇది టోల్, ప్రయాణ ఛార్జీలను పెంచుతుంది. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న వస్తువులపై విధిస్తున్న పన్నులు, దిగుమతి సుంకాలన్నీ ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతున్నాయి. అధిక ద్రవ్యోల్బణం, పన్నుల ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ధనికుల కంటే పేదలపైనే అధికంగా ఉంటుంది. ప్రభుత్వం దిగుమతి చేసుకునే కనీస అవసరాలకు సంబంధించిన వస్తువులపై సుంకాన్ని తగ్గిస్తే వాటి ధరలు కుంగి కొంత మేరకు ప్రజలపై భారం తగ్గుతుంది. మొత్తం పన్ను భారాన్ని తగ్గించే వస్తుసేవలపై అదనపు పన్ను, సర్ఛార్జీలను తొలగించినా కొంత ఉపశమనం కలుగుతుంది. ఆహార పదార్థాలు, ఔషధాలపై పన్ను తొలగిస్తే పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చౌకగా లభ్యమవుతాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై పన్నుల భారం తగ్గించడం ద్వారా తక్కువ ఆదాయ కుటుంబాలతో పాటు వినియోగదారులందరికీ మేలు జరుగుతుందనే వాదనలు ఉన్నాయి. కార్పొరేట్ పన్ను, వ్యక్తిగత ఆదాయ పన్ను వంటి ప్రత్యక్ష పన్నులకు సంబంధించి విధానాలు మారాలి. దేశీయ ఉత్పత్తి తగ్గకుండా చూసి ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడం, ఇంధన పన్నులు తగ్గించడం వంటివీ ఉపకరిస్తాయి. -
సాక్షి మనీ మంత్రా: నష్టాల ముగింపు, జీఎస్టీ సెగ, డెల్టా కార్ప్ ఢమాల్!
దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుస లాభాల నుంచి వెనక్కి తగ్గాయి. ఆరంభంలో లాభాల్లో ఉన్న సూచీలు లాభాల స్వీకరణతో ఫ్లాట్‌గా మారాయి. ఆ తరువాత మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 224 పాయింట్ల నష్టంతో 65394 వద్ద,నిఫ్టీ 55 పాయింట్లు క్షీణించి 19384 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 19400దిగువకు చేరింది. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు లాభపడగా, ఐటీ షేర్లు నష్టపోయాయి. ఓఎన్జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోటక్ మహీంద్ర బ్యాంకు, ఐషర్ మోటార్స్,సన్‌ఫార్మా టాప్ విన్నర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఎల్‌టిఐఎండ్‌ట్రీ, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్ అదానీ ఎంటర్ప్రైజెస్ బీపీసీఎల్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో నష్టపోయాయి. మరోవైపు రానున్న ఫలితాల నేపథ్యంలో టీసీఎస్, హెచ్‌సీఎల్ నష్టపోయాయి. జీఎస్టీ పెంపు: కుప్పకూలిన డెల్టా కార్ప్ మరోవైపు క్యాసినో ఆపరేటర్ డెల్టా కార్ప్ లిమిటెడ్ ఏకంగా 25 శాతం కుప్పకూలింది. తాజా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కాసినోలపై జీఎస్టీ 18-28 శాతానికిపెంచడంతో25 లోయర్ సర్క్యూట్లో లాక్ అయింది. ఇది రెండు నెలల కనిష్ట స్థాయి. రికార్డులో స్టాక్‌కి ఇదే అతిపెద్ద సింగిల్ డే డ్రాప్ కూడా. ఫలితంగా సంస్థ మార్కెట్ క్యాప్ రూ.1,600 కోట్లు నష్టపోయింది. ఈ క్షీణత దాని మొత్తం ఆర్థిక సంవత్సరం 2023 ఆదాయం రూ.1,021 కోట్ల కంటే ఎక్కువే కావడం గమనార్హం. అటు మంగళవారం నాటి ముగింపు 82.36తో పోలిస్తే బుధవారం డాలర్‌తో రూపాయి 12 పైసలు పెరిగి 82.24 వద్ద ముగిసింది. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఆగ్రా రైల్వేస్టేషన్లో టాయ్‌లెట్ చార్జీ రూ.112
ఆగ్రా: రైల్వేస్టేషన్లో టాయ్‌లెట్ వాడుకుంటే ఎంత చెల్లిస్తాం? ఉచితం కాకుంటే గనక ఏ ఐదు రూపాయలో, 10 రూపాయలో. కానీ ఇద్దరు బ్రిటిష్ పర్యాటకులు మాత్రం ఏకంగా రూ.112 చొప్పున చెల్లించుకోవాల్సి వచ్చింది! వారిద్దరూ ఢిల్లీలోని బ్రిటిష్ ఎంబసీ నుంచి ఆగ్రా వెళ్లారు. రైల్వేస్టేషన్లో శ్రీవాత్సవ అనే గైడ్ వారిని రిసీవ్ చేసుకున్నాడు. టాయ్‌లెట్‌కు వెళ్లాలని చెప్పడంతో ఐఆర్సీటీసీ ఎగ్జిక్యూటివ్ లాంజ్‌కు తీసుకెళ్లాడు. బయటికి రాగానే 12 శాతం జీఎస్టీతో కలిపి చెరో రూ.112 రూపాయలు చెల్లించాలని వారిని సిబ్బంది డిమాండ్ చేశారట. ఇదేమిటని ప్రశ్నించినా లాభం లేకపోయిందని, దాంతో ఆ మొత్తాన్ని తానే చెల్లించానని గైడ్ చెప్పుకొచ్చాడు. దీనిపై ఆయన ఐఆర్సీటీసీకి ఫిర్యాదు కూడా చేశాడు. అయితే అది లాంజ్ సేవల చార్జే తప్ప టాయ్‌లెట్‌కు వెళ్లినందుకు వసూలు చేసింది కాదని ఐఆర్సీటీసీ స్పష్టం చేసింది. ‘‘లాంజ్ సేవలు వాడుకుంటే కనీస చార్జీ రూ.200. రెండు గంటల పాటు ఏసీ లాంజ్ రూము, కాంప్లిమెంటరీ కాఫీ, ఉచిత వైఫై వంటి సదుపాయాలకు కలిపి ఈ చార్జీ. 50 శాతం డిస్కౌంట్ పోను 12 శాతం జీఎస్టీతో కలిపి రూ.112 చెల్లించాల్సి ఉంటుంది’’ అని వివరించింది. -
ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తులపై జీఎస్టీ బాదుడు.. పెరుగు, మజ్జిగలపైనా పెంపు
న్యూఢిల్లీ: నిత్యావసర ఉత్పత్తులపై జీఎస్టీ బాదుడు షురూ అయింది. 25 కిలోలు/లీటర్లు, అంతకులోపు పరిమాణంలో ఉండే ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తులపై (బ్రాండెడ్ కాకపోయినా) కొత్తగా 5 శాతం జీఎస్టీ పడనుంది. ప్యాక్ చేసి విక్రయించే గోధుమ పిండి, మైదా వంటి అన్ని రకాల పిండులు, బియ్యం, గోధుమల వంటి ధాన్యాలు, పప్పు దినుసులు తదితరాలన్నింటికీ ఇది వర్తిస్తుంది. వీటిని ‘ప్రీ ప్యాకేజ్డ్, లేబుల్డ్ కమోడిటీ’ విభాగం కిందకు చేరుస్తూ 5 శాతం జీఎస్టీని కేంద్రం సోమవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. వీటిని లూజ్‌గా కొనుగోలు చేస్తే ఈ పన్నుండదని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) పేర్కొంది. అలాగే 25 కిలోలకు/లీటర్లకు మించిన పరిమాణంలో విక్రయించినా జీఎస్టీ పడదని స్పష్టం చేసింది. కొత్త పన్ను రేట్లపై సందేహాలను నివృత్తి చేస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ధరలు పెంచిన ప్రముఖ సంస్థలు పెరుగు, మజ్జిగ, పనీర్, టెట్రా ప్యాక్‌లో విక్రయించే పానీయాలపైనా జీఎస్టీ 12 నుంచి 18 శాతానికి పెరిగింది. ఈ నిర్ణయాన్ని ప్రముఖ సంస్థలు అమల్లోకి తీసుకొచ్చేశాయి. బటర్‌మిల్క్, పెరుగు, లస్సీ, టెట్రా ప్యాక్‌ల్లో విక్రయించే పానీయాలపై ధరలను 5 శాతం పెంచినట్టు అమూల్ బ్రాండ్ పేర్కొంది. కొత్త జీఎస్టీ రేట్ల ప్రకారం ధరలను సవరిస్తున్నట్టు మదర్ డెయిరీ కూడా మంగళవారమే ప్రకటన జారీ చేసింది. ఇదీ చదవండి: ఇలా అయితే జీఎస్టీ ఉండదు: నిర్మలా సీతారామన్ క్లారిటీ -
ఇలా అయితే జీఎస్టీ ఉండదు: నిర్మలా సీతారామన్ క్లారిటీ
సాక్షి, ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ద్వారా కీలక ప్రకటన చేశారు. ప్యాకేజీ ఫుడ్స్, ఆసుపత్రి బెడ్స్‌పై 5 శాతం జీఎస్టీ బాదుడుపై విమర్శలు చెలరేగిన నేపథ్యంలో జీఎస్టీ వర్తించని కొన్నివస్తువుల జాబితాను విడుదల చేశారు. జీఎస్టీపై గందరగోళం నెలకొనడంతో సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ప్రీప్యాకింగ్ లేదా లేబెల్డ్ చేసి విక్రయిస్తేనే జీఎస్టీ వర్తిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఓట్స్, మొక్కజొన్న, బియ్యం, పప్పు, బియ్యం, రవ్వ, సెనగపిండి, పెరుగు, లస్సీ, మరమరాలు వంటి నిత్యావసర వస్తువులను బ్రాండెడ్‌గా, ప్యాక్ చేసి విక్రయిస్తే మాత్రమే పన్ను ఉంటుందని ఆమె వివరణ ఇచ్చారు. ఇవే ఉత్పత్తులను విడిగా, ప్యాక్ చేయకుండా, విక్రయిస్తే జీఎస్టీ వర్తించదని ఆర్థికమంత్రి వెల్లడించారు. లూజ్‌గా లేదా, బహిరంగ విక్రయాలపై జీఎస్టీ వర్తించదు అంటూ 14 వస్తువుల జాబితాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ట్వీట్ చేశారు. లేబుల్ లేని లేదా ప్యాక్ చేయని, విడిగా అమ్మే వస్తువులపై జీఎస్టీ ఉండదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వరుస ట్వీట్లలో స్పందించిన నిర్మలా సీతారామన్ గత నెలలో జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశం ఏకగ్రీవ నిర్ణయం ప్రకారం చర్య తీసుకున్నామంటూ పన్ను పెంపును సమర్ధించుకున్నారు. The @GST_Council has exempt from GST, all items specified below in the list, when sold loose, and not pre-packed or pre-labeled. They will not attract any GST. The decision is of the @GST_Council and no one member. The process of decision making is given below in 14 tweets. pic.twitter.com/U21L0dW8oG — Nirmala Sitharaman (@nsitharaman) July 19, 2022 -
హాస్పిటల్ బెడ్స్‌పై జీఎస్టీ బాదుడు: మరింత నరకం!
సాక్షి, ముంబై: ‘ఒకే దేశం ఒకే పన్ను’ అంటూ కేంద్రం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ ఇపుడికి రోగులను కూడా చుట్టుకుంది. కార్పొరేట్ ఆసుపత్రుల బాదుడుకు తోడు బీజేపీ సర్కార్ మరో భారాన్ని మోపింది. జూన్ చివరలో జరిగిన 47వ సమావేశంలో హాస్పిటల్ బెడ్స్‌పై 5 శాతం జీఎస్టీని కౌన్సిల్ సిఫార్సు చేసింది. దీని కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో నేటి(జూలై 18, 2022) రూ.5 వేలకు పైగా చార్జీ ఉండే పడకలపై అదనపు భారం పడనుంది. ఐసీయూ మినహాయించి, ఆసుపత్రిలో ఒక రోగికి రోజుకు రూ. 5,000 కంటే ఎక్కువ ఉండే బెడ్స్‌పై 5 శాతం జీఎస్టీ బాదుడు తప్పదు. ఇన్పుట్ ట్యా ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ సదుపాయం లేకుండా పన్నును ప్రవేశపెట్టడాన్ని నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. పేదలు, మధ్యతరగతి వారిపై ఇది భారం మోపుతుందని, నాణ్యమైన దూరం చేయడం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి గది అద్దెపై జీఎస్టీ రోగుల ఆరోగ్య సంరక్షణ భారాన్ని పెంచుతుందని, అలాగే పరిశ్రమకు పెను సవాళ్లతోపాటు, ఆస్పత్రుల ఆదాయంపై కూడా ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు. Instead of learning from the havocking results of its failed healthcare system during COVID, the Modi govt is hell-bent on making it more disastrous. #GabbarSinghStrikesAgain pic.twitter.com/M4KNPnn5LB — Congress (@INCIndia) July 18, 2022 ఈ రోజునుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ పన్నులపై కాంగ్రెస్ మండిపడింది. చివరికి ఆసుపత్రి పడకలపై కూడా పన్ను బాదుడుపై సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆవస్పత్రి పడకలపై కూడా పన్నుతో గబ్బర్ సింగ్ మరో బాదుడుకు తెరతీశాడని మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించింది. కేంద్రం నిర్ణయం దేశ ప్రజలపై పెను భారం మోపుతుందని ట్విటర్లో మండిపడింది. అసలే కోవిడ్-19 మహమ్మారిసంక్షోభంతో ఆరోగ్య సంరక్షణకు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట కల్పించాల్సింది పోయి, ముఖ్యంగా పేద ప్రజలను మరింత నరకంలో నెట్టేసిందని ట్వీట్ చేసింది. కాగా దేశంలో హెల్త్‌కేర్ సేవలను జీఎస్టీ కిందకు తీసుకురావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలాగే ప్రీ-ప్యాకేజ్డ్ ఫుడ్స్‌తో సహా అనేక వస్తువులపై జీఎస్టీ వసూలుకు ప్రభుత్వం నిర్ణయించింది. -
కొత్త సంవత్సరంలో జీఎస్టీ మోత, వేటి మీద ఎంతంటే..
న్యూయర్ ప్రారంభం నుంచి కస్టమర్లకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ షాకిచ్చాయి. నేటి నుంచి (జనవరి1) నుంచి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టే ప్రతి కస్టమర్ నుంచి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ 5శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నాయి. దీంతో ఫుడ్ ఆర్డర్ పెట్టే కస్టమర్లకు ఫుడ్ డెలివరీ యాప్స్ విధిస్తున్న జీఎస్టీ మరింత భారం కానుంది. గతంలో ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు రెస్టారెంట్లు 5 శాతం చొప్పున జీఎస్టీని వసూలు చేసేవి. స్విగ్గీ, జొమాటో కేవలం తమ సేవలకు వినియోగదారుల నుంచి కొంత మొత్తం వసూలు చేసేవి. ఈ విధానం వల్ల కొన్ని గుర్తింపు లేని రెస్టారెంట్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యలో జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యతను ఈ ఫుడ్ డెలివరీ యాప్‌లకే అప్పజెప్పాలని, డెలివరీలపై 5 శాతం జీఎస్టీని విధించాలని జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఓలా,ఊబర్ వంటి రైడ్ షేరింగ్ సర్వీసుల్లో సైతం జీఎస్టీని విధించాయి. జనవరి 1నుంచి బైక్, ఆటో బుక్ చేసుకున్న ప్రయాణికులు ప్రతి రైడ్ పై అదనంగా మరో 5శాతం జీఎస్టీని కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ జీఎస్టీ సాధారణంగా నడిచే షేర్, ఇతర ఆటోలు కాకుండా కేవలం రైడ్ షేరింగ్ కంపెనీలైన ఓలా, ఊబర్ సంస్థల సేవలందించే ఆటోల్లో ప్రయాణించే వారికి జీఎస్టీ వర్తిస్తుందని తెలిపింది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం ఈ నెల 18నే ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. ఈ కొత్త జీఎస్టీ నిబంధనలు జనవరి అమల్లోకి వచ్చాయి. కాగా, ఇప్పటి వరకు ఈ కామర్స్ ఆటో రిక్షా బుకింగ్ పై జీఎస్టీ మినహాయింపు ఉండేది. దాన్ని ఇప్పుడు కేంద్రం ఉప సంహరించుకుంది. ఇక వీటితో పాటు ధరలతో సంబంధం లేకుండా ఫుట్ వేర్ పై నేటి నుండి 12 శాతం జీఎస్టీని కట్టాల్సి ఉంటుంది. చదవండి: కోల్గేట్ పేస్ట్ ఎగబడి కొంటున్నారు! ఎందుకంటే.. -
ముగిసిన 46 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
-
పైసా వసూల్, జీఎస్టీ పన్ను లక్షకోట్లను దాటేసింది!
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ క్రియాశీలత ఉత్తేజాన్ని ప్రతిబింబిస్తూ, వరుసగా రెండవనెల ఆగస్టులోనూ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు లక్ష కోట్లకు అధిగమించాయి. రూ.1,12,020 కోట్లుగా నమోదయ్యాయి. 2020 ఆగస్టుతో (రూ.86,449 కోట్లు) పోల్చితే ఈ నిధులు 30 శాతం అధికం కావడం గమనార్హం. కోవిడ్ ముందస్తు స్థాయి ఆగస్టు 2019 (రూ.98,202 కోట్లు) కన్నా కూడా ఈ నిధులు 14 శాతం అధికం కావడం మరో విషయం. జులై, ఆగస్టు మాసాల్లో తిరిగి రూ. లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు నమోదవడం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి సంకేతమని ఆర్థిక శాఖ విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతోపాటు ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడం వంటి కారణాలు కూడా జీఎస్టీ వసూళ్లలో పెరుగుదలకు కారణమైనట్లు తెలిపింది. ప్రభుత్వం ఈ మేరకు బుధవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. వేర్వేరుగా ఇలా... ►సెంట్రల్ జీఎస్టీ రూ.20,522 కోట్లు ►స్టేట్ జీఎస్టీ రూ.26,605 కోట్లు ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (రాష్ట్రాల మధ్య వస్తు, సేవల రవాణాకు సంబంధించి వసూళ్లు– ఐజీఎస్టీ) రూ.56,247 కోట్లు. (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.26,884 కోట్లుసహా) ► సెస్ రూ.8,646 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.646 కోట్లుసహా). అప్పడానికి జీఎస్టీ వర్తించదు కాగా అప్పడానికి జీఎస్టీ వర్తించబోదని పరోక్ష పన్నులు, కస్టమ్స్ సుంకాల కేంద్ర బోర్డ్ (సీబీఐసీ) వివరణ ఇచ్చింది. పేరు లేదా ఆకారంతో సంబంధం లేకుండా.. పాపడ్‌కు జీఎస్టీ వర్తించబోదని స్పష్టం చేసింది. ‘‘గుండ్రంగా ఉన్న పాపడ్‌కు జీఎస్టీ నుండి మినహాయింపు ఉంది. చదరపు పాపడ్‌కు జీఎస్టీ వర్తిస్తుందని మీకు తెలుసా? నాకు ఈ లాజిక్ అర్థం అయ్యేలా మంచి చార్టర్డ్ అకౌంటెంట్ని ఎవరైనా సూచించగలరా?’’ అని ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్షా గోయెంకా మంగళవారం చేసిన ట్వీట్ నేపథ్యంలో సీబీఐసీ తాజా వివరణ ఇచ్చింది. చదవండి: ఫేస్బుక్లో హింస ఈ రేంజ్లో ఉందా!?