న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (GST) వసూళ్లు 2024 డిసెంబర్‌లో స్థూలంగా (2023 ఇదే నెలతో పోల్చి) 7.3 శాతం పెరిగి రూ.1.77 లక్షల కోట్లకు చేరాయి. సమీక్షా నెల్లో దేశీయ లావాదేవీల నుంచి జీఎస్‌టీ వసూళ్లు 8.4 శాతం పెరిగి రూ.1.32 లక్షల కోట్లకు చేరగా, దిగుమతుల పైన వచ్చే పన్నుల వసూళ్లు దాదాపు 4 శాతం పెరిగి రూ.44,268 కోట్లకు చేరాయి. డిసెంబర్‌లో రిఫండ్స్(Refunds) భారీగా నమోదుకావడం గమనార్హం.
ఇదీ చదవండి: 2024లో కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..
రిఫండ్స్ 31 శాతం పెరిగి రూ.22.490 కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్లను సవరించిన తర్వాత నికర జీఎస్‌టీ వసూళ్లు 3.3 శాతం పెరిగి రూ.1.54 లక్షల కోట్లకు చేరాయి. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. సెంట్రల్ జీఎస్‌టీ వసూళ్లు రూ. 32,836 కోట్లు. స్టేట్ జీఎస్‌టీ రూ. 40,499 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.47,783 కోట్లు. సెస్సు(Cess) రూ.11,471 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో రూ.2.10 లక్షల కోట్లు నమోదయ్యాయి. ఈ వసూళ్ల ఇప్పటి వరకూ ఒక రికార్డు.
Comments
Please login to add a commentAdd a comment