జీఎస్టీ శ్లాబులను మరింత సరళతరం చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ ఛైర్మన్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నిర్మాణాన్ని క్రమబద్ధీకరించేందుకు ప్రస్తుతం అమలవుతున్న నాలుగు శ్లాబులను మూడుకు తగ్గించేలా చర్చలు సాగుతున్నాయని చెప్పారు.
ఈ సందర్భంగా సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం అమలవుతున్న జీఎస్టీ శ్లాబుల విధానంలో చాలా వస్తువుల వర్గీకరణపై వివాదాలున్నాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పన్ను చెల్లింపులను మరింత సరళతరం చేసేందుకు ప్రస్తుతం ఉన్న నాలుగు జీఎస్టీ శ్లాబులను మూడుకు తగ్గించేలా చర్చలు జరుగుతున్నాయి. జులై 2017లో జీఎస్టీను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆదాయ వృద్ధి మెరుగుపడింది’ అన్నారు.
ఇదీ చదవండి: ఈఎస్‌ఐ పథకంలోకి భారీగా చేరిన ఉద్యోగులు
కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..‘జీఎస్టీ ప్రయోజనాలను పెంచడం కోసం పన్ను నిర్మాణాన్ని మరింత సరళీకృతం చేసేందుకు ప్రయత్నిస్తాం. జీఎస్టీ పరిధిని ఇతర రంగాలకు విస్తరిస్తాం’ అని చెప్పారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రాబడుల్లో స్థిరమైన వృద్ధి నమోదైంది. ఏప్రిల్ 2024లో ఆల్ టైమ్‌హై రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ప్రస్తుతం జీఎస్టీ శ్లాబులు 5%, 12%, 18%, 28%గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment