పన్ను రేట్లు తగ్గుతాయ్, ఎప్పుడంటే...
న్యూఢిల్లీ : ప్రభుత్వం పన్ను రేట్లను కచ్చితంగా తగ్గిస్తుంది, ఎప్పుడంటూ ప్రజలు తమ బకాయలను నిజాయితీగా చెల్లిస్తే అది సాధ్యపడుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ''జీఎస్టీ రేట్లు, ఆదాయపు పన్ను రేట్లు ఇతరాత్ర రేట్లని తగ్గుతాయి. ఎప్పుడంటే ప్రతి ఒక్కరూ తమ పన్నులను చెల్లిస్తే అది వీలవుతుంది'' అని గోయల్ 'ఈవై ఎంటర్ప్రిన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్' లో చెప్పారు. పన్ను రేట్లు తగ్గించాలని వ్యాపారస్తుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పన్ను రేట్లు తగ్గించడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. జీఎస్టీ పాలన కింద పన్ను రేట్లను జీరో నుంచి ఐదు శాతానికి తీసుకురావాలని ఇండస్ట్రి ఛాంబర్స్ కోరుతున్నాయి. క్లయింట్స్ వారి పన్ను చెల్లించేలా ఛార్టెడ్ అకౌంటెంట్స్ తోడ్పడాలని గోయల్ సూచించారు. పవర్ టారిఫ్లు ఆల్ టైమ్ కనిష్ట స్థాయిలకు చేరుకున్నాయన్నారు.