tax rates
-
అద్దెదారులకు షాక్: కొత్త జీఎస్టీ గురించి తెలుసా?
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద ఇకపై అద్దెదారులకు భారీ షాక తగలనుంది. దీని ప్రకారం ఇంటి అద్దెపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే, పన్నుచెల్లింపుదారుల ఐటీ రిటర్న్‌లలో దీనిని మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు. అద్దెదారులు రివర్స్ ఛార్జ్ మెకానిజం (RCM) కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. (సంచలన నిర్ణయం: ఐకానిక్ బేబీ పౌడర్‌కు గుడ్‌బై) Claim: 18% GST on house rent for tenants #PibFactCheck ▶️Renting of residential unit taxable only when it is rented to business entity ▶️No GST when it is rented to private person for personal use ▶️No GST even if proprietor or partner of firm rents residence for personal use pic.twitter.com/3ncVSjkKxP — PIB Fact Check (@PIBFactCheck) August 12, 2022 ఎవరు జీఎస్టీ చెల్లించాలి? అయితే ఈ వార్తపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వివరణ ఇచ్చింది. వ్యాపార సంస్థకు అద్దెకు ఇచ్చినప్పుడు మాత్రమే రెసిడెన్షియల్ యూనిట్ అద్దెకు పన్ను చెల్లించాలి. వ్యక్తిగత ఉపయోగం కోసం ప్రైవేట్ వ్యక్తికి అద్దెకు ఇచ్చినప్పుడు GST లేదు. వ్యక్తిగత ఉపయోగం కోసం యజమాని లేదా సంస్థ పార్టనర్ నివాసాన్ని అద్దెకు తీసుకున్నప్పటికీ GST ఉండదు అని స్పష్టం చేసింది. ఇది చదవండి : Anand Mahindra: వీకెండ్ మూడ్‌లోకి ఆనంద్ మహీంద్ర, భార్య జంప్, మైండ్ బ్లోయింగ్ రియాక్షన్స్ మింట్ అందించిన కథనం ప్రకారం జూలై 13, 2022న జరిగిన GST కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం జూలై 18 నుంచి దేశంలో కొత్త జీఎస్టీ పన్నులు అమలులోకి వచ్చాయి. ఈ జీఎస్టీ కొత్త నిబంధనల ప్రకారం.. జీఎస్టీ కింద నమోదైన అద్దెదారు.. రెసిడెన్షియల్ ప్రాపర్టీని అద్దె చెల్లిస్తున్న దానిపై 18 శాతం వస్తుసేవల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు, అద్దెదారు లేదా భూస్వామి నమోదు చేసుకున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా జూలై 17, 2022 వరకు రెసిడెన్షియల్ ప్రాపర్టీల అద్దెను జీఎస్టీ నుంచి మినహాయించిన సంగతి తెలిసిదే. కానీ ఈ ఏడాది జూలై 18 నుండి, నమోదు చేసుకున్న అద్దెదారు అద్దె ఆదాయంపై 18 శాతం పన్ను చెల్లించాలి. దీనిపై స్పందించిన క్లియర్ వ్యవస్థాపకుడు, సీఈవో అర్చిత్ గుప్తా సాధారణ జీతం పొందే వ్యక్తి రెసిడెన్షియల్ హౌస్ లేదా ఫ్లాట్ అద్దెకు తీసుకున్నట్లయితే, వారు జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాగే జీఎస్టీ కింద నమోదైన వ్యాపారులు, గృహ యజమానుల, నమోదిత వ్యక్తి యజమానికి చెల్లించే అద్దెపై తప్పనిసరిగా 18 శాతం GST చెల్లించాలని స్పష్టం చేశారు. రిజిస్టర్డ్ ఎంటిటీ, లేదా వ్యాపారులు ఏడాదికి రూ.40 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అద్దె ఆదాయం ఉన్నట్లయితే వారు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈశాన్య రాష్ట్రాలు లేదా ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల్లో వ్యాపారులకు ఈ లిమిట్ రూ.10 లక్షలుగా ఉందన్నారు. ఇదీ చదవండి : ఇన్‌స్టాలో కొత్త అవతార్, స్నాప్‌చాట్‌లో స్పెషల్ ఫీచర్లు -
జీఎస్టీతో తగ్గిన పన్నుల భారం
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో 66 కోట్లకు పైగా జీఎస్టీ రిటర్నులు దాఖలయ్యాయని.. పన్ను రేట్లు తగ్గడంతో నిబంధనలను పాటించే వారు పెరిగినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బహుళ పన్నుల విధానం స్థానంలో జీఎస్టీని కేంద్రం 2017 జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పెట్రోలియం, లిక్కర్ తదితర కొన్ని మినహా అధిక శాతం వస్తు, సేవలను జీఎస్టీలో భాగం చేశారు. 1.3 కోట్ల పన్ను చెల్లింపుదారులు ‘‘వినియోగదారు, పన్ను చెల్లింపుదారులకూ జీఎస్టీ అనుకూలమైనదని నిరూపణ అయింది. జీఎస్టీకి పూర్వం అధిక పన్నుల రేట్లు నిబంధనల అమలు విషయంలో నిరుత్సాహకరంగా ఉండేవి. ప్రతీ రాష్ట్రం భిన్నమైన పన్ను రేటును వసూలు చేసేది. దీంతో అసమర్థత, వ్యయాలకు దారితీసింది. జీఎస్టీ æవిధానంలో తక్కువ రేట్ల కారణంగా పన్ను నిబంధనలను పాటించేవారి సంఖ్య క్రమంగా పెరిగింది’’ అని కేంద్ర ఆర్థిక శాఖ ట్విట్టర్‌పై పేర్కొంది. ఒక కంపెనీ వ్యాపారం చేయడం కోసం కరోనాకు ముందు నాటి విధానంలో కనీసం 495 భిన్నమైన పత్రాలను దాఖలు చేయాల్సి వచ్చేదంటూ.. జీఎస్టీలో ఇది 12కు తగ్గినట్టు వివరించింది. జీఎస్టీ కింద నాలుగు రకాల రేట్లు అమలవుతుండడం తెలిసిందే. నిత్యావసరాలపై 5 శాతం, విలాసవంతం, సమాజానికి చేటు చేసేవాటిపై 28 శాతం పన్ను అమలు చేస్తుండగా.. మిగిలిన వస్తు, సేవలపై 12, 18 శాతం పన్ను అమలవుతోంది. వీరికి పన్ను భారం తక్కువ వార్షికంగా రూ.40 లక్షల వరకు టర్నోవర్ ఉన్న (విక్రయాల ఆదాయం) వ్యాపారాలు, పరిశ్రమలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంది. అలాగే వార్షికంగా రూ.1.5 కోట్ల టర్నోవర్ ఉన్నవి కాంపోజిషన్ పథకాన్ని ఎంపిక చేసుకుని టర్నోవర్‌పై 1 శాతం జీఎస్టీ చెల్లిస్తే చాలు. సేవల వ్యాపారం నిర్వహించే సంస్థలకు వార్షికంగా రూ.20 లక్షల వరకు టర్నోవర్ ఉంటే జీఎస్టీ వర్తించదు. రూ.50లక్షల వరకు టర్నోవర్ ఉన్న సేవల సంస్థలు కాంపోజిషన్ స్కీమ్ కింద 6 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. 54,439 మందికి అభినందనలు జీఎస్టీ 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ విధానం విజయవంతం కావడంలో భాగమైన పన్ను చెల్లింపుదారులను గౌరవించాలని నిర్ణయించాం. సకాలంలో రిటర్నులను దాఖలు చేయడమే కాకుండా, గణనీయమైన పన్ను చెల్లింపులు చేసిన వారిని గుర్తించేందుకు పరోక్ష పన్నులు, కస్టమ్స్ విభాగం (సీబీఐసీ) డేటా అన్‌లిటిక్స్ (సమాచార విశ్లేషణ)ను చేపట్టింది. ఇందులో భాగంగా 54,439 మంది పన్ను చెల్లింపుదారులను గుర్తించింది. ఇందులో 88 శాతానికి పైగా ఎంఎస్ఎంఈలే ఉన్నాయి. సూక్ష్మ పరిశ్రమలు 36 శాతం, చిన్న తరహా పరిశ్రమలు 41 శాతం, మధ్య తరహా పరిశ్రమలు 11 శాతం చొప్పున ఎంపికైన వాటిల్లో ఉన్నాయి. వీటిని అభినందిస్తూ సర్టిఫికేట్లను సీబీఐసీ ఇవ్వనుంది. – కేంద్ర ఆర్థిక శాఖ మైలురాయి భారత ఆర్థిక ముఖచిత్రంలో జీఎస్టీ ఒక మైలురాయి. జీఎస్టీ పన్నుల సంఖ్యను తగ్గించింది. నిబంధనల అమలు భారాన్ని, సామాన్యునిపై మొత్తం మీద పన్ను భారాన్ని తగ్గించింది. పారదర్శక, నిబంధనల అమలు, పన్ను వసూలు గణనీయంగా పెరిగింది. – నరేంద్రమోదీ, ప్రధానమంత్రి -
అన్నం లేదు.. ఆవకాయే
ఏ బడ్జెట్లో అయినా అందరినీ ఆకర్షించేది ఆదాయపు పన్నే!!. ఎందుకంటే అంతిమంగా తన జేబులో ఎంత మిగులుతుందన్నదే వేతనజీవి వెదుక్కుంటాడు. అలాంటి వేతనజీవికి... పన్ను రేట్లు తగ్గిస్తున్నామంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన చక్కని విందు భోజనంలా కనిపించింది. ఎంత మమకారమో... అనుకున్నాడు. కానీ... తగ్గింపు రేట్లు కావాలనుకునేవారికి పన్ను మినహాయింపులేవీ ఉండవని ఆమె చెప్పేసరికి.. అన్నం లేకుండా ఆవకాయ వడ్డించినట్లయింది. అమ్మో... కారం!!. పన్ను రేట్లను తగ్గిస్తున్నట్లు ఒక పక్కన ప్రకటిస్తూనే.. మరో పక్క పన్ను మినహాయింపులను భారీగా తొలగించడం ద్వారా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వేతనజీవుల్ని దొంగ దెబ్బ తీశారు. కొన్ని ఆదాయవర్గాలకు సగానికి సగం పన్ను తగ్గినట్లు చూపించినా.. స్టాండర్డ్ డిడక్షన్, ఇంటి అద్దె అలవెన్స్, చాప్టర్ 6 –ఎ కింద లభించే సెక్షన్ 80–సీ వంటి మినహాయింపులు, ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ వంటి కీలక మినహాయింపులను తొలగించారు. శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్థికమంత్రి ఆదాయ పన్ను శ్లాబుల్లో భారీ మార్పులను ప్రతిపాదించారు. రూ.15 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి పన్ను రేట్లు తగ్గిస్తూ ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబుల స్థానంలో ఏడు శ్లాబుల విధానాన్ని ప్రవేశపెట్టారు. కొత్తగా ప్రవేశపెట్టిన విధానంలో రూ.2.5 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను ఉండదని, రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి గతంలో మాదిరే 5 శాతం పన్ను ఉన్నా దానిపై పూర్తిస్థాయి పన్ను రిబేటు లభిస్తుందని సీతారామన్ తెలిపారు. ఈ కొత్త విధానంలో రిటర్నులు దాఖలు చేసే వారికి... పాత విధానం ప్రకారం వివిధ సెక్షన్ల కింద లభించే మినహాయింపు ప్రయోజనాలు ఉండవని ఆర్థికమంత్రి స్పష్టంచేశారు. అయితే కొత్త విధానానికి మారాలా? లేక పాత విధానంలోనే కొనసాగాలా? అన్నది పన్ను చెల్లింపుదారుల ఇష్టమంటూ... నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కూడా వారికే వదిలిపెట్టారు. ఆదాయపు పన్ను చట్టాన్ని సరళతరం చేసే విధానంలో భాగంగా ప్రస్తుతం ఉన్న సుమారు 100 మినహాయింపుల్లో 70 తొలగించినట్లు మంత్రి ప్రకటించారు. పన్ను రేట్లు తగ్గింపు వల్ల ప్రభుత్వం రూ.40,000 కోట్ల ఆదాయాన్ని నష్టపోతున్నట్లు తెలియజేశారు. ‘‘పన్ను మినహాయంపులు వేటినీ లెక్కించకపోతే రూ.15 లక్షల ఆదాయం ఉన్నవారికి కొత్త పన్ను విధానంలో రూ.78,000 ప్రయోజనం లభిస్తోంది. పాత విధానంలో వారు రూ.2.73 లక్షల పన్ను కట్టాల్సి వస్తే కొత్త విధానంలో రూ.1.95 లక్షలు కడితే సరిపోతుంది’’అని నిర్మల చెప్పారు. కానీ వాస్తవంగా పాత విధానంలో మినహాయింపులను పరిగణనలోకి తీసుకుంటే కొత్త విధానంలో అధిక పన్ను చెల్లించాల్సి వస్తుందని ట్యాక్సేషన్ నిపుణులు స్పష్టం చేస్తుండటం గమనార్హం. తొలగించిన కొన్ని ముఖ్యమైన మినహాయింపులివే... వివాద్ సే విశ్వాస్ ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి వివిధ న్యాయస్థానాల్లో ఉన్న లక్షలాది కేసులను పరిష్కరించడానికి ‘వివాద్ సే విశ్వాస్’ పేరుతో ప్రత్యేక ప్రథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఆదాయ పన్నుకు సంబంధించి 4.83 లక్షల కేసులు వివాదాల్లో ఉన్నాయని, వీటిని పరిష్కరించుకోవాలనుకునే వారు ఈ పథకం కింద వివాదంలో ఉన్న మొత్తాన్ని చెల్లిస్తే చాలునని స్పష్టంచేశారు. ‘‘మార్చి 31, 2020లోగా చెల్లించేవారికి పెనాల్టీలు, వడ్డీలు వంటివేమీ ఉండవు. అప్పటి నుంచి జూన్ 30, 2020లోగా చెల్లించే వారు మాత్రం కొంత మొత్తాన్ని పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరవాత మాత్రం ఈ పథకం అమల్లో ఉండదు’’అని మంత్రి స్పష్టం చేశారు. గతేడాది బడ్జెట్లో పరోక్ష పన్నుల విధానంలో ఉన్న వివాదాలను పరిష్కరించడానికి సబ్కా వికాస్ పేరుతో ప్రవేశపెట్టిన పథకం ద్వారా 1.89 లక్షల కేసులు పరిష్కారమయ్యాయని, వీటి ద్వారా రూ.39,000 కోట్ల బకాయిలను వసూలు చేశామని వివరించారు. ఈ–కామర్స్ లావాదేవీలపై 1% టీడీఎస్ న్యూఢిల్లీ: ఈ–కామర్స్ లావాదేవీలపై కొత్తగా 1 శాతం టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) విధిస్తూ కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం డిజిటల్ ప్లాట్‌ఫాంను నిర్వహించే ఈ–కామర్స్ ఆపరేటరు.. విక్రేతల స్థూల అమ్మకాలకు సంబంధించి 1 శాతం టీడీఎస్ మినహాయించాల్సి ఉంటుంది. అయితే, ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంపై అంతక్రితం ఏడాది సదరు విక్రేత అమ్మకాలు రూ. 5 లక్షలకన్నా తక్కువ ఉండటంతో పాటు పాన్ ఆధార్ నంబరు ధృవీకరణ ఉన్న పక్షంలో ఈ నిబంధన వర్తించదు. దీన్ని అధ్యయనం చేస్తున్నట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వెల్లడించగా .. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ స్పందించలేదు. -
బడ్జెట్ తర్వాత జీఎస్టీ రేట్ల సవరణ
సాక్షి, అమరావతి: దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి మూడేళ్లు అవుతున్న సందర్భంగా వివిధ వస్తువులపై ఉన్న పన్ను రేట్లను పునః సమీక్షించనున్నారు. అత్యధిక వస్తువులను తక్కువ శాతం పన్ను పరిధిలో ఉండటంతో ఆదాయం పెంచుకునే దిశగా అడుగులు వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాయి. ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల తర్వాత రేట్ల సమీక్షించాలని కిందటి నెలలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సూత్రప్రాయ అంగీకారానికి వచ్చాయి. ప్రస్తుతం 150కిపైగా వస్తువులను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించగా, సుమారు 260 వస్తువులు 5 శాతం శ్లాబులో ఉన్నాయి. నిర్దేశిత ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమవుతుండటంతో జీఎస్టీ పరిధి నుంచి మినహాయించిన వస్తువులను సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ ఏడాది ప్రతి నెలా సగటు జీఎస్టీ ఆదాయం రూ.1.12 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేయగా, లక్ష కోట్లు దాటడమే గగనంగా మారింది. 9 నెలలకు సగటు నెల జీఎస్టీ ఆదాయం రూ.1,00,646 కోట్లకు పరిమితమయ్యింది. ఇదే సమయంలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన పరిహార భారం పెరిగిపోతోంది. దీంతో ఆదాయం భారీగా కోల్పోతున్న సున్నా పన్ను పరిధిలో ఉన్న వస్తువులను గుర్తించి వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేయోచనలో ఉన్నారు. ప్రస్తుతం 5%, 12%, 18%, 28% శ్లాబులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు ఈ నాలుగు ట్యాక్స్ శ్లాబులను మూడు శ్లాబులుగా మార్చమని సూచిస్తున్నాయి. 5%, 12% శ్లాబుల్లో ఉన్న వస్తువులను కలిపి 8–9 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావడం లేదా, 12, 18% శ్లాబులను కలిపి 15–16 శాతంగా చేయాలని సూచిస్తున్నాయి. ఈ పన్ను రేటు సవరింపును ఒకేసారిగా కాకుండా దశలవారీగా చేపట్టాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో స్థిర ఆదాయం వచ్చే దిశగా మార్చి నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. -
ఈ వస్తువుల ధరలు దిగిరానున్నాయ్..
ముంబై : ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో మార్కెట్లో డిమాండ్ పుంజుకునేందుకు పలు వస్తువులు, సేవల ధరలను తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గోవాలో శుక్రవారం జరగనున్న 37వ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఈ దిశగా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థలో తిరిగి ఉత్తేజం నెలకొనడంతో పాటు కార్లు, బైక్‌లు సహా ఆటోమొబైల్ విక్రయాలు ఊపందుకునేలా పలు చర్యలు చేపడతారని భావిస్తున్నారు. బిస్కట్ల నుంచి కార్ల వరకూ పలు వస్తువులపై పన్ను తగ్గింపు నిర్ణయాలు వెల్లడవుతాయని ఆయా వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈ సమావేశంలో పన్ను రేట్లు, విధానాల సరళీకరణకు సంబంధించి దాదాపు 80 ప్రతిపాదనలు ముందుకు రానున్నాయని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో సంక్షోభంలో కూరుకుపోయిన ఆటోమొబైల్ పరిశ్రమను ఆదుకునేందుకు కార్లపై ప్రస్తుతం విధిస్తున్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గిస్తారని భావిస్తున్నారు. పండుగ సీజన్‌కు ముందు ఈ నిర్ణయం వెలువడితే విక్రయాలు పుంజుకుంటాయని ఆశిస్తున్నారు. ఈ దిశగా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం కోసం ఆటోమొబైల్ కంపెనీలు వేచిచూస్తున్నాయి. బిస్కెట్లు, అగ్గిపుల్లలు, హోటల్స్‌కు సంబంధించి కూడా పన్ను రేట్ల తగ్గింపుపై ఆయా వర్గాలు సానుకూల నిర్ణయం ఉంటుందని ఆశిస్తున్నాయి. చిన్న వ్యాపారులకు కనీసం తొలి ఏడాది (2017-18) వరకైనా వార్షిక రిటన్ దాఖలు నుంచి మినహాయింపు ఇచ్చే ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించనుంది. పిల్లలు, పెద్దలు నిత్యం ఉపయోగించే బిస్కట్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని బిస్కెట్ తయారీదారులు కోరుతున్నారు. మరోవైపు లగ్జరీ హోటళ్లపై విధిస్తున్న జీఎస్టీ రేట్‌ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలనే డిమాండ్ జీఎస్టీ కౌన్సిల్ ముందుకు రానుంది. -
డీటీసీతో ‘పన్ను’ ఊరట!
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల కోడ్(డీటీసీ) సమీక్ష కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ప్యానెల్.. పన్నుల భారం తగ్గించే దిశగా కీలక సిఫారసులు చేసింది. వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించాలని, డివిడెండ్ పంపిణీపై పన్ను (డీడీటీ)ను ఎత్తివేయాలని ప్యానెల్ చేసిన సిఫారసుల్లో ముఖ్యమైనవి. అదే సమయంలో దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)ను, సెక్యూరిటీ లావాదేవీల పన్నును (ఎస్టీటీ) మాత్రం కొనసాగించాలని సూచించింది. గత వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమర్పించిన నివేదికలో ఎనిమిది మంది సభ్యులతో కూడిన ప్యానెల్ తన సిఫారసులను పేర్కొంది. ఆదాయపు పన్ను మూడు రకాలే... వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లను తగ్గించాలన్నది డీటీసీ టాస్క్ ఫోర్స్ సిఫారసుల్లో అత్యంత కీలకమైన సంస్కరణ. ప్రస్తుతం 5, 20, 30 శాతం పన్ను శ్లాబులు ఉండగా, వీటిని క్రమబద్ధీకరించి, 5 శాతం, 10 శాతం, 20 శాతం రేట్లను తీసుకురావాలని సూచించింది. అంటే పై స్థాయిలో 30 శాతం, 20 శాతం పన్ను రేట్లను కలిపేసి.. 20 శాతం పన్నునే తీసుకురావాలని పేర్కొనడం పన్ను భారాన్ని భారీగా తగ్గించే కీలక సిఫారసు. మరో ప్రతిపాదన ప్రకారం... రూ.5–10 లక్షల మధ్య ఆదాయ వర్గాలపై 10 శాతం, రూ.10–20 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.30 లక్షలు మించి రూ.2 కోట్ల వరకు ఆదాయంపై 30 శాతం పన్ను విధించాలన్నదీ ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.2.5 లక్షల ఆదాయంపై ఎటువంటి పన్ను లేదు. రూ.2.5–5 లక్షల ఆదాయం ఉన్న వారికి పన్ను రాయితీ ఉంది. అంటే రూ.5 లక్షల వరకు పన్ను వర్తించే ఆదాయం ఉన్న వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.5–10 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.10 లక్షలు మించిన ఆదాయంపై 30 శాతం పన్ను రేటు అమల్లో ఉంది. రూ.2.5–5 లక్షల ఆదాయంపై ఎలానూ పన్ను రిబేటు ఉంది కనుక ఇకపై రూ.5 లక్షల వరకు ఆదాయ వర్గాలను పన్ను నుంచి మినహాయించే అవకాశం ఉంది. ‘‘పన్ను శ్లాబులను సమీక్షించడం వల్ల స్వల్ప కాలం పాటు ఇబ్బంది ఉంటుంది. ప్రభుత్వ ఖజానాపై 2–3 ఏళ్ల ప్రభావం చూపిస్తుంది. కానీ పన్నుల సరళీకరణతో పన్ను చెల్లించే వారు పెరుగుతారు’’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. 58 ఏళ్ల క్రితం నాటి ఆదాయపన్ను చట్టాన్ని సమీక్షించి, వ్యక్తులు, కంపెనీలపై పన్నుల భారాన్ని తగ్గించడంతోపాటు, పన్ను నిబంధనల అమలును పెంచే దిశగా సిఫారసుల కోసం ప్రభుత్వం అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ సిఫారసులపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. డీడీటీకి మంగళం? ‘‘డీడీటీని తొలగించాలన్న ఆలోచన వెనుక ఉద్దేశం పన్నులపై పన్ను ప్రభావాన్ని తొలగించడమే’’ అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. కంపెనీలు వాటాదారులకు పంపిణీ చేసే డివిడెండ్‌పై 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా 12 శాతం సర్‌చార్జ్, 3 శాతం ఎడ్యుకేషన్ సెస్సు కూడా కలుపుకుంటే డివిడెండ్‌పై నికర పన్ను 20.3576 శాతం అవుతోంది. డివిడెండ్‌పై కార్పొరేట్ ట్యాక్స్, డీడీటీ, ఇన్వెస్టర్ ఇలా మూడు సార్లు పన్నుల భారం పడుతున్నట్టు మార్కెట్ పార్టిసిపెంట్లు (బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, బీమా సంస్థలు) రెండు వారాల క్రితం ఆర్థిక మంత్రితో భేటీ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల అంతర్జాతీయంగా భారత క్యాపిటల్ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉండడం లేదని పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌లో చెల్లించే పన్నులకు తమ దేశంలో క్రెడిట్ పొందే అవకాశం ఉంటుంది. అయితే డివిడెండ్‌పై పన్నును కంపెనీలే చెల్లిస్తున్నందున వారు దానిపై క్రెడిట్ పొందడానికి అవకాశం ఉండడం లేదు. ఈ నేపథ్యంలో డీడీటీని ఎత్తివేసి, దీనికి బదులు సంప్రదాయ విధానంలోనే పన్ను వేయాలన్నది టాస్క్ ఫోర్స్ సూచన. ప్రతిపాదిత డీడీటీని రద్దు చేస్తే, ఆదాయంపై బహుళ పన్నులు తొలగిపోయి కంపెనీలపై భారం తగ్గుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీన్ని రద్దు చేస్తే డివిడెండ్ అందుకున్న వాటాదారులే దాన్ని ఆదాయంగా చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను స్టాక్ ఎక్సేంజ్‌ల ద్వారా చేసే సెక్యూరిటీల లావాదేవీలపై పన్ను ను కూడా కొనసాగించాలని పేర్కొంది. -
జీఎస్టీ 2.0 అమల్లోకి తేవాలి
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ) రెండో దశను (2.0) అమల్లోకి తేవాల్సిన సమయం వచ్చిందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. విద్యుత్, చమురు, గ్యాస్, రియల్ ఎస్టేట్, ఆల్కహాల్‌ను కూడా దీని పరిధిలోకి తీసుకురావడం ద్వారా పన్ను సంస్కరణలకు మరింత ఊతమివ్వాల్సిన అవసరముందని పేర్కొన్నాయి. అలాగే పన్ను రేటును 2–3 శ్లాబులకు పరిమితం చేయాలని కోరాయి. ‘జీఎస్టీ అమల్లోకి వచ్చి రెండేళ్లయింది. ఇక జీఎస్టీ 2.0ని అమలు చేయాల్సిన తరుణం వచ్చింది. ఇది దేశ ఎకానమీని తదుపరి వృద్ధి స్థాయికి చేర్చగలదు‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ తెలిపారు. ప్రారంభ దశలో ఎదురైన పలు సవాళ్లను అధిగమించిన నేపథ్యంలో పరోక్ష పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేయాలన్న లక్ష్య సాధన దిశగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమానీ పేర్కొన్నారు. మరోవైపు రిటర్నుల ఫైలింగ్ల్లోనూ.. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ల్లోనూ వ్యత్యాసాలు ఉన్నా, పన్నులు ఎగవేసినా ఆయా సంస్థల ప్రమోటర్లు, డైరెక్టర్లు, ప్రొప్రైటర్లకు ఎస్ఎంఎస్లు పంపుతున్నట్లు జీఎస్టీ నెట్వర్క్ సీఈవో ప్రకాష్ కుమార్ తెలిపారు. దీనివల్ల తెలియక చేసిన తప్పులేమైనా ఉంటే వారు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుందని ఆయన వివరించారు. ఇందుకోసం ప్రత్యేక జీఎస్టీ వ్యవస్థను రూపొందించినట్లు కుమార్ చెప్పారు. ఐటీసీ క్లెయిమ్‌లు, రిటర్నుల్లో తేడాలున్న పక్షంలో ఆయా అసెసీలకు అలర్ట్‌లు పంపడంతో పాటు ఆదాయ పన్ను శాఖకు సమాచారం అందించడం జరుగుతుందని ఆయన వివరించారు. మరోవైపు వరుసగా రెండు నెలల పాటు జీఎస్టీఆర్–3బి దాఖలు చేయని సంస్థలకు ఆగస్టు 22 నుంచి ఈ–వే బిల్లుల జారీ నిలిపివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 1.22 కోట్ల వ్యాపార సంస్థలు జీఎస్టీ కింద నమోదయ్యాయి. -
వేతన జీవులకు ఊరట..?
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 5న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై వివిద వర్గాలు పలు అంచనాలతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితి ప్రస్తుత రూ 2.5 లక్షల నుంచి పెంచాలని కేపీఎంజీ ఇండియా నిర్వహించిన ప్రీ బడ్జెట్ సర్వేలో పాల్గొన్నవారిలో అత్యధికులు కోరారు. ఇక రూ 10 కోట్ల పైబడిన వార్షికాదాయం కలిగిన సంపన్నులపై 40 శాతం పన్ను రేటు విధించాలని కూడా పలువురు కోరారు. వివిధ పరిశ్రమలకు చెందిన 226 మందిని ప్రీ బడ్జెట్ సర్వేలో భాగంగా కేపీఎంజీ పలుకరించింది. ఇక వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ 2.5 లక్షల నుంచి పెంచాలని 74 శాతం మంది అభిప్రాయపడగా, రూ 10 కోట్ల పైబడిన ఆదాయం కలిగిన వారిపై 40 శాతం పన్ను రేటు వర్తింపచేయాలని 58 శాతం మంది కోరడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వం వెల్త్ ట్యాక్స్ లేదా ఎస్టేట్ సుంకాన్ని తిరిగి ప్రవేశపెట్టవచ్చని 10 శాతం మంది అంచనా వేశారు. ఇక వారసత్వ పన్ను కూడా తిరగతోడతారని 13 శాతం మంది పేర్కొన్నారు. ఇక గృహరుణంపై వడ్డీకి పన్ను డిడక్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ 2 లక్షల నుంచి ప్రభుత్వం పెంచాలని సర్వేలో పాల్గొన్న వారిలో 65 శాతం మంది కోరారు. -
నేడు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహంలో భాగంగా జీఎస్టీ రేటు తగ్గింపుపై జీఎస్టీ కౌన్సిల్ శుక్రవారం జరిగే సమావేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం 12 శాతం రేటు ఉండగా, దీన్ని 5 శాతానికి తగ్గించాలన్నది ప్రతిపాదన. పెట్రోల్, డీజిల్ వాహనాలపై ప్రస్తుతం 28 శాతం పన్ను రేటు అమల్లో ఉంది. అక్రమ లాభ నిరోధక విభాగం పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు 2020 నవంబర్ వరకు పొడిగించే ప్రతిపాదనపైనా కౌన్సిల్ నిర్ణయాన్ని ప్రకటించనుంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జరిగే తొలి జీఎస్టీ కౌన్సిల్ భేటీ ఇది. వాస్తవానికి కౌన్సిల్‌కు ఇది 35వ సమావేశం అవుతుంది. జీఎస్టీ ఎగవేత నిరోధక చర్యల్లో భాగంగా ఈవే బిల్లును జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు (ఎన్హెచ్ఏఐ) చెందిన ఫాస్టాగ్‌తో 2010 ఏప్రిల్ 1 నుంచి అనుసంధానించడం, వ్యాపారుల నుంచి వ్యాపారుల మధ్య జరిగే విక్రయాలు (బీటుబీ) రూ.50 కోట్ల పైన ఉంటే ఈ ఇన్వాయిస్ జారీ చేయడం, అన్ని సినిమా హాళ్లలో ఈ టికెట్‌ను తప్పనిసరి చేయాలని రాష్ట్రాలను కోరే అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. లాటరీలపై పన్ను అంశం తేలేనా? లాటరీలపై జీఎస్టీ రేటు తగ్గింపుపైనా నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం లాటరీలపై భిన్న పన్ను రేట్లు అమల్లో ఉన్నాయి. ఏకీకృత రేటు విషయంలో 8 మందితో కూడిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. రాష్ట్రాలు నిర్వహించే లాటరీలపై 12% రేటు ఉంటే, రాష్ట్ర గుర్తింపుతో నడిచే లాటరీలపై 28 శాతం పన్ను అమలు చేస్తున్నారు. జీఎస్టీ రిఫండ్స్ మంజూరు వ్యవçహారాలకు ఒకే ఒక యంత్రాంగం ఉండాలన్న దానిపైనా కౌన్సిల్ చర్చించనుంది. ప్రస్తుతం తిరిగి చెల్లింపులను చూసేందుకు కేంద్రం, రాష్ట్రాల తరఫున రెండు రకాల యంత్రాంగాలు ఉన్నాయి. అలాగే, అప్పిలేట్ అథారిటీ నేషనల్ బెంచ్ ఏర్పాటు అంశం కూడా చర్చకు రానుంది. -
ఇళ్లపై తగ్గనున్న జీఎస్టీ భారం
న్యూఢిల్లీ: నివాసిత గృహాలపై జీఎస్టీ రేటును 12 శాతం నుంచి 5 శాతానికి, అందుబాటు ధరల ఇళ్ల ప్రాజెక్టులపై జీఎస్టీని 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించేందుకు మంత్రుల బృందం తొలి భేటీలోనే సానుకూలత వ్యక్తం చేసింది. గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ అధ్యక్షతన మంత్రుల బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్ గత నెలలో ఏర్పాటు చేసింది. జీఎస్టీ విధానంలో రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను పరిశీలించి, పన్ను రేట్లపై సూచనలు చేసే బాధ్యతలు అప్పగించింది. ఈ మంత్రుల బృందం తొలి సమావేశం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. వారం రోజుల్లోపే నివేదికను సిద్ధం చేసి వచ్చే వారం జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముందుంచనున్నట్టు ఓ అధికారి తెలిపారు. పన్ను రేట్లను తగ్గించేందుకు మంత్రుల బృందం సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. నిర్మాణంలో ఉన్న లేదా నిర్మాణం పూర్తి చేసుకున్న ఫ్లాట్లపై (పూర్తయినట్టు ధ్రువీకరణ జారీ చేయని వాటిపై) ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయంతో అమలు చేస్తున్నారు. నిర్మాణం పూర్తయినట్టు ధ్రువీకరణ ఇచ్చిన ఇళ్లపై కొనుగోలుదారుల నుంచి జీఎస్టీని వసూలు చేయడం లేదు. అయితే, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయాన్ని బిల్డర్లు వినియోగదారులకు బదిలీ చేయడం లేదని ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈ అంశాలను పరిశీలించి తగిన సూచనలకు గాను జీఎస్టీ కౌన్సిల్ జనవరి 10న మంత్రుల బృందాన్ని నియమించింది. జీఎస్టీ తగ్గిస్తే ఇళ్ల అమ్మకాలు రయ్: క్రెడాయ్ నిర్మాణంలో ఉన్న ఇళ్లు, ఫ్లాట్లపై జీఎస్టీని తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయని రియల్టర్ల సంఘం క్రెడాయ్ పేర్కొంది. అధిక జీఎస్టీ రేటు 12 శాతం, 8 శాతం ఉండడంతో ఇళ్ల కొనుగోలును ప్రస్తుతం వాయిదా వేసుకుంటున్నట్టు క్రెడాయ్ ప్రెసిడెంట్ జక్సేషా తెలిపారు. జీఎస్టీ తగ్గిస్తే కొనడం ప్రారంభిస్తారని అభిప్రాయపడ్డారు. -
బిగ్గెస్ట్ ట్యాక్స్ కట్ : చౌకగా 200 వస్తువులు?
-
బిగ్గెస్ట్ ట్యాక్స్ కట్ : చౌకగా 200 వస్తువులు?
సాక్షి, న్యూఢిల్లీ : చేతితో రూపొందించిన ఫర్నీచర్ నుంచి శాంపు, శానిటరీ వేర్, ప్లే వుడ్ వరకు మొత్తం 200 పైగా వస్తువులు ఇక చౌకగా లభ్యం కానున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో గౌహతిలో జరుగుతున్న భేటీలో నేడు జీఎస్టీ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది. ఎక్కువగా వినియోగదారులు వాడే వస్తువులపై పన్ను రేట్లు కోత విధించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 28 శాతం శ్లాబులో ఉన్న సేవలు, వస్తువుల్లో 80 శాతం ఇకపై 18 శాతం పన్ను పరిధిలోకి రాబోతున్నట్లు సమాచారం. రెస్టారెంట్లపై విధిస్తున్న పన్ను రేట్లను కూడా తగ్గించబోతున్నట్టు తెలుస్తోంది. పన్ను రేట్లను తగ్గించాలని అభ్యర్థిస్తూ రెస్టారెంట్ల యజమానులు జీఎస్టీ కౌన్సిల్‌తో భేటీ అయి తమ గోడును వినిపించుకున్నారు. జీఎస్టీ 28 శాతం శ్లాబు పరిధిలో ఉన్న 227 ఐటమ్స్‌లో దాదాపు 80 శాతం ఐటమ్స్‌ను 18 శాతం శ్లాబులోకి తెచ్చే అవకాశం ఉందని బిహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ చెప్పారు. అంతేకాకుండా ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ పరిధిలో ఉన్నవాటిలో చాలా ఐటమ్స్‌ను 12 శాతం జీఎస్టీకి తగ్గించాలని కూడా జీఎస్టీ ఫిట్మెంట్ కమిటీ సిఫారసు చేసిందన్నారు. ఎక్కువ మొత్తంలో పన్ను రేట్లు భరిస్తున్న కొన్ని ఉత్పత్తులను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలే తయారీ చేస్తుండటంతో, వీరిపై ఒత్తిడి అధికంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పన్ను రేట్లను పునఃసమీక్షించాల్సి ఉందని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నేడు పన్ను రేట్లు తగ్గబోతున్న వస్తువులు... చేతితో రూపొందించిన ఫర్నీచర్, షాంపు, శానిటరీ వేర్, స్యూట్‌కేస్, వాల్ పేపర్, ప్లేవుడ్, స్టేషనరీ ఆర్టికల్స్, వాచ్, ప్లే ఇన్స్ట్రుమెంట్స్ రెస్టారెంట్లపై కూడా పన్ను రేట్లు తగ్గించేందుకు ప్యానెల్ నిర్ణయం కాంపోజిషన్ స్కీమ్ కింద కవర్ చేయని ఏసీ, నాన్-ఏసీ రెస్టారెంట్ల మధ్య పన్ను రేటు వ్యత్యాసం ఉండకూడదని అస్సాం ఆర్థికమంత్రి హిమంత్ బిస్వా శర్మ ఆధ్వర్యంలోని ప్యానెల్ ప్రతిపాదించింది. ఒకే విధంగా 12 శాతం పన్ను రేటు ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం నాన్ ఏసీ రెస్టారెంట్లకు 12 శాతం జీఎస్టీ, ఏసీ రెస్టారెంట్లకు 18 శాతం పన్ను రేట్లు ఉన్నాయి. ప్రస్తుతం 28 శాతం పన్ను కేటగిరీలో ఉన్న 5-స్టార్ హోటళ్లను ప్రత్యేక కేటగిరీ కింద ఉంచడం కాకుండా.. రూమ్ టారిఫ్ రూ.7500 దాటిన వారందరికీ ఒకే విధంగా 18 శాతం పన్ను విధించాలని ప్యానెల్ నిర్ణయించింది. కోటికి వరకు వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారస్తులు కాంపోజిషన్ స్కీమ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి ఇన్పుట్ క్రెడిట్లు లేకుండా ఫ్లాట్ రేటులో పన్ను చెల్లించుకోవచ్చు. చిన్న వ్యాపారస్తులకు పడుతున్న ఒత్తిడి మేరకు, ప్రతి నెలా మూడు సార్లు ఫైల్ చేయాల్సిన రిటర్నులపై కూడా జీఎస్టీ కౌన్సిల్ సమీక్ష జరుపుతోంది. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ పన్ను విధానంపై ప్రతి నెలా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుపుతోంది. జీఎస్టీ కింద ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం పన్ను శ్లాబులున్నాయి. -
వీటి ధర తగ్గే ఛాన్స్..
సాక్షి,న్యూఢిల్లీ: రోజువారీ ఉపయోగించే పలు వస్తువులపై జీఎస్టీ భారాన్నితగ్గించేందుకు కసరత్తు సాగుతోంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శుక్రవారం జరగనున్న 23వ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ సమావేశంలో 28 శాతం పన్ను పరిథిలో ఉన్న పలు వస్తువులను ఆ జాబితా నుంచి కుదించడంతో పాటు రోజువారీ ఉపయోగించే షాంపూలు, ఎలక్ట్రిక్ స్విచ్‌లు, ప్లాస్టిక్ ఉత్పుత్తులు, ఫర్నిచర్ వంటి వాటిపై పన్ను రేటును తగ్గిస్తారని భావిస్తున్నారు. జీఎస్టీ రిటన్స్ దాఖలులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న మధ్యతరహా వ్యాపారులకూ ఊరట ఇచ్చేలా పలు నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు. కాంపోజిషన్ స్కీమ్ కింద రూ కోటి లోపు టర్నోవర్ కలిగిన వ్యాపారాలపై పన్నును ఒక శాతానికి తగ్గించడం, నాన్ ఏసీ రెస్టారెంట్లపై తక్కువ పన్నురేట్ల వర్తింపు ప్రతిపాదనలపైనా ఓ నిర్ణయం తీసుకోనున్నారు. -
28% పన్ను శ్లాబు ఉత్పత్తులకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : అత్యధిక జీఎస్టీ శ్లాబు 28 శాతం అమలవుతున్న ఉత్పత్తులకు మంచి రోజులు రాబోతున్నాయి. ఎక్కువగా వినియోగించే ఉత్పత్తులకు, నాన్-లగ్జరీ ఉత్పత్తులకు ఈ రేటును తగ్గించాలని పాలసీ తయారీదారులు నిర్ణయిస్తున్నారు. వీటిని 18 శాతం పన్ను శ్లాబులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. వీటికి మరింత డిమాండ్‌ను పెంచడానికి ఈ ఉత్పత్తుల ధరలు తగ్గించాలని చూస్తున్నారు. 28 శాతం శ్లాబును పునఃసమీక్షించాల్సి ఉందని ఓ సీనియర్ ప్రభుత్వాధికారి చెప్పారు. ఎక్కువ మొత్తంలో పన్ను రేట్లు భరిస్తున్న కొన్ని ఉత్పత్తులను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలే తయారీ చేస్తుండటంతో, వీరిపై ఒత్తిడి అధికంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పన్ను రేట్లను పునఃసమీక్షించాల్సి ఉందని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 28 శాతం పన్ను శ్లాబులో వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రిక్ ఫిట్టింగ్స్, సిమెంట్ సీలింగ్ ఫ్యాన్స్, వాచ్‌లు, ఆటోమొబైల్స్, టుబాకో ఉత్పత్తులు, న్యూట్రిషినల్ డ్రింకులు, ఆటో పార్ట్లు, ప్లాస్టిక్ ఫర్నీచర్, ప్లేవుడ్లున్నాయి. పాలసీ తయారీదారులు ప్రస్తుతం తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించాల్సి ఉంది. నవంబర్ 9-10వ తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ గౌహతిలో భేటీ కాబోతుంది. ఈ భేటీలో ఈ అంశాలు చర్చకు రానున్నాయి. 28 శాతం పన్ను శ్లాబు అనేది నిజమైన జీఎస్టీ విధానానికి, లక్ష్యానికి విఘాతం కల్గిస్తుందని ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫిడరేషన్ విమర్శిస్తోంది. లగ్జరీ ఉత్పత్తులకు మాత్రమే దీన్ని అమలు అయ్యేలా చూడాలని కోరుతోంది. ఇదే విషయాన్ని ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు వచ్చే జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ప్రస్తావించనున్నట్టు కూడా తెలుస్తోంది. -
జీఎస్టీతో వారికి రూ.6000కోట్లు ఆదా
సాక్షి, కోల్కత్తా : ప్రభుత్వం జూలై 1 నుంచి ప్రవేశపెట్టిన కొత్త పన్నుల విధానం జీఎస్టీతో బొగ్గు వినియోగదారులకు మంచి లాభం చేకూరుతోంది. జీఎస్టీ అనంతరం పన్ను రేట్లు దిగిరావడంతో బొగ్గు వినియోగదారులకు వార్షికంగా రూ.6000 కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందని అధికారిక అంచనాలు వెలువడుతున్నాయి. ప్రీ-జీఎస్టీ కాలంలో బొగ్గుపై ఎక్సైజ్ డ్యూటీలు, వాల్యుయాడెట్ పన్నులు, కేంద్ర విక్రయ పన్నులు వంటి పలు కారణాలతో భారీ మొత్తంలో పన్నులుండేవి. కానీ జీఎస్టీ అమలు తర్వాత అన్ని పన్నులు, లెవీలు కలిపేసి, కేవలం 5 శాతం జీఎస్టీని మాత్రమే వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. పన్ను రేట్లు దిగిరావడంతో వినియోగదారులకు వార్షికంగా రూ.6000 కోట్ల లబ్ది చేకూరుతుందని కోల్ ఇండియాకు చెందిన ఓ అధికారి చెప్పారు. జీఎస్టీ పాలనలో పన్ను విధానం తలకిందులైందని, అవుట్‌పుట్‌కు తక్కువ పన్ను ఉండి, ఇన్పుట్కు ఎక్కువ పడుతుందన్నారు. జీఎస్టీ పాలనలో 5 శాతం పన్నును కోల్‌కు వేస్తే, తమ ఇన్పుట్లకు 18-28 శాతం పన్నులు పడుతున్నాయని తెలిపారు. -
జీఎస్టీకి ముందు, తర్వాత పన్నురేట్లు ఇవిగో!
-
జీఎస్టీతో పన్ను రేట్లు తగ్గుతాయా? పెరుగుతాయా?
ఒకే దేశం.. ఒకే పన్ను విధానమంటూ చారిత్రాత్మక పన్ను విధానం జీఎస్టీ నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రాబోతుంది. పార్లమెంట్ సెంట్రల్ హాలు వేదికగా ఎంతో అట్టహాసంగా దీనికి అంకురార్పణ చేయబోతున్నారు. దేశమంతా ఒకే జీఎస్టీ ఉండటంతో రకరకాల పన్నుల నుంచి వినియోగదారులకు విముక్తి లభిస్తోంది. అంతేకాక కొన్ని వస్తువులపై పన్ను భారం కూడా వినియోగదారుడిపై పడనుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ రాకముందు వివిధ వస్తువుల పన్ను రేట్లు ఏ విధంగా ఉన్నాయి? వచ్చిన తర్వాత వాటిపై పన్ను భారం లేదా లాభం ఏ మేర ఉండబోతుందో ఓ సారి తెలుసుకుందాం... చాక్లెట్లు, బిస్కెట్లు : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18% కేకులు, పేస్ట్రీలు : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18% ఐస్ క్రీంలు: ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18% నెయ్యి : ప్రస్తుతం 5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12% వెన్న : ప్రస్తుతం 14.5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12% చక్కెర : ప్రస్తుతం 10%, జీఎస్టీ వచ్చిన తర్వాత 5% టీ పొడి : ప్రస్తుతం 10%, జీఎస్టీ వచ్చిన తర్వాత 5% కాఫీ పొడి : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 5% సిమెంట్ : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28% మొబైల్స్ : ప్రస్తుతం 6%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12% టీవీలు : ప్రస్తుతం 26%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28% వైద్య పరికరాలు : ప్రస్తుతం 18%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12% మైక్రోవేవ్ ఓవెన్ : ప్రస్తుతం 26%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28% ఫ్రిడ్జ్ : ప్రస్తుతం 26%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28 % వాషింగ్ మెషిన్ : ప్రస్తుతం 26%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28 % సబ్బులు : ప్రస్తుతం 29 %, జీఎస్టీ వచ్చిన తర్వాత 18% టూత్‌పేస్ట్ : ప్రస్తుతం 29 %, జీఎస్టీ వచ్చిన తర్వాత 18% హెయిర్ ఆయిల్ : ప్రస్తుతం 29 %, జీఎస్టీ వచ్చిన తర్వాత 18% ఆయుర్వేద మందులు : ప్రస్తుతం 10%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12% బంగారం : ప్రస్తుతం 5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 3% ఫర్నీచర్ : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12% కంప్యూటర్లు/ల్యాపీలు : ప్రస్తుతం 6%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18% ద్విచక్రవాహనాలు : ప్రస్తుతం 30%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28% చిన్నకార్లు : ప్రస్తుతం 30%, జీఎస్టీ వచ్చిన తర్వాత 29% మీడియం కార్లు : ప్రస్తుతం 47%, జీఎస్టీ వచ్చిన తర్వాత 43% పెద్ద కార్లు : ప్రస్తుతం 49%, జీఎస్టీ వచ్చిన తర్వాత 43% ఎస్యూవీ కార్లు : ప్రస్తుతం 55%, జీఎస్టీ వచ్చిన తర్వాత 43% కమర్షియల్ వాహనాలు : ప్రస్తుతం 30%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28% రెడీమేడ్ దుస్తులు : (రూ.1000 కంటే తక్కువ)- ప్రస్తుతం 5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 2.5% రెడీమేడ్ దుస్తులు : (రూ.1000 కంటే ఎక్కువ)- ప్రస్తుతం 12%, జీఎస్టీ వచ్చిన తర్వాత 4.5% చెప్పులు, బూట్లు : (రూ.500 వరకు)- ప్రస్తుతం 5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 5% చెప్పులు, బూట్లు : (రూ.500 నుంచి రూ.1000 వరకు)- ప్రస్తుతం 20.5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18% చెప్పులు, బూట్లు : (రూ.1000పైన)- ప్రస్తుతం 26.5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18% -
జీఎస్టీ ఎఫెక్ట్: ఎఫ్ఎంసీజీ షేర్ల జోరు
ముంబై: జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన పన్ను రేట్లకు అనుగుణంగా సోమవారంనాటి మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనయ్యింది. కొన్ని ముఖ్యమైన ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ధరలు తగ్గనున్న నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ షేర్లు ర్యాలీ జరపగా, పన్ను రేట్లు అధికంగా కానున్నందున సిమెంటు షేర్లు క్షీణించాయి. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా పెరిగి 30,712 పాయింట్ల గరిష్టస్థాయికి చేరి, అటుతర్వాత 30,517 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది. చివరకు క్రితం ట్రేడింగ్ రోజుతో పోలిస్తే 106 పాయింట్ల లాభంతో 30,571 పాయింట్ల వద్ద ముగిసింది. 9,499–9,428 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 10 పాయింట్ల లాభంతో 9,438 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్లోఎఫ్ఎంసీజీ షేర్లకు వున్న అధిక వెయిటేజీ వల్ల ఈ సూచి పెరుగుదల 0.35%కాగా, నిఫ్టీ లాభం 0.11 శాతానికే పరిమితంకావడం గమనార్హం. ఐటీసీ 6 శాతం జూమ్...: ముఖ్యంగా ప్రధాన ఎఫ్ఎంసీజీ షేరు ఐటీసీ 6 శాతం మేర ర్యాలీ జరిపి చరిత్రాత్మక గరిష్టస్థాయి రూ. 303 వద్ద ముగిసింది. హిందుస్తాన్ యూనీలీవర్ 1 శాతంపైగా ఎగిసి కొత్త గరిష్టస్థాయి రూ. 1,020 వద్ద క్లోజయ్యింది. ఇతర ఎఫ్ఎంసీజీ షేర్లు నెస్లే, బ్రిటానియా, మారికో, డాబర్ ఇండియాలు కూడా పెరిగాయి. బీఎస్ఈ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 3 శాతంపైగా ఎగిసింది. సెన్సెక్స్–30 షేర్లలో ఎల్ అండ్ టీ, అదాని పోర్ట్స్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్‌లు 1–2 శాతం మధ్య పెరిగాయి. -
జీఎస్టీపై పరిశ్రమ అటూఇటూ..!
పన్ను రేట్లపై మిశ్రమ స్పందన న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలు దిశగా కీలక ఘట్టాన్ని పూర్తి చేసేసింది. వివిధ వస్తువులు, సేవలకు పన్ను రేట్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రేట్లపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఆటోమొబైల్ రంగం స్వాగతించగా, టెలికం మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆటోమొబైల్స్‌పై అంచనాలకు తగ్గట్లే రేట్లు... పరిశ్రమ ఆశించినట్టుగానే జీఎస్టీ రేట్లు ఉన్నాయని ఆటోమొబైల్ రంగం పేర్కొంది. మొత్తం మీద వివిధ రకాల పన్నుల భారం తగ్గుతుందని, పరిశ్రమలోని అన్ని విభాగాలూ లబ్ధి పొందుతాయని ఆటోమొబైల్ తయారీ దారుల సంఘం ప్రెసిడెంట్ వినోద్ దాసరి తెలిపారు. ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచడమే కాకుండా దేశంలో ఆటోమొబైల్ మార్కెట్‌ను బలోపేతం చేస్తుందన్నారు. ఎలక్ట్రికల్ వాహనాలకు విడిగా వేరే పన్ను రేటును ఖరారు చేయడం ఆయా వాహనాలకు ఊతమిస్తుందని వినోద్ అభిప్రాయపడ్డారు. 10–13 సీట్ల సామర్థ్యంగల వాహనాలను, లగ్జరీ కార్లకు మాదిరిగా 15 శాతం పన్ను పరిధిలోకి చేర్చడంపై సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని ప్రధానంగా ప్రజా రవాణాకు వినియోగిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టెలికం సేవలు భారం... టెలికం సేవలను 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావడంపై ఆ శాఖ నిరాశ వ్యక్తం చేసింది. ఇప్పటికే తీవ్రమైన అప్పుల భారాన్ని మోస్తున్న ఈ రంగంపై ప్రభుత్వ నిర్ణయం మరింత భారాన్ని మోపుతుందని అభిప్రాయపడింది. ‘‘గొప్ప సంస్కరణగా జీఎస్టీని టెలికం పరిశ్రమ ప్రశంసించింది. కానీ, 18 శాతం పన్ను రేటుతో మేము నిరాశ చెందాం. ఈ రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతమున్న 15 శాతం రేటుకు మించిన పన్నును నిర్ణయిస్తే టెలికం సేవలు మరింత ఖరీదుగా మారతాయని ప్రభుత్వానికి ఇప్పటికే తెలియజేశాం’’ అని సెల్యులర్ ఆపరేటర్ల సంఘం(సీఓఏఐ) పేర్కొంది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలైన ‘డిజిటల్ ఇండియా’, ‘నగదు రహిత భారత్’పై ప్రభావం పడుతుందని సీఓఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మ్యాథ్యూస్ అన్నారు. నిత్యాసవసర సేవల్లో భాగమైన టెలికం రంగానికి పన్ను మినహాయింపులు ఉండాలని అభిప్రాయపడ్డారు. స్థిరీకరణకు 6 నెలలు.. ప్రతిఫలాలకు 3 ఏళ్లు..: క్రిసిల్ జీఎస్టీని అమలులోకి తీసుకొచ్చిన తర్వాత పారిశ్రామిక రంగ స్థిరీకరణకు ఆరు నెలల కాలం పడుతుందని దేశీ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. ఈ అతిపెద్ద పరోక్ష పన్ను సంస్కరణ వల్ల కలిగే ప్రయోజనాలకు మూడేళ్ల వరకు వేచిఉండాలని తెలిపింది. ఎఫ్ఎంసీజీకి ప్రయోజనకరమే..: జీఎస్టీ పన్ను రేట్లు వల్ల ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల వినియోగం పెరుగుతుందని పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు. కొన్ని హోమ్‌కేర్ ఉత్పత్తులు, షాంపులు మినహా ఇతర ఉత్పత్తులపై పన్ను రేట్లు సానుకూలంగానే ఉన్నాయన్నారు. జీఎస్టీ రేట్లు అశించిన స్థాయిల్లోనే ఉన్నాయని, ఇవి పరిశ్రమకు ప్రయోజనకరమని అభిప్రాయపడ్డారు. అయితే అధిక రేట్ల వల్ల ఆయుర్వేద్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. -
నిత్యావసరాలు మరింత చవక
-
నిత్యావసరాలు మరింత చవక
పన్ను రేట్లు ఖరారు చేసిన జీఎస్టీ మండలి ► 81 శాతం వస్తువులు 18.. అంతకంటే తక్కువ పన్ను శ్లాబుల్లోనే ► పన్ను పరిధి నుంచి ఆహార ధాన్యాల మినహాయింపు.. వ్యాట్ తొలగింపు శ్రీనగర్/న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) అమలులో భాగంగా మరో కీలక అడుగు పడింది. వివిధ వస్తువుల్ని 5, 12, 18, 28 పన్ను శ్లాబుల్లోకి చేరుస్తూ జీఎస్టీ మండలి గురువారం నిర్ణయం తీసుకుంది. ఆరు మినహా మొత్తం 1211 వస్తువులపై పన్ను రేట్లను జీఎస్టీ మండలి ఆమోదించింది. కొత్త పన్ను రేట్లతో ఆహారధాన్యాలు, రోజువారీ వినియోగ వస్తువులైన కొబ్బరినూనె, సబ్బులు, టూత్‌పేస్టులతో పాటు విద్యుత్ చార్జీలు తగ్గుముఖం పడతాయి. అయితే విలాసవంతమైన కార్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. కార్లను 28 శాతం శ్లాబులో చేర్చగా.. వాటిపై ఒక శాతం నుంచి 15 శాతం వరకూ అదనపు సెస్సు వసూలు చేయనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో శ్రీనగర్‌లో జరుగుతున్న రెండ్రోజుల జీఎస్టీ మండలి సమావేశంలో భాగంగా మొదటి రోజు మొత్తం 1205 వస్తువులపై నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం బీడీలు, బంగారం, టెక్స్టైల్స్, బయోడీజిల్, పాదరక్షలు, బ్రాండెడ్ ఆహార పదార్థాలతో పాటు సేవలపై పన్ను రేట్లను నిర్ధారిస్తారు. జూలై1 నుంచి జీఎస్టీని అమల్లోకి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. పంచదార, టీ, కాఫీ, వంట నూనెలపై మార్పులేదు ప్రస్తుతం కొబ్బరినూనె, సబ్బులు, టూత్ పేస్టులపై 22 నుంచి 24 శాతం పన్ను వసూలు చేస్తుండగా వాటిని 18 శాతం శ్లాబులో చేర్చారు. బొగ్గుపై ప్రస్తుతం వసూలు చేస్తోన్న 11.69 శాతం పన్నుకు బదులు జీఎస్టీ అమల్లోకి వస్తే 5 శాతమే వసూలు చేస్తారు. దీంతో విద్యుత్ ఉత్పత్తి చవకై వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది. ప్రాణాల్ని కాపాడే మందుల్ని 5 శాతం పరిధిలో.. కేపిటల్ గూడ్స్(ఇతర వస్తువుల తయారీకి వాడే యంత్రాలు, భవనాలు వంటివి) ఇండస్ట్రియల్ ఇంటర్మీడియరీస్‌లను 18% పరిధిలో చేర్చారు. ప్రస్తుతం వీటిపై 28% పన్ను వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్నట్లే పాలు, పెరుగుపై ఎలాంటి పన్ను ఉండదు. స్వీట్లపై మాత్రం 5 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. రోజువాడే పంచదార, టీ, కాఫీ, వంట నూనెలపై 5 శాతం పన్ను యథాతథంగా కొనసాగుతుంది. గోధుమలు, వరిని పన్ను పరిధి నుంచి మినహాయించారు. ప్రస్తుతం వీటిపై కొన్ని రాష్ట్రాల్లో వసూలు చేస్తున్న వ్యాట్ కూడా రద్దయితే ధరలు మరింత తగ్గే అవకాశముంది. కన్సూ్యమర్ డ్యూరబుల్స్‌పై ప్రస్తుతం 32 శాతం పన్ను ఉండగా... వాటిని 28% శ్లాబులోకి చేర్చారు. ఏసీలు, రిఫ్రిజిరేటర్స్‌ను 28% పన్ను శ్రేణిలో చేర్చారు. ద్రవ్యోల్బణం తలెత్తకుండా పకడ్బందీగా..: జైట్లీ అధిక శాతం వస్తువులపై పన్ను రేట్లను నిర్ణయించామని, మినహాయింపు జాబితాను కూడా రూపొందించామని సమావేశం అనంతరం అరుణ్ జైట్లీ చెప్పారు. ‘మొత్తం ఆరింటిపై తప్ప అన్ని వస్తువులపై నిర్ణయం తీసుకున్నాం. శుక్రవారం జరిగే సమావేశంలో సేవలపై పన్ను రేట్లను నిర్ణయిస్తాం. ప్రస్తుతం 12.5 నుంచి 15 శాతం పన్ను శ్రేణిలో వస్తువులపై స్థానిక పన్నులతో కలిపి పన్ను 30–31 శాతం వసూలు చేస్తున్నారు. వీటిని 28 శాతంలో చేర్చాం. అందరూ వాడే సబ్బులు, నూనెల్ని 18 శాతానికి తగ్గించాం. పన్ను రేట్లు ద్రవ్యోల్బణానికి దారితీయకుండా ఉండేలా అన్ని అంశాల్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నాం. ధరలు తగ్గేలా చూడడం కూడా అందులో ఒకటి’ అని జైట్లీ తెలిపారు. ప్రస్తుతం 31 శాతం పన్ను వసూలు చేస్తున్న వస్తువుల్ని 28 శాతం పరిధిలోకి తెచ్చినందున ద్రవ్యోల్బణ ప్రభావం ఉండదన్నారు. జీఎస్టీ రేటుతో ఏ వస్తువుల ధరలు పెరగవని, ఎలాంటి పెంపు చేయలేదని, పైగా చాలా వస్తువులు ధరలు తగ్గుతాయని చెప్పారు. పరిశ్రమ వర్గాల హర్షం నిత్యావసర వస్తువుల్ని(ఎఫ్ఎంసీజీ) 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావడం మంచి పరిణామమని, ధరలు తగ్గడం వల్ల వినియోగదారులు లాభపడతారని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఆహార వస్తువులైన వంట నూనెలు, టీ, కాఫీ, పంచదారలపై 5 శాతం పన్నుతో పరిశ్రమకు లాభదాయకమని పన్నుల విశ్లేషకుడు ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. పెరగనున్న కార్ల ధరలు కార్లను 28 శాతం శ్లాబ్‌లో చేర్చగా... చిన్న కార్లపై అదనంగా ఒక శాతం సెస్సు, మధ్యశ్రేణి కార్లపై 3 శాతం, విలాసవంతమైన కార్లపై 15 శాతం సెస్సు వసూలు చేస్తారు. ఏరేటెడ్ డ్రింక్స్(కోకోకోలా, పెప్సీ వంటి శీతల పానీయాలు)పై 28 శాతం జీఎస్టీ అమలు చేస్తారు. తగ్గేవి కొబ్బరినూనె, సబ్బులు, టూత్ పేస్టు, ఆహార ధాన్యాలు(గోధుమ, వరి), కన్సూ్యమర్ డ్యూరబుల్స్(టీవీలు, లాప్‌ట్యాప్‌లు, కెమెరాలు, వాషింగ్ మిషన్లు, ఏసీలు వంటివి) పెరిగేవి కార్లు, ఏరేటెడ్ డ్రింక్స్ -
పన్ను రేట్లు తగ్గుతాయ్, ఎప్పుడంటే...
న్యూఢిల్లీ : ప్రభుత్వం పన్ను రేట్లను కచ్చితంగా తగ్గిస్తుంది, ఎప్పుడంటూ ప్రజలు తమ బకాయలను నిజాయితీగా చెల్లిస్తే అది సాధ్యపడుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ''జీఎస్టీ రేట్లు, ఆదాయపు పన్ను రేట్లు ఇతరాత్ర రేట్లని తగ్గుతాయి. ఎప్పుడంటే ప్రతి ఒక్కరూ తమ పన్నులను చెల్లిస్తే అది వీలవుతుంది'' అని గోయల్ 'ఈవై ఎంటర్‌ప్రిన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్' లో చెప్పారు. పన్ను రేట్లు తగ్గించాలని వ్యాపారస్తుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పన్ను రేట్లు తగ్గించడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. జీఎస్టీ పాలన కింద పన్ను రేట్లను జీరో నుంచి ఐదు శాతానికి తీసుకురావాలని ఇండస్ట్రి ఛాంబర్స్ కోరుతున్నాయి. క్లయింట్స్ వారి పన్ను చెల్లించేలా ఛార్టెడ్ అకౌంటెంట్స్ తోడ్పడాలని గోయల్ సూచించారు. పవర్ టారిఫ్‌లు ఆల్ టైమ్ కనిష్ట స్థాయిలకు చేరుకున్నాయన్నారు. -
406 పాయింట్ల రిలీఫ్ ర్యాలీ..
పన్ను రేట్లు తగ్గాలన్న జైట్లీ వ్యాఖ్యలతో లాభాలు • 26వేల పైకి సెన్సెక్స్, 8 వేల పైకి నిఫ్టీ • డెరివేటివ్స్ ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ • 125 పాయింట్ల లాభంతో 8,033కు నిఫ్టీ పన్ను రేట్లు తగ్గాల్సిన అవసరముందన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలతో మంగళవారం స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. మరో రెండు రోజుల్లో డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో షార్ట్ కవరింగ్ జరగడంతో స్టాక్ సూచీలు మంచి లాభాలు సాధించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ మళ్లీ 26వేల పాయింట్ల, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,000 పాయింట్ల ఎగువన ముగిశాయి. సెన్సెక్స్ ఐదు వారాల కనిష్ట స్థాయి నుంచి, నిఫ్టీ ఏడు నెలల కనిష్ట స్థాయిల నుంచి కోలుకుని వారం గరిష్ట స్థాయికి చేరాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 406 పాయింట్లు (1.57 శాతం)లాభపడి 26,213 పాయింట్లు వద్ద, నిఫ్టీ 125 పాయింట్లు (1.58 శాతం) లాభపడి 8,033 పాయింట్ల వద్ద ముగిశాయి. మూడు వారాల్లో స్టాక్ సూచీలు ఈ స్థాయిలో లాభపడడం ఇదే మొదటిసారి. ఎఫ్ఎంసీజీ, లోహ, వాహన, ఫార్మా షేర్ల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. రిటైల్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు కూడా లాభపడ్డాయి. రోజంతా లాభాలే.. లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కొనసాగింది. షేర్ల లాభాలపై మూలధన లాభాల పన్ను విధించే యోచనేదీ ప్రభుత్వానికి లేదని ఆర్థిక మంత్రి అభయమివ్వడం సోమవారం ప్రభావం చూపించకపోయినా, మంగళవారం కొంత ప్రభావం చూపించిందని నిపుణులంటున్నారు. దీనికి తోడు పన్ను రేట్లు తగ్గాల్సిన అవసరముందన్న ఆర్థిక మంత్రి ఆరుణ్ జైట్లీ వ్యాఖ్యలతో మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. రూపాయి పతనమైనా, ఆ ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడలేదు. చైనా ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటంతో లోహ, మైనింగ్ షేర్లు లాభపడడం కలసివచ్చింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడం, యూరప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం సానుకూల ప్రభావం చూపాయి. ఇటీవల బాగా పతనమైన ఫార్మా, ఎఫ్ఎంసీజీ, లోహ, ఆయిల్, గ్యాస్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా కంపెనీల ఆర్థిక పలితాలు ఎలా ఉంటాయో అనిశ్చితి నెలకొందని, డిసెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టులు రేపు(గురువారం) ముగియనున్నందున రానున్న రోజుల్లో మార్కెట్ మరింతగా ఒడిదుడుకులకు గురవుతుందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. వెలుగులో సిగరెట్ల షేర్లు.. 30 సెన్సెక్స్ షేర్లలో ఒక్క గెయిల్ ఇండియా షేర్ మాత్రమే నష్టపోయింది. మిగిలిన 29 కంపెనీలూ లాభాల్లోనే ముగిశాయి. రెండు రకాల సిగరెట్ల ధరలను 14–15 శాతం పెంచిన నేపథ్యంలో ఐటీసీ షేర్ 4 శాతం ఎగసింది. రూ.234 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడ్డ షేర్ ఇదే. బడ్జెట్లో సిగరెట్లపై సుంకం పెరగకపోవొచ్చనే అంచనాలు కూడా సిగరెట్ ఉత్పాదక కంపెనీల షేర్లు పెరగడానికి కారణమయ్యింది. గాడ్ఫ్రే ఫిలిప్స్, వీఎస్టీ ఇండస్ట్రీస్, గోల్డెన్ టుబాకో షేర్లు 3–20 శాతం రేంజ్లో పెరిగాయి. గత రెండు సెషన్లలో 34 శాతం నష్టపోయిన దివీస్ ల్యాబ్స్ షేర్ కోలుకుంది. 3 శాతం లాభంతో రూ.789 వద్ద ముగిసింది. బాష్, టాటా స్టీల్, అరబిందో ఫార్మా, టాటా మోటార్స్ డీవీఆర్, లుపిన్, హిందాల్కో, షేర్లు 2.5–3.5 శాతం రేంజ్లో పెరిగాయి. బీఎస్ఈలో 1,708 షేర్లు లాభాల్లో, 860 షేర్లు నష్టాల్లో ముగిశాయి. -
తక్కువ స్థాయి పన్ను రేట్లు అవశ్యం
ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మారాల్సిందే... • అప్పుడే ఆర్థిక వ్యవస్థ విస్తరణ.. • ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు ఫరీదాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థ విస్తృత స్థాయిలో బలోపేతం కావాలంటే తక్కువ స్థాయి పన్ను రేట్లు తప్పనిసరి అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మనం మారాల్సిన అవసరం ఉందని చెప్పారు. సోమవారమిక్కడ ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) అధికారుల వృత్తినైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ జైటీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘1991 నుంచి మన ఆర్థిక వ్యసస్థ అనేక మార్పులను చవిచూస్తూవస్తోంది. ప్రభుత్వానికి అధిక ఆదాయం లభించాలంటే ఎక్కువ పన్నులను విధించాలన్న విధానానికి కాలం చెల్లింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను మరింత విస్తృతం చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది. ఇందుకు తక్కువ స్థాయి పన్ను రేట్లు ముఖ్యం. తయారీ ఉత్పత్తుల నుంచి సేవల వరకూ అంతర్జాతీయంగా మరింత పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యత ఉండేలా మన పన్ను రేట్లు కూడా తక్కువగా ఉండాలి. అని జైట్లీ చెప్పారు. పోటీ అనేది దేశీయంగానే లేదని ప్రపంచస్థాయిలో నెలకొందన్నారు. దీనికి అనుగుణంగానే గత రెండున్నర దశాబ్దాల్లో ప్రభుత్వాలు పన్నుల విధానాలను అమలు చేస్తూ వస్తున్నాయని ఆర్థిక మంత్రి వివరించారు. పన్ను ఎగవేత అనైతికం కాదన్న ధోరణిలో... ‘గడిచిన 70 ఏళ్లలో ప్రజల ప్రవర్తనను నిశితంగా గమనిస్తే.. ప్రభుత్వానికి పన్నులు చెల్లించపోయినా అదేమీ అనైతికం కాదని, తప్పు లేదన్న ధోరణి నెలకొంది. దీన్ని తెలివిగా తప్పించుకోవడంగా కొందరు భావిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం తీవ్ర పరిణామాలనే ఎదుర్కొన్నారు కూడా’ అని జైట్లీ పేర్కొన్నారు. రానున్న దశాబ్దాల్లో స్వచ్ఛందంగా పన్ను చెల్లింపు ధోరణులు పెరిగేవిధంగా యువ ఐఆర్ఎస్ అధికారులు కృషి చేయాలన్నారు. ‘చట్టబద్ధమైన పన్నులను చెల్లించడం తమ బాధ్యత అన్న విధంగా ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలి. పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించే విధంగా వారిలో విశ్వాసం నెలకొనేలా చేయడం మీ(అధికారుల) బాధ్యత. పన్నులకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన పన్ను కేసుల్లో మాత్రమే తీవ్రమైన పరిశీలన అవసరం’ అని ఆర్థిక మంత్రి సూచించారు. జీఎస్టీ నేపథ్యంలో నైపుణ్యాలు పెరగాలి... ప్రతిపాదిత వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) త్వరలోనే కార్యరూపం దాల్చనున్న నేపథ్యంలో పన్నుల విభాగాలకు చెందిన అధికారులు తమ నైపుణ్యాలను మరింతగా సానబెట్టుకోవాల్సిన అవసరం ఉందని జైట్లీ పేర్కొన్నారు. -
పన్ను రేట్లు దిగివస్తాయ్!
• ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సంకేతాలు • పెద్ద నోట్ల రద్దుతో పన్నుల ఆదాయం పెరుగుతుంది • లెక్కలు చూపని డిపాజిట్లపై పన్ను వసూలు చేస్తామని వెల్లడి న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని త్వరలో పన్ను రేట్లు దిగిరానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం సంకేతాలు ఇచ్చారు. డీమోనిటైజేషన్ కారణంగా లెక్కల్లో చూపని సంపద నుంచి అధిక మొత్తంలో పన్ను ఆదాయం వ్యవస్థలోకి వస్తే భవిష్యత్తులో ప్రత్యక్ష, పరోక్ష రేట్లు తక్కువ స్థాయికి దిగివస్తాయన్నారు. అనైతిక చర్యలకు పాల్పడేవారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అక్రమంగా భారీ మొత్తాల్లో నగదు సమకూర్చుకుంటే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, నిఘా సంస్థలు వారిపై కన్నేసి ఉంచాయన్నారు. బ్యాంకు అధికారుల సహకారంతో కొందరు భారీ మొత్తాల్లో పాత నోట్లను కొత్త నోట్లతో మార్చుకుంటున్న నేపథ్యంలో జైట్లీ ఈ విధంగా స్పందించారు. ఈ విధమైన చర్యలు చట్టాన్ని ఉల్లంఘించడమేనని, ఆర్థిక రంగానికి నష్టం చేకూరుస్తాయన్నారు. డిజిటల్ యుగంలోకి...: ‘‘వ్యవస్థలో చెలామణిలో ఉన్న నగదు చాలా వరకు నేడు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చింది. ఈ డిపాజిట్లు అన్నింటినీ లెక్కించాల్సి ఉంది. పన్నులు చెల్లించని నగదు ఉంటే వాటిపై పన్ను వసూలు చేస్తాం’’ అని జైట్లీ వివరించారు. భవిష్యత్తు లావాదేవీలన్నీ డిజిటల్ ఆధారితమేనని, నగదు రహిత సమాజం దిశగా దేశం అడుగులు వేస్తోందన్నారు. ‘‘ఒక్కసారి ఈ మొత్తం డిజిటల్‌గా మారితే పన్ను వలలో చిక్కుకున్నట్టే. ఫలితంగా ఇప్పటి కంటే భవిష్యత్తులో పన్ను ఆదాయం మరింత పెరుగుతుంది. దీంతో పన్ను రేట్లను మరింత సహేతుక స్థాయిలో ఉంచేందుకు ప్రభుత్వానికి అవకాశం చిక్కుతుంది. ఇది ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లకూ వర్తిస్తుంది’’అని జైట్లీ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుకు తోడు జీఎస్టీ అమలు వంటి సంస్కరణలు, నగదు వినియోగంపై పాన్ నంబర్ చూపాలనే ఆంక్షలతో అవినీతి తగ్గుముఖం పడుతుందన్నారు. నగదు వినియోగం తగ్గిస్తే, పన్ను ఎగవేతలు కూడా తగ్గుముఖం పడతాయని చెప్పారు. -
పన్ను తగ్గిస్తే బ్లాక్‌మనీ ఉండదు
• జీఎస్టీ, ఆదాయపన్ను శ్లాబుల రేట్లు కుదించాలి • పెట్రోల్, డీజిల్‌పై పన్నుల భారం ఎత్తివేయాలి • 2,000 నోటును రద్దు చేయాలి • డిసెంబరు 30 వరకూ పాత నోట్లు అనుమతించాలి • లేకపోతే మోదీ నిర్ణయం బూమ్రాంగ్ అవుతుంది • ఏపీ చాంబర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యాపారవేత్తల వ్యాఖ్య సాక్షి, అమరావతి: పన్ను రేట్లు తగ్గితేనే వ్యవస్థలో బ్లాక్‌మనీ తగ్గుతుందని, ఈ దిశగా ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకోవాలని ఏపీ చాంబర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దేశంలో ఉన్న అధిక పన్నులే బ్లాక్‌మనీ పెరగడానికి ప్రధాన కారణమని పేర్కొంది. ‘‘నల్లధనం వెలికితీయడానికి పెద్ద నోట్లు రద్దు అనేది మంచి నిర్ణయమే! కానీ ఆచరణలో సరైన ప్రణాళిక లేదు. అందుకే ప్రజల్లో ఆందోళన నెలకొంది’’ అని ఏపీ చాంబర్స్ ప్రధాన కార్యదర్శి పొట్లూరి భాస్కరరావు చెప్పారు. ’పెద్ద నోట్ల రద్దు... వివిధ రంగాలపై ప్రభావం’ అన్న అంశంపై మంగళవారం విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల జీడీపీ వృద్ధిరేటు 2-3 శాతం తగ్గే అవకాశం ఉందంటూ... బ్లాక్ మనీ వెలికితీత వల్ల రూ.5 లక్షల కోట్లు ప్రభుత్వానికి మిగులుతాయని భావిస్తున్నారని, దాన్ని ఆర్థిక వ్యవస్థలోకి వేగంగా తీసుకొచ్చేలా పలు పథకాలు ప్రకటించాలని చాంబర్స్ డిమాండ్ చేసింది. పెద్ద నోట్ల రద్దు వల్ల ధరలు తగ్గితేనే ఈ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తారని, లేకపోతే ఈ చర్యలన్నీ వృథా కావడమే కాకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని వ్యాపారవేత్తలు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆదాయపన్ను, జీఎస్టీ రేట్లతో పాటు పెట్రోల్, డీజిల్‌పై ఉన్న పన్ను భారాన్ని తగ్గించడం ద్వారా సామాన్యులకు ఊరట కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణం వ్యవస్థలోకి 100, 500 నోట్ల చెలామణీని పెంచడమే కాకుండా 2,000 నోటును రద్దు చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. సమావేశంలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులేమన్నారంటే... సగం వాహనాలకు బ్రేకులు.. నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా 80 లక్షల లారీల్లో సగానికిపైగా రోడ్లపైకి రాలేదు. రాష్ట్రంలో 3 లక్షల లారీలున్నారుు. సరుకు అన్లోడ్ చేశాక కిరారుువ్వడం లేదు. దీంతో రుణాలను చెల్లించలేని పరిస్థితి. బ్లాక్ మనీ వెలికి తీయాలన్నది మంచి అంశమైనా, సరైన ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. - వై.వి.ఈశ్వరరావు, ప్రెసిడెంట్, ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ చిల్లర బెడద పెరిగింది.. మనుషుల ప్రాణాలు కాపాడే మందుల షాపులు ఇప్పుడు తీవ్ర చిల్లర కొరత ఎదుర్కొంటున్నారుు. రూ.50 మందులకు 2,000 నోటిస్తే చిల్లర ఎక్కడ నుంచి తెస్తాం? జిల్లాలో ఉన్న 2,680 మందుల షాపుల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. మానవతా దృక్పథంతో డిసెంబర్ 30 వరకు పాత నోట్లను అనుమతించాలి. - డాక్టర్ పి.ఎస్ పట్నాయక్, ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లా కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రజలు అసహనంతో ఉన్నారు చిల్లర కష్టాలతో ప్రజలు, రైతులు తీవ్ర అసహనంతో ఉన్నారు. చేతికొచ్చిన పత్తి పంటను కొంత అమ్ముకోవడం ద్వారా అత్యవసర అవసరాలకు వినియోగించుకోవాలనుకుంటున్న రైతుల ఆశలు అడియాసలవుతున్నారుు. వేరే చోట్ల నుంచి వచ్చిన వలస, వ్యవసాయ కూలీలు బ్యాంకుల ద్వారా నగదు తీసుకోవడానికి అంగీకరించడం లేదు. క్యాష్ కావాలంటున్నారు. దీంతో పత్తి లేక స్పిన్నింగ్ మిల్లులు మూతపడుతున్నారుు. - పి.కోటి రావు, డెరైక్టర్, ఏపీ స్పిన్నింగ్ మిల్స్ డిసెంబర్ 30 వరకు అనుమతించండి నోట్ల రద్దుతో బ్యాంకుల కంటే మాపై ఒత్తిడి చాలా ఎక్కువుంది. పాత నోట్ల అనుమతి గురువారంతో ముగియనుండటంతో ఆ తర్వాత నుంచి 2,000 నోటుతో వచ్చే చిల్లర సమస్య తలుచుకుంటేనే భయమేస్తోంది. కార్డులపై కొంతమంది రూ. 20- 30లకు కొట్టమని గొడవలకు దిగుతున్నారు. డిసెంబర్ 30 వరకు పాతనోట్లను అనుమతించాలి. - రవి గోపాలకృష్ణ, ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ ‘పాన్’ పరిమితి పెంచాలి.. నోట్ల రద్దు తర్వాత వారం రోజులపాటు బంగారం ఆభరణాల వ్యాపారం తగ్గింది. ఇప్పుడిప్పుడే తిరిగి పుంజుకుంటోంది. ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ప్రస్తుతం రెండు లక్షలు దాటిన లావాదేవీకి పాన్‌కార్డు ఉండాలి. ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. - ప్రశాంత్ జైన్, ఎండీ, ఎంబీఎస్ జ్యూవెలర్స్ టూరిజం తుడిచిపెట్టుకుపోరుుంది ఇది రాష్ట్ర పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. రోజువారీ కార్యకలాపాలకు చేతిలో డబ్బుల్లేక ఈ రంగం దెబ్బతింటోంది. విదేశీ పర్యాటకులపై కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. కోలుకోవడానికి మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం 60 టూరిజం ప్రాజెక్టులకు టెండర్లు ఆహ్వానించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వీటికి స్పందన అంతగా ఉండకపోవచ్చు. - కె. లక్ష్మీ నారాయణ, కన్సల్టెంట్, ఏపీ ప్రాజెక్ట్ ఫెసిలిటేటర్స్ -
పన్నుల రేట్లు తగ్గే సంస్కరణలు తేవాలి
జయప్రకాష్‌నారాయణ డిమాండ్ సాక్షి, అమరావతి: చలామణీలో ఉన్న పెద్ద నోట్లను తక్షణం రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న చర్య నల్లధనాన్ని, నకిలీ నోట్లను నిరోధించడంలో ముందడుగే కానీ, మళ్లీ అవినీతి జరగకుండా చేస్తూ ప్రజలకు సమర్థ పాలన అందించడానికి మాత్రం సరిపోదని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ ఒక ప్రకటన ద్వారా అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ రాజకీయ గిమ్మిక్కుగా మిగిలిపోకూడదంటే.. ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన, పన్నుల తగ్గింపుతోపాటు ప్రజల పన్నుల డబ్బును నేతల విలాసాలకు, ఉద్యోగుల జీత భత్యాలు భారీ పెంపునకు కాకుండా ప్రజల సేవలకు సద్వినియోగం చేసే సంస్కరణలను చేపట్టాలని సూచించారు. పన్ను రేటు తగ్గింపునకు చర్యలు చేపట్టాలని సూచించారు. అమరావతిలో ఉండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయాన్ని రూ.10 కోట్లతో వృధాగా అలకరించడం, ప్రత్యేక విమానాల్లో ప్రయాణించడం వంటి వాటి కోసమా ప్రజలు పన్నులు చెల్లించేది అని ప్రశ్నించారు.