
సాక్షి,న్యూఢిల్లీ: రోజువారీ ఉపయోగించే పలు వస్తువులపై జీఎస్‌టీ భారాన్నితగ్గించేందుకు కసరత్తు సాగుతోంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శుక్రవారం జరగనున్న 23వ జీఎస్‌టీ కౌన్సిల్ భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ సమావేశంలో 28 శాతం పన్ను పరిథిలో ఉన్న పలు వస్తువులను ఆ జాబితా నుంచి కుదించడంతో పాటు రోజువారీ ఉపయోగించే షాంపూలు, ఎలక్ట్రిక్ స్విచ్‌లు, ప్లాస్టిక్ ఉత్పుత్తులు, ఫర్నిచర్ వంటి వాటిపై పన్ను రేటును తగ్గిస్తారని భావిస్తున్నారు.
జీఎస్‌టీ రిటన్స్ దాఖలులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న మధ్యతరహా వ్యాపారులకూ ఊరట ఇచ్చేలా పలు నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు.
కాంపోజిషన్ స్కీమ్ కింద రూ కోటి లోపు టర్నోవర్ కలిగిన వ్యాపారాలపై పన్నును ఒక శాతానికి తగ్గించడం, నాన్ ఏసీ రెస్టారెంట్లపై తక్కువ పన్నురేట్ల వర్తింపు ప్రతిపాదనలపైనా ఓ నిర్ణయం తీసుకోనున్నారు.