జీఎస్టీతో పన్ను రేట్లు తగ్గుతాయా? పెరుగుతాయా? | GST rollout: A look at tax rates and how it will impact your basic expenses | Sakshi
Sakshi News home page

జీఎస్టీతో పన్ను రేట్లు తగ్గుతాయా? పెరుగుతాయా?

Published Fri, Jun 30 2017 9:06 AM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM

జీఎస్టీతో పన్ను రేట్లు తగ్గుతాయా? పెరుగుతాయా?

జీఎస్టీతో పన్ను రేట్లు తగ్గుతాయా? పెరుగుతాయా?

ఒకే దేశం.. ఒకే పన్ను విధానమంటూ చారిత్రాత్మక పన్ను విధానం జీఎస్టీ నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రాబోతుంది. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలు వేదికగా ఎంతో అట్టహాసంగా దీనికి అంకురార్పణ చేయబోతున్నారు. దేశమంతా ఒకే జీఎస్టీ ఉండటంతో రకరకాల పన్నుల నుంచి వినియోగదారులకు విముక్తి లభిస్తోంది. అంతేకాక కొన్ని వస్తువులపై పన్ను భారం కూడా వినియోగదారుడిపై పడనుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ రాకముందు వివిధ వస్తువుల పన్ను రేట్లు  ఏ విధంగా ఉన్నాయి? వచ్చిన తర్వాత వాటిపై పన్ను భారం లేదా లాభం ఏ మేర ఉండబోతుందో ఓ సారి తెలుసుకుందాం... 
 
చాక్లెట్లు, బిస్కెట్లు : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
కేకులు, పేస్ట్రీలు : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
ఐస్‌ క్రీంలు: ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
నెయ్యి : ప్రస్తుతం 5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
వెన్న : ప్రస్తుతం 14.5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
చక్కెర : ప్రస్తుతం 10%, జీఎస్టీ వచ్చిన తర్వాత 5%
టీ పొడి : ప్రస్తుతం 10%, జీఎస్టీ వచ్చిన తర్వాత 5%
కాఫీ పొడి : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 5%
 
 
సిమెంట్‌ : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28%
మొబైల్స్‌ : ప్రస్తుతం 6%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
టీవీలు : ప్రస్తుతం 26%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28%
వైద్య పరికరాలు : ప్రస్తుతం 18%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
మైక్రోవేవ్‌ ఓవెన్‌ : ప్రస్తుతం 26%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28%
ఫ్రిడ్జ్‌ : ప్రస్తుతం 26%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28 %
వాషింగ్‌ మెషిన్‌ : ప్రస్తుతం 26%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28 %
సబ్బులు : ప్రస్తుతం 29 %, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
టూత్‌పేస్ట్‌ : ప్రస్తుతం 29 %, జీఎస్టీ వచ్చిన తర్వాత 18% 
హెయిర్‌ ఆయిల్‌ : ప్రస్తుతం 29 %, జీఎస్టీ వచ్చిన తర్వాత 18% 
 
 
ఆయుర్వేద మందులు : ప్రస్తుతం 10%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
బంగారం : ప్రస్తుతం 5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 3%
ఫర్నీచర్‌ : ప్రస్తుతం 29%, జీఎస్టీ వచ్చిన తర్వాత 12%
కంప్యూటర్లు/ల్యాపీలు : ప్రస్తుతం 6%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
ద్విచక్రవాహనాలు : ప్రస్తుతం 30%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28%
చిన్నకార్లు : ప్రస్తుతం 30%, జీఎస్టీ వచ్చిన తర్వాత 29%
మీడియం కార్లు : ప్రస్తుతం 47%, జీఎస్టీ వచ్చిన తర్వాత 43%
పెద్ద కార్లు : ప్రస్తుతం 49%, జీఎస్టీ వచ్చిన తర్వాత 43%
ఎస్‌యూవీ కార్లు : ప్రస్తుతం 55%, జీఎస్టీ వచ్చిన తర్వాత 43%
కమర్షియల్‌ వాహనాలు : ప్రస్తుతం 30%, జీఎస్టీ వచ్చిన తర్వాత 28%
 
రెడీమేడ్‌ దుస్తులు : (రూ.1000 కంటే తక్కువ)- ప్రస్తుతం 5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 2.5%
రెడీమేడ్‌ దుస్తులు : (రూ.1000 కంటే ఎక్కువ)- ప్రస్తుతం 12%, జీఎస్టీ వచ్చిన తర్వాత 4.5%
చెప్పులు, బూట్లు : (రూ.500 వరకు)- ప్రస్తుతం 5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 5%
చెప్పులు, బూట్లు : (రూ.500 నుంచి రూ.1000 వరకు)- ప్రస్తుతం 20.5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
చెప్పులు, బూట్లు : (రూ.1000పైన)- ప్రస్తుతం 26.5%, జీఎస్టీ వచ్చిన తర్వాత 18%
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement