పన్ను తగ్గిస్తే బ్లాక్మనీ ఉండదు
• జీఎస్‌టీ, ఆదాయపన్ను శ్లాబుల రేట్లు కుదించాలి
• పెట్రోల్, డీజిల్‌పై పన్నుల భారం ఎత్తివేయాలి
• 2,000 నోటును రద్దు చేయాలి
• డిసెంబరు 30 వరకూ పాత నోట్లు అనుమతించాలి
• లేకపోతే మోదీ నిర్ణయం బూమ్‌రాంగ్ అవుతుంది
• ఏపీ చాంబర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యాపారవేత్తల వ్యాఖ్య
సాక్షి, అమరావతి: పన్ను రేట్లు తగ్గితేనే వ్యవస్థలో బ్లాక్‌మనీ తగ్గుతుందని, ఈ దిశగా ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకోవాలని ఏపీ చాంబర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దేశంలో ఉన్న అధిక పన్నులే బ్లాక్‌మనీ పెరగడానికి ప్రధాన కారణమని పేర్కొంది. ‘‘నల్లధనం వెలికితీయడానికి పెద్ద నోట్లు రద్దు అనేది మంచి నిర్ణయమే! కానీ ఆచరణలో సరైన ప్రణాళిక లేదు. అందుకే ప్రజల్లో ఆందోళన నెలకొంది’’ అని ఏపీ చాంబర్స్ ప్రధాన కార్యదర్శి పొట్లూరి భాస్కరరావు చెప్పారు. ’పెద్ద నోట్ల రద్దు... వివిధ రంగాలపై ప్రభావం’ అన్న అంశంపై మంగళవారం విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల జీడీపీ వృద్ధిరేటు 2-3 శాతం తగ్గే అవకాశం ఉందంటూ... బ్లాక్ మనీ వెలికితీత వల్ల రూ.5 లక్షల కోట్లు ప్రభుత్వానికి మిగులుతాయని భావిస్తున్నారని, దాన్ని ఆర్థిక వ్యవస్థలోకి వేగంగా తీసుకొచ్చేలా పలు పథకాలు ప్రకటించాలని చాంబర్స్ డిమాండ్ చేసింది. పెద్ద నోట్ల రద్దు వల్ల ధరలు తగ్గితేనే ఈ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తారని, లేకపోతే ఈ చర్యలన్నీ వృథా కావడమే కాకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని వ్యాపారవేత్తలు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆదాయపన్ను, జీఎస్‌టీ రేట్లతో పాటు పెట్రోల్, డీజిల్‌పై ఉన్న పన్ను భారాన్ని తగ్గించడం ద్వారా సామాన్యులకు ఊరట కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణం వ్యవస్థలోకి 100, 500 నోట్ల చెలామణీని పెంచడమే కాకుండా 2,000 నోటును రద్దు చేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. సమావేశంలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకులేమన్నారంటే...
సగం వాహనాలకు బ్రేకులు..
నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా 80 లక్షల లారీల్లో సగానికిపైగా రోడ్లపైకి రాలేదు. రాష్ట్రంలో 3 లక్షల లారీలున్నారుు. సరుకు అన్‌లోడ్ చేశాక కిరారుువ్వడం లేదు. దీంతో రుణాలను చెల్లించలేని పరిస్థితి. బ్లాక్ మనీ వెలికి తీయాలన్నది మంచి అంశమైనా, సరైన ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. - వై.వి.ఈశ్వరరావు, ప్రెసిడెంట్, ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్
చిల్లర బెడద పెరిగింది..
మనుషుల ప్రాణాలు కాపాడే మందుల షాపులు ఇప్పుడు తీవ్ర చిల్లర కొరత ఎదుర్కొంటున్నారుు. రూ.50 మందులకు 2,000 నోటిస్తే చిల్లర ఎక్కడ నుంచి తెస్తాం? జిల్లాలో ఉన్న 2,680 మందుల షాపుల్లో ఇలాంటి పరిస్థితే ఉంది. మానవతా దృక్పథంతో డిసెంబర్ 30 వరకు పాత నోట్లను అనుమతించాలి. - డాక్టర్ పి.ఎస్ పట్నాయక్, ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లా కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్
ప్రజలు అసహనంతో ఉన్నారు
చిల్లర కష్టాలతో ప్రజలు, రైతులు తీవ్ర అసహనంతో ఉన్నారు. చేతికొచ్చిన పత్తి పంటను కొంత అమ్ముకోవడం ద్వారా అత్యవసర అవసరాలకు వినియోగించుకోవాలనుకుంటున్న రైతుల ఆశలు అడియాసలవుతున్నారుు. వేరే చోట్ల నుంచి వచ్చిన వలస, వ్యవసాయ కూలీలు బ్యాంకుల ద్వారా నగదు తీసుకోవడానికి అంగీకరించడం లేదు. క్యాష్ కావాలంటున్నారు. దీంతో పత్తి లేక స్పిన్నింగ్ మిల్లులు మూతపడుతున్నారుు. - పి.కోటి రావు, డెరైక్టర్, ఏపీ స్పిన్నింగ్ మిల్స్
డిసెంబర్ 30 వరకు అనుమతించండి
నోట్ల రద్దుతో బ్యాంకుల కంటే మాపై ఒత్తిడి చాలా ఎక్కువుంది. పాత నోట్ల అనుమతి గురువారంతో ముగియనుండటంతో ఆ తర్వాత నుంచి 2,000 నోటుతో వచ్చే చిల్లర సమస్య తలుచుకుంటేనే భయమేస్తోంది. కార్డులపై కొంతమంది రూ. 20- 30లకు కొట్టమని గొడవలకు దిగుతున్నారు. డిసెంబర్ 30 వరకు పాతనోట్లను అనుమతించాలి. - రవి గోపాలకృష్ణ, ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్
‘పాన్’ పరిమితి పెంచాలి..
నోట్ల రద్దు తర్వాత వారం రోజులపాటు బంగారం ఆభరణాల వ్యాపారం తగ్గింది. ఇప్పుడిప్పుడే తిరిగి పుంజుకుంటోంది. ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ప్రస్తుతం రెండు లక్షలు దాటిన లావాదేవీకి పాన్‌కార్డు ఉండాలి. ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. - ప్రశాంత్ జైన్, ఎండీ, ఎంబీఎస్ జ్యూవెలర్స్
టూరిజం తుడిచిపెట్టుకుపోరుుంది
ఇది రాష్ట్ర పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. రోజువారీ కార్యకలాపాలకు చేతిలో డబ్బుల్లేక ఈ రంగం దెబ్బతింటోంది. విదేశీ పర్యాటకులపై కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. కోలుకోవడానికి మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం 60 టూరిజం ప్రాజెక్టులకు టెండర్లు ఆహ్వానించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వీటికి స్పందన అంతగా ఉండకపోవచ్చు.
- కె. లక్ష్మీ నారాయణ, కన్సల్టెంట్, ఏపీ ప్రాజెక్ట్ ఫెసిలిటేటర్స్