న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల స్కీమ్ రద్దుపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. స్కీమ్‌ను పూర్తిగా రద్దు చేయకుండా ఉండాల్సిందని, మార్పులు చేస్తే బాగుండేదని అమిత్ షా అన్నారు. ఒక వార్తాసంస్థ ఇంటర్వ్యూలో మట్లాడుతూ అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదే సమయంలో తాను సుప్రీంకోర్టు తీర్పును గౌవరవిస్తానని తెలిపారు.
భారత రాజకీయాల్లో బ్లాక్ మనీ ప్రవాహాన్ని అరికట్టేందుకు ఎన్నికల బాండ్ స్కీమ్‌ను తీసుకువచ్చినట్లు చెప్పారు. ‘ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తం రూ.20 వేల కోట్ల రాజకీయ పార్టీల ఖాతాలకు చేరాయి. వీటిలో కేవలం రూ.6 వేల కోట్లు మాత్రమే బీజేపికి విరాళంగా వచ్చాయి. మిగిలిన డబ్బులు ప్రతిపక్షాలకు వెళ్లాయి. 303 ఎంపీ సీట్లకు రూ.6 వేల కోట్లు వస్తే 242 సీట్లకు ఏకంగా రూ.14 వేల కోట్లు వెళ్లాయి’అని ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు.
కాగా, ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేయడంతో పాటు బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని సూచించిన విషయం తెలిసిందే. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఎన్నికల కమిషన్ (ఈసీ)కి బాండ్ల వివరాలు అందజేసింది. ఈ వివరాలను ఈసీ తన వెబ్‌సైట్‌లో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఏయే కంపెనీలు బాండ్ల ద్వారా పార్టీలకు విరాళాలిచ్చాయి, ఏ పార్టీకి ఎంత సొమ్ము చేరిందనేది ఈ వివరాల్లో బహిర్గతమైంది.
Comments
Please login to add a commentAdd a comment