న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల (ఇబి) ఎలక్టోరల్ ఫైనాన్సింగ్‌పై న్యాయ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు సిట్ ఏర్పాటు చేసేందుకు నిరాకరించింది.
ఎలక్టోరల్ ఫైనాన్సింగ్ ద్వారా రాజకీయ పార్టీలు, పలు కార్పొరేట్ కంపెనీల మధ్య క్విడ్ ప్రోకో జరిగాయని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఇదే అంశంపై సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశాయి.
ఈ పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం..శుక్రవారం (ఆగస్ట్2న)విచారించింది. సిట్ ఏర్పాటుకు నిరాకరించింది. ఆర్టికల్ 32 ప్రకారం ఈ దశలో జోక్యం చేసుకోవడం కూడా తొందరపాటే అవుతుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Supreme Court declines petitions seeking a probe by a Special Investigation Team (SIT) into the alleged instances of quid pro quo arrangements between corporates and political parties through Electoral Bonds donations.
In February, the Supreme Court had struck down the Electoral… pic.twitter.com/0bnAC6TwIE— ANI (@ANI) August 2, 2024
రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 19(1)(ఎ)ను అనుసరించి.. ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. అలాగే.. నల్లధనాన్ని అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమంజసం కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు ఎలక్టోరల్ బాండ్స్ చెల్లుబాటు కాదంటూ ఏకగ్రీవ తీర్పును రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment