న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై ప్రతి ఒక్కరూ చింతిస్తున్నారని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీల నగదు లావాదేవీలకు స్పష్టమైన మార్గం ఏర్పడిందన్నారు.
ఎన్నికల్లో నల్లధనాన్ని అరికట్టేందుకు ఈ పథకాన్ని తామ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపారు. అయితే నల్లధనాన్ని నిర్మూలించాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇదే సరైన మార్గం అని తాను ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు నగదు ఖర్చు చేస్తాయన్నారు. అంతేగాక ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకే భాజపాకే ఎక్కువ ప్రయోజనం చేకూరిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మోదీ ఘాటుగా స్పందించారు. బాండ్ల అంశంపై అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
రాజకీయ పార్టీలకు వ్యక్తులు లేదా సంస్థలు గుప్త విరాళాలిచ్చే ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను సుప్రీంకోర్టు గత ఫిబ్రవరిలో రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల బాండ్లు ఎవరు కొనుగోలు చేశారు, రాజకీయ పార్టీలకు వాటి ద్వారా ఎన్ని విరాళాలు వచ్చాయన్న వివరాలు ఎన్నికల కమిషన్(ఈసీ)కి అందించాలని ఎస్‌బీఐని సుప్రీం ఆదేశించింది. దీంతో ఎస్‌బీఐ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘానికి అందించడంతో ఆ వివరాలను ఈసీ తన వెబ్‌సైట్‌లో ఉంచి బహిర్గతం చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల బాండ్ల ద్వారా అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా నిలిచింది.
చదవండి: కుటుంబ ప్రయోజనాలే వారి లక్ష్యం.. విపక్షాలకు ప్రధాని మోదీ చురకలు
Comments
Please login to add a commentAdd a comment