న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టులో శుక్రవారం(జులై 19) కీలక విచారణ జరగనుంది. ఎన్నికల బాండ్ల వెనుక జరిగిన వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసి న్యాయవ్యవస్థ పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
బడా కార్పొరేట్ కంపెనీల నుంచి కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల బాండ్ల రూపంలో భారీగా నిధులు పొందాయని పిటిషనర్లు తెలిపారు.
ఇందుకు ప్రతిఫలంగా ఆయా కంపెనీలను సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీల విచారణ నుంచి తప్పించడం లేదంటే పాలసీల్లో మార్పులు చేసి వాణిజ్యపరంగా వాటికి భారీ లబ్ధి చేకూర్చడం వంటి క్విడ్ ప్రో కో జరిగిందని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌లపై సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా మారనుంది. కాగా, ఇప్పటికే ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment