సాక్షి,ఢిల్లీ:కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుపై బుధవారం(జనవరి22)సుప్రీంకోర్టు,కోల్‌కతా హైకోర్టుల్లో విచారణ జరగనుంది. కేసులో సీబీఐ దర్యాప్తు సరిగా లేదని ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేయాలని భాధితురాలి తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
ఈ పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ కన్నా,జస్టిస్ సంజయ్ కుమార్,జస్టిస్ కె వి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఈ కేసులో దోషి సంజయ్ రాయ్‌కి యావజ్జీవ కారాగార శిక్ష,50 వేల జరిమానా విధిస్తూ కోల్‌కతా కోర్టు జనవరి20వ తేదీన తీర్పిచ్చింది.
సంజయ్‌రాయ్‌కి యావజ్జీవ కారాగర శిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ కోల్‌కతా హైకోర్టులో బెంగాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్‌ను కోల్‌కతా హైకోర్టు విచారించనుంది. జస్టిస్ దేబాంగ్షు బసక్, జస్టిస్ షబ్బర్ రష్దీలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరపనుంది.
కాగా, మహిళా ట్రైనీ డాక్టర్‌పై పాశవికంగా అత్యాచారం చేసి చంపినందుకుగాను దోషి సంజయ్‌రాయ్‌కి కోర్టు ఖచ్చితంగా మరణశిక్ష విధిస్తుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా అతడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్షవిధించింది. దీంతో ఇటు హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు, మెడికోలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సంజయ్‌కి మరణశిక్ష విధించాల్సిందేనని కోల్‌కతాలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment