quid pro quo
-
కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రో కో: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీ మధ్య క్విడ్ ప్రో కో ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి టార్గెట్‌గా మంగళవారం(అక్టోబర్ 29) కేటీఆర్ ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. ‘తెలంగాణ మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు చేసి నెల రోజులు కావస్తోంది. కాంగ్రెస్,బీజేపీ మధ్య క్విడ్ ప్రోకో ఉన్నందునే ఈడీ దాడులపై బీజేపీ,కాంగ్రెస్ నుంచి ఒక్క మాట కూడా లేదు. ఈడీ దాడుల్లో భారీగా డబ్బు దొరికినట్లు మీడియాలో వార్తలు వచ్చినా కేసు నమోదు చేయలేదు.దాడులు ముగిసిన వెంటనే హైదరాబాద్‌లో అదానీతో మంత్రి పొంగులేటి రహస్యంగా సమావేశమయ్యారు. ఇది బీజేపీ,కాంగ్రెస్ మధ్య క్విడ్ ప్రో కో కాక మరేంటి?’అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదీ చదవండి: సీడీఎంఏగా శ్రీదేవి..హరీశ్‌కు ఐఅండ్‌పీఆర్ -
ఎన్నికల బాండ్లలో క్విడ్ ప్రో కో..? నేడు సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్లపై సుప్రీంకోర్టులో శుక్రవారం(జులై 19) కీలక విచారణ జరగనుంది. ఎన్నికల బాండ్ల వెనుక జరిగిన వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసి న్యాయవ్యవస్థ పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.బడా కార్పొరేట్ కంపెనీల నుంచి కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల బాండ్ల రూపంలో భారీగా నిధులు పొందాయని పిటిషనర్లు తెలిపారు. ఇందుకు ప్రతిఫలంగా ఆయా కంపెనీలను సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీల విచారణ నుంచి తప్పించడం లేదంటే పాలసీల్లో మార్పులు చేసి వాణిజ్యపరంగా వాటికి భారీ లబ్ధి చేకూర్చడం వంటి క్విడ్ ప్రో కో జరిగిందని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా మారనుంది. కాగా, ఇప్పటికే ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. -
Somesh Kumar: క్విడ్ ప్రోకోతో భూముల కొనుగోలు!
హైదరాబాద్: మాజీ సీఎస్, ధరణి రూపకర్తగా పేరున్న సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టాలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాతిక ఎకరాల భూమిని తక్కువ ధరలకు చెల్లించి ఆయన కొనుగోలు చేయడం.. అదీ ఫార్మా సిటీ ప్రాంతంలోనే కావడంతో కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో క్విడ్ ప్రోకో అంశంపై తెరపైకి వచ్చింది. ఫార్మాసిటీ వస్తుందని ముందే తెలుసుకుని.. ప్లాన్ప్రకారమే యాచారంలో భూములు కొన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. 2018లో ఫార్మాసిటీ ప్రాంతం అయిన కొత్తపల్లిలో 25 ఎకరాల్ని నలుగురి దగ్గరి నుంచి ఆయన కొన్నారు. అందుకుగానూ ఎకరానికి రూ.2 లక్షలు చెల్లించారు. అయితే అది సోమేష్ భార్య పేరిట ఉన్నట్లు ధరణి రికార్డుల్లోనూ ఇది నమోదు అయ్యింది. లక్షల్లో రైతుబంధు సొమ్ము తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఈ భూముల ద్వారా సోమేశ్ కుమార్ లక్షల్లో రైతుబంధు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తపల్లి విలేజ్‌లో కొనుగోలు చేసిన భూమిపై ఇప్పటివరకు 14 లక్షల 5 వేల 550 రూపాయల రైతుబంధు తీసుకున్నట్లు సమాచారం. భూమి సాగు చేయకపోయినా రైతుబంధు తీసుకున్నట్లు తెలుస్తోంది. 25 ఎకరాల 19 గుంటలు భూమి మొత్తం రాళ్లు, గుట్టలు మాత్రమే ఉన్నాయి. కానీ, సోమేశ్ కుటుంబం.. సాగు చెయ్యకుండానే రైతుబంధు పొందినట్లు తెలుస్తోంది. అదేకాకుండా ఆయన బంధువులు మొత్తం 150 ఎకరాలకు సంబంధించి భూమిపై రైతుబంధు డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఇక.. ఏడాదికి రెండు దఫాల్లో 2 లక్షల 52,750 రూపాయల రైతుబంధు డబ్బును సోమేశ్ కుమార్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు భూముల కొనుగోలులో క్విడ్ ప్రోకో జరిగినట్లు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే రెరా సెక్రటరీగా పని చేసిన శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో సోమేష్‌కుమార్ కూడా రెరాలో పని చేయడంతో ఏమైనా లింకులు ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు నడుస్తోంది. -
చంద్రబాబుపై తొందరపాటు చర్యలుండవు
సాక్షి, అమరావతి: అస్మదీయుల కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు, క్విడ్ ప్రోకో ఆరోపణలపై నమోదు చేసిన కేసులో నిందితుడైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోబోమని సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేయడంతో పాటు క్విడ్ ప్రోకోకు పాల్పడినందుకు సీఐడీ కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి మంత్రులు నారాయణ, లోకేశ్ తదితరులను నిందితులుగా చేర్చింది. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మల్లికార్జునరావు మంగళవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్న నేపథ్యంలో ఆ బెయిల్ ఇచ్చిన ఉద్దేశం నెరవేరేంత వరకు ఆయన విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు ఉండవని తెలిపారు. మద్యం కుంభకోణం కేసులోనూ ఇలాంటి హామీనే ఇచ్చానని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు సైతం అదే హామీ ఇస్తున్నానని తెలిపారు. కంటిశస్త్ర చికిత్స నిమిత్తం చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా ముందుకెళ్లే ఉద్దేశం తమకు లేదన్నారు. అడ్వొకేట్ జనరల్ ఇచ్చిన హామీని నమోదు చేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ఏ రకంగానూ ముందుకెళ్లొద్దంటూ ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆదేశిస్తూ గతంలో తానిచ్చిన ఉత్తర్వులను ఈ నెల 28 వరకు హైకోర్టు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక కుంభకోణం.. ముందస్తు బెయిల్‌పై నేడు విచారణ ఉచిత ఇసుక విధానం పేరుతో ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం కలిగించినందుకు సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు బుధవారం విచారణ జరపనున్నారు. తనను రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం తనపై కేసుల మీద కేసులు పెడుతోందన్నారు. వేధింపులకు గురి చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ కేసు నమోదు చేసిందన్నారు. తాను ఏ అంశంపై ప్రశ్నిస్తే ఆ అంశానికి సంబంధించి కేసు నమోదు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ అక్రమాలపై గళం విప్పకుండా చేసేందుకే ప్రభుత్వం తనపై తప్పుడు కేసు నమోదు చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. -
‘ఇన్నర్’లోనూ చుక్కెదురు
సాక్షి, అమరావతి :ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పులో అక్రమాలు, క్విడ్ ప్రో కోకు సంబంధించి సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏ–1 నిందితుడైన మాజీ సీఎం చంద్రబాబునాయుడు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టేసింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా తాను కస్టడీలోనే ఉన్నట్లు (డీమ్డ్ కస్టడీ) భావించాలన్న చంద్రబాబు వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు రెండూ వేర్వేరు కేసులని, రెండూ కూడా వేర్వేరు లావాదేవీలకు సంబంధించినవని, రెండు కేసుల్లో దర్యాప్తు అధికారులూ వేర్వేరని, విచారించిన సాక్షులు, సేకరించిన సాక్ష్యాలు కూడా వేర్వేరని హైకోర్టు స్పష్టంచేసింది. అందువల్ల ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు కస్టడీలో ఉన్నట్లు (డీమ్డ్) భావించడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. ఈ కేసులో చంద్రబాబు అరెస్టు కావడంగానీ, జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేయడంగానీ జరగలేదని, అందువల్ల ఆయన బెయిల్‌కు అర్హులుకాదని స్పష్టంచేసింది. చంద్రబాబు వాదనలో బలంలేదు 2022లో నమోదు చేసిన ఈ కేసులో ఇప్పటివరకు తనను అరెస్టుచేయకపోవడంలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారని, తనను మరింత కాలం జైలులో ఉంచేందుకే ఇలా చేస్తున్నారంటూ చంద్రబాబు వాదనలో ఎలాంటి బలంలేదని హైకోర్టు స్పష్టంచేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు నమోదైన విషయం చంద్రబాబుకు బాగా తెలుసునని, ఇదే కేసులో ఏ–2 నుంచి ఏ–5 వరకు నిందితులు ముందస్తు బెయిళ్లు కూడా పొందారని న్యాయస్థానం గుర్తుచేసింది. ముందస్తు బెయిల్ విషయంలో చంద్రబాబు ఇన్నేళ్లు నిద్రపోయి, ఇప్పుడు పోలీసులను నిందిస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది. స్కిల్ కేసులో అరెస్టుచేసిన మరుసటిరోజే చంద్రబాబును ఇన్నర్ కేసులో కూడా కోర్టు ముందు హాజరుపరచాలంటూ సీఐడీ సీఆర్పీసీ సెక్షన్–267 కింద సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని గుర్తుచేసింది. అలాగే, ఈ బెయిల్ పిటిషన్‌ను తన సరెండర్ పిటిషన్‌గా భావించి, తనకు బెయిల్ మంజూరు చేసే విషయాన్ని పరిశీలించాలన్న చంద్రబాబు అభ్యర్థనను సైతం హైకోర్టు తిరస్కరించింది. అలాగే, ఇన్నర్ కేసులో హైకోర్టు ముందు చంద్రబాబు భౌతిక హాజరుగానీ, వాస్తవిక లొంగుబాటు గానీ సాధ్యంకాదని, తన పిటిషన్లో చంద్రబాబు ఎక్కడా కూడా తాను హైకోర్టు ముందు లొంగిపోయేందుకు అనుమతినివ్వాలని కూడా కోరలేదని తెలిపింది. అలాంటి అభ్యర్థన ఏదీ లేనప్పుడు, ఈ పిటిషన్‌ను సరెండర్ పిటిషన్‌గా భావించలేమని తేల్చిచెప్పింది. అలాగే, బెయిల్ విషయంలో ఆ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోలేమని కూడా స్పష్టంచేసింది. అంతేకాక.. ఒకవేళ కోర్టు స్కిల్ కేసులో తన కస్టడీని ఇన్నర్ కేసులో డీమ్డ్ కస్టడీగా భావించని పక్షంలో, తాను దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా పరిగణించి, ముందస్తు బెయిల్ మంజూరు విషయాన్ని పరిశీలించాలన్న చంద్రబాబు వాదనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి ఏ మాత్రం వెళ్లడంలేదని, కేవలం డీమ్డ్ కస్టడీ అంశానికే పరిమితం అవుతున్నట్లు న్యాయస్థానం తెలిపింది. అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ చంద్రబాబు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి సోమవారం 24 పేజీల తీర్పును వెలువరించారు. క్విడ్ ప్రో కో పై ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు.. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పులో అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఇందులో అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, అలాగే క్విడ్ ప్రో కో కూడా జరిగిందంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపిన సీఐడీ.. లింగమనేని రమేష్, హెరిటేజ్ ఫుడ్స్, రామకృష్ణ హౌసింగ్ సంస్థలకు లబ్ధిచేకూర్చారని ఆరోపించింది. ఈ లబ్ధికి ప్రతిఫలంగా కరకట్ట వద్ద ఉన్న ఇంటిని లింగమనేని రమేష్ చంద్రబాబుకు ఇచ్చారని తెలిపింది. ఇక ఈ కేసులో చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, ప్రమోద్‌కుమార్ దూబే, సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించగా, సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపించారు. -
చంద్రబాబు ఏ–1.. లోకేశ్ ఏ–14
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు సహకార డెయిరీలను దెబ్బతీసి తమ కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ వ్యాపారం, ఆస్తులను అమాంతం పెంచగా ఆయన తనయుడు లోకేశ్ రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్) అలైన్మెంట్ ఖరారులో అక్రమాలతో హెరిటేజ్ ఫుడ్స్ కోసం భూములను కొల్లగొట్టారు. తమ బినామీ, సన్నిహితుడు లింగమనేని రమేశ్ కుటుంబంతో క్విడ్‌ప్రోకోకు పాల్పడి భారీ భూదోపిడీకి తెగబడటంలో చంద్రబాబు, లోకేశ్ చక్కటి సమన్వయం కనబరిచారు. క్విడ్ ప్రోకో కింద చంద్రబాబు కరకట్ట నివాసాన్ని తీసుకోగా హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ భూములను కొల్లగొట్టారు. ఈ అవినీతి భూబాగోతాన్ని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. క్విడ్ ప్రోకో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసాన్ని, నారాయణ కుటుంబ సభ్యులు సీడ్ క్యాపిటల్‌లో పొందిన 75,888 చ.గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈమేరకు న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణను పేర్కొన్న సిట్ నారా లోకేశ్‌ను ఏ–14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో మంగళవారం ప్రత్యేక మెమో దాఖలు చేసింది. లింగమనేని రమేశ్, రాజశేఖర్‌లతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. ఐఆర్ఆర్ అలైన్మెంట్లో అవినీతి మెలికలు.. అమరావతి ముసుగులో చంద్రబాబు సాగించిన భారీ భూదందాలో ఐఆర్ఆర్ కుంభకోణం ఓ భాగం! మాజీ మంత్రి పొంగూరు నారాయణతోపాటు లోకేశ్ ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు తమ బినామీ, సన్నిహితుడైన లింగమనేని రమేష్‌తో క్విడ్ ప్రోకోకు పాల్పడి ఆయన భూముల విలువను భారీగా పెరిగేలా చేశారు. అందుకు ప్రతిగా బినామీల పేరిట భారీగా భూములను పొందడమే కాకుండా కరకట్ట నివాసంతోపాటు హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు కానుకగా దక్కించుకున్నారు. నాడు సీఆర్డీఏ అధికారులు రూపొందించిన 94 కి.మీ. అమరావతి ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌పై చంద్రబాబు, నారాయణ మండిపడ్డారు. ఆ అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతిలోని పెదపరిమి, నిడమర్రు, చినవడ్లపూడి, పెదవడ్లపూడి మీదుగా వెళ్తుంది. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి దాన్ని నిర్మించాల్సి వస్తుంది. దీంతో తమ భూముల విలువ అమాంతం పెరగదని వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారి ఆదేశాలతో సీఆర్డీయే అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబానికి చెందిన వందలాది ఎకరాలున్న తాడికొండ, కంతేరు, కాజాను పరిగణలోకి తీసుకున్నారు. అందుకోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపారు. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి కంతేరు, కాజాలో ఉన్న భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా 97.50 కి.మీ. అలైన్‌మెంట్‌ను రూపొందించారు. అయితే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అనంతరం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చి అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించి మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగా ఉండాలని ఆదేశించారు. అప్పటికే సీఆర్డీయే అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు. ఈ క్రమంలో తాడికొండ, కంతేరు, కాజాలో హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని భూములను ఆనుకుని అలైన్‌మెంట్‌ను ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ఖరారు చేసింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను మెలికలు తిప్పడం ద్వారా లింగమనేని కుటుంబం భూముల విలువను భారీగా పెరిగేలా చేశారు. కంతేరు, కాజాలో లింగమనేని కుటుంబానికి ఉన్న 355 ఎకరాలను ఆనుకునే అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. అందుకు ప్రతిగా అదే ప్రాంతంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములను పొందారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్‌కు 10.4 ఎకరాలు పొందగా 2014 జూన్ నుంచి సెప్టెంబరు మధ్యలో కొనుగోలు చేసినట్టు చూపించారు. లింగమనేని కుటుంబ నుంచి మరో 4.55 ఎకరాలను కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. అప్పటికే ఈ కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో ఆ సేల్ డీడ్‌ను రద్దు చేసుకున్నారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉండటం గమనార్హం. లోకేశ్ కీలక ‘భూ’మిక క్విడ్‌ప్రోకోకు పాల్పడి హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములను దక్కేలా చేయడంలో లోకేశ్ కీలక భూమిక పోషించారు. ఆయన 2008 జూలై 1 నుంచి 2013 జూన్ 29 వరకు హెరిటేజ్ ఫుడ్స్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. అనంతరం 2017 మార్చి 31 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని కొనుగోలు పేరిట భూములను దక్కించుకోవాలని నిర్ణయించిన హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో లోకేశ్ కూడా పాల్గొన్నారు. క్విడ్ ప్రోకో కింద భూములను పొందే ప్రక్రియలో ఆయన కీలక భూమిక పోషించారు. లోకేశ్ పేరిట హెరిటేజ్ ఫుడ్స్‌లో 23,66,400 షేర్లు ఉన్నాయి. అంటే హెరిటేజ్ ఫుడ్స్‌లో లోకేశ్‌కు 10.20 శాతం వాటా ఉంది. బాబుకు కరకట్ట నివాసం క్విడ్‌ప్రోకోలో భాగంగా లింగమనేని రమేశ్ విజయవాడ వద్ద కృష్ణా కరకట్టపై ఉన్న తన బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారాన్ని మసిపూసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఆ బంగ్లాను అద్దెకు ఇచ్చానని లింగమనేని రమేశ్ బుకాయించారు. కానీ ఆయన అద్దె వసూలు చేసినట్టుగానీ, చంద్రబాబు చెల్లించినట్టుగానీ ఆదాయపన్ను వివరాల్లో లేవు. తరువాత ఆ ఇంటిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని చెప్పారు. మరి చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్ఆర్ఏ ఎందుకు పొందారన్న ప్రశ్నకు సమాధానం లేదు. దీంతో ఆ బంగ్లాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా క్విడ్‌ప్రోకో కింద ఇచ్చారని స్పష్టమైంది. లింగమనేని నుంచి కానుకగా స్వీకరించిన కరకట్ట ఇంట్లోనే చంద్రబాబు, లోకేష్ దర్జాగా నివసించడం గమనార్హం. పవన్‌కూ వాటా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా ఈ అవినీతి పాపంలో పిడికెడు వాటా ఇచ్చారు. కాజాకు సమీపంలో ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌కు చేరువలో పవన్‌కల్యాణ్‌కు 2.4 ఎకరాలున్నాయి. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్లు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కల్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం. భారీగా పెరిగిన విలువ ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. మార్కెట్ ధర ప్రకారమైతే ఎకరా రూ.50 లక్షలు ఉంది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇక ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు తరువాత ఎకరం రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకుపైగా పెరిగింది. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్ ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే రూ.62.4 కోట్లకు చేరుతుందని తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకుని రద్దు చేసినట్టు చూపిన మరో 4.55 ఎకరాల విలువ కూడా రూ.27.3 కోట్లకు చేరుతుంది. ఇక చంద్రబాబు బినామీల పేరిట ఉన్న వందలాది ఎకరాల విలువ అమాంతం పెరిగింది. -
కరకట్ట సాక్షిగా క్విడ్ ప్రో కో
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణం కచ్చితంగా క్విడ్ ప్రో కోనే అన్నది స్పష్టమైంది. దీనికి కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే అన్నది తేటతెల్లమైంది. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్‌లో భూములు దక్కాయని తేలిపోయింది. సీడ్ క్యాపిటల్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారులో ఏ–3 లింగమనేని రమేశ్ కుటుంబానికి నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం చేకూర్చినందుకే వారిద్దరికీ ఆ ఆస్తులు దక్కాయనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానం పేర్కొంది. క్విడ్‌ప్రోకో అభియోగాలను కొట్టివేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం స్పష్టం చేసింది. చంద్రబాబు కరకట్ట నివాసం, నారాయణకు అమరావతిలో ఉన్న ప్లాట్లు, కౌలు, బ్యాంకులో ఉన్న నిధుల అటాచ్‌మెంట్‌కు అనుమతినిస్తూ తాజాగా ఇచ్చిన ఉత్తర్వులలో న్యాయస్థానం కీలక అంశాలను వెల్లడించింది. ఈ కుంభకోణంలో చంద్రబాబు, నారాయణ అంతా తామై నడిపిన వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. అంతా ఏ–1 చంద్రబాబే అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ అంతా నాటి సీఎం, ఈ కేసులో ఏ–1 చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సమయంలో సీఆర్డీయే ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా వ్యవహరించిన చంద్రబాబుకు మాస్టర్‌ప్లాన్ గురించి మొత్తం ముందే తెలుసని న్యాయస్థానం స్పష్టం చేసింది. మాస్టర్‌ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకుంది చంద్రబాబే అని పేర్కొంది. అంతేకాదు రాజధాని ఎంపిక, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు ప్రక్రియలో ఆయనకు పూర్తి భాగస్వామ్యం ఉందని తేల్చి చెప్పింది. అలైన్మెంట్ మూడుసార్లు మార్పు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకోకు పాల్పడటంపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. టీడీపీ ప్రభుత్వంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మూడుసార్లు మార్చారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టంచేసింది. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్మెంట్లో మార్పులు చేశారని న్యాయస్థానం వెల్లడించింది. ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి టీడీపీ ప్రభుత్వం ప్రయోజనం కల్పించిందన్నది నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ కుటుంబానికి ఇన్నర్‌రింగ్ రోడ్డు తుది అలైన్‌మెంట్‌ను ఆనుకునే 168.45 ఎకరాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించారా లేదా అన్నదానితో దీనికి సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లేని ఇన్నర్‌రింగ్ రోడ్డుపై కేసులు పెట్టడం ఏమిటంటూ టీడీపీ నేతలు ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నారు. అయితే ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేదని, లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలోనే అలైన్‌మెంట్‌ను ఖరారు చేసినట్లు న్యాయస్థానం వ్యాఖ్యల ద్వారా తేటతెల్లమైంది. టీడీపీ 2019లో మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే అదే అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్‌రింగ్ రోడ్డును నిర్మించి లింగమనేని కుటుంబానికి భారీగా లబ్ధి కలిగించేదన్నది స్పష్టం. కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబు ఉంటున్న కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మించారని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ నివాసంలో ఏడేళ్లుగా నివసిస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు నివసిస్తున్నారు. ఆ నివాసం గురించి ప్రభుత్వంతో లింగమనేని అధికారికంగా ఎలాంటి వ్యవహారాలు నెరపలేదని న్యాయస్థానం వెల్లడించడం గమనార్హం. అంటే ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదన్నది స్పష్టం. కరకట్ట నివాసాన్ని లింగమనేని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారంటూ టీడీపీ చేస్తున్న వాదన పూర్తిగా అవాస్తవం అని దీంతో తేలిపోయింది. ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ చంద్రబాబుకు వ్యక్తిగతంగానే ఇచ్చారు. రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లలో కుంభకోణం ద్వారా భారీగా ప్రయోజనం కల్పించినందున క్విడ్ ప్రోకోలో భాగంగానే కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. హెరిటేజ్ భూముల లావాదేవీలు గోప్యం లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేస్తున్నట్టు చూపిస్తున్న భూముల బాగోతం కూడా బట్టబయలైంది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు లింగమనేని కుటుంబం భూములు అమ్మినట్టు ఎలాంటి లావాదేవీలను చూపించలేదని న్యాయస్థానం పేర్కొంది. రాజధాని ప్రాంతంలో లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసిన భూములకు సంబంధించి లావాదేవీలను చంద్రబాబు వెల్లడించలేదని వ్యాఖ్యానించింది. లోకేశ్‌దీ కీలక పాత్రే... క్విడ్ ప్రోకో కింద అమరావతిలో లింగమనేని కుటుంబం భూములను హెరిటేజ్‌కు బదలాయించడంలో నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారన్నది బట్టబయలైంది. లింగమనేని కుటుంబం నుంచి భూములు తీసుకునేందుకు హెరిటేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానించారు. హెరిటేజ్ డైరెక్టర్‌గా లోకేశ్ ఆ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మంత్రిగా ఉంటూ చంద్రబాబుతో కరకట్ట నివాసంలోనే నివసించారు. అంటే లింగమనేని కుటుంబానికి భారీగా ప్రయోజనం కల్పించి క్విడ్ ప్రోకో కింద హెరిటేజ్ భూములు దక్కించుకోవడంలో, కరకట్ట నివాసాన్ని సొంతం చేసుకోవడంలోనూ లోకేశ్ క్రియాశీల పాత్ర పోషించారన్నది స్పష్టమైంది. కథ నడిపిన ఏ–2 నారాయణ అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా నారాయణ కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం పొందినట్లు స్పష్టమైంది. మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల వ్యవహారాలన్నీ నారాయణకు పూర్తిగా తెలుసని, అంతా ఆయన ఆధ్వర్యంలోనే సాగిందని న్యాయస్థానం వెల్లడించింది. నారాయణ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సీడ్ క్యాపిటల్‌లో భూములు కొనుగోలు చేశారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని తెలిపింది. వారు తన కుటుంబ సభ్యులు, బంధువులు అనే విషయాన్ని నారాయణ గోప్యంగా ఉంచారని వ్యాఖ్యానించడం గమనార్హం. తద్వారా సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములు సీఆర్డీయేకే భూసమీకరణ కింద ఇచ్చి 75,888 చ.గజాల ప్లాట్లు పొందారని తెలిపింది. ఆ భూములపై కౌలు కింద రూ.1.92కోట్లు కూడా పొందారని పేర్కొంది. అంతా క్విడ్ ప్రోకోనే.. అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పుల ద్వారా చంద్రబాబు, నారాయణ లింగమనేని రమేశ్‌తో క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో క్విడ్‌ప్రోకోకు పాల్పడలేదంటూ లింగమనేని రమేశ్ చేసిన వాదనను తోసిపుచ్చింది. ఈ కేసును కొట్టి వేయాలన్న ఆయన వాదనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కరకట్ట నివాసం, సీడ్ క్యాపిటల్‌లో నారాయణ కుటుంబ సభ్యులకు కేటాయించిన 75,888 చ.గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేసేందుకు అనుమతినిచ్చింది. -
ఇండియా సిమెంట్స్‌పై సీబీఐ కేసు కొట్టివేత
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసుల నుంచి తెలంగాణ హైకోర్టు శుక్రవారం మరొకరికి విముక్తి కలిగించింది. ఇండియా సిమెంట్స్‌కు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చినందుకు ప్రతిగా జగన్ కంపెనీల్లో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టిందని ఆరోపిస్తూ సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. ఇండియా సిమెంట్స్‌పై సీబీఐ నమోదు చేసిన అభియోగ పత్రాన్ని (చార్జిషీట్) విచారణ నిమిత్తం పరిగణనలోకి (కాగ్నిజెన్స్) తీసుకొనేటప్పుడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం యాంత్రికంగా వ్యవహరించిందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఇండియా సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ ఎన్ శ్రీనివాసన్‌పై ఇదే ఆరోపణలతో సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు ఇప్పటికే కొట్టేసిందని ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా సిమెంట్స్‌పై కేసు కొనసాగించడం న్యాయం కాదని స్పష్టం చేశారు. సీబీఐ చేసిన ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని సంతృప్తి చెందేందుకు సీబీఐ కోర్టు ఎలాంటి కారణాలను రికార్డ్ చేయలేదని సీజే జస్టిస్ భుయాన్ ఆక్షేపించారు. అందువల్ల ఇలాంటి ఉత్తర్వులు న్యాయ సమీక్షకు నిలబడవని తేల్చి చెప్పారు. గతంలో శ్రీనివాసన్‌పై కేసును కొట్టేసిన న్యాయమూర్తి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తీర్పులో పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీ ఓ కృత్రిమ వ్యక్తి అని, కంపెనీ వ్యవహారాలను చూసుకొనే వ్యక్తులు చేసే తప్పులకు కార్పొరేట్ కంపెనీ బాధ్యత వహించాలనడానికి వీల్లేదన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పిందని తెలిపారు. చట్టం స్పష్టంగా నిర్దేశిస్తే తప్ప వ్యక్తులు చేసే తప్పులకు కంపెనీ బాధ్యత వహించాలనడానికి వీల్లేదన్నారు. క్విడ్ ప్రో కో ఆరోపణలతో సీబీఐ కేసు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఇండియా సిమెంట్స్‌కు కృష్ణా జలాలను అదనంగా కేటాయించడంతోపాటు కడపలో ఆ సంస్థ ఫ్యాక్టరీకి ఉన్న 2.5 ఎకరాల స్థలం లీజును పొడిగించినందుకు ప్రతిఫలంగా ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందిన కంపెనీల్లో ఇండియా సిమెంట్స్ పెట్టుబడి పెట్టిందని ఆరోపిస్తూ ఆ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. దర్యాప్తు అనంతరం చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌ను విచారణకు స్వీకరిస్తూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఇండియా సిమెంట్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ విచారణ జరిపారు. కంపెనీ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, న్యాయవాది చల్లా గుణరంజన్ వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ భుయాన్... శుక్రవారం ఆ వివరాలను వెలువరించారు. -
వ్యాక్సిన్ కోసం వారిని చైనాకు అమ్మకం.!
ఇస్తాంబుల్: టర్కీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కోవిడ్ వ్యాక్సిన్‌కి బదులుగా తమ దేశంలో ఉంటున్న ఉయఘర్ ముస్లింలను చైనాకు అప్పగించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. గత కొన్నేళ్లుగా చైనా ఉయఘర్ ముస్లింల మతాన్ని సాకుగా చూపుతూ.. వారి వల్ల దేశ భద్రతకు భంగం కలుగుతుందని ప్రచారం చేస్తో... వారిని బలవంతంగా బంధీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. స్వదేశం నుంచి వెళ్లగొట్టబడిన ఉయఘర్లలో చాలా మంది టర్కీలో తల దాచుకుంటున్నారు. ఇక తాజా వార్తల నేపథ్యంలో టర్కీలో ఉన్న ఉయఘర్లు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కరోనావైరస్ వ్యాక్సిన్ కోసం అధికార పార్టీ ఉయఘర్లను చైనాకు అప్పగించబోతుంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చైనా తాను పంపిణీ చేస్తానని వాగ్దానం చేసిన 10 లక్షల డోసుల టీకాలను ఇంకా టర్కీకి చేరవేయలేదు. ఇక గత కొద్ది నెలలుగా టర్కీ పోలీసులు బహిష్కరణ కేంద్రాలపై దాడి చేసి 50 మంది ఉయఘర్లను అదుపులోకి తీసుకున్నారని న్యాయవాదులు తెలుపుతున్నారు. అయితే చైనాకు ఉయఘర్ల అప్పగింతకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి ఆధారాలు గానీ.. అధికారిక ప్రకటన కానీ వెలువడలేదు. కానీ శాసనసభ్యులు, ఉయఘర్లు ఈ అప్పగించే ఒప్పందం ఆమోదం కోసం బీజింగ్ వ్యాక్సిన్లకు బదులుగా ఉయఘర్లను అప్పగించాలని డిమాండ్ చేస్తుందని భయపడుతున్నారు. ఈ ఒప్పందం సంవత్సరాల క్రితం చేయబడింది. అయితే ఇన్ని నెలలు మౌనంగా ఉన్న చైనా అకస్మాత్తుగా దీనిని గతేడాది డిసెంబరులో ఆమోదించింది. ఇది ఈ నెలలోనే టర్కీ చట్టసభల ముందుకు రావచ్చు. ఉయఘర్లు టర్కీ భాష మాట్లాడటమే కాక ఆ దేశంతో సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్నారు. ఇక చైనా వాయువ్య ప్రాంతమైన జిన్జియాంగ్ హింసను నివారించడానికి అనుకూలమైన గమ్యస్థానంగా మారుతుంది. అయితే థర్డ్ కంట్రీస్ ద్వారా టర్కీ రహస్యంగా ఉయఘర్లను చైనాకు తిరిగి ఇచ్చిందని వార్తా కథనాలు ఆరోపించాయి. జిన్జియాంగ్లో కనీసం పదిలక్షల మందిని ఖైదు చేశారని హక్కుల కార్యకర్తల ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతం న్యాయవిరుద్ధమైన నిర్బంధ శిబిరాల విస్తారమైన నెట్‌వర్క్‌కు నిలయమంటున్నారు. కానీ చైనా మాత్రం ఈ శిబిరాలను ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి వృత్తి శిక్షణా కేంద్రాలుగా పని చేస్తున్నాయని తెలిపింది. ఇక తాజా ఒప్పందం పట్ల తమ ఆందోళనను ప్రభుత్వానికి తెలపడానికి ఉయఘర్లు రోడ్డు మీదకు వచ్చి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టర్కీ పౌరసత్వం ఉన్న ఒమర్ ఫర అనే ఉయఘర్ మాట్లాడుతూ.. ‘‘దేవుడి దయ వల్ల టర్కీ తమను చైనాకు అప్పగించే ఒప్పందాన్ని అంగీకరించదని భావిస్తున్నాము’’ అన్నాడు. అతడి పిల్లలు ప్రస్తుతం చైనా నిర్బంధంలో ఉన్నారు. అంతేకాక టర్కీలో ఉన్న ఉయఘర్లను చైనా నేరస్తులుగా భావిస్తోందని వారు అభిప్రాయ పడుతున్నారు. చదవండి: టర్కీలో కరువు తాండవం.. 45 రోజుల్లో.. 1000 మంది గర్ల్‌ఫ్రెండ్స్.. 1075 ఏళ్ల జైలు శిక్ష -
రాజధానిలో అక్రమాలకు ఆధారాలివిగో..
సాక్షి, అమరావతి : రాజధాని ప్రాంతంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన నేరం బయట పడటం వల్ల శిక్ష అనుభవించాల్సి వస్తుందనే భయంతోనే రైతులను రెచ్చగొడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని విషయంలో గత టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతికి సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా బయట పెట్టింది. ఇందుకు సంబంధించి గురువారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిలు వివరాలు వెల్లడించారు. రాజధానిలో జరిగిన భూ అక్రమాలపై 21 నిమిషాల నిడివిగల వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో వివరాలు ఇలా ఉన్నాయి. భూ దందాలో మరో కోణం క్విడ్ ప్రో కో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వ్యాపార వేత్త లింగమనేని రమేష్ తన భార్య సుమన.. ఇతరులు ప్రశాంతి, స్వర్ణకుమారి, ఎల్.వి.రమేష్, ఎల్వీఎస్ రాజశేఖర్ పేర్లమీదే కాకుండా తన సంస్థలు లింగమనేని ఎస్టేట్స్, ఐజెఎం, లింగమనేని ఎడ్యుకేషనల్ అకడమిక్ ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్, లింగమనేని ఇన్ఫోసిటీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, కుముదల ఎస్టేట్స్, లింగమనేని ఆగ్రో ప్రై వేట్ లిమిటెడ్, లౌక్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, స్వర్ణిక ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, వల్లభ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, విఘ్నేష్ వెంచర్స్, వైట్‌సిటీ ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లమీద పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. విచిత్రంగా ఈ భూములేవీ రాజధాని నగరం పరిధిలోకిగానీ, సీఆర్డీయే పరిధిలోకి గానీ రాలేదు. లింగమనేని ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ భూములకు కేవలం పది మీటర్ల దూరంలో రాజధాని సరిహద్దు రేఖ ఆగిపోయింది. ఇందుకు ప్రతిఫలంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. లింగమనేనికి చెందిన గెస్ట్‌హౌస్‌ను తన నివాసంగా మార్చుకున్నారు. 158 ఎకరాలకు సంబంధించి ఇలాంటి అక్రమాలు జరిగాయని ఇప్పటి వరకు రికార్డులు లభించాయి. ప్లాట్ల కేటాయింపులో కూడా భారీగా అక్రమాలు జరిగాయి. రాజకీయంగా పలుకుబడి ఉన్న వారు, పైస్థానంలో ఉన్న వారు తమకు అనుకూలమైన ప్రాంతంలో ప్లాట్లను పొందగా, వీరి స్థానంలో ప్లాట్లు దక్కాల్సిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అసైన్డ్ భూముల వ్యవహారం.. రాజధాని అసైన్డ్ భూముల విషయంలో జరిగిన అక్రమాలు, అవకతవకలు అన్నీ ఇన్నీకావు. దళితులు, నిరుపేదలు దారుణంగా మోసపోయారు. అధికార పార్టీ నేతలు రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములకు ప్లాట్లు రావని ఉద్దేశ పూర్వకంగా ప్రచారం చేశారు. అసైన్డ్ భూములు అమ్మేయాలంటూ బెదిరింపులకు దిగారు. బలవంతంగా వాటిని కొనుగోలు చేశారు. దీనికోసం సబ్రిజిస్ట్రార్లపై అప్పటి అధికార పార్టీ నాయకులు విపరీతంగా ఒత్తిడి తీసుకు వచ్చారు. తర్వాత ఈ భూములను భూ సమీకరణలో తీసుకోవడానికి, తీసుకున్న వాటికి ప్రతిఫలంగా ప్లాట్లు ఇవ్వడానికి అనుకూలంగా జీఓలు జారీ చేశారు. ఇలా అసైన్డ్ భూములను కొనుగోలు చేసి, వాటిని ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన వారిలో దాదాపు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉండడం విశేషం. అసైన్డ్ భూములను తక్కువకు కొనుగోలు చేసి రాజధానిలో ప్లాట్లు పొందిన వారిలో ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నట్టు రికార్డుల్లో వెలుగు చూసింది. నారా లోకేష్ సన్నిహితుడు కొల్లి శివారం 47.39 ఎకరాలను ఇలా కొని దానికి ప్రతిఫలంగా ప్లాట్లు పొందారు. నారా లోకేష్‌కు మరో సన్నిహితుడు గుమ్మడి సురేష్ 42.925 ఎకరాల అసైన్డ్ ల్యాండ్‌ను చేజిక్కించుకున్నారు. ఇంకో సన్నిహితుడు బలుసు శ్రీనివాసరావు 14.07 ఎకరా తక్కువ ధరకు లాక్కున్నారు. మొత్తంగా 338.887 ఎకరాల అసైన్డ్ భూములను తక్కువ ధరకే కొనుగోలు చేసి ప్రతిఫలంగా రాజధాని ప్రాంతంలో ప్లాట్లు పొంది ఆర్థికంగా లబ్ధి పొందారు. జోన్ల అలైన్మెంట్ల కుంభకోణం.. రాజధానిలో జరిగిన మరో కుంభకోణంలో మరో కోణం ఇష్టాను సారంగా సరిహద్దులు నిర్ణయించడం. జోన్ల అలైన్మెంట్లను తమకు అనుకూలంగా మార్చడం. అప్పటి అధికార పార్టీ నాయకులు, వారి బంధువులు, అనుయాయుల భూము లేవీ ల్యాండ్ పూలింగ్ జోన్లోకి రాకుండా చేయడానికి సరిహద్దులను మార్చారు. 2015 జూన్‌లో రాజధాని పరిధిని 217 చదరపు కిలోమీటర్లుగా ప్రకటించారు. ఆ తర్వాత సింగపూర్‌కు చెందిన సుర్బానాజురాంగ్‌కు డ్రాఫ్ట్ ప్లాన్ బాధ్యతలను ప్రభుత్వం అందించింది. సుర్బానాజురాంగ్ ప్రభుత్వానికి రాజధాని ప్లాన్ అందించింది. ఈ ప్లాన్ ప్రకారం 391.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని డ్రాఫ్ట్ ప్లాన్‌ను రూపొందించింది. అయితే దీన్ని అప్పటి ప్రభుత్వం పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా కేవలం 217 చదరపు కిలోమీటర్లకు పరిమితి చేస్తూ ఫిబ్రవరి 2016లో నోటిఫికేషన్ జారీ చేసి, ఆ మేరకు ల్యాండ్ పూలింగ్ చేపట్టింది. జురాంగ్ కంపెనీ ఇచ్చిన డ్రాఫ్ట్ ప్లాన్‌కు భిన్నంగా రాజధాని నగరాన్ని కుదించడం వెనుక తమకు రాజకీయంగా అనుకూలమైన వ్యక్తులను పూలింగ్ నుంచి మినహాయించి, వాటి విలువ పెరిగేలా చేసి వారికి ఆర్థికంగా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశం ఇక్కడ వెల్లడవుతోంది. ► మంగళగిరి సమీపంలోని కాజా టోల్గేట్ సమీపంలో ఉన్న రామకృష్ణా హౌసింగ్‌ను సీఆర్డీయే జోన్ పరిధిలోకి రాకుండా తప్పించి ఆ కంపెనీకి ప్రయోజనం చేకూర్చారు. ► చంద్రబాబు బావమరిది, నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు కంపెనీ వీబీసీ ఫెర్టిలైజర్స్‌కు చందర్లపాడులో కేటాయించిన 498.3 ఎకరాల భూమి విషయంలో వారికి అత్యంత అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ కంపెనీకి భూములు కేటాయించిన తర్వాత సీఆర్డీయే ప్రాంతాన్ని ఆ ప్రాంతానికి విస్తరించారు. త ద్వారా ఆ భూములకు మంచి రేటు వచ్చేలా చేశారు. ► రాజధాని చుట్టూ నిర్మించ దలచిన ఇన్నర్ రింగురోడ్డు, దాన్ని అనుసంధానిస్తూ నిర్మించ దలచిన రోడ్ల విషయంలోనూ అలైన్మెంట్లను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ పేరుమీద కొనుగోలుచేసిన భూములు ఇన్నర్ రింగ్‌రోడ్డుకు పక్కనే ఉన్నాయి. ► చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు మురళీ మోహన్ కుంచనపల్లె సమీపంలో కొనుగోలు చేసిన 53.29 ఎకరాలకు ఆనుకుని ఇన్నర్ రింగు రోడ్డు వచ్చేలా చేశారు. పక్కా ప్లాన్‌తో భూ దందా 2014 జూన్ 1 నుంచి 2014 డిసెంబర్ 31 వరకు అంటే రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాజధాని ప్రకటన జరిగేంత వరకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రాజధాని ఎక్కడ రాబోతున్నదనే ముందస్తు సమాచారంతో అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు జరిగాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు, అమరావతి, తాడికొండ, పెదకూరపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్, చందర్లపాడు మండలాల్లో భూముల లావాదేవీలు చేశారు. రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై 2014 ఆగస్టు 27న శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన సమగ్ర నివేదికను పూర్తిగా పక్కన పడేశారు. తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 25 గ్రామాలను రాజధాని ప్రాంతంగా ప్రకటిస్తూ 2014 డిసెంబర్ 30న ఏపీ సీఆర్డీయే చట్టాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆమోదించింది. రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రాజధాని ప్రకటన జరిగిన 2014 సెప్టెంబర్ 4లోపు తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో తమ బంధువులు, బినామీల పేర్ల మీద భూములు కొనుగోలు చేశారు. 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకు గుంటూరు జిల్లాలోని రాజధాని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2,279.91 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 1,790 ఎకరాలు కొనుగోలు చేశారు. మొత్తం 4,069.91 ఎకరాలు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా లబ్ధి పొందారు. లంకా దినకర్ (ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు), కంభంపాటి రామ్మోహన్రావు కుమార్తె కంభంపాటి స్వాతి , పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం, అల్లుడు వడ్లమూడి శ్రీహర్ష.. వారు నడుపుతున్న ఆర్.ఆర్.ఇన్ఫ్రా అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్.. కూడా భారీగా భూములు కొనుగోలు చేశారు. (పైన పేర్కొన్న వాటికి అసైన్డ్ భూములు అదనం) రాష్ట్రం మొత్తం మీద 800 మంది తెల్లరేషన్ కార్డు దారులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో 60 మంది తెల్లరేషన్ కార్డు దారులు రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. చదవండి: ‘వారి బినామీలే భూములు కొనుగోలు చేశారు’ ఇన్సైడర్ ట్రేడింగ్ నిజమే రాజధాని దందా నిగ్గు తేలుస్తాం బట్టబయలైన అమరావతి కుంభకోణం ‘మొదట గుంటూరు, నూజివీడు అని చెప్పి..’ రాజధానిలో తవ్వేకొద్దీ ‘ఇన్సైడర్’ బాగోతాలు రాజధానిలో మరో భారీ భూ కుంభకోణం నారా లోకేశ్ తోడల్లుడి అబద్ధాలు వంద శాతం ఇన్సైడర్ ట్రేడింగే -
అవును.. లాలుకు లంచం ఇచ్చాం
ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబం క్విడ్ ప్రో కో బాగోతం కలకలం రేపుతోంది. కేంద్ర మాజీ మంత్రులు రఘునాథ్ ఝా, కాంతి సింగ్‌లు తాము లాలు కుటుంబానికి భూములు ఇచ్చామని చెప్పడంతో ఇది బయటపడింది. వాళ్లు తమకు భూములు ఇచ్చిన మాట వాస్తవమేనని, అయితే అది క్విడ్ ప్రో కో మాత్రం కాదని రాష్ట్రీయ జనతాదళ్ వర్గాలు వాదిస్తున్నాయి. యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో తమకు కేంద్రంలో మంత్రిపదవులు ఇప్పించినందుకు వాళ్లిద్దరూ లాలు కుటుంబానికి భూములు ఇచ్చారని బీజేపీ సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ మోదీ ఆరోపించిన ఒక రోజు తర్వాత ఇదంతా బయటపడింది. పట్నా జిల్లాలోని దానాపూర్ గ్రామంలో సుమారు ఎకరం భూమిని తాము లాలు భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవికి 2006లో లీజుకు ఇచ్చామని కాంతిసింగ్ ఒప్పుకొన్నారు. ఆ తర్వాత అదే భూమిని రబ్రీదేవి పేరుతోనే 2010లో రిజిస్టర్ చేశామన్నారు. కేంద్రంలో మంత్రిపదవి ఇప్పించినందుకు గాను ముందుగా నెలకు రూ. 1250 చొప్పున 99 ఏళ్లకు లీజుకు ఇచ్చారని మోదీ ఆరోపించారు. 2005 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఓడిపోవడంతో మోదీ కుటుంబం సీఎం బంగ్లాను ఖాళీ చేయాల్సి వచ్చిందని, లాలుకు 100 వరకు ఆవులు ఉండటంతో వాటిని వేరే చోటుకు తరలించడానికి గాను తన దానాపూర్ భూమిని తాత్కాలికంగా లీజుకు ఇచ్చానని, ఆ తర్వాత తాను 2009 ఎన్నికల్లో ఓడిపోవడంతో డబ్బు అవసరమై దాన్ని రబ్రీకి అమ్మేశానని కాంతిసింగ్ చెప్పారు. అయితే సుశీల్ మోదీ మాత్రం ఆమె చెప్పిన విషయాన్ని ఖండించారు. రబ్రీకి అమ్మిన భూమి వేరని, అది చాలా చిన్న భూమి మాత్రమేనని, అది కాకుండా ఆ పక్కనే ఉన్న భూమిని కారు చవగ్గా లాలు కొడుకులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లకు ఇచ్చేశారని ఆరోపించారు. ఇక రఘునాథ్ ఝా కుమారుడు అజిత్ కుమార్ ఝా కూడా తన తండ్రి గోపాల్‌గంజ్‌లో ఉన్న ఒక ప్లాటును తేజస్వి, తేజ్ప్రతాప్లకు 2005లో బహుమతిగా ఇచ్చినట్లు అంగీకరించారు. అయితే అది వ్యక్తిగతం మాత్రమేనన్నారు. తన భూమిని తాను ఎవరికి కావాలన్నా ఇస్తానని, అందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. తన తండ్రి మంత్రిగా చేయడం మొదటిసారి ఏమీ కాదని, ఆయన అంతకుముందు కూడా ఎమ్మెల్యేగాను, ఎంపీగాను, మంత్రిగాను పనిచేశారని చెప్పారు. ఇక ఈ భూముల విషయంలో ఆర్జేడీ వాదన మరీ విచిత్రంగా ఉంది. ''లాలు మా నాయకుడు. ఆయన సామాజిక న్యాయం కోసం పోరాడుతుంటారు. అందువల్ల ఇతర నాయకులు ఆయనను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తారు. దానివల్ల ఆయన ఉద్యమానికి నాయకత్వం వహించడానికి వీలవుతుంది'' అని ఆర్జేడీ నాయకుడు జగదానంద్ సింగ్ తెలిపారు.