ఇస్తాంబుల్: టర్కీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కోవిడ్ వ్యాక్సిన్‌కి బదులుగా తమ దేశంలో ఉంటున్న ఉయఘర్ ముస్లింలను చైనాకు అప్పగించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. గత కొన్నేళ్లుగా చైనా ఉయఘర్ ముస్లింల మతాన్ని సాకుగా చూపుతూ.. వారి వల్ల దేశ భద్రతకు భంగం కలుగుతుందని ప్రచారం చేస్తో... వారిని బలవంతంగా బంధీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. స్వదేశం నుంచి వెళ్లగొట్టబడిన ఉయఘర్లలో చాలా మంది టర్కీలో తల దాచుకుంటున్నారు. ఇక తాజా వార్తల నేపథ్యంలో టర్కీలో ఉన్న ఉయఘర్లు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కరోనావైరస్ వ్యాక్సిన్ కోసం అధికార పార్టీ ఉయఘర్లను చైనాకు అప్పగించబోతుంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే చైనా తాను పంపిణీ చేస్తానని వాగ్దానం చేసిన 10 లక్షల డోసుల టీకాలను ఇంకా టర్కీకి చేరవేయలేదు. ఇక గత కొద్ది నెలలుగా టర్కీ పోలీసులు బహిష్కరణ కేంద్రాలపై దాడి చేసి 50 మంది ఉయఘర్లను అదుపులోకి తీసుకున్నారని న్యాయవాదులు తెలుపుతున్నారు. అయితే చైనాకు ఉయఘర్ల అప్పగింతకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి ఆధారాలు గానీ.. అధికారిక ప్రకటన కానీ వెలువడలేదు. కానీ శాసనసభ్యులు, ఉయఘర్లు ఈ అప్పగించే ఒప్పందం ఆమోదం కోసం బీజింగ్ వ్యాక్సిన్లకు బదులుగా ఉయఘర్లను అప్పగించాలని డిమాండ్ చేస్తుందని భయపడుతున్నారు. ఈ ఒప్పందం సంవత్సరాల క్రితం చేయబడింది. అయితే ఇన్ని నెలలు మౌనంగా ఉన్న చైనా అకస్మాత్తుగా దీనిని గతేడాది డిసెంబరులో ఆమోదించింది. ఇది ఈ నెలలోనే టర్కీ చట్టసభల ముందుకు రావచ్చు.
ఉయఘర్లు టర్కీ భాష మాట్లాడటమే కాక ఆ దేశంతో సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్నారు. ఇక చైనా వాయువ్య ప్రాంతమైన జిన్జియాంగ్ హింసను నివారించడానికి అనుకూలమైన గమ్యస్థానంగా మారుతుంది. అయితే థర్డ్ కంట్రీస్ ద్వారా టర్కీ రహస్యంగా ఉయఘర్లను చైనాకు తిరిగి ఇచ్చిందని వార్తా కథనాలు ఆరోపించాయి. జిన్జియాంగ్‌లో కనీసం పదిలక్షల మందిని ఖైదు చేశారని హక్కుల కార్యకర్తల ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతం న్యాయవిరుద్ధమైన నిర్బంధ శిబిరాల విస్తారమైన నెట్‌వర్క్‌కు నిలయమంటున్నారు.
కానీ చైనా మాత్రం ఈ శిబిరాలను ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి వృత్తి శిక్షణా కేంద్రాలుగా పని చేస్తున్నాయని తెలిపింది. ఇక తాజా ఒప్పందం పట్ల తమ ఆందోళనను ప్రభుత్వానికి తెలపడానికి ఉయఘర్లు రోడ్డు మీదకు వచ్చి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టర్కీ పౌరసత్వం ఉన్న ఒమర్ ఫర అనే ఉయఘర్ మాట్లాడుతూ.. ‘‘దేవుడి దయ వల్ల టర్కీ తమను చైనాకు అప్పగించే ఒప్పందాన్ని అంగీకరించదని భావిస్తున్నాము’’ అన్నాడు. అతడి పిల్లలు ప్రస్తుతం చైనా నిర్బంధంలో ఉన్నారు. అంతేకాక టర్కీలో ఉన్న ఉయఘర్లను చైనా నేరస్తులుగా భావిస్తోందని వారు అభిప్రాయ పడుతున్నారు.
చదవండి: టర్కీలో కరువు తాండవం.. 45 రోజుల్లో..
1000 మంది గర్ల్‌ఫ్రెండ్స్.. 1075 ఏళ్ల జైలు శిక్ష
Comments
Please login to add a commentAdd a comment