![China Xi Jinping Says Will Provide 2 Billion Covid Vaccine Doses To World - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/6/xi-jinping.jpg.webp?itok=M4-tBv9l)
బీజింగ్: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ప్రపంచానికి చేయూతనందిస్తామని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ గురువారం చెప్పారు. ఈ ఏడాది 2 కోట్ల డోసుల కోవిడ్ టీకాలను ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆధ్వర్యంలో కొనసాగుతున్న వ్యాక్సిన్ కార్యక్రమం ‘కోవాక్స్’కు 100 మిలియన్ అమెరికన్ డాలర్లు విరాళంగా ఇస్తామన్నారు. చైనాలో డెల్టా వేరియంట్ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం 1,800కి పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 527 కేసులు ఎలాంటి అక్షణాలు కనిపించని కేసులేనని నేషనల్ హెల్త్ కమిషన్ ఒక నివేదికలో ప్రకటించింది. 1,285 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. సెంట్రల్ వూహాన్‌లో డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండడంతో కరోనా నిర్ధారణ పరీక్షల్లో వేగంగా పెంచారు. తాము ఇప్పటిదాకా 75 కోట్ల డోసులను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు అందించినట్లు చైనా విదేశాంగ శాఖ ఇటీవలే ప్రకటించింది. ఇందులో కోటి డోసులను కోవాక్స్ కార్యక్రమానికి ఇచ్చామని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment