ప్రజల ప్రాణాలను రక్షించేందుకు సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారులను కోరారు. ఈ మహమ్మారి వ్యాపి చెందకుండా హెల్త్ క్యాపెయిన్‌లు ఏర్పాటు చేసి తగిన వైద్యం అందించాలని చెప్పారు. అలాగే ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేసేలా రక్షణ చర్యలను మరింత బలోపేతం చేయాలని నొక్కి చెప్పారు. ప్రజల జీవితాలకు భద్రతా తోపాటు మెరుగైనా ఆరోగ్యాన్ని అందించేలా చర్యలు తీసుకోమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు వెల్లువలా పెరుగుపోతుంటే..మరోవైపు ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. దీంతో ప్రస్తుతం అక్కడ వైద్య సేవల కొరత తోపాటు ఔషధాలకు డిమాండ్ కూడా అధికంగా ఉంది. ఈ మేరకు చైనా ప్రభుత్వం ఈ డిమాండ్‌ని తీర్చడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు శ్మశాన వాటికలకు సైతం డిమాండ్ పెరుగుతున్నట్లు సమాచారం.
ఒక పక్క కేసుల తోపాటు మరణాలు కూడా అధికమవ్వడంతో శ్మశానాల వద్ద కిక్కిరిసిపోయిన శవాలతో హృదయవిదారకంగా ఉంది. ఐతే డ్రాగన్ దేశం కరోనా మరణాల సంఖ్యలను గణించకుండా కేవలం కోవిడ్ కారణంగా వచ్చిన న్యుమోనియా లేదా శ్వాసకోస వైఫల్య కేసులను మాత్రమే చైనా లెక్కిస్తోందంటూ.. విమర్శలు వెల్లవెత్తాయి.
(చదవండి: శ్మశానాల ముందు మృతదేహాలతో భారీ క్యూ.. చైనాలో దారుణ పరిస్థతులు)
Comments
Please login to add a commentAdd a comment