urges
-
ప్రధాని రాజీనామా కోరిన నేపాలీ కాంగ్రెస్
పొరుగుదేశం నేపాల్‌లో సంభవించిన రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది. తాజాగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలంటూ నేపాలీ కాంగ్రెస్ దేశ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండను కోరింది. హిమాలయ దేశంలో గెరిల్లా మాజీ నేత నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.తాజాగా నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా నివాసంలో జరిగిన నేపాలీ కాంగ్రెస్ సెంట్రల్ వర్క్ పెర్ఫార్మెన్స్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తు వ్యూహంపై చర్చించారు. ఈ నేపధ్యంలో షేర్ బహదూర్ దేవుబా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్-యూఎంఎల్) అధ్యక్షుడు కేపీ శర్మ ఓలీతో సమావేశమై ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని పాలక కూటమి స్థానంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ఒప్పందాన్ని ఖరారు చేశారు.ఈ సమావేశం అనంతరం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ప్రకాష్ శరణ్ మహత్ విలేకరులతో మాట్లాడుతూ నేపాల్‌లో అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్, యూఎంఎల్‌లు కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమై, అందుకు మార్గం సుగమం చేసేందుకు ప్రధాని రాజీనామా చేయాలని కోరాయని తెలిపారు. దేశంలోని ఇతర పార్టీలు కూడా కొత్త నేపాలీ కాంగ్రెస్-యుఎంఎల్ కూటమికి మద్దతు ఇస్తున్నాయన్నారు. అయితే ప్రధాని ప్రచండ తన పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించారు. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం, సభలో మెజారిటీ కోల్పోయిన ప్రధానమంత్రి రాజీనామాకు సిద్ధమైతే అతను పాలక కూటమికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయితే ఇందుకు సభలో ఓటింగ్ జరగాలన్నారు. -
నా కోసం ఎదురు చూడొద్దు!..మళ్లీ పెళ్లి చేసుకో: ఓ నేరస్తుడి భావోద్వేగ సందేశం
ఓ వ్యక్తి 30 ఏళ్ల క్రితం చేసిన నేరానికి ఇటీవలే పోలీసులకు పట్టుబడతాడు. దీంతో అతను జైలుకి వెళ్తూ.. భార్యను మళ్లీ పెళ్లి చేసుకో, నా కోసం ఎదురు చూడకు అని భావోద్వేగంగా చెబుతాడు. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింత తెగ వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..'జౌ' అనే చైనా వ్యక్తి 1993లో సెంట్రల్ హుబీ ప్రావిన్స్‌లో తన ముగ్గురి స్నేహితులతో కలసి ఒక వ్యక్తిని హత్య చేశాడు. ఆ ఘటన జరిగిన వెంటనే అతడి స్నేహితులు అరెస్టు అయ్యారు. కానీ జౌ మాత్రం పోలీసులకు పట్టుబడలేదు. గత నెలాఖరు వరకు పరారీలోనే ఉన్నాడు. ఇటీవలే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తాను జైలుకి వెళ్లడం ఖాయమని తెలిసిన జౌ తన భార్యతో భావోద్వేగంగా మాట్లాడతాడు. తనకు విడాకులు ఇచ్చి మరోకర్ని పెళ్లి చేసుకోవాలని, తన కోసం ఎదురు చూడొద్దని వేడుకుంటాడు. జైలుకి వెళ్తూ వెళ్తూ..ఆమెని కౌగిలించుకంటూ తన కోసం ఎదురు చూడొద్దని కన్నీళ్లు పెట్టుకుంటాడు. తమ రిలేషన్ ఇక్కడతో ముగిసిపోయింది. మీ అక్కకి మరో పెళ్లి చేయండని తన మరదలికి కూడా చెబుతాడు. తానెప్పటికీ జైలు నుంచి విడుదలకాలేనని కన్నీటిపర్యంతమవుతాడు. దీంతో ఔ భార్య ఇక మాట్లాడొద్దు అంటూ తన చేతిని జౌ నోటికి అడ్డం పెడుతుంది. అలా మాట్లాడొద్దు. అందుకు తాను ఒప్పుకోనని భార్య తెగేసి చెబుతుంది. ఆ ఘటన అక్కడ ఉన్నవాళ్లందర్నీ కదిలించింది. ఇక నేరస్తుడు జౌ కూడా తాను 30 ఏళ్ల క్రితం చేసిన నేరానికి ఇప్పడు అరెస్టు కావడం తననెంతో బాధించిందన్నాడు. తాను చేసిన నేరానికి చాలా పశ్చాత్తాప పడుతున్నానంటూ బావురమన్నాడు. తాను యువకుడిగా ఉన్నప్పుడు ఆ నేరం చేశానని, ఐనా తాను అప్పడు అలా చేసి ఉండకూడదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. (చదవండి: ఆ ఎమోజీని ఉపయోగించినందుకు..రైతుకి రూ. 50 లక్షలు జరిమానా) -
Imran Khan: మహిళా కార్యకర్తలపై జరుగుతున్న అకృత్యాలపై దర్యాప్తు చేయాలి!:
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు నేపథ్యంలో జరిగిన అల్లర్లు, హింసాకాండలో మహిళా కార్యకర్తలు, మద్దతుదారులు అరెస్టయ్యిన సంగతి తెలిసిందే. వారిపై అత్యాచారం వంటి అకృత్యాలు జరిగనట్లు ఇమ్రాన్ ఆరోపించడమే గాక దీన్ని సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఐతే పాక్ అంతర్గత మంత్రి పీటీఐ సభ్యులు బూటకపు ఎన్కౌంటర్, అత్యాచార ఘటనకు సంబంధించి కుట్రను బహిర్గతం చేసే కాల్‌ను ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు అడ్డుకున్నాయని విలేకరులు సమావేశంలో పేర్కొన్నారు. ఆ తదనంతరమే పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయా కాల్స్‌లో.. మంత్రి సనావుల్లా పీటీఐ కార్యకర్తల ఇంటిపై దాడి చేసి కాల్పు జరిపే పథకం ఉందని, ఫలితంగా ఫ్రాణం నష్టం జరిగి ప్రపంచానికి మానవహక్కుల ఉల్లంఘన జరిగినట్లు చిత్రీకరిస్తుందని పేర్కొన్నారు. అలాగే అత్యాచారాలు అనేది రెండవ ప్రణాళికలో భాగం అని, పీటీఐకి వ్యతిరేకంగా జరిగిన అన్యాయన్ని ప్రచారం చేయడానికి గ్లోబల్ మీడియా సంస్థలతో భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్న పార్టీ మహిళ కార్యకర్తలకు ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎలాంటి చికిత్స అందిస్తున్నారని ప్రశ్నించారు. మహిళా కార్యకర్తలను బంధించి జైల్లో పడేసిన విధానం బాధించింది. అక్కడ వారిపై అత్యాచారాలు జరిగడంతో చికిత్స పొదుతున్నట్లు విన్నామని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనల గురించి వివిధ ప్రాంతాల నుంచి నివేదికలు వస్తున్నట్లు పేర్కొన్నారు. అందువల్ల సుప్రీం కోర్టు దయనీయ స్థితిలో ఉన్న మహిళ కార్శికుల గురించి దర్యాప్తు చేయాలని కోరారు ఇమ్రాన్ ఖాన్. (చదవండి: Imran Khan PTI Party: పాకిస్తాన్లో సంచలనం.. ఇమ్రాన్‌కు ఊహించని షాక్!) -
ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్..వాటిని పునరుద్ధరించమని యూఎస్‌కి విజ్క్షప్తి!
అఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలగినప్పటి నుంచి పాక్‌తో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇరుదేశాల సంబంధాలు సుదీర్ఘకాలం అనిశ్చితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగదు కొరతతో సతమవుతున్న పాక్ మిలటరీ ఫైనాన్సింగ్ సేల్స్‌ను పునరుద్ధరించాలని అమెరికాని కోరింది. వాస్తవానికి దీన్ని యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు వాషింగ్టన్లో జరిగిన సెమినార్లో అమెరికాకు చెందిన పాకిస్తాన్ రాయబారి మసూద్ ఖాన్ ప్రసంగిస్తూ.. గత ప్రభుత్వం సస్పెండ్ చేసిన దానిని పునరుద్ధరించాలన్నారు. విదేశీ మిలిటరీ ఫైనాన్సింగ్, ఫారిన్ మిలటరీ సేల్స్‌ను పునరుద్ధరించడం పాక్‌కి చాలా ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ మధ్య ఆసియా యూఎస్ ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఎలిజబెత్ హూర్ట్స్ సమస్యత్మకంగా మారిన పాక్ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడంలో సహాయం చేయాల్సిన అవసరంపై దృష్టి సారించారు. ఐతే ముందు పాక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్)తో కలిసి పనిచేయాల్సి ఉంటుందని అన్నారు ఎలిజబెత్. పాక్ ఐఎంఎఫ్‌తో అంగీకరించిన కఠినమైన సంస్కరణలు అంత తేలికైనవి కాదన్నారు. కానీ పాక్ తన దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయాలన్న, మరింత అప్పుల ఊబిలో చిక్కుకోకుండా తన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి పాక్‌కి ఈ చర్యలు తీసుకోవడం చాలా కీలకమని చెప్పారు. అందువల్ల ఐఎంఎఫ్‌తో అంగీకరించిన సంస్కరణలను పాక్ ముందుగా అమలు చేయాలని యూఎస్ కోరింది. ఈ మేరకు పాక్ అమెరికాతో దెబ్బతిన్న సంబంధాలను సరి చేసుకోవడంపై దృష్టి సారించింది. ఆ సమావేశంలో రాయబారి ఖాన్ రష్యా చమురు కోసం పాక్ తన మొదటి ఆర్డర్ ఇచ్చిందని కానీ యూఎస్‌తో సంప్రదించి వెనక్కి తగ్గినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఖాన్ అఫ్ఘనిస్తాన్‌లో సుస్థిరత తీసుకురావడంలో పాక్ పోషించిన కీలక పాత గురించి మాట్లాడారు. గత నాలుగు దశాబ్దాలుగా తీవ్రంగా నష్టపోయిన అఫ్ఘాన్‌లోని ప్రజలకు స్థిరత్వం చాలా అవసరం అని ఖాన్ పేర్కొన్నారు. అలాగే అఫ్ఘనిస్తాన్‌లో వృద్ధి చెందుతున్న ఉగ్రవాదంపై అమెరికా, చైనాలు ఆందోళన చెందుతున్నాయన్నారు. ఈ రోజు అది పాక్, అఫ్ఘాన్లకు ముప్పుగా ఉండోచ్చు కానీ దీన్ని అదుపు చేయకపోతే మరింతగా విస్తరిస్తుందని హెచ్చరించారు. ఈ ఉగ్రవాద ముప్పును తొలగించేందుకు కలిసికట్టుగా పనిచేద్దాం అని రాయబారి ఖాన్ పిలుపునిచ్చారు. (చదవండి: సూడాన్ నుంచి మరో 754 మంది రాక) -
WHO: కరోనా మహమ్మారి మూలాల గురించి మీకు తెలిసిందే చెప్పండి!
చైనా ల్యాబ్ లీక్ కారణంగా కరోనా వచ్చిదంటూ యూఎస్ వాదిస్తుండగా.. అవాస్తవం అని చైనా పదే పదే తిరస్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవిడ్-19 మూలాలు గురించి మీకు తెలిసిందే చెప్పండని శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అన్ని దేశాలను కోరింది. 2019లో చైనాలో వచ్చిన ఈ కరోనా ప్రపంచ దేశాలను ఓ కుదుపు కుదిపేసింది. లక్షల్లో మరణాలు సంభవించగా, దేశాలన్ని ఆర్థిక సంక్షోభంలో కొట్టుకునే పరిస్థితకి దారితీసింది కూడా. ఈ కారణాల రీత్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మహమ్మారి పుట్టుక గురించి బహిర్గతం చేయాల్సిందిగా ఆదేశించింది. అంతేగాదు దీని గురించి అంతర్జాతీయ దేశాలతో పంచుకోవడం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. ఇప్పడు నిందలు వేసుకోవడం ముఖ్యం కాదని, ఈ మహమ్మారి ఎల ప్రారంభమైంది అనేదానిపై అవగాహన పెంచుకుని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి అంటువ్యాధులను నిరోధించవచ్చని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ అన్నారు. ఈ కోవిడ్-19 మూలాన్ని గుర్తించడానికి సంబంధించిన ఏ చిన్న ప్రణాళికను డబ్ల్యూహెచ్ఓ వదిలిపెట్టలేదని నొక్కి చెప్పారు. ఈ విషయంలో వాస్తవాలు కావాలి 2021లో యూఎన్ ఈ మహమ్మారి మూలం తెలుసుకోవడానికి సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్(ఎస్‌ఏజీఓ) గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన డేటాను చైనా పంచుకోవాలని, ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించమని ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. అలాగే డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఈ విషయమై చైనా అగ్రనాయకులతో పలుమార్లు చర్చించినట్లు కూడా తెలిపారు. ఇలాంటి విషయాలను రాజకీయాలు చేయొద్దని అది పరిశోధనలను కష్టతరం చేస్తుంది, ఫలితంగా ప్రపంచ సురక్షితంగా ఉండదని చెప్పారు. ఇటీవలే యూఎస్‌లోని ప్రముఖ ఎనర్జీ డిపార్ట్‌మెట్ కరోనా మూలానికి వ్యూహాన్ ల్యాబ్ లీకే ఎక్కువగా కారణమని నివేదిక కూడా ఇచ్చింది. అదీగాక ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్లోనే అత్యున్నత అధికారులు ఉండటంతో ఈ నివేదిక ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈమేరకు డబ్ల్యూహెచ్ఓలోని అంటువ్యాధుల ఎపిడెమియాలజిస్ట్ వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ..ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు, దీర్ఘకాల కోవిడ్‌తో జీవిస్తున్న వారి కోసం ఇదేలా ప్రారంభమైందనేది తెలుసుకోవడం నైతికంగా అత్యంత ముఖ్యం. శాస్త్రీయ అధ్యయనంలో ముందుకు తీసుకువెళ్లడంలో సహాయపడటానికి ఈ సమాచారం పంచుకోవడం అత్యంత కీలకం అని అన్నారు. -
తక్షణమే ప్రజల ప్రాణాలను కాపాడండి..అధికారులకు జిన్‌పింగ్ ఆదేశాలు
ప్రజల ప్రాణాలను రక్షించేందుకు సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారులను కోరారు. ఈ మహమ్మారి వ్యాపి చెందకుండా హెల్త్ క్యాపెయిన్లు ఏర్పాటు చేసి తగిన వైద్యం అందించాలని చెప్పారు. అలాగే ఈ కరోనా మహమ్మారిని కట్టడి చేసేలా రక్షణ చర్యలను మరింత బలోపేతం చేయాలని నొక్కి చెప్పారు. ప్రజల జీవితాలకు భద్రతా తోపాటు మెరుగైనా ఆరోగ్యాన్ని అందించేలా చర్యలు తీసుకోమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం చైనాలో కరోనా కేసులు వెల్లువలా పెరుగుపోతుంటే..మరోవైపు ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. దీంతో ప్రస్తుతం అక్కడ వైద్య సేవల కొరత తోపాటు ఔషధాలకు డిమాండ్ కూడా అధికంగా ఉంది. ఈ మేరకు చైనా ప్రభుత్వం ఈ డిమాండ్‌ని తీర్చడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు శ్మశాన వాటికలకు సైతం డిమాండ్ పెరుగుతున్నట్లు సమాచారం. ఒక పక్క కేసుల తోపాటు మరణాలు కూడా అధికమవ్వడంతో శ్మశానాల వద్ద కిక్కిరిసిపోయిన శవాలతో హృదయవిదారకంగా ఉంది. ఐతే డ్రాగన్ దేశం కరోనా మరణాల సంఖ్యలను గణించకుండా కేవలం కోవిడ్ కారణంగా వచ్చిన న్యుమోనియా లేదా శ్వాసకోస వైఫల్య కేసులను మాత్రమే చైనా లెక్కిస్తోందంటూ.. విమర్శలు వెల్లవెత్తాయి. (చదవండి: శ్మశానాల ముందు మృతదేహాలతో భారీ క్యూ.. చైనాలో దారుణ పరిస్థతులు) -
రష్యా ఆయిల్‌పై నియంత్రణకు మా కూటమిలో చేరండి: అమెరికా
న్యూఢిల్లీ: రష్యన్ ముడిచమురు రేటును నియంత్రించడం ద్వారా ఆ దేశ ఆదాయ మార్గాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న కూటమిలో చేరాలంటూ భారత్‌పై అమెరికా ఒత్తిడి మరింత పెంచుతోంది. భారత్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన అమెరికా ఆర్థిక శాఖ సహాయ మంత్రి వాలీ అడెయెమో.. ప్రభుత్వ వర్గాలతో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలతో పాటు ఈ అంశంపైనా చర్చించారు. రష్యా చమురు రేట్లకు చెక్ పెట్టడమనేది, దేశీయంగా ఇంధన ధరలను తగ్గించుకోవాలన్న భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని వాలీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారత్‌కు తత్సంబంధ వివరాలు అందిస్తున్నామని, దీనిపై చర్చలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాను ఆర్థికంగా దిగ్బంధం చేసేందుకు .. అమెరికా తదితర దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రష్యాకు కీలక ఆదాయ వనరైన చమురు రేట్లను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు, అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా ఎగిసినప్పటికీ భారత్‌కు రష్యా డిస్కౌంటు రేటుకే చమురును అందిస్తోంది. దీంతో రష్యా నుంచి భారత్ చౌకగా చమురును కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు అమెరికా యత్నిస్తోంది. -
Afghanistan: మమ్మల్ని రక్షించండి - తెలంగాణ వలస కార్మికుల వేడుకోలు
మోర్తాడ్ (బాల్కొండ): అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత దయనీయ పరిస్థితు లకు వీరిద్దరి గాథలు అద్దం పడుతున్నాయి. పొట్ట చేత పట్టుకుని అఫ్గాన్‌కు వెళ్లిన తెలంగాణ వాసుల దయనీయ స్థితి. కొందరు అక్కడి నుంచి క్షేమంగా ఇంటికి చేరుకోగా మరికొందరు అక్కడే చిక్కుకుని బిక్కు బిక్కుమంటూ కాలం గడుపు తున్నారు. అఫ్గాన్‌లోని మన విదే శాంగ కార్యాలయాన్ని ఉద్యోగులు ఖాళీ చేసినా అక్కడ చిక్కుకుపోయిన వారి సంఖ్య ఎంత? వారి స్థితి గతులేంటో ఇప్పటికీ తెలియట్లేదు. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం, నాటో సేనలు ఖాళీ చేస్తుండటం.. అంతలోనే తాలిబన్లు అఫ్గాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకోవడంతో వలస కార్మికుల్లో ఉపాధి కల చెదిరిపోయింది. ఫలితంగా తమ వీసాలకు గడువు ఉన్నా అఫ్గాన్‌ను వీడాల్సి వస్తుందని వలస కార్మికులు వాపోతున్నారు. అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో దళాలు వెనక్కి వెళ్లిపోవడానికి గడువు సమీపించింది. కాగా అమెరికన్ సైన్యంకు సేవలు అందించే ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని గుర్తించిన కొందరు తెలంగాణ యువకులు అఫ్గాన్‌లోనే ఉండటానికి ప్రత్యామ్నాయ మార్గం వెతుక్కున్నారు. అఫ్గాన్ నుంచి అమెరికా, నాటో సైన్యం ఉపసంహరణ జరిగినా రాయబార కార్యాలయాలల్లో విధులు నిర్వహిస్తే తమ ఉద్యోగానికి ఢోకా ఉండదని వలస కార్మికులు భావించారు. ఈ క్రమంలో ఏజెన్సీల మెప్పు పొంది అమెరికా, ఇతర దేశాల రాయబార కార్యాలయాల్లో బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అంతలోనే అంతా అయిపోయింది.. కానీ అంతలోనే తాలిబన్లు అఫ్గానిస్తాన్ మొత్తాన్ని వశం చేసుకోవడంతో అమెరికా సహా అన్ని దేశాల రాయబార కార్యాలయాలను ఖాళీ చేశాయి. ఈ క్రమంలో రాయబార కార్యాలయాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ వలస కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. అమెరికా ఎంబసీకి అనుబంధంగా పని చేసే కార్మికులను నాలుగు నెలలకు ఒకసారి ఇంటికి వెళ్లి రావడానికి సెలవులు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల కొందరు సెలవులపై ఇంటికి రాగా అఫ్గాన్‌లో మారిన పరిస్థితులతో మళ్లీ అక్కడకు వెళ్లలేకపోతున్నారు. కాబుల్‌లో చిక్కుకుపోయాను నేను అఫ్గానిస్తాన్‌లోని అమెరికన్ మిలటరీ క్యాంపులో సహాయ కుడిగా పనిచేస్తాను. కాబూల్ పట్టణం కసబ్ అనే ప్రాంతంలో చిక్కుకున్నాను. రెండు మూడు రోజుల కింద తాలిబన్లు కాల్పుల మోత మోగిం చారు. బిక్కుబిక్కుమంటూ క్యాంపు గదిలోనే దాక్కున్నాం. సెల్ఫోన్లు వినియోగించ డానికి అనుమతి లేదు. రహస్యంగానే వాడుతున్నాం. తాలిబన్లు ఎప్పుడేం చేస్తారో తెలియట్లేదు. నాతో పాటు చాలామంది ఇక్కడ చిక్కుకున్నారు. - బొమ్మన రాజన్న( మంచి ర్యాల) ఎటుపోవాలో తెలియడం లేదు నేను అఫ్గానిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో పని చేస్తున్నాను. నాకు ఇక్కడ పని చేయడానికి వీసా గడువు ఇంకా ఉంది. కానీ తాలిబన్ల కారణంగా అమెరికా రాయబార కార్యాలయం ఖాళీ చేశారు. నాతో పాటు ఇక్కడ ఉపాధి పొందుతున్న విదేశీయులను రెండు రోజుల కింద ఖతర్‌కు తరలించారు. మమ్మల్ని ఇక్కడే ఉంచుతారో లేక ఇంటికి పంపుతారో తెలియట్లేదు. - బొమ్మెన మహేందర్ (మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా) అమెరికా బాధ్యత తీసుకోవాలి- స్వదేశ్ పరికిపండ్ల (ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు) అఫ్గాన్‌లో 20 ఏళ్ల పాటు అమెరికా సైన్యం, నాటో దళాలకు సేవలు అందించిన తెలంగాణ వలస కార్మికులను అమెరికా ప్రభుత్వం చేరదీయాలనే డిమాండ్ వస్తోంది. అఫ్గాన్ పౌరులతోపాటు తెలంగాణ వలస కార్మికులకు కూడా అమెరికా తమ దేశ వీసాలను జారీ చేసి ఉపాధి కల్పించాలి. -
టెస్లా పాటే పాడుతున్న ఫోక్స్‌వ్యాగన్
దిగుమతి సుంకం తగ్గించాలంటూ విదేశీ కార్ల తయారీ కంపెనీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్ల దిగుమతి విషయంలో ప్రస్తుతం ఉన్న పన్నులను పరిశీలించాని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ విషయంలపై ఇప్పటికే టెస్లా, హ్యుందాయ్‌లు తమ అభిప్రాయం చెప్పగా తాజాగా ఫోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్‌లు వాటికి వంత పాడాయి. పన్ను తగ్గించండి కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి పన్ను తగ్గించాలంటూ ఫోక్స్‌వ్యాగన్ కేంద్రాన్ని కోరింది. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి అవుతున్న లగ్జరీ కార్లపై వంద శాతం పన్నును ప్రభుత్వం విధిస్తోంది. దీంతో విదేశీ కార్లు ఇండియా మార్కెట్లోకి వచ్చే సరికి ధర అమాంతం పెరిగిపోతుంది. ఫలితంగా అమ్మకాలు తక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పన్ను తగ్గింపు అంశం పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఫోక్స్ వ్యాగన్ కోరింది. ఈ మేరకు ఫోక్స్‌వ్యాగన్ ఇండియా హెడ్ గుర్ప్రతాప్ బొపారియా మాట్లాడుతూ ‘ దిగుమతి సుంకం తగ్గించడం వల్ల స్థానిక ఆటో ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందని తాను భావించడం లేదన్నారు. ఇప్పుడున్న పన్నులను 100 శాతం నుంచి 25 శాతానికి తగ్గించినా.. ఇండియన్ ఆటోమోబైల్ ఇండస్ట్రీకిపై పెద్దగా ప్రభావం ఉందని ఆయన రాయిటర్స్ వార్త సంస్థతో అన్నారు. మినహాయింపు వస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో నంబర్ వన్ స్థానం కోసం ఫోక్స్ వ్యాగన్ పోటీ పడుతోంది. దీంతో ఆ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటికే ఆడీ ఈ ట్రాన్ పేరుతో ఎలక్ట్రిక్ కారుని ఇండియాలో లాంఛ్ చేసింది. అయితే ఈ కారు ధర ఎక్కువగా ఉండటంతో అమ్మకాలు ఆశించినంతగా లేవు. దిగుమతి సుంకం తగ్గిస్తే ఫోక్స్‌వ్యాగన్, స్కోడా బ్రాండ్ల కింద పలు ఈవీ కార్లను మార్కెట్లోకి తెచ్చేందుకు ఫోక్స్‌వ్యాగన్ ప్రయత్నాలు చేస్తోంది. క్లారిటీ లేదు ఫారిన్ బ్రాండ్ల కార్లపై ఇంపోర్ట్ ట్యాక్స్ విషయంలో టెస్లా, హ్యుందాయ్, బెంజ్, ఫోక్స్‌వ్యాగన్‌ల విజ్ఞప్తులు ఇప్పటికే కేంద్రానికి చేరాయి. దీంతో మిగిలిన కార్లకు మినహాయింపు ఇవ్వకున్నా ఈవీ కార్లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న 100 శాతం పన్నుని 40 శాతానికి తగ్గించే అంశం కేంద్రం పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అంతేకాదు ఇండియాలో కార్ల తయారీ యూనిట్ పెట్టాలని విదేశీ కంపెనీలను ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. అయితే విదేశీ కంపెనీల విజ్ఞప్తులపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి క్లారిటీ రాలేదు. స్వదేశీపై ప్రభావం ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లకు సంబంధించి రూ. 40 లక్షలకు పైబడి ధర ఉన్న అన్ని లగ్జరీ కార్లపై వంద శాతం పన్ను విధిస్తున్నారు. విదేశీ ఈవీ కార్ల ధరలన్నీ కూడా రూ. 40 లక్షలకు పైగానే ఉన్నాయి. దీంతో వీటిపై వందశాతం పన్ను వసూలు అవుతోంది. దీంతో పన్ను తగ్గించాలంటూ విదేశీ కార్ల కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు దిగుమతి పన్ను శాతాన్ని తగ్గిస్తే దేశీ ఈవీ కార్ల తయారీ కంపెనీలకు నష్టం జరుగుతందని టాటా మోటార్ వంటి సంస్థలు వాదిస్తున్నాయి. విదేశీ కంపెనీలతో స్వదేశీ కంపెనీలు పోటీ పడలేవనే సందేహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక పన్ను తగ్గింపు అంశంపై మారుతి, మహీంద్రాలు ఇంకా స్పందించలేదు. -
నచ్చినోళ్లకు రుణం... బ్యాంకింగ్‌కు భారం
న్యూఢిల్లీ: క్రోనీ రుణ మంజూరీలకు దూరంగా ఉండాలని, అధిక నాణ్యత రుణ మంజూరీలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణ్యం ఫైనాన్షియల్ సంస్థలకు మంగళవారం పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి సంబంధించి విలువైన ఆస్తుల సృష్టికి అధిక నాణ్యతతో కూడిన రుణాలు దోహదపడతాయని అన్నారు. తద్వారానే దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా నడిపించవచ్చని సూచించారు. నచ్చిన వాళ్లకు లేదా రాజకీయ నాయకుల ప్రభావానికి గురై ఇతర ఎటువంటి అంశాలనూ పరిశీలనలోకి తీసుకోకుండా మంజూరు చేసే రుణాలను ‘క్రోనీ లెండింగ్’గా పరిగణిస్తారు. ఇండస్ట్రీ చాంబర్ ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... ►నాణ్యత లేని పేలవ రుణ మంజూరీ సమస్యను 1990 నుంచీ భారత్ బ్యాంకింగ్ ఎదుర్కొంటోంది. ప్రత్యేకించి బడా రుణాల విషయంలో ఈ పరిస్థితి చోటుచేసుకుంటోంది. రుణాలను సకాలంలో తీర్చుతున్న (క్రెడిట్ వర్తీనెస్) వారికి రుణ మంజూరీలు సజావుగా లేవు. అదే సమయంలో క్రోనీ క్యాపిటలిస్టుల విషయంలో రుణ మంజూరీలు సునాయాసంగా జరుగుతున్నాయి. బ్యాంకింగ్‌లో మొండిబకాయిలు పెరిగిపోవడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటి. ►క్రెడిట్‌వర్తీ లేని ఒక వ్యక్తికి రుణం మంజూరు చేయడం అంటే, క్రెడివర్తీ కలిగిన రుణ గ్రహీత రుణం పొందడంలో ఒక అవకాశాన్ని కోల్పోయినట్లే భావించాల్సి ఉంటుంది. ►వృద్ధి బాటలో మూలధనాన్ని తగిన రుణ గ్రహీతకు అందజేయడం ఫైనాన్షియల్ రంగం విధి. ►మౌలిక రంగంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితలు కూడా బ్యాంకింగ్ మొండిబకాయిలు పెరిగిపోవడానికి కారణం. అధిక నాణ్యతతో కూడిన రుణాల మంజూరీల విషయంలో ఫైనాన్షియల్ రంగం బాధ్యతా ఉంది. ప్రత్యేకించి మౌలిక రంగంలో రుణాల విషయంలో ‘క్రోనీ’ లెండింగ్‌కు ఎంతమాత్రం స్థానం ఉండకూడదు. ఫైనాన్షియల్ రంగ ప్రధాన లక్ష్యంలో ఈ అంశం ఉండాలి. ►ఫైనాన్షియల్ రంగంలో కార్పొరేట్ పాలనా విధానం కూడా మెరుగుపడాలి. ఇది అధిక నాణ్యత కలిగిన రుణ మంజూరీలకు దోహదపడుతుంది. సీనియర్ మేనేజ్మెంట్కు ప్రోత్సాహకాలకు రుణ నాణ్యత ప్రాతిపదికగా ఉండాలి. దివాలా చట్రంలో 4000 కంపెనీలు: సాహూ కార్యక్రమంలో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎంఎస్ సాహూ మాట్లాడుతూ, దివాలా చట్రంలో ప్రస్తుతం 4,000 కంపెనీలు ఉన్నాయన్నారు. ఇందులో 2,000 కంపెనీలకు సంబంధించి దివాల ప్రక్రియ పూర్తయినట్లు వివరించారు. ఇందుకు సంబంధించి ఆయా కంపెనీల విలువ లిక్విడేషన్ కన్నా అధికంగా ఉందనీ తెలిపారు. కొన్ని కంపెనీల విషయంలో విలువలు లిక్విడేషన్ వ్యాలూకన్నా 300 శాతం వరకూ అధికంగా ఉన్నట్లు వెల్లడించారు. -
నిర్భయ తల్లి ఆశాదేవి ఆ నిర్ణయం తీసుకుంటారా?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ నిర్భయ తల్లి ఆశాదేవికి ఆసక్తికరమైన విన్నపాన్ని చేశారు. ఏడేళ్ల క్రితం తన కుమార్తె (నిర్భయ)పై సామూహిక హత్య చారం చేసిన వారిని క్షమించాలని ఆమె కోరారు. ఈ విషయంలో ఆమె పెద్దమనసు చేసుకోవాలని ఇందిరా విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగాఈ విషయంలో కాంగ్రెస్ అధినేత్రి, రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీని ఉదాహరణగా తీసుకోవాలని కోరారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీని మానవబాంబు ద్వారా హత్య చేసిన కేసులోనళినిని సోనియా క్షమించినట్టుగానే, నలుగురు దోషులకు కూడా ఆశాదేవి క్షమాభిక్ష పెట్టాలని కోరుతున్నామని జైసింగ్ ట్వీట్ చేశారు. తన కుమార్తె మరణాన్ని రాజకీయం చేస్తున్నారన్న ఆశాదేవి ఆవేదనకు పూర్తి మద్దతు తెలిపిన ఇందిరా మరణశిక్ష వద్దు.. ఉరి శిక్షలకు తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా రాజకీయాల్లోకి ప్రవేశించనున్నరాన్నవార్తలపై ఆశాదేవి తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా కోర్టులు, ప్రభుత్వంపై ఆమె ధ్వజమెత్తారు. అలాగే 2012లో నిర్భయ హత్యాకాండకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి, మహిళల భద్రత కోసం నినాదాలు చేసిన వ్యక్తులే, రాజకీయ ప్రయోజనం కోసం తన కుమార్తె మరణాన్ని వాడు కుంటున్నారని విమర్శించారు. తమ స్వార్థ రాజకీయ లాభాల కోసమే ఉరిశిక్ష అమలును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అయితే గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా మహిళలపై హింసకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించేలా చూడాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు దోషులను ఉరితీసే వరకు తనకు మనశ్శాంతి లేదంటూ కంట తడిపెట్టారు. ఈ నేపథ్యంలో ఇందిరాజైసింగ్ అభ్యర్థనను, ఆశాదేవి అంగీకరిస్తారా అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏం నేరమూ చేయని తన కుమార్తెను అతికిరాతంగా హత్య చేసిన వారికి మరణ శిక్షే న్యాయమంటూ.. ఏడేళ్లుగా అలుపెరుగని పోరాటం చేసిన ఆమె ఇపుడు హంతకులను క్షమిస్తారా? పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి, క్షమించడమనే ఉదాత్తమైన నిర్ణయం తీసుకుంటారా... లేదంటే..దేశవ్యాప్తంగా ఎందరో ఆడబిడ్డల కన్నతల్లులకు తీరని కడుపుశోకాన్ని మిగిల్చుతున్న వారికి ఇదే న్యాయమంటారా? వేచి చూడాలి కాగా 2012 డిసెంబర్ 16 రాత్రి దేశ రాజధానిలో కదిలే బస్సులో 23 ఏళ్ల నిర్భయపై సామూహిత్య హత్యాచారానికి పాల్పడిన కేసులో వినయ్, అక్షయ్, పవన్, ముకేశ్ అనే నలుగురు దోషులుగా (ఒక దోషి జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో దోషి మైనర్ కావడంతో శిక్షనుంచి మ తప్పించుకున్నాడు) నిర్దారించారు. సుదీర్ఘ విచారణ, న్యాయపరంగా అన్ని అడ్డంకులను అధిమించిన అనంతరం ఫిబ్రవరి 1 న ఉదయం 6 గంటలకు వారిని ఉరి తీయనున్న సంగతి తెలిసిందే. చదవండి : ఫిబ్రవరి 1న ఉరిశిక్ష అమలు నిర్భయ దోషుల ఉరి : కొత్త ట్విస్టు చావును వాడుకోకండి.. నిర్భయ తల్లి కన్నీటి పర్యంతం While I fully identify with the pain of Asha Devi I urge her to follow the example of Sonia Gandhi who forgave Nalini and said she didn’t not want the death penalty for her . We are with you but against death penalty. https://t.co/VkWNIbiaJp — Indira Jaising (@IJaising) January 17, 2020 -
ధర్మభిక్షానికి భారతరత్న ఇవ్వాలి
సంస్థాన్‌నారాయణపురం: స్వాతంత్య్ర సమర యోధుడు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షానికి కేంద్రం భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్మభిక్షం విగ్రహాన్ని శుక్రవారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన జీవిత చరిత్రను పాఠ్యంశాలుగా చేర్చడానికి, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రధాన పట్టణాలలో ధర్మభిక్షం విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో గీత కార్మికుల సంక్షేమానికి నీరా పాలసీ తీసుకొచ్చామన్నారు. కార్మికులు ప్రమాదం జరిగి మృతి చెందితే రూ.5 లక్షల పరిహారం, గాయాలైతే రూ.10 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. కుల వృత్తుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్, గీత పనివారల సంఘం రాష్ట్ర ఆధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.32వేలను దాటేసిన బంగారం
-
ఆయనకు సమన్లు జారీ చేయండి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సమన్లు జారీ చేయాలని జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా ఓ పిటిషన్ లో కోరుతున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మన్మోహన్సింగ్ సహా, మరో ఇద్దరికి సమన్లు జారీ చేయాలని మధుకోడా తన పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై తదుపరి విచారణ ఆగస్టు 28 న జరగనుంది. బొగ్గ క్షేత్రాల అక్రమ కేటాయింపుల కేసులో కాంగ్రెస్ నాయకుడు నవీన్ జిందాల్, మధు కోడా, కేంద్ర మాజీ సహాయమంత్రి దాసరి నారాయణరావు, మాజీ కోల్ సెక్రటరీ హెచ్‌సీ గుప్తా తదితరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిపై చార్జ్‌షీట్ కూడా నమోదైంది. అయితే మధుకోడా సహా 8 మంది నిందితులకు ప్రత్యేకకోర్టు ఇటీవలే బెయిల్ మంజూరుచేసింది. ప్రైవేటు సంస్థలకు బొగ్గు బ్లాక్‌ల కేటాయింపులో మధుకోడా సహా, మిగిలిన నిందితులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని కోర్టు పేర్కొంది. కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మన్మోహన్ సింగ్ తన అభిప్రాయాలను కోర్టు ముందుంచిన సంగతి తెలిసిందే. -
రాష్ట్ర ప్రజలకు వైఎస్ విజయమ్మ లేఖ