పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు నేపథ్యంలో జరిగిన అల్లర్లు, హింసాకాండలో మహిళా కార్యకర్తలు, మద్దతుదారులు అరెస్టయ్యిన సంగతి తెలిసిందే. వారిపై అత్యాచారం వంటి అకృత్యాలు జరిగనట్లు ఇమ్రాన్ ఆరోపించడమే గాక దీన్ని సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఐతే పాక్ అంతర్గత మంత్రి పీటీఐ సభ్యులు బూటకపు ఎన్‌కౌంటర్, అత్యాచార ఘటనకు సంబంధించి కుట్రను బహిర్గతం చేసే కాల్‌ను ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు అడ్డుకున్నాయని విలేకరులు సమావేశంలో పేర్కొన్నారు. ఆ తదనంతరమే పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆయా కాల్స్‌లో.. మంత్రి సనావుల్లా పీటీఐ కార్యకర్తల ఇంటిపై దాడి చేసి కాల్పు జరిపే పథకం ఉందని, ఫలితంగా ఫ్రాణం నష్టం జరిగి ప్రపంచానికి మానవహక్కుల ఉల్లంఘన జరిగినట్లు చిత్రీకరిస్తుందని పేర్కొన్నారు. అలాగే అత్యాచారాలు అనేది రెండవ ప్రణాళికలో భాగం అని, పీటీఐకి వ్యతిరేకంగా జరిగిన అన్యాయన్ని ప్రచారం చేయడానికి గ్లోబల్ మీడియా సంస్థలతో భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్న పార్టీ మహిళ కార్యకర్తలకు ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎలాంటి చికిత్స అందిస్తున్నారని ప్రశ్నించారు. మహిళా కార్యకర్తలను బంధించి జైల్లో పడేసిన విధానం బాధించింది. అక్కడ వారిపై అత్యాచారాలు జరిగడంతో చికిత్స పొదుతున్నట్లు విన్నామని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనల గురించి వివిధ ప్రాంతాల నుంచి నివేదికలు వస్తున్నట్లు పేర్కొన్నారు. అందువల్ల సుప్రీం కోర్టు దయనీయ స్థితిలో ఉన్న మహిళ కార్శికుల గురించి దర్యాప్తు చేయాలని కోరారు ఇమ్రాన్ ఖాన్.
(చదవండి: Imran Khan PTI Party: పాకిస్తాన్‌లో సంచలనం.. ఇమ్రాన్‌కు ఊహించని షాక్!)
Comments
Please login to add a commentAdd a comment