'Don't wait for me': Fugitive Chinese killer caught after 30 years urges wife to remarry - Sakshi
Sakshi News home page

నా కోసం ఎదురు చూడొద్దు!.. మళ్లీ పెళ్లి చేసుకో: ఓ నేరస్తుడి భావోద్వేగ సందేశం

Published Tue, Jul 11 2023 5:03 PM | Last Updated on Wed, Jul 12 2023 2:51 PM

Remarry Dont Wait For Me Arrested Chinese Killer Urges His Wife - Sakshi

ఓ వ్యక్తి 30 ఏళ్ల క్రితం చేసిన నేరానికి ఇటీవలే పోలీసులకు పట్టుబడతాడు. దీంతో అతను జైలుకి వెళ్తూ.. భార్యను మళ్లీ పెళ్లి చేసుకో, నా కోసం ఎదురు చూడకు అని భావోద్వేగంగా చెబుతాడు. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింత తెగ వైరల్‌గా మారింది. 

వివరాల్లోకెళ్తే..'జౌ' అనే చైనా వ్యక్తి 1993లో సెంట్రల్‌ హుబీ ప్రావిన్స్‌లో తన ముగ్గురి స్నేహితులతో కలసి ఒక వ్యక్తిని హత్య చేశాడు. ఆ ఘటన జరిగిన వెంటనే అతడి స్నేహితులు అరెస్టు అయ్యారు. కానీ జౌ మాత్రం పోలీసులకు పట్టుబడలేదు. గత నెలాఖరు వరకు పరారీలోనే ఉన్నాడు. ఇటీవలే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తాను జైలుకి వెళ్లడం ఖాయమని తెలిసిన జౌ తన భార్యతో భావోద్వేగంగా మాట్లాడతాడు. తనకు విడాకులు ఇచ్చి మరోకర్ని పెళ్లి చేసుకోవాలని, తన కోసం ఎదురు చూడొద్దని వేడుకుంటాడు.

జైలుకి వెళ్తూ వెళ్తూ..ఆమెని కౌగిలించుకంటూ తన కోసం ఎదురు చూడొద్దని కన్నీళ్లు పెట్టుకుంటాడు. తమ రిలేషన్‌ ఇక్కడతో ముగిసిపోయింది. మీ అక్కకి మరో పెళ్లి చేయండని తన మరదలికి కూడా చెబుతాడు. తానెప్పటికీ జైలు నుంచి విడుదలకాలేనని కన్నీటిపర్యంతమవుతాడు. దీంతో ఔ భార్య ఇక మాట్లాడొద్దు అంటూ తన చేతిని జౌ నోటికి అడ్డం పెడుతుంది. అలా మాట్లాడొద్దు. అందుకు తాను ఒప్పుకోనని భార్య తెగేసి చెబుతుంది. ఆ ఘటన అక్కడ ఉన్నవాళ్లందర్నీ కదిలించింది.

ఇక నేరస్తుడు జౌ కూడా తాను 30 ఏళ్ల క్రితం చేసిన నేరానికి ఇప్పడు అరెస్టు కావడం తననెంతో బాధించిందన్నాడు. తాను చేసిన నేరానికి చాలా పశ్చాత్తాప పడుతున్నానంటూ బావురమన్నాడు. తాను యువకుడిగా ఉన్నప్పుడు ఆ నేరం చేశానని, ఐనా తాను అప్పడు అలా చేసి ఉండకూడదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

(చదవండి: ఆ ఎమోజీని ఉపయోగించినందుకు..రైతుకి రూ. 50 లక్షలు జరిమానా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement