విడాకులివ్వడం ఇష్టం లేని ఓ వ్యక్తి.. భార్యను ఎత్తుకొని కోర్టు నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ విచిత్ర ఘటన చైనాలో జరిగింది. లీకి, చెన్‌కి 20 ఏళ్ల కిందట పెళ్లయ్యింది. వారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అయితే తాగొచ్చిన భార్యను లీ హింసిస్తున్నాడు. ఎంత చెప్పినా వినకపోవడం, భర్తలో ఎంతకీ మార్పు రాకపోవడంతో విడాకుల కోసం భార్య చెన్ కోర్టును ఆశ్రయించారు. గృహ హింస కింద కేసు పెట్టిన ఆమె విడాకులు ఇవ్వాలని కోర్టును కోరింది. అయితే పిల్లల పోషణ బాధ్యతల దృష్ట్యా సయోధ్య సాధ్యమని భావించిన కోర్టు తొలుత విడాకులకు నిరాకరించింది. అయినా భర్త మారకపోవడంతో చెన్ మళ్లీ కోర్టును ఆశ్రయించారు
విచారణకు వచ్చిన భార్యను ఎత్తుకుని కోర్టు హాల్ నుంచి లీ పారిపోయాడు. కోర్టు న్యాయాధికారులు వెంటనే జోక్యం చేసుకుని లీని మందలించారు. దీంతో లీ సెప్టెంబర్ 2న రెండో తేదీన కోర్టుకు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాడు. మళ్లీ అలాంటి తప్పు చేయబోనని ప్రతిజ్ఞ చేశాడు. ‘విడాకులు ఇస్తున్నారని పొరపడ్డా. అందుకే ఆందోళనకు గురై భార్యను ఎత్తుకెళ్లా’’అని క్షమాపణ పత్రంలో రాశారు.
ఎక్కడ దూరమైపోతుందోనని భర్త పడ్డ ఆవేదన చూసి భార్య మనసు కాస్తంత కరిగింది. ఇకనైనా మారతాడేమో చూద్దామని ఆయనకు మరో అవకాశం వచి్చంది. దీంతో ఈ జంటకు విడాకులు మంజూరుకాలేదు. మరోవైపు చైనాలో గృహ హింస పెద్ద సమస్యగా ఉంది. ఆల్–చైనా ఉమెన్స్ ఫెడరేషన్ ప్రకారం వివాహిత మహిళల్లో 30 శాతం గృహ హింసను ఎదుర్కొంటున్నారు. 60శాతం మంది మహిళల ఆత్మహత్యలకు గృహ హింసే కారణం. ‘జడ్జీలు, పోలీసుల ముందే కోర్టు నుంచి ఎత్తుకెళ్లిన వ్యక్తి.. ఒంటరిగా ఉన్నపుడు భార్యను ఎంతైనా హింసిస్తాడు’అని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment