పదే పది నిమిషాలు.. "ఇదెక్కడి టార్చర్ భయ్యా..!" | Puneet Khurana and Manika Pahwa CCTV video viral on social media | Sakshi
Sakshi News home page

పదే పది నిమిషాలు.. "ఇదెక్కడి టార్చర్ భయ్యా..!"

Published Thu, Jan 2 2025 10:01 PM | Last Updated on Thu, Jan 2 2025 10:01 PM

Puneet Khurana and Manika Pahwa CCTV video viral on social media

ఢిల్లీ : వ్యాపార వేత్త పునీత్‌ ఖురానా ఆత్మహత్య ఘటనలో సంచలన ఆడియో,వీడియో టేపులు వెలుగులోకి వచ్చాయి.  సీసీటీవీ ఫుటేజ్‌ వీడియోల్లో బ్రతికుండగానే భర్త పునీత్‌ ఖురానాకు భార్య మనీకా పహ్వా ఎలాంటి నరకం చూపించిందో స్పష్టంగా తెలుస్తోంది. ఇంట్లోనే భర్తకు ఎదురుగా కూర్చున్న పహ్వా చెప్పుకోలేని విధంగా బూతులు తిడుతున్న ఆడియో,వీడియో దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఢిల్లీలో ప్రముఖ వుడ్‌బాక్స్‌ కేఫ్‌ సహ వ్యవస్థాపకుడు పునీత్‌ ఖురానా(40) భార్య మనికా జగదీష్‌ పహ్వా వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

2016లో పునిత్‌కు,పహ్వాకు వివాహం జరిగింది. ఇద్దరు ఉడ్‌బాక్స్‌ కేఫ్‌, ఫర్‌గాడ్‌ కేక్‌ పేరుతో బేకరీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపారం జోరందుకుంది. అంతా సాఫిగా సాగుతున్న జీవితంలో మనస్పర్ధలు తలెత్తాయి.  దీంతో విడాకుల తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కోర్టు ద్వారా విడాకుల కోసం అప్లయ్‌ చేశారు.

 

పరస్పర అంగీకారంతో కోర్టు ఇద్దరికి విడాకులు ఇచ్చేందుకు అంగీకరించింది. నా డిమాండ్లను నెరవేరిస్తే విడాకులు ఇస్తానునని పహ్వా కోర్టుకు తెలిపింది. కోర్టు సైతం పహ్వా షరతులకు లోబడి ఆమె డిమాండ్లు నెరవేర్చాలని పూనిత్‌కు సూచించింది. అందుకు పునిత్‌ సైతం అంగీకరిస్తూ సంతకం కూడా చేశాడు. 180 రోజుల్లో కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది.

ఈలోగా భార్య,భర్తలు వ్యాపారాలు వేర్వేరుగా చేసుకుంటున్నారు. కానీ కోర్టు ఎదుట విధించిన షరతులు కాకుండా అంతకు మించి పహ్వా కుటుంబ సభ్యులు పునిత్‌ను వేధించడం మొదలు పెట్టారు. దీంతో తట్టుకోలేక  59 నిమిషాల వీడియోను రికార్డ్‌ చేసి డిసెంబరు 31న మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు. ఆ వీడియోలో తన భార్య పహ్వా, ఆమె కుటుంబసభ్యులు ఎంతలా వేధించారో చెప్పారు.

ఆ వీడియోలో ‘నా భార్య నా తాహతకు మించి డిమాండ్‌ చేస్తుంది. ఇప్పటికే ఐదు డిమాండ్లను నెరవేర్చా. లాయర్‌ ఫీజు కింద నెలకు రూ.70వేలు ఇచ్చా. అవి సరిపోలేదని మరో రూ.10లక్షలు ఇవ్వాలని భార్య,అత్తమామలు వేధిస్తున్నారు. ఇంకా డబ్బులు కావాలని నన్ను పీక్కుతింటున్నారు. ఇంతుకు మించి ఇవ్వలేను. డబ్బులు కావాలని నా తల్లిదండ్రులను అడగలేను ’ అని తెలిపారు.

పునీత్‌ ఖురానా ఆత్మహత్యపై డిసెంబరు 31న మధ్యాహ్నం 4:30 గంటలకు ఢిల్లీ  పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా పునీత్‌ ఖురానా ఇంట్లో సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చాయి. ఆ ఫుటేజీలు ఎప్పటివి అనేది తెలియాల్సి ఉండగా భార్య మనికా జగదీష్‌ పహ్వా భర్త పునీత్‌ ఖురానాను బ్రతికి ఉండగానే ఎంతటి నరకం చూపించిందో తెలుస్తోంది.

ఆ సీసీటీవీ ఆడియో,వీడియో ఫుటేజీలో ఓ పది నిమిషాలు సమయం నీకు ఇస్తున్నా అంటూ   ‘ఓ బిచ్చగాడ. నువ్వు ఏమి అడిగావో చెప్పు. నీ మొహం చూడటం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు నా ముందుకు వచ్చావనుకో నీ రెండు చెంపలు వాయిస్తా. ఏంటి నీకు విడాకులు కావాలి. నన్ను వ్యాపారం చేసుకోనివ్వవా?అంటూ భర్తను,అతని కుటుంబ సభ్యుల్ని అనరాని మాటలు అన్నది. అయినా సరే ఇవన్నీ పర్వాలేదు. నీకేం కావాలో చెప్పు’ అని భర్త బదులివ్వడం గమనించవచ్చు. వాటి ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement