
ముంబై : వాళ్లిద్దరూ భార్యా, భర్తలు. అయితే, భర్త తనని వేధిస్తున్నాడని ఆరోపిస్తూ భార్య కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు విడాకులు కావాలని కోరింది. ఈ కేసుపై కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సమయంలో న్యాయమూర్తికి, మహిళకు మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పూణేకు చెందిన అంకుర్ ఆర్ జగిధర్ లాయర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా, ఓ మహిళ తన భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ తనని సంప్రదించిందని, అందుకే ఆమె తరుఫున వాదిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా తన క్లయింట్ కేసు పూణే జిల్లా కోర్టులో విచారణకు వచ్చిందని, విచారణ సమయంలో న్యాయమూర్తితో జరిగిన వాదనలను భార్య తరుఫు లాయర్ లింక్డిన్‌లో పోస్ట్ చేశారు.
ఆ పోస్టులో పూణే జిల్లా కోర్టులో ‘‘నా క్లయింట్ విడాకుల కేసు విచారణ జరిగింది. విచారణలో భర్త తన డిమాండ్లను నెరవేర్చాలని కోర్టును కోరింది. అయితే, ఈ కేసు విచారిస్తున్న న్యాయమూర్తి నా క్లయింట్‌ను ఇలా ప్రశ్నించారు.
‘‘ఏమ్మా.. మిమ్మల్ని చూస్తుంటే మొడలో మంగళసూత్రం, నుదుట బొట్టు పెట్టుకునేవారిలా కనిపించడం లేదే? వివాహం జరిగిన స్త్రీగా మీరు కనిపించకపోతే.. మీ వారు.. మిమ్మల్ని ఎలా ఇష్టపడతారు? అందుకే భర్తలతో ప్రేమగా ఉండండి. కఠువగా ఉండకండి అని సలహా ఇచ్చారు.
అంతేకాదు.. మాటల మధ్యలో న్యాయమూర్తి ఇలా అన్నారు. ‘‘ఒక స్త్రీ బాగా సంపాదిస్తే, ఆమె ఎప్పుడూ తనకంటే ఎక్కువ సంపాదిస్తున్న భర్తనే కోరుకుంటుంది. తక్కువ సంపాదిస్తున్న వ్యక్తి చాల్లే అని సరిపెట్టుకోదు. అదే బాగా సంపాదించే వ్యక్తి తాను వివాహం చేసుకోవాలనుకుంటే, తన ఇంట్లో పాత్రలు కడిగే పనిమనిషినైనా సరే వివాహం చేసుకోవాలనుకుంటాడు. కాబట్టి మీరు మీ భర్త పట్ల కాస్త ప్రేమను చూపించండి. కఠినంగా ఉండొద్దు అని ఇద్దరు దంపతుల్ని ఒక్కటి చేసే ప్రయత్నం చేశారని వివరిస్తూ’’ సదరు న్యాయవాది రాసిన సోషల్ మీడియా పోస్టు నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment