wait
-
చలికాలంలో బరువు పెరుగుతారెందుకు? అదుపులో ఉండేందుకు ఏం చేయాలి?
చలి వాతావరణంలో మన ఆహారపు అలవాట్లు మారుతుంటాయి. శీతాకాలంలో మనం వేడిగా ఉండే ఆహారపదార్థాలను అధికంగా తీసుకుంటుంటాం. ఫలితంగా శరీర బరువు పెరగడం మొదలవుతుంది. ఇది కొందరిలో ఆందోళనకు దారితీస్తుంది. అయితే చలికాలంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం, నియమాలను పాటించడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. చలికాలంలో బరువు పెరగడానికి కారణాలేమిటో, ఏ విధంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.అదనపు కేలరీల తీసుకోవడంచలికాలంలో మనం ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటుంటాం. అతిగా టీ, కాఫీలు తాగడం, తీపి పదార్థాలు ఎక్కువగా తినడం మొదలైనవన్నీ బరువు పెరగడానికి కారణంగా నిలుస్తాయి. శీతాకాలంలో శరీరంలోని జీవక్రియ మందగిస్తుంది. ఫలితంగొ కొద్ది కేలరీలు మాత్రమే బర్న్ అవుతాయి.వ్యాయామం చేయకపోవడంచలికాలంలో చాలామంది వెచ్చగా పడుకోవాలని అనుకుంటారు. దీంతో రోజువారీ వ్యాయామాన్ని ఆపివేస్తారు. ఫలితంగా బరువు పెరగడం ప్రారంభమవుతుంది. దీనిని నివారించేందుకు వ్యాయామంపై దృష్టి పెట్టాలి.ప్రోటీన్ తీసుకోవడం ముఖ్యంఆహారంలో ప్రోటీన్ ఉండటం ముఖ్యం. ప్రొటీన్ వినియోగం జీవక్రియను పెంచుతుంది. కండరాలను నిర్మించడంలో కూడా సహాయపడుతుంది. పప్పులు, చేపలు, గుడ్లు, జున్ను ఇలా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.చక్కెర- ఉప్పు తగ్గించండిచలికాలంలో తీపిని ఎక్కువగా తినడం కూడా బరువు పెరగడానికి కారణంగా నిలుస్తుంది. అదనంగా తీసుకునే ఉప్పు కూడా బరువు పెరగడానికి కారణంగా నిలుస్తుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీరు చేరి బరువు పెరుగుతారు.ఫైబర్ కలిగిన ఆహారం ఉత్తమంపండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మొదలైన ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను శీతాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ఫలితంగా కడుపు చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది. బరువు పెరిగేందుకు అవకాశమివ్వదు.తాగునీరు- సూప్చలికాలంలో నీరు ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఆకలి తగ్గుతుంది. అలాగే చలికాలంలో వేడి వేడి సూప్ తాగడం మంచిది. తక్కువ కేలరీలు కలిగిన కూరగాయల సూప్ లేదా చికెన్ సూప్ తీసుకోవచ్చు.వ్యాయామం చేయండిచలికాలంలో వ్యాయామంపై తగిన శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కేలరీలను బర్న్ చేయవచ్చు. బరువు తగ్గవచ్చు.ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు శీతాకాలంలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు తీసుకోవాలి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఈ తరహా కొవ్వులు అసంతృప్తమైనవి. ఫలితంగా గుండెకు కూడా మేలు కలుగుతుంది. ఆలివ్ ఆయిల్, అవకాడో, గింజధాన్యాలను తీసుకోవడం ఉత్తమం.ఇది కూడా చదవండి: నేడు గీతా జయంతి: రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్ వందేళ్ల ఘన చరిత్ర -
45 కిలోల భారీ ఆకారంలో.. బుజ్జి కుక్క పిల్ల!
‘పెంపుడు కుక్క పిల్ల’.. అనగానే ముద్దుగా మన కాళ్లకు అడ్డుపడే బుజ్జి కుక్కపిల్ల మనకు గుర్తుకువస్తుంది. అయితే దీనికి భిన్నంగా 45 కిలోల బరువైన భారీ కుక్క పిల్లను మీరు ఎప్పుడైనా చూశారా? దాని ఆకారం చూసి కూడా దానిని ఒడిలోకి తీసుకుని దాని యజమాని మురిసిపోతుంటాడు. ఆరడుగుల పొడవు, దాదాపు 45 కేజీల బరువున్న ఈ బుల్ డాగ్ పేరు రోల్ఫ్. భారీ ఆకారం ఉన్నప్పటికీ అది బుజ్జి కుక్క పిల్ల మాదిరిగానే ప్రవర్తిస్తుంటుంది. దాని యజమాని క్రెయిగ్ కూడా దానిని ఒడిలో పెట్టుకుని మురిసిపోతుంటాడు. దాని చేష్టలు చూసి, దీనికి ఇంకా చిన్నతనం పోలేదని అందరికీ చెబుతుంటాడు. క్రెయిగ్ కొన్నేళ్ల క్రితం స్ట్రోక్‌తో నడవలేకపోయేవాడు. అదే సమయంలో రోల్ఫ్ను ఇంటికి తీసుకువచ్చాడు. రోల్ఫ్ రాకతో తన జీవితమే మారిపోయిందని. క్రెయిగ్ చెప్పాడు. రోల్ఫ్ అతని జీవితాన్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకువచ్చేందుకు సహాయపడిందట. తాను అనారోగ్యం నుంచి కోలుకున్నానంటే దానికి రోల్ఫ్ కారణమని క్రెయిగ్ చెబుతుంటాడు. సాధారణంగా శునకాలు వయసే పెరిగేకొద్దీ తమ చేష్టలను తగ్గిస్తుంటాయి. అదే సమయంలో తమ యజమానిపై ప్రేమను కురిపిస్తాయి. అయితే రోల్ఫ్ విషయంలో దాని వయసు, ఆకారం పెరిగినా అది పిల్ల చేష్టలను ఇంకా మానలేదట. -
టాప్-5 డైట్ ప్లాన్స్... 2023లో ఇలా బరువు తగ్గారట!
2023లో కొన్ని డైట్ ప్లాన్లు వార్తల్లో నిలిచాయి. వీటిలో వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రయోజనకరంగా ఉండే డైట్ ప్లాన్ కూడా ఉంది. ఆ వివరాలతో పాటు 2023లో చర్చకు వచ్చిన టాప్-5 డైట్ ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. మెడిటేరియన్ డైట్ 2023లో మెడిటేరియన్ డైట్ అధికంగా చర్చల్లోకి వచ్చింది. చాలా మంది దీనిని అనుసరించారు. ఈ డైట్ ప్లాన్‌లో వారానికోసారి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాల్సి ఉంటుంది. చక్కెర, కొవ్వు పదారార్థాలు తీసుకోకూడదు. గుండెపోటు, స్ట్రోక్, టైప్ -2 డయాబెటిస్ బాధితులు వైద్యుల సూచనల మేరకు ఈ ప్లాన్ అనుసరించారు. 2. వెయిట్ వాచర్స్ రెసిపీ డైట్ వెయిట్ వాచర్స్ రెసిపీలో వేగంగా బరువు తగ్గడంలో సహాయపడే అనేక అంశాలు ఉన్నాయి. బరువు తగ్గడంలో సహాయపడే ఆహార ప్రణాళిక దీనిలో ఉంది. దీనిలో రెండు ఫార్ములాలు ఉన్నాయి. మొదటి ఫార్ములాలో ఆహారంలో నూనె పదార్థాలకు దూరంగా ఉండటం. రెండవ ఫార్ములా.. అధిక కేలరీలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండటం. అలాగే కార్బోహైడ్రేట్లు వీలైనంత తక్కువగా తీసుకోవడం. 3. కీటో డైట్ కీటో డైట్లో తక్కువ కార్బ్, తక్కువ కొవ్వు పదార్ధాల వినియోగంపై దృష్టి పెట్టాలి. కీటో డైట్ ద్వారా కొన్ని వారాల్లోనే వేగంగా బరువు తగ్గవచ్చు. వైద్యులు పర్యవేక్షణలో ఈ డైట్‌ని ఎంచుకోవాలి. ఎందుకంటే దీనిని దీర్ఘకాలం పాటు ఫాలో చేస్తే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. 4. డాష్ డైట్ డాష్ డైట్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని చెబుతారు. డాష్ అంటే హైపర్‌టెన్షన్‌ను నియంత్రించడానికి ఉపయోగపడే డైట్ ప్లాన్. ఇది అధిక రక్తపోటు నియంత్రణకు రూపొందించిన ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక. హృద్రోగులు దీనిని పాటిస్తుంటారు. 5. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే అడపాదడపా ఉపవాసం. ప్రతిరోజూ కొంత సమయం లేదా వారంలో ఒకరోజు ఏమీ తినకుండా ఉండటం. అడపాదడపా ఉపవాసంలో ప్రతిరోజూ కొన్ని గంటల పాటు ఏమీ తినకుండా ఉండాలి. లేదా వారంలో ఒక రోజు ఉపవాసం చేసి, మరుసటి రోజు తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి. ఈ ఐదు డైట్ ప్లాన్లు 2023లో అత్యంత ఆదరణ పొందాయి. ఇది కూడా చదవండి: గ్యాస్ చాంబర్‌గా రాజధాని.. కనిపించని సూర్యుడు! -
375 ఏళ్లకు బయటపడిన 8 వ ఖండం ఏది?
మనిషి భూమి నలుచెరగులా తిరిగాడని, ఇక చూడాల్సినది ఏమీ లేదని అనుకుంటే అది తప్పే అవుతుంది. నేటికీ భూమిపై అన్వేషించేందుకు చాలా రహస్యాలు దాగివున్నాయి. 375 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇటీవలే శాస్త్రవేత్తలు భూమికి గల 8వ ఖండం అయిన జిలాండియాను కనుగొన్నారు. ఈ ఖండం చాలా పెద్దది. పలు చిన్న దేశాలకు ఇందులో వసతి కల్పించవచ్చు. ఈ ఖండానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ఏళ్లుగా దాగున్న ఖండం అని చెబుతారు. 2017 సంవత్సరం వరకు ఈ ఖండం గురించి ఎవరికీ తెలియదు. అయితే ఈ ఏడాది కొందరు శాస్త్రవేత్తలు దీని గురించి ప్రస్తావించడంతో ప్రపంచం దృష్టి ఈ ఖండంవైపు మళ్లింది. ఈ 8వ ఖండం 49 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని పలు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. దీని ఉనికి విషయానికొస్తే ఈ ఖండం దాదాపు 55 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఖండంలోని 94 శాతం భూభాగం నీటిలో మునిగిపోయింది. 6 శాతం భూమి మాత్రమే అందుబాటులో ఉంది. ఇది న్యూజిలాండ్ మాదిరిగా కనిపిస్తుంది. ఈ ఖండం చాలా ప్రత్యేకమైనది. అగ్నిపర్వత శిలలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కనిపించే జంతువులు, జీవులు ప్రపంచంలోని ఇతర జీవులకు భిన్నంగా కనిపిస్తాయి. ఈ ఖండంలో దాగున్న రహస్యాలను వెలికితీసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: భారత్‌లో ఆఫ్ఘన్ ఎంబసీ మూసివేత! -
21 కి.మీ. పరిగెత్తితే 11 కిలోలు తగ్గుతారా?.. దీనిలో నిజమెంత?
శరీర బరువును తగ్గించడంలో రన్నింగ్ సహాయపడుతుందని ఫిట్నెస్ నిపుణులు చెప్పడాన్ని మీరు వినే ఉంటారు. అయితే ఒక వ్యక్తి కేవలం 21 కిలోమీటర్ల రన్నింగ్ ద్వారా తన శరీర బరువును 11 కిలోలు తగ్గించుకున్నాడనే సంగతి మీకు తెలుసా? ఇటీవల రష్యాలోని రిపబ్లిక్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక వృద్ధుడు రన్నింగ్ ద్వారా 11 కిలోల బరువు తగ్గాడు. ఇందుకోసం ఆ వృద్ధుడు 2 గంటల 50 నిముషాలు పరిగెత్తాడు. అయితే వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజానిజాలేమిటో ధృవీకరణ కాలేదు. రష్యన్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌లో ఉంటున్న 69 ఏళ్ల బహామా ఎగుబోవ్ పేరు 2019లో రష్యన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది. అప్పుడు బహామా 5 గంటల పాటు పరిగెత్తి, 9 కిలోలకుపైగా బరువు తగ్గాడు. తాజాగా బహామా ఎగుబోవ్ 21 కిలోమీటర్ల రేసులో పరుగు తీసి, కేవలం రెండున్నర గంటల్లోనే 11 కిలోల బరువు తగ్గాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఫీట్లో బహామా ఎగుబోవ్ పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు కాలేదు. ఎందుకంటే శరీరానికి హాని కలిగించే ఇలాంటి విజయాన్ని రికార్డ్‌గా పరిగణించరు. త్వరగా బరువు తగ్గేందుకు ప్రయోగాలు చేయడం ప్రాణాంతకం కావచ్చని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత వేగంగా బరువు తగ్గిన వ్యక్తి ని తానేనని బహామా ఎగుబోవ్ చెబుతున్నాడు. ఆడిటీ సెంట్రల్ న్యూస్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం బహామా.. జూడో, సాంబో, గ్రీకో-రోమన్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో ప్రావీణ్యం సాధించాడు. బహామా ఒకప్పుడు యుద్ధాల్లో పాల్గొన్న సమయంలో బరువు తగ్గించే కళను నేర్చుకున్నాడు. తాను తన చిన్నతనంలో యుద్ధాల కోసం 17 కిలోల బరువును తగ్గానని బహామా తెలిపాడు. అయితే వృద్ధాప్యంలో బరువు తగ్గడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. అయినా తాను ఈ ఘనత సాధించానని పేర్కొన్నాడు. పోషకాహార నిపుణుడు ఒక్సానా లైసెంకో మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా రెండు గంటల్లో 11 కిలోల బరువు తగ్గాలంటే, శరీరం నుండి తగినంత ద్రవాన్ని తొలగించాలి. ఇది బహామా ఎగుబోవ్ విషయంలో నిస్సందేహంగా జరిగింది. అయితే సాధారణ వ్యక్తి ఇలాంటి ప్రయోగాలు చేయకూడదని ఆయన హెచ్చరించారు. ఇది కూడా చదవండి: భారత్- కెనడాల మధ్య చిచ్చుపెడుతున్న గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరు? -
World’s fattest kids: బాల భీములు పెద్దోళ్లయిపోయారు.. ఇప్పుడు ఉన్నారిలా..
ఏ వయసువారికైనా స్థూలకాయమనేది పెద్ద సమస్యే. చిన్న వయసులోనే ఊబకాయం బారిన పడినవారు వయసు పెరిగేకొద్దీ అనేక సమస్యలను ఎదుర్కొంటారు. చిన్న వయసు కారణంగా వారు ఆహారం తినడాన్ని నియంత్రించుకోలేకపోతారు. ఫిజికల్ యాక్టివిటీకి కూడా దూరంగా ఉంటారు. ప్రపంచంలో ఇలాంటి చిన్నారులు చాలామంది ఉన్నారు. వీరిలో కొందరు పెద్దయ్యాక ఊహకందనంతగా మారిపోయారు. మరి కొందరు మరింత బరువు పెరిగారు. 1 అరియా పెర్మానా ఇండోనేషియాకు చెందిన అరియా పెర్మానా కొన్నేళ్ల క్రితం 200 కిలోల బరువుతో ప్రపంచంలోనే అత్యంత స్థూలకాయుడైన పిల్లాడిగా గుర్తింపు పొందాడు. అయితే ఇప్పుడు అరియా పెర్మానా ఊహించనంతగా మారిపోయాడు. కొన్నేళ్ల క్రితమే అరియా పెర్మానా 120 కిలోల బరువు తగ్గాడు. అరియా రోజంతా వీడియో గేమ్స్ ఆడుతూ ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఇన్స్టెంట్ నూడుల్స్, ఫ్రైడ్ చికెన్ తినేవాడు. అలాగే విపరీతంగా కూల్‌డ్రింక్స్ తాగేవాడు. దీంతో అరియా విపరీతంగా బరువు పెరిగిపోయాడు. అయితే 2017 ఏప్రిల్‌లో అరియాకు బేరియాట్రిక్ సర్జరీ జరిగింది. ఇంత చిన్న వయసులో బేరియాట్రిక్ సర్జరీ జరిగిన బాలునిగా అరియా పేరొందాడు. 2 ఆండ్రస్ మెరెనో ఆండ్రస్ మెరెనో పుట్టుకతోనే 5.8 కిలోల బరువు కలిగివున్నాడు. మెక్సికోకు చెందిన ఆండ్రస్ 10 ఏళ్ల వయసుకే 118 కిలోల బరువు పెరిగాడు. 20 ఏళ్ల వయసులో ఆండ్రస్ పోలీసుశాఖలో చేరాడు. అయితే బరువు పెరిగిన కారణంగా కూర్చొనేందుకు కూడా ఇబ్బంది పడేవాడు. కొన్నేళ్ల వ్యవధిలోనే అతని బరువు 444 కిలోలకు చేరుకుంది. 2015లో అతని ఉదరానికి బైపాస్ సర్జరీ జరిగింది. దీంతో అతను స్వయంగా లేని నిలబడగలిగాడు. అయితే కొంతకాలం తరువాత ఒక క్రిస్మస్ రోజున 6 కూల్ డ్రింక్స్ తాగాడు. దీంతో ఆరోగ్యం విషమించింది. 38 ఏళ్ల వయసులోనే కన్నుమూశాడు. 3 కత్రీనా రైఫార్డ్ ఫ్లోరిడాకు చెందిన కత్రీనా రైఫార్డ్ ఒకప్పుడు ప్రపంచంలోనే స్థూలకాయురాలైన యువతిగా పేరొందింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు మిఠాయిలు, చాక్లెట్లలాంటి అధిక కేలరీలు కలిగిన పదార్థాలంటే ఇష్టమమని, వీటిని అధికంగా తినడం కారణంగానే బరువు పెరిగానని తెలిపారు. కత్రీనా 14 ఏళ్ల వయసుకే 203 కిలోల బరువు పెరిగింది. 21 ఏళ్ల వచ్చేనాటికి ఆమె 285 కిలోల బరువుకు చేరుకుంది. 2009లో ఆమెకు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ జరిగింది. దీంతో ఆమె బరువు 127 కిలోలకు చేరుకుంది. ప్రస్తుతం 47 ఏళ్ల వయసుకు చేరుకున్న కత్రీనా రైఫార్డ్ కాస్త ఫిట్నెస్తో కనిపిస్తుంది. ఇది కూడా చదవండి: మొసలి నోటికి చిక్కిన మహిళ.. గంట తర్వాత బయటపడిందిలా..! -
డేంజర్లో ఢిల్లీ.. కేజ్రీవాల్ కీలక ప్రకటన..
ఢిల్లీ: యమునా నది ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. బుధవారం రికార్డ్ స్థాయిని దాటిందని అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం 4 గంటల సమయంలో యమునా నది ఢిల్లీ ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ వద్ద 207 మీటర్ల మేర ప్రవహించింది. అదే.. సాయంత్రం 4 గంటలకు వచ్చేసరిగా మరో 0.71 పెరిగి 207.71గా నమోదైందని సెంట్రల్ వాటర్ కమీషన్(సీడబ్ల్యూసీ) తెలిపింది. దీంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు త్వరగా ఖాలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏ మాత్రం వేచి చూడరాదని తెలిపారు. నది ప్రవాహాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని పరిమిత స్థాయిలో విడుదల చేయాలని కేంద్ర హూం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. Arvind Kejriwal's SOS To Centre As Yamuna Flows At All-Time High https://t.co/sUT5bOloRM pic.twitter.com/YNjWK8z8lp — NDTV News feed (@ndtvfeed) July 12, 2023 యమునా నది బుధవారం రికార్డ్ స్థాయిని దాటిందని అధికారులు తెలిపారు. 1978 నాటి 207.49 మీటర్లను దాటింది. దీంతో సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు త్వరగా ఖాలీ చేయాలని కోరారు. యమునా నది ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతానికి దగ్గరగా ఉన్న వేల మందిని ఇప్పటికే పునరావాస ప్రాంతాల్లోకి తరలించామని తెలిపారు. నదీ సమీప ప్రాంతాల్లో రాకపోకలపై అధికారులు నిషేధాజ్ఞాలు జారీ చేశారు. "Beds Stacked Vertically": Desperation Kicks In As Water Enters Delhi Houses@Priyanshi50 reports pic.twitter.com/0VxpYdjZMg — NDTV (@ndtv) July 12, 2023 'దేశ రాజధానికి వరద సూచన ప్రపంచ దేశాలకు సరైన మెసేజ్‌ను ఇవ్వదు. ఢిల్లీ ప్రజలను కలిసి కాపాడదాం. ఈ రోజు రాత్రికి యమున నది 207.72కు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ తెలిపింది.' త్వరలో ఢిల్లీలో జీ-20 సమావేశం జరగనున్న నేపథ్యంలో యుమునా వరదను త్వరగా తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కేజ్రీవాల్ కోరారు. Central Water Commission predicts 207.72 meter water level in Yamuna tonite. Not good news for Delhi. There have been no rains in Delhi last 2 days, however, levels of Yamuna are rising due to abnormally high volumes of water being released by Haryana at Hathnikund barrage.… pic.twitter.com/3D0SI2eYUm — Arvind Kejriwal (@ArvindKejriwal) July 12, 2023 గత రెండు రోజులుగా ఢిల్లీలో వర్షం రాకపోయినా యమునా నది వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఢిల్లీకి పైన ఉన్న హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరఖండ్‌లో వర్షాల కారణంగా వరద యమునకు పోటెత్తుతోంది. ఢిల్లీ పైన ఉన్న హర్యానాలోని హత్నీకుండ్ డ్యామ్ నుంచి నీటిని అధికంగా విడుదల చేయడం వల్ల యుమున నది ప్రవాహం పెరుగుతోంది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన కేజ్రీవాల్.. ఆ డ్యామ్ నుంచి పరిమితంగా నీటిని విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. #WATCH | Water level of river Yamuna continues to rise in Delhi. Visuals from Old Railway Bridge. Today at 8 am, water level of the river was recorded at 207.25 metres at the Bridge, inching closer to the highest flood level - 207.49 metres. The river is flowing above the… pic.twitter.com/e46LLHdeVe — ANI (@ANI) July 12, 2023 యమునా నది కరకట్టలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం సరైన చర్యలను తీసుకుంటోందని ఢిల్లీ రెవెన్యూ మంత్రి అతిషి తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించామని వెల్లడించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ప్రభుత్వాలు హామీలు ఇవ్వడం తప్పా క్షేత్ర స్థాయిలో చేసిందేమీ లేదని ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు. Mathura, Uttarakhand | The water level of the Yamuna River is increasing due to rain. All the police stations along the banks of the river have been instructed to increase vigilance in the area. Coordination is also being established with other agencies so that if there is… pic.twitter.com/lHHAVVTn6f — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 11, 2023 ఇదీ చదవండి: Yamuna Rivar: డేంజర్ మార్క్ దాటి మహోగ్రంగా ప్రవహిస్తున్న యమునా.. ఢిల్లీ హై అలర్ట్.. -
నా కోసం ఎదురు చూడొద్దు!..మళ్లీ పెళ్లి చేసుకో: ఓ నేరస్తుడి భావోద్వేగ సందేశం
ఓ వ్యక్తి 30 ఏళ్ల క్రితం చేసిన నేరానికి ఇటీవలే పోలీసులకు పట్టుబడతాడు. దీంతో అతను జైలుకి వెళ్తూ.. భార్యను మళ్లీ పెళ్లి చేసుకో, నా కోసం ఎదురు చూడకు అని భావోద్వేగంగా చెబుతాడు. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింత తెగ వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..'జౌ' అనే చైనా వ్యక్తి 1993లో సెంట్రల్ హుబీ ప్రావిన్స్‌లో తన ముగ్గురి స్నేహితులతో కలసి ఒక వ్యక్తిని హత్య చేశాడు. ఆ ఘటన జరిగిన వెంటనే అతడి స్నేహితులు అరెస్టు అయ్యారు. కానీ జౌ మాత్రం పోలీసులకు పట్టుబడలేదు. గత నెలాఖరు వరకు పరారీలోనే ఉన్నాడు. ఇటీవలే పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. తాను జైలుకి వెళ్లడం ఖాయమని తెలిసిన జౌ తన భార్యతో భావోద్వేగంగా మాట్లాడతాడు. తనకు విడాకులు ఇచ్చి మరోకర్ని పెళ్లి చేసుకోవాలని, తన కోసం ఎదురు చూడొద్దని వేడుకుంటాడు. జైలుకి వెళ్తూ వెళ్తూ..ఆమెని కౌగిలించుకంటూ తన కోసం ఎదురు చూడొద్దని కన్నీళ్లు పెట్టుకుంటాడు. తమ రిలేషన్ ఇక్కడతో ముగిసిపోయింది. మీ అక్కకి మరో పెళ్లి చేయండని తన మరదలికి కూడా చెబుతాడు. తానెప్పటికీ జైలు నుంచి విడుదలకాలేనని కన్నీటిపర్యంతమవుతాడు. దీంతో ఔ భార్య ఇక మాట్లాడొద్దు అంటూ తన చేతిని జౌ నోటికి అడ్డం పెడుతుంది. అలా మాట్లాడొద్దు. అందుకు తాను ఒప్పుకోనని భార్య తెగేసి చెబుతుంది. ఆ ఘటన అక్కడ ఉన్నవాళ్లందర్నీ కదిలించింది. ఇక నేరస్తుడు జౌ కూడా తాను 30 ఏళ్ల క్రితం చేసిన నేరానికి ఇప్పడు అరెస్టు కావడం తననెంతో బాధించిందన్నాడు. తాను చేసిన నేరానికి చాలా పశ్చాత్తాప పడుతున్నానంటూ బావురమన్నాడు. తాను యువకుడిగా ఉన్నప్పుడు ఆ నేరం చేశానని, ఐనా తాను అప్పడు అలా చేసి ఉండకూడదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. (చదవండి: ఆ ఎమోజీని ఉపయోగించినందుకు..రైతుకి రూ. 50 లక్షలు జరిమానా) -
Wrestlers Protest: విచారణ ముగిసే వరకు వేచి ఉండండి!
నెలల తరబడి రెజ్లర్లంతా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేయడమే గాక తమ పతకాలను గంగా నదిలో విసిరేస్తామని హెచ్చరించారు కూడా. ఐనా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై నోరు మెదపలేదు. అలాంటిది తొలిసారిగా ఆ విషయమైన సాక్షాత్తు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడటం విశేషం. రెజ్లర్లు రోజుకో డిమాండ్‌తో వస్తున్నారని ఆరోపణలు చేశారు. క్రీడను, క్రీడాకారులను బాధించే ఎటువంటి చర్య తీసుకోవద్దని పునరుద్ఘాటించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ..రెజ్లర్ల నిరసన చేసిన ప్రాంతానికి రాజకీయ నాయకులంతా పెద్ద ఎత్తున తరలివచ్చారని మండిపడ్డారు. అయినా ఇది రాజకీయాలు చేయడానికి వేదిక కాదని రెజ్లర్లే చెప్పారు కానీ వారంతా వచ్చారు. ఐనా తాను దీని గురించి పెద్దగా వ్యాఖ్యానించనన్నారు. ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ముగిసే వరకు వేచి ఉండమని మాత్రమే అథ్లెట్లను కోరుతున్నా. ఢిల్లీ పోలీసులు సుప్రీం కోర్టుకు తెలియజేసేలా ఎఫ్ఆర్ దాఖలు చేశారు దర్యాప్తు వరకు పూర్తి అయ్యింది. దయచేసి క్రీడకు, ఆటగాళ్లకు హాని కలిగించే ఏ చర్య తీసుకోవద్దని విజ్ఞప్తిచేశారు. అలాగే ఈ సమస్యపై విచారకు కమిటీ వేయాలన్న రెజ్లర్ల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది. వారు నిరసన వ్యక్తం చేస్తున్న ఫెడరేషన్ చీఫ్‌ని కూడా తొలగించారు. అంతేగాదు క్రీడాకారుల శిక్షణ, క్రీడా మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించింది. ఇప్పుడు కూడా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఆదేశాల మేరకు పనిచేస్తోంది అని అనురాగ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు. ఆదివారం కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ టైంలో నిరసనకు యత్నించిన రెజ్లర్లపై పోలీసుల చర్యకు సంబంధించిన దృశ్యాలు యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేశాయి. ఆ తదనందర ఈ అంశంపై మొట్టమొదటిసారగా ప్రభుత్వం వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలా ఉండగా, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే ఎలాంటి శిక్షను స్వీకరించడానికైనా సిద్ధమేనని అన్నారు. ఒక్క ఆరోపణ రుజువైనా ఉరి వేసుకుంటానని చెప్పారు. రెజ్లర్లను ఉద్దేశిస్తూ.. మీ వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకి సమర్పించండి అని సవాలు కూడా విసిరారు సదరు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్. (చదవండి: కొందరు నేతలు ఆ వ్యాధితో బాధపడుతున్నారు.. ప్రధాని మోదీ కూడా!: రాహుల్) -
ముగిసిన జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని ఐఎంఏ హాల్ నిర్వహించిన జిల్లాస్థాయి ద్వితీయ సబ్‌జూనియర్, జూనియర్, పురుషులు, మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ముగిసిశాయి. ఉదయం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పోటీలను ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 65 మంది క్రీడాకారులు ఆయా కేటగిరీల్లో పాల్గొన్నారు. ఒక్క రోజుకు పరిమితంగా జరిగిన ఈ పోటీల్లో విజేతలకు సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ క్రీడలను కెరీర్‌గా మార్చుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. ఆయా కేటగిరిల్లో విజేతలుగా నిలిచినవారికి ఆయన బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ పీటీఆర్ కృష్ణారావు, అధ్యక్షుడు జి.నరేంద్ర, కార్యదర్శి సీహెచ్ మనోజ్‌కుమార్ పాల్గొన్నారు. -
కల్యాణమైంది.. ‘లక్ష్మి’ రాలేదు..!
♦ బీసీలకు అందని ద్రాక్షలా కల్యాణలక్ష్మి ♦ దరఖాస్తులకే పరిమితం ♦ రెండునెలలైనా కాసులు ఇవ్వని సర్కారు ♦ లబ్ధిదారుల నిరీక్షణ చిత్రంలో కనిపిస్తున్న వధువు, వరుడి పేర్లు సంగీత, గంగాధర్. వధువుది సిరికొండ మండలం హుస్సేన్‌నగర్ గ్రామ పరిధిలోని లొంకతండా కాగా, వరుడిది కమ్మర్పల్లి మండలం మానాల. ఫిబ్రవరిలో వీరి వివాహమైంది. కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు విచారణ కూడా చేశారు. మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. - సిరికొండ ఇందూరు : ఎస్సీ, ఎస్టీలకే పరిమితమైన కల్యాణలక్ష్మి పథకాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీసీలకు కూడా వర్తింపజేస్తున్నామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అమలులో విఫలం అవుతోంది. దరఖాస్తులు చేసుకోవాలని రెండు నెలల క్రితం బీసీ సంక్షేమ శాఖకు జీవోఎంఎస్ నంబరు 5ను జారీ చేసింది. ఇందుకు వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చారుు. కానీ.. ఇంతవరకు సర్కారు ఒక్కరికి కూడా నయాపైసా అందజేయలేదు. పెళ్లి సమయంలో కాదు కదా.. పెళ్లి అయిన రెండు నెలల తర్వాత కూడా డబ్బులు రాకపోవడంతో దరఖాస్తులు చేసుకున్న పేదింటి ఆడ్డబిడ్డలు ఆందోళన చెందుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు వెంటనే నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం నిధుల లేమి సాకుతో బీసీలకు ‘లక్ష్మి’ని దూరం చేస్తుంది. దరఖాస్తులు 726 జిల్లాలో బీసీ జనాభా 13,00,174 ఉంది. ఇందులో 70 శాతం మంది పేదలు ఉన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెళ్లిళ్లు చేసుకున్న పేదింటి బీసీలకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. ఇందుకు ఏప్రిల్ నెల నుంచి ఇప్పటివరకు బీసీలు 671, ఓబీసీలు 55 మొత్తం కలిపి 726 మంది ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఇంకా చేసుకుంటూనే ఉన్నారు. అయితే వీటిని పరిశీలన జరిపి మంజూరు చేయాల్సి ఉంది. అయితే పరిశీలన అనంతరం పక్షం రోజుల్లో ప్రభుత్వం నుంచి నేరుగా వధువు ఖాతాలో డబ్బులు జమ కావాలి. కానీ.. దరఖాస్తులు చేసుకుని రెండు నెలలవుతున్నా ఇంతవరకు పరిశీలన జరగలేదు. నిధులూ జమ కాలేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అందించే నిధులు ఆర్థికంగా దోహదపడుతాయని అనుకున్న తల్లిదండ్రులకు అందని ద్రాక్షలా మారాయి. 726 మంది దరఖాస్తు దారులకు ఒక్కొక్కరికి రూ.51,000 చొప్పున మొత్తం జిల్లాకు రూ.3.70 కోట్ల నిధులు అవసరం ఉన్నాయి. పరిశీలన బాధ్యతలు తహసీల్దార్లకు అప్పగింత కల్యాణలక్ష్మి పథకం బీసీ, ఓబీసీలకు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుల పరిశీలన బాధ్యతలు తొలుత సహాయ సంక్షేమాధికారులు (ఏబీసీడబ్ల్యూఓ), వసతిగృహ వార్డెన్లకు అప్పగించింది. బీసీ సంక్షేమలో వార్డెన్లు తక్కువగా ఉండటంతో పరిశీలన ఆలస్యం జరుగుతుందనే ఉద్దేశంతో పరిశీలన బాధ్యతలను మండలాల తహసీల్దార్లకు అప్పగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఉత్తర్వులు రావాల్సి ఉంది. జిల్లాలో నమోదైన 726 దరఖాస్తులు ఇంత వరకు పరిశీలనకే నోచుకోలేదు. ఫలితంగా లబ్ధిదారులకు మరింత ఆలస్యం కానుంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు జరుగుతుంది. ఇప్పటి వరకు 726 దరఖాస్తులు నమోదయ్యాయి. అయితే పరిశీలన బాధ్యతలు వార్డెన్లకా? తహసీల్దార్లకా? అనే విషయంపై స్పష్టత రావాలి. పరిశీలన తరువాత మంజూరు చేస్తాం. ఆ తరువాత ప్రభుత్వం నిధులు విడుదల చేయడమే తరువాయి. - విమలాదేవి, జిల్లా బీసీ సంక్షేమాధికారిణి -
ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందన్నట్లు..
లండన్: ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందనే సామెత ఈ కుక్కకు అతికినట్లు సరిపోతుంది. బ్రిటన్ కు చెందిన ఫ్రేయా అనే కుక్కకు హాలీవుడ్ లో ‘న్యూ ట్రాన్స్ ఫార్మర్స్’ అనే చిత్రంలో నటించే అవకాశం లభించింది. ఈ కుక్క 6 సంవత్సరాల నుంచి ఒక జంతువుల షెడ్డులో ఉంటోంది. ఫ్రేయాను పెంచుకోవడానికి 18,000 మంది నిరాకరించారు. న్యూ ట్రాన్స్ ఫార్మర్స్ చిత్ర దర్శకుడు మైఖేల్ బే మాట్లాడుతూ.. ఫ్రేయా ఈ చిత్ర సంపాదనతో జంతువుల షెడ్డులో జీవితాంతం జీవించగలిగే డబ్బు సంపాదిస్తుంది. ఈ పాత్రలో నటించిన తర్వాత ఆ కుక్క తిరిగి తన ఇంటిని గుర్తించకపోతే, తన దగ్గరే పెంచుకుంటానని ఆయన తెలిపారు. మైఖేల్ బే ద్వారా ఫ్రేయా ఫేస్‌బుక్‌లోనూ దర్శనమిచ్చింది. ఫ్రేయా తిరిగి తన నివాసానికి చేరుకుంటుందని ఫ్రెష్ఫీల్డ్స్ యానిమల్ రెస్క్యూ సెంటర్ సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్రేయా అందమైన కుక్కే కాక మంచి విశ్వాసం కలదని ఆ కుక్క నివసిస్తున్న షెల్టర్ ఫండ్రైజర్ తెలిపారు. -
అమరేంద్ర బాహుబలి @ 150
హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో సాహసం చేశాడు. ఆయా పాత్రల్లో ఒదిగిపోయేందుకు ఇప్పటి నటీనటులు ఎంతటి రిస్క్ చేసేందుకు అయినా వెనకడుగు వేయడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన 'బాహుబలి'లో శివుడు పాత్రలో ఆరడుగల ఎత్తు - కండలు తిరిగిన శరీరంతో బాగా ఆకట్టుకున్న ఈ టాలీవుడ్ రైజింగ్ స్టార్ రెండో భాగంలోని తండ్రి అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం ఇపుడు మరింత బరువు పెరిగాడట. 'బాహుబలి ది కంక్లూజన్' అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం ప్రభాస్ ఏకంగా 150 కిలోల బరువు పెరిగాడట. అమెరికా నుంచి తెప్పించుకున్న స్పెషల్ జిమ్ ఎక్విప్మెంట్ సాయంతో మరో 17 కిలోలు బరువు పెరిగాడని సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా మెనూను కూడా ఫాలో అవుతున్నాడట. వెజ్ - నాజ్ వెజ్ రెండింటినీ సమతూకంగా తీసుకుంటూ, ప్రొటీన్స్, కార్బొహైడ్రేట్స్ సమతూకంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. 42 ఎగ్ వైట్స్, - పావుకిలో చికెన్ - తాజా పళ్లు.. ఇదీ ప్రభాస్ బ్రేక్ ఫాస్ట్. బ్రౌన్ రైస్ - ఓట్స్ - సలాడ్స్ - బ్రొకలి - పాస్టా.. ఇది లంచ్. వర్కవుట్స్ తర్వాత హాఫ్ స్కూప్ ప్రొటీన్ పౌడర్.. సూప్‌తో గానీ పాలతో గానీ తీసుకుంటాడట ప్రభాస్. వామప్‌తో పాటు.. యోగ - డంబుల్స్ - స్ట్రెచింగ్ - క్రాస్ ఫిట్స్ - ప్లయోమెట్రిక్స్ ఇలా రకరకాల ఎక్సర్ సైజులతో తన బాడీని తీర్చుదిద్దుకుంటున్నాడట. ఇక ప్రతిరోజు ఉదయం - సాయంత్రం గంటన్నరపాటు వ్యాయాయం ఇవన్నీ షరా మామూలే. కాగా ఈశ్వర్ చిత్రంతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ వర్షం, ఛత్రపతి, బిల్లా తదితర సినిమాల్లో తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, డార్లింగ్ చిత్రాలతో క్లాస్, మాస్ ఏదయినా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఇక ఆ తర్వాత బాహుబలితో ప్రభంజనాన్నే సృష్టించాడు. పూర్తి ఫిట్నెస్ బాడీతో.. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కన్నుకుట్టే రేంజ్లో ప్రభాస్, బాహుబలి-1లోని శివుడు పాత్ర కోసం తన బరువును 130 కిలోలకు పెరిగిన విషయం తెలిసిందే. -
ఇక్కడ మూత్రం చేస్తే ఇక అంతే...
శాన్ఫ్రాన్సిస్కో: ఎక్కడ గోడ కనపడితే అక్కడ లఘుశంక తీర్చుకునే మగ మహారాజులకు ఇప్పుడు చుక్కెదురైనట్టే. ఏం.. ఎందుకు అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. త్రీ ఇడియట్స్ సినిమాలో సీనియర్ మూత్రం పోస్తానంటే స్పూను పెట్టి, దానికి కరెంటు కనెక్షన్ ఇచ్చే సీన్ చూసే ఉంటారు కదూ. ఇంతవరకు మనం గోడకు కొట్టిన బంతి గురించి విన్నాం.. చూశాం.. ఇది పాతదే. కానీ ఇపుడు గోడక్కొట్టిన సు.. స్సూ.. అంతే వేగంగా తిరిగి మొఖం మీద పడటం ఖాయమట. ఇది కొత్త విషయం. ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేసి.. నగరాన్ని మురికికూపంగా మారుస్తున్న వైఖరికి స్వస్తి చెప్పేందుకు శాన్ఫ్రాన్సిస్కోలోని అధికారులు ఈ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. నగరంలోని బార్లు, హోటెళ్లు, బస్లాండ్లు తదితర ఏరియాల్లో గోడలకు ఒక పెయింట్ వేశారు. దాంతో పాటు ఒక స్లోగన్‌ను కూడా జత చేర్చారు. 'ఆగండి.. ఇక్కడ కాదు... దాని కోసం వేరే చోటు వెదుక్కోండి.. లేదంటే మీ మూత్రం మీ మొఖం మీదికే' అని బోర్డులు తగిలించేశారు. అల్ట్రా ఎవర్ డ్రై గా పిలిచే ఈ పెయింట్ వేసిన గోడలపై నీళ్లు, లేదా ఏదైనా ద్రవపదార్థం పడితే, అది అంతే వేగంగా వెనక్కి వెదజల్లుతుంది. ఈ పెయింట్‌కు సూపర్ హైడ్రోఫోబిక్ (నీటిని వికర్షించే శక్తి) గుణం ఉండడం వల్ల ఎవరైనా మూత్రం చేస్తే ఆ మూత్రం తిరిగి వారిమీదే పడుతుందని అధికారులు వెల్లడించారు. సిమెంట్ కంపెనీ దిగ్గజం అల్ట్రాటెక్ సిమెంట్ ఈ పెయింటును తయారు చేసిందని సమాచారం. ఇటీవల జర్మనీ అనుసరించిన ఈ విధానం గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. జర్మనీలోని హాంబర్గ్ వాసులు సెయింట్ పాలి నైట్‌క్లబ్ ప్రాంతంలో ఆచరించిన ఈ పద్ధతికి ఎట్రాక్ట్ అయ్యారు. వెంటనే తమ నగరంలోని పలు గోడలకు పైలట్ ప్రాజెక్టు కింద ఈ పెయింట్లు వేయించారట. దీంతో తమ ప్రాంతంలో కూడా ఈ పెయింట్లు వేయించండి బాబూ అని నగర వాసుల నుంచి విపరీతంగా కాల్స్ వస్తున్నాయట. ఇలాంటి అవకాశం మనకు కూడా వస్తే.. గోడల మీద ఎక్కడ పడితే అక్కడ ప్రపంచ పటాలు దర్శనం ఇవ్వకుండా ఉంటాయి. -
లావూసన్నం
ఫిక్సేషన్ మాధవ్ శింగరాజు మనుషులు ఎలా ఉంటే అందంగా ఉంటారు? ఏమిటీ వాక్యం! ఇందులో పౌష్టికాహార లోపమేదో ఉన్నట్లు అనిపించడం లేదూ?! నిజమే. అనిపిస్తోంది. వాక్యంలో ఉండాల్సినంత వెయిట్ లేదు. అయితే కొంచెం మార్చి చూద్దాం.. బరువు పెరుగుతుందేమో! ‘మనుషులు’ అని ఉన్నచోట ‘మహిళలు’ అని చేరిస్తే అప్పుడీ వాక్యం ఇలా ఉంటుంది: ‘మహిళలు ఎలా ఉంటే అందంగా ఉంటారు?’. వచ్చేసింది! వాక్యం బరువు పెరిగి, వాక్యానికి అందం వచ్చేసింది. అదీ ఫిమేల్ పవర్! స్త్రీ.. పక్కన ఉంటే చాలు ఎవరికైనా ఇట్టే వెయిట్ పెరిగిపోతుంది.. అది వాక్యమే అయినా, వానరమే అయినా. స్త్రీల వల్ల పెరిగే వెయిట్ సరే, స్త్రీల వెయిట్‌ను పెంచేదేమిటి? గ్లామర్ ఇండస్ట్రీలో ఉండేవారిని మాత్రం ఈ ప్రశ్న అడక్కండి. వారు జీరో సైజ్ గురించి మాట్లాడతారు. ‘వెయిట్ తగ్గడమే వెయిట్ పెరగడం’ అని వారి డెఫినిషన్. సౌందర్యభారం తప్ప ఒంటికి మరే భారమూ తగిలించుకోని వారే తీరైన అందగత్తెలని వారొక ఫీలింగ్‌ని గాల్లోకి వదిలిపెట్టారు. తిండి మానేసి, మన పిల్లలు ఆ ఫీలింగ్‌తో పొట్ట నింపేసుకుంటున్నారు. ఇష్టమైన కూరతో ఒక్క ముద్ద ఎక్కువ తిన్నా సరే, ఆ పూటకి... దే ఫీల్ ఫ్యాటీ! బరువంటే అంత భయం పెట్టేశారు ఈ ఫ్యాషన్ డిజైనర్లు, పూరి జగన్నాథ్‌లు. ‘ఫీలింగ్ ఫ్యాట్’ అనే మాటకు నిన్నమొన్నటి వరకు ఫేస్బుక్లో ఒక ఎమోటికాన్ ఉండేది. ఇప్పుడది లేదు. రౌండ్ సర్కిల్. లోపల రెండు కళ్లు. చెంపలపై అటూఇటు కందినట్లు బ్లషింగ్. నవ్వీనవ్వనట్లుండే నోరు. దాని కింద డబుల్ చిన్ గీత. ఇదీ ఆ ఎమోటికాన్. అయితే ‘‘ఫ్యాట్ అనేది ఫీలింగ్ ఎలా అవుతుంది?’’ అని కేథరీన్ వైగాఫెన్ అనే నాటక రచయిత్రి పెద్ద ఉద్యమం తేవడంతో ఫేస్బుక్ దానిని తీసేసింది. ‘‘పూరీ, ఆలుగడ్డ చేయడం పాపమా ఏంటి?’’ అని ఓ కమర్షియల్ యాడ్‌లోని పెద్దావిడ అడిగినవిధంగా, ‘‘ఫ్యాటీగా ఉండడం పాపమా ఏంటి?’’ అని ప్రపంచం ఇప్పుడు అడుగుతోంది. మంచి పరిణామమే. బక్కపలుచని ముఖచిత్రాలకు పేరుమోసిన ‘స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్’... బొద్దుగా ఉన్న మోడల్స్‌ని మాత్రమే ఈ ఏడాది తన కవర్ పేజీలకు ఎంపిక చేసుకుంది! అతి నాజూకైన ‘పెరిల్లి’ కొత్త క్యాలెండర్ కూడా కాస్త బరువు తూగే అమ్మాయిలతోనే పరిపుష్టం అయింది! ఇక ఫ్రాన్స్ అయితే ఎండుటాకులా ఎగిరిపోయేలా ఉన్న (అల్ట్రా థిన్) మోడల్స్.. ర్యాంప్‌పై నడుస్తూ కనబడితే, వాళ్లను అలా నడిపించినవాళ్లకు డెబ్బై ఐదు వేల యూరోల ఫైన్ విధించి, ఆర్నెల్లు జైల్లో పెట్టే చట్టం ఒకటి తెచ్చింది. అంటే ఏమిటి? లావులోనే అందం ఉందనా? మరీ చిక్కితే అందం అనారోగ్యం అవుతుందనా? రెండూ కాదు. సన్నదనం మీద అంత వ్యామోహం పనికిరాదని. ఇంతకీ మహిళలు ఎలా ఉంటే అందంగా ఉంటారు? లావుగానా? సన్నగానా? లావూసన్నం కాకుండానా? ‘‘ఎలా ఉంటే వారికి సంతోషంగా అనిపిస్తుందో అదే అందం’’ అంటారు సప్న భావ్నాని. సప్న ప్రముఖ హెయిర్ స్టెయిలిస్ట్. ‘‘మీ లావూసన్నం గురించి ఎవరేం కామెంట్ చేసినా పట్టించుకోవద్దు. మీరూ ఎవరి గురించీ కామెంట్ చేయొద్దు. ఫిట్‌నెన్ మీకు సంతోషాన్నిచ్చే పనైతే ఫిట్‌గా ఉండండి. సన్నగా ఉండడం మీకు సంతోషమైతే సన్నగానే ఉండండి. లావుగా ఉన్నందువల్ల సంతోషంగా ఉంటామనుకుంటే లావుగానే ఉండండి’’ అని సప్న సూచన. ఇందులో ఆమె మగాళ్లకు మృదువుగా వేసిన మొటిక్కాయ కూడా ఉంది! ఆడవాళ్ల అందం గురించి అదే పనిగా ఆలోచించడం మాని, పనికొచ్చే పనేదైనా ఉంటే చూసుకొమ్మని! ఇన్ని మాట్లాడుతున్నాం కానీ ఎంతైనా ‘సన్నం... సన్నం’ అని మనసు పీకుతూనే ఉంటుంది. మన మైండ్లు అలా ఫిక్స్ అయిపోయాయి. అయితే ఈ సాంస్కృతిక కోమలత్వపు కలవరింత (కల్చరల్ ఫిక్సేషన్) ఆడవాళ్ల అందం గురించి కాదనీ, వారి అణకువపై మగవాళ్లకుండే పరితపన (అబ్సెషన్) మాత్రమేనని ‘ది బ్యూటీ మిత్’ రచయిత్రి నవోమీ ఉల్ఫ్ చెబుతున్నారు. బ్యూటీ మీదే కాదు, ఆడవాళ్ల ‘డూస్ అండ్ డోంట్స్’ మీద కూడా ఏళ్లుగా మనక్కొన్ని మిత్‌లు ఉండిపోయాయి. ఆ కల్పితాలను ఎగరగొట్టేందుకు ఆ మధ్య ‘ఏక్ బూరీ లడికీ’ (బ్యాడ్ గర్ల్) అని ఒక పోస్టర్ సెటైర్ నెట్లోకి వచ్చింది. చెడ్డమ్మాయిల గుణగణాలను ఆ పోస్టర్లో ఒక పట్టికలా ఇచ్చారు. బ్యాడ్ గర్ల్స్ మితి మీరి తింటారట. లేదా అసలే తిండి మానేస్తారట. రోటీలు గుండ్రంగా తయారు చేయలేరట. వెంట్రుకల్ని విరబోసుకుని వీధుల్లోకి వచ్చేస్తారట. ఇలాంటి ఓ పన్నెండు వరకు ఉన్నాయి. వాటన్నింటినీ ఒంటికి పట్టించుకోకపోతే మనక్కొంచెం ఫ్యాట్ తగ్గుతుంది. ఆడవాళ్ల అందంలోని ఫ్యాట్ కన్నా, మగవాళ్ల ఆలోచనల్లోని ఫ్యాట్ ఎక్కువ హానికరం. బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా : ట్విట్టర్లో తన బరువుపై వచ్చిన జోకులకు ఆమధ్య సోనాక్షీ ఎంతో బాధపడ్డారు. ‘‘అస్థిపంజరం అందంగా ఉంటుందని అనుకునే మీలాంటి వారికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు’’ అని ఆమె సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేశారు. సోనాక్షికైనా, మనకైనా సప్న భావ్నాని ఇస్తున్న సలహా ఏమిటంటే.. ఇలాంటి కామెంట్లను అస్సలు పట్టించుకోవద్దని. మీరు మీలా ఉండండని! -
వేచి చూద్దాం!
శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తిపై కేంద్రం వైఖరి సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి, నీటి విడుదల విషయంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం విషయంలో కేంద్ర ప్రభుత్వం వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. ప్రాజెక్టుల్లో నీటి వినియోగ అంశాన్ని ఇప్పటికే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పర్యవేక్షిస్తున్నందున తాము జోక్యం చేసుకునే అవసరం లేదనే భావనను కేంద్ర జల వనరుల శాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవోల్లో పేర్కొన్న కనిష్ట నీటి మట్టాలను మించి వినియోగించిన పక్షంలో తమ జోక్యం ఉంటుందని పేర్కొంటున్నాయి. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి విషయమై ఇరు రాష్ట్రాల ఘర్షణపూరిత వైఖరి, వేర్వేరుగా వచ్చిన విజ్ఞప్తులను జల వనరుల శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. తమ శాఖ మంత్రి ఉమాభారతికి సమాచారం అందజేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టున తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తితో రాయలసీమ తాగునీటి ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్.. తమ వాటా మేరకే వినియోగిస్తున్నామంటూ తెలంగాణ భిన్న వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కల్పించుకున్నా సమస్యకు పరిష్కారం లభించలేదు. తాగు, సాగు నీటి అంశాలకు తొలి ప్రాధాన్యం ఇస్తూ సత్వరమే శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా రెండుసార్లు లేఖ రాసినా తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు ఏపీ నుంచి రావాల్సిన న్యాయబద్ధమైన విద్యుత్ వాటా అందేంత వరకు విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తామంటున్న తెలంగాణ ప్రభుత్వం... జీవో 69 ప్రకారం తమకు శ్రీశైలంలో 834 అడుగుల వరకు నీటిని వాడుకునే అవకాశం ఉందని స్పష్టం చేస్తోంది. 854 అడుగుల మట్టం వరకే నీటిని వాడుకోవాలన్న జీవో 107ను పట్టించుకోబోమని పేర్కొంటోంది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తిని కొనసాగిస్తోంది. అయితే... ఈ అంశంలో ఏపీ ప్రభుత్వ పెద్దలు ఇటీవల కేంద్ర జల వనరుల శాఖ అధికారులతో వరుసగా సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం జోక్యం చేసుకుంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని... తక్షణమే శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని ఆపేలా చూడాలని వారు కేంద్రాన్ని కోరుతున్నారు. కానీ దీనిపై జల వనరుల శాఖ నుంచి కార్యాచరణ పరమైన స్పందన రాలేదని సమాచారం. నిబంధనల పరంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని... కనిష్ట మట్టం 854 అడుగుల పరిమితిని విస్మరించి ఉత్పత్తి చేస్తేనే తాము జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎవరైనా కోరితేనే.. సమస్య పరిష్కారానికి తమంతట తాముగా జోక్యం చేసుకోలేమని కేంద్ర జల వనరుల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లో ఒకరి నుంచైనా ఇందుకు సంబంధించి వినతులు వస్తే మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని పేర్కొంటున్నాయి. జల వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహణ సాధాసాధ్యాలపై చట్టంలో ఉన్న నియమ నిబంధనలపై అధ్యయనం చేయాల్సి ఉందని వివరించాయి. విద్యుత్ ఇవ్వకనే సమస్య..! ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణానికి సంబంధించి... విద్యుత్ వాటాల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ వైఖరిని కేంద్ర జల వనరుల శాఖ అధికారవర్గాలు తప్పుపడుతున్నట్లుగా తెలుస్తోంది. చట్టప్రకారం ఏపీ ప్రాజెక్టుల నుంచి వాటా మేరకు రావాల్సిన విద్యుత్‌ను తెలంగాణకు ఇవ్వకపోవడం వల్లే అసలు సమస్య ఉత్పన్నమైందని అధికారవర్గాలు సంబంధిత శాఖ మంత్రికి విన్నవించినట్లుగా చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా.. శ్రీశైలంలో 834 అడుగుల కనిష్ట మట్టానికన్నా తక్కువగా 780 అడుగులదాకా కూడా విద్యుత్ ఉత్పత్తి చేసిన ఉదంతాన్ని ఆ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. గతంలో ఉల్లంఘనలకు పాల్పడిన వారే ఇప్పుడు మరో ప్రభుత్వ ధోరణిని ప్రశ్నించడంపై కేంద్ర జల వనరుల శాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటాను ఇచ్చేస్తే సమస్యకు పరిష్కారం సులభంగా కనుగొనవచ్చనే భావనను వ్యక్తీకరిస్తున్నట్టు తెలిసింది. వివాదాన్ని మీరే పరిష్కరించుకోండి సాక్షి, న్యూఢిల్లీ: శ్రీశైలం జల విద్యుదుత్పత్తి అంశంపై తలెత్తిన వివాదం ఇరు రాష్ట్రాలు, తెలుగు ప్రజలే పరిష్కరించుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సలహా ఇచ్చారు. న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయం వద్ద ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుదుత్పత్తి అంశం ఇరు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైందని మంత్రి దృష్టికి తీసుకురాగా.. ‘ఆ విషయంలో మాకేమీ సంబంధం లేదు. ఈ సమస్యను రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలి. విద్యుత్ విషయంలో ఏ రాష్ట్రానికైనా సమస్య ఉందంటే మా వంతు సాయం చేస్తాం. ఏపీ సీఎం చంద్రబాబు పలుమార్లు విద్యుత్ సమస్యలను మా దృష్టికి తెచ్చారు. వాటిని పరిష్కరించాం. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ సౌర విద్యుత్, ఎన్టీపీసీ ఏర్పాటుపై ప్రతిపాదనలు ఇచ్చారు. వాటినీ పరిష్కరిస్తున్నాం. కానీ శ్రీశైలం వివాదంలో మాకేమీ సంబంధం లేదు. ఇద్దరు సీఎంలూ కూర్చొని మాట్లాడుకోవాలి’ అని అన్నారు. -
ఎవరి లెక్క వారిదే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎన్నికల సమరం ముగిసింది. ఇక కౌంటింగ్ తేదీ వరకు నిరీక్షణ మిగిలింది. మధ్యలో వివిధ పార్టీల అభ్యర్థులు రకరకాల లెక్కల్లో మునిగితేలుతున్నారు. విజయావకాశాలపై ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. ‘ఓటర్లు మాకే మొగ్గు చూపారు.. విజయం మాదే’ అని అన్ని పార్టీల అభ్యర్థులు బయటకు చెబుతున్నా..లోలోపల ఓటమి భయం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాము భావించిన వారంతా తమకే ఓటేశారా? వెనుక నడిచినవారు మద్దతిచ్చారా? క్రాస్ ఓటింగ్ కొంపముంచుతుందా? అని తెగ కంగారు పడిపోతున్నారు. కూడికలు.. తీసివేతలు. ఏ బూత్‌లో మైనస్.. ఏ బూత్‌లో ప్లస్ అనే గణాంకాలపై కుస్తీపడుతున్నారు. తమ బంధుమిత్రులు, అనుచరులతో కలిసి బూత్‌లవారీగా పోలింగ్ వివరాలు తెప్పించుకుని మధిస్తున్నారు. విజయావకాశాలపై బేరీజు వేసుకుంటున్నారు. దాదాపు నెలరోజుల పాటు రేయిం బవళ్లు విశ్రాంతి లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు ఇప్పుడు ఇళ్లు, గెస్ట్‌హౌస్‌ల్లో కూర్చుని బుధవారం నాటి పోలింగ్ ట్రెండ్‌ను పసిగట్టే పనిలో పడ్డారు. సమీకరణలు మారిపోయి పరిస్థితి ఎక్కడైనా ప్రత్యర్థులకు అనుకూలంగా మారిందా? నమ్మినవారెవరైనా వెన్నుపోటు పొడిచారా? అని ఆరా తీస్తున్నారు. అంతుపట్టని ఓటరు నాడి! మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి బహుముఖ పోటీ నెలకొనడం, అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడిన నేపథ్యంలో ఓటరు నాడిని అభ్యర్థులు పసిగట్టలేకపోతున్నారు. గతం లో ఎన్నడూ లేనంత కొత్తగా ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారనే ప్రచారం కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులలో ఆందోళన కలిగిస్తోంది. గెలుపుపై మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా అంతర్గతంగా ఓటమి భయం వెన్నాడుతోంది. పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగినందున ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతోనే అని అభ్యర్థులు భావిస్తున్నారు. క్రాస్.. చెక్: క్రాస్ ఓటింగ్ అభ్యర్థుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఏ పార్టీవైపు మొగ్గు చూపాలో తేల్చుకోవడంలో ఓటర్లు చతురతను ప్రదర్శించారు. అభ్యర్థుల గుణగణాలు, సామాజిక నేపథ్యం, పార్టీ వ్యవహారశైలిపై ఒక అంచనాకొచ్చిన ఓటర్లలో చాలావరకు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. ఈ పరిణామం అభ్యర్థులను కలవరపరుస్తోంది. బలమైన ఎంపీ అభ్యర్థి ఉన్నందున.. ఎమ్మెల్యే స్థానాలు కూడా మావేననే విశ్వాసం వ్యక్తం చేయలేని పరిస్థితి అన్ని పార్టీల్లో తలెత్తింది. ఓట్ల బదలాయింపు ఏ మేరకు జరిగిందనేదానిపైనే అభ్యర్థులు విజయావకాశాలు ఆధారపడ్డాయి. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్‌పై బూత్‌లవారీగా ఆరా తీస్తున్నారు. ఎంపీ అభ్యర్థులకు పరీక్ష: ఓట ర్ల వ్యవహారశైలి లోక్‌సభ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఒకే పార్టీకి అటు పార్లమెంటు, అసెంబ్లీలోనూ ఓటేస్తారని ఆశించిన అభ్యర్థులకు ఈసారి ఎదురు దెబ్బ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. శాసనసభలో ఒక అభ్యర్థికి మొగ్గు చూపిన ఓటర్లు.. పార్లమెంటు విషయానికి వచ్చేసరికి మరో పార్టీని ఆదరించినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. అటు చేవెళ్ల, ఇటు మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో ఇదే పరిణామం చోటుచే సుకున్నట్లు స్పష్టమవుతోంది. వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ పరిస్థితి స్పష్టంగా క నిపించింది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటేసే విషయంలో ఓటర్లు పరస్పర విరుద్ధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో దేశంలో అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజిగిరిలో బహుముఖ పోటీ నెలకొనడంతో ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు క్రాస్ ఓటింగ్ వేశారు. కొన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ స్థానాలలో ఒక పార్టీకి మొగ్గు కనిపిస్తున్నా.. పార్లమెంటుకు పడే ఓట్లలో భారీ తేడా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో పోటీచేసిన ఓ ప్రధాన పార్టీకి ఒక్క అసెంబ్లీ సెగ్మెంటు కూడా వచ్చే సంకేతాలు లేన ప్పటికీ, పార్లమెంటు విషయానికి వచ్చేసరికి మొగ్గు కనిపించడం విలక్షణంగా పేర్కొంటున్నారు. చేవెళ్ల భవితవ్యం.. ఈ ఓటర్లపైనే: ఓటింగ్ శాతంపైనా అభ్యర్థులు మేధోమథనం జరుపుతున్నారు. పట్టణ సెగ్మెంట్లలో ఓటింగ్ శాతం తగ్గడంపై విజయావకాశాలను బేరీజు వేసుకుంటున్న పార్టీలు... పెరిగిన ఓటర్ల నేపథ్యంలో అవి ఎవరిని ప్రభావితం చేస్తాయోనని భయపడుతున్నారు. ఉదాహరణకు చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో గెలుపోటములను నిర్ధేశించేది శివార్లలోని రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాలు. తాజాగా జరిగిన ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో 49.50 శాతం కాగా, గత ఎన్నికలతో పోలిస్తే 4 శాతం పోలింగ్ తగ్గింది. అలాగే రాజేంద్రనగర్‌లో 2009 ఎన్నికల్లో 60.55 శాతం కాగా, ఈసారి కూడా దాదాపుగా అంతేస్థాయిలో పోలింగ్ జరిగింది. మహేశ్వరంలో గత ఎన్నికలతో పోలిస్తే ఏడు శాతం తక్కువ ఓటింగ్ నమోదైంది. 2009లో 60.93 శాతం కాగా, తాజా ఎన్నికల్లో 53.82 శాతం పోలింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ మూడు నియోజకవర్గాల్లో 7,30,386 ఓట్లు పోల్‌కాగా, వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్లలో 5,83,526 ఓట్లు పోలయ్యాయి. ఈ క్రమంలోనే చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గెలుపోటములు ఈ పట్టణ నియోజకవర్గాల్లో పెరిగిన ఓటర్లు నిర్దేశించనున్నారు.