టాప్‌-5 డైట్‌ ప్లాన్స్‌... 2023లో ఇలా బరువు తగ్గారట! | Mediterranean to Keto Trending Diet Plans | Sakshi
Sakshi News home page

Trending Diet Plans: 2023లో ఇలా బరువు తగ్గారట!

Published Sat, Dec 23 2023 7:56 AM | Last Updated on Sat, Dec 23 2023 8:17 AM

Mediterranean to Keto Trending Diet Plans - Sakshi

2023లో కొన్ని డైట్ ప్లాన్‌లు వార్తల్లో నిలిచాయి. వీటిలో వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రయోజనకరంగా ఉండే డైట్ ప్లాన్ కూడా ఉంది. ఆ వివరాలతో పాటు 2023లో చర్చకు వచ్చిన టాప్‌-5 డైట్‌ ప్లాన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1. మెడిటేరియన్‌ డైట్‌
2023లో మెడిటేరియన్‌ డైట్ అధికంగా చర్చల్లోకి వచ్చింది. చాలా మంది దీనిని అనుసరించారు. ఈ డైట్ ప్లాన్‌లో వారానికోసారి పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాల్సి ఉంటుంది. చక్కెర, కొవ్వు పదారార్థాలు తీసుకోకూడదు. గుండెపోటు, స్ట్రోక్, టైప్ -2 డయాబెటిస్‌ బాధితులు వైద్యుల సూచనల మేరకు ఈ ప్లాన్‌ అనుసరించారు.

2. వెయిట్ వాచర్స్ రెసిపీ డైట్
వెయిట్ వాచర్స్ రెసిపీలో వేగంగా బరువు తగ్గడంలో సహాయపడే అనేక అంశాలు ఉన్నాయి. బరువు తగ్గడంలో సహాయపడే ఆహార ప్రణాళిక దీనిలో ఉంది. దీనిలో రెండు ఫార్ములాలు ఉన్నాయి. మొదటి ఫార్ములాలో ఆహారంలో నూనె పదార్థాలకు దూరంగా ఉండటం. రెండవ ఫార్ములా.. అధిక కేలరీలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండటం. అలాగే కార్బోహైడ్రేట్లు వీలైనంత తక్కువగా తీసుకోవడం. 

3. కీటో డైట్
కీటో డైట్‌లో తక్కువ కార్బ్, తక్కువ కొవ్వు పదార్ధాల వినియోగంపై దృష్టి పెట్టాలి. కీటో డైట్‌ ద్వారా కొన్ని వారాల్లోనే వేగంగా బరువు తగ్గవచ్చు. వైద్యులు పర్యవేక్షణలో ఈ డైట్‌ని ఎంచుకోవాలి. ఎందుకంటే దీనిని దీర్ఘకాలం పాటు ఫాలో చేస్తే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. 

4. డాష్ డైట్
డాష్ డైట్ ఆరోగ్యానికి  ఎంతో ఉపయోగకరమని చెబుతారు. డాష్‌ అంటే హైపర్‌టెన్షన్‌ను నియంత్రించడానికి  ఉపయోగపడే డైట్‌ ప్లాన్‌. ఇది అధిక రక్తపోటు నియంత్రణకు రూపొందించిన ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక. హృద్రోగులు దీనిని పాటిస్తుంటారు.

5. ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌
ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ అంటే అడపాదడపా ఉపవాసం. ప్రతిరోజూ కొంత సమయం లేదా వారంలో ఒకరోజు ఏమీ తినకుండా ఉండటం. అడపాదడపా ఉపవాసంలో ప్రతిరోజూ కొన్ని గంటల పాటు ఏమీ తినకుండా ఉండాలి. లేదా వారంలో ఒక రోజు ఉపవాసం చేసి, మరుసటి రోజు తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి. ఈ ఐదు డైట్ ప్లాన్‌లు 2023లో అత్యంత ఆదరణ పొందాయి.
ఇది కూడా చదవండి: గ్యాస్ చాంబర్‌గా రాజధాని.. కనిపించని సూర్యుడు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement