చలి వాతావరణంలో మన ఆహారపు అలవాట్లు మారుతుంటాయి. శీతాకాలంలో మనం వేడిగా ఉండే ఆహారపదార్థాలను అధికంగా తీసుకుంటుంటాం. ఫలితంగా శరీర బరువు పెరగడం మొదలవుతుంది. ఇది కొందరిలో ఆందోళనకు దారితీస్తుంది. అయితే చలికాలంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం, నియమాలను పాటించడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. చలికాలంలో బరువు పెరగడానికి కారణాలేమిటో, ఏ విధంగా బరువును అదుపులో ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
అదనపు కేలరీల తీసుకోవడం
చలికాలంలో మనం ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటుంటాం. అతిగా టీ, కాఫీలు తాగడం, తీపి పదార్థాలు ఎక్కువగా తినడం మొదలైనవన్నీ బరువు పెరగడానికి కారణంగా నిలుస్తాయి. శీతాకాలంలో శరీరంలోని జీవక్రియ మందగిస్తుంది. ఫలితంగొ కొద్ది కేలరీలు మాత్రమే బర్న్ అవుతాయి.
వ్యాయామం చేయకపోవడం
చలికాలంలో చాలామంది వెచ్చగా పడుకోవాలని అనుకుంటారు. దీంతో రోజువారీ వ్యాయామాన్ని ఆపివేస్తారు. ఫలితంగా బరువు పెరగడం ప్రారంభమవుతుంది. దీనిని నివారించేందుకు వ్యాయామంపై దృష్టి పెట్టాలి.
ప్రోటీన్ తీసుకోవడం ముఖ్యం
ఆహారంలో ప్రోటీన్ ఉండటం ముఖ్యం. ప్రొటీన్ వినియోగం జీవక్రియను పెంచుతుంది. కండరాలను నిర్మించడంలో కూడా సహాయపడుతుంది. పప్పులు, చేపలు, గుడ్లు, జున్ను ఇలా ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
చక్కెర- ఉప్పు తగ్గించండి
చలికాలంలో తీపిని ఎక్కువగా తినడం కూడా బరువు పెరగడానికి కారణంగా నిలుస్తుంది. అదనంగా తీసుకునే ఉప్పు కూడా బరువు పెరగడానికి కారణంగా నిలుస్తుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీరు చేరి బరువు పెరుగుతారు.
ఫైబర్ కలిగిన ఆహారం ఉత్తమం
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మొదలైన ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను శీతాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ఫలితంగా కడుపు చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది. బరువు పెరిగేందుకు అవకాశమివ్వదు.
తాగునీరు- సూప్
చలికాలంలో నీరు ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఆకలి తగ్గుతుంది. అలాగే చలికాలంలో వేడి వేడి సూప్ తాగడం మంచిది. తక్కువ కేలరీలు కలిగిన కూరగాయల సూప్ లేదా చికెన్ సూప్ తీసుకోవచ్చు.
వ్యాయామం చేయండి
చలికాలంలో వ్యాయామంపై తగిన శ్రద్ధ వహించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కేలరీలను బర్న్ చేయవచ్చు. బరువు తగ్గవచ్చు.
ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు
శీతాకాలంలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు తీసుకోవాలి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఈ తరహా కొవ్వులు అసంతృప్తమైనవి. ఫలితంగా గుండెకు కూడా మేలు కలుగుతుంది. ఆలివ్ ఆయిల్, అవకాడో, గింజధాన్యాలను తీసుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: నేడు గీతా జయంతి: రూపాయికే భగవద్గీతను అందిస్తూ.. గీతాప్రెస్ వందేళ్ల ఘన చరిత్ర
Comments
Please login to add a commentAdd a comment