న్యూఢిల్లీ: త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆయన తన మిత్రపక్షం అయిన ఇండియా అలయన్స్‌తో పాటు ఇతర మిత్రపక్ష పార్టీలకు ప్రచారం చేయనున్నారు.
కేజ్రీవాల్ మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి (ఎంవీఏ) తరపున ప్రచారం చేయనున్నారు. పార్టీ వాలంటీర్లు ఉన్న అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు. అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు, పార్టీ సీనియర్ నేతలు కూడా ఈ రెండు రాష్ట్రాలలో ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించే అవకాశం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ జార్ఖండ్‌లో.. జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నారు. అలాగే ఇండియా బ్లాక్‌లోని అర్బన్ స్థానాలకు ఆయన ప్రచారం చేయనున్నారు.
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబరు 23న ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితం వెలువడనుంది. మహారాష్ట్రలో ప్రధాన పోటీ ఎంఏవీ పాలక మహాయుతికి మధ్యనే ఉంది. అధికార మహా కూటమిలో బీజేపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్), శివసేన (ఏక్నాథ్ షిండే) ఉన్నాయి. రెండవ కూటమి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ (శరద్ పవార్) ఉన్నాయి. రెండు కూటముల్లోనూ సీట్ల పంపకం జరిగింది. ఎన్నికల ప్రచారం కూడా మొదలైంది.
జార్ఖండ్‌లో నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది. జార్ఖండ్‌లో ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ), జనతాదళ్ (యునైటెడ్) (జేడీయూ), లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల పోరులోకి దిగింది.
ఇది కూడా చదవండి: ‘ప్రియాంక రోడ్డు షో.. సీజనల్ ఫెస్టివల్ లాంటిది’
Comments
Please login to add a commentAdd a comment