ఏ వయసువారికైనా స్థూలకాయమనేది పెద్ద సమస్యే. చిన్న వయసులోనే ఊబకాయం బారిన పడినవారు వయసు పెరిగేకొద్దీ అనేక సమస్యలను ఎదుర్కొంటారు. చిన్న వయసు కారణంగా వారు ఆహారం తినడాన్ని నియంత్రించుకోలేకపోతారు. ఫిజికల్ యాక్టివిటీకి కూడా దూరంగా ఉంటారు. ప్రపంచంలో ఇలాంటి చిన్నారులు చాలామంది ఉన్నారు. వీరిలో కొందరు పెద్దయ్యాక ఊహకందనంతగా మారిపోయారు. మరి కొందరు మరింత బరువు పెరిగారు.
1 అరియా పెర్మానా
ఇండోనేషియాకు చెందిన అరియా పెర్మానా కొన్నేళ్ల క్రితం 200 కిలోల బరువుతో ప్రపంచంలోనే అత్యంత స్థూలకాయుడైన పిల్లాడిగా గుర్తింపు పొందాడు. అయితే ఇప్పుడు అరియా పెర్మానా ఊహించనంతగా మారిపోయాడు. కొన్నేళ్ల క్రితమే అరియా పెర్మానా 120 కిలోల బరువు తగ్గాడు. అరియా రోజంతా వీడియో గేమ్స్ ఆడుతూ ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఇన్‌స్టెంట్ నూడుల్స్, ఫ్రైడ్ చికెన్ తినేవాడు. అలాగే విపరీతంగా కూల్‌డ్రింక్స్ తాగేవాడు. దీంతో అరియా విపరీతంగా బరువు పెరిగిపోయాడు. అయితే 2017 ఏప్రిల్‌లో అరియాకు బేరియాట్రిక్ సర్జరీ జరిగింది. ఇంత చిన్న వయసులో బేరియాట్రిక్ సర్జరీ జరిగిన బాలునిగా అరియా పేరొందాడు.
2 ఆండ్రస్ మెరెనో
ఆండ్రస్ మెరెనో పుట్టుకతోనే 5.8 కిలోల బరువు కలిగివున్నాడు. మెక్సికోకు చెందిన ఆండ్రస్ 10 ఏళ్ల వయసుకే 118 కిలోల బరువు పెరిగాడు. 20 ఏళ్ల వయసులో ఆండ్రస్ పోలీసుశాఖలో చేరాడు. అయితే బరువు పెరిగిన కారణంగా కూర్చొనేందుకు కూడా ఇబ్బంది పడేవాడు. కొన్నేళ్ల వ్యవధిలోనే అతని బరువు 444 కిలోలకు చేరుకుంది. 2015లో అతని ఉదరానికి బైపాస్ సర్జరీ జరిగింది. దీంతో అతను స్వయంగా లేని నిలబడగలిగాడు. అయితే కొంతకాలం తరువాత ఒక క్రిస్మస్ రోజున 6 కూల్ డ్రింక్స్ తాగాడు. దీంతో ఆరోగ్యం విషమించింది. 38 ఏళ్ల వయసులోనే కన్నుమూశాడు.
3 కత్రీనా రైఫార్డ్
ఫ్లోరిడాకు చెందిన కత్రీనా రైఫార్డ్ ఒకప్పుడు ప్రపంచంలోనే స్థూలకాయురాలైన యువతిగా పేరొందింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు మిఠాయిలు, చాక్లెట్లలాంటి అధిక కేలరీలు కలిగిన పదార్థాలంటే ఇష్టమమని, వీటిని అధికంగా తినడం కారణంగానే బరువు పెరిగానని తెలిపారు. కత్రీనా 14 ఏళ్ల వయసుకే 203 కిలోల బరువు పెరిగింది. 21 ఏళ్ల వచ్చేనాటికి ఆమె 285 కిలోల బరువుకు చేరుకుంది. 2009లో ఆమెకు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ జరిగింది. దీంతో ఆమె బరువు 127 కిలోలకు చేరుకుంది. ప్రస్తుతం 47 ఏళ్ల వయసుకు చేరుకున్న కత్రీనా రైఫార్డ్ కాస్త ఫిట్‌నెస్‌తో కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: మొసలి నోటికి చిక్కిన మహిళ.. గంట తర్వాత బయటపడిందిలా..!
World’s fattest kids: బాల భీములు పెద్దోళ్లయిపోయారు.. ఇప్పుడు ఉన్నారిలా..
Published Wed, Aug 2 2023 10:40 AM | Last Updated on Wed, Aug 2 2023 11:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment