అమరేంద్ర బాహుబలి @ 150 | Amarendra Baahubali @ 150 | Sakshi
Sakshi News home page

అమరేంద్ర బాహుబలి @ 150

Published Mon, Feb 8 2016 3:44 PM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

అమరేంద్ర బాహుబలి @ 150

అమరేంద్ర బాహుబలి @ 150

హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో సాహసం చేశాడు. ఆయా పాత్రల్లో ఒదిగిపోయేందుకు ఇప్పటి నటీనటులు ఎంతటి రిస్క్ చేసేందుకు అయినా వెనకడుగు వేయడం లేదు.  ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన 'బాహుబలి'లో శివుడు పాత్రలో ఆరడుగల ఎత్తు - కండలు తిరిగిన శరీరంతో బాగా ఆకట్టుకున్న  ఈ టాలీవుడ్ రైజింగ్ స్టార్  రెండో భాగంలోని తండ్రి  అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం  ఇపుడు మరింత బరువు  పెరిగాడట.  'బాహుబలి ది కంక్లూజన్'  అమరేంద్ర బాహుబలి పాత్ర కోసం ప్రభాస్  ఏకంగా 150  కిలోల బరువు  పెరిగాడట. అమెరికా నుంచి తెప్పించుకున్న స్పెషల్ జిమ్ ఎక్విప్మెంట్  సాయంతో మరో 17 కిలోలు బరువు పెరిగాడని సమాచారం.

ఇందుకోసం ప్రత్యేకంగా మెనూను కూడా ఫాలో అవుతున్నాడట.  వెజ్ - నాజ్ వెజ్  రెండింటినీ  సమతూకంగా తీసుకుంటూ,  ప్రొటీన్స్, కార్బొహైడ్రేట్స్ సమతూకంలో ఉండేలా   జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.  42 ఎగ్ వైట్స్,  - పావుకిలో చికెన్ - తాజా పళ్లు.. ఇదీ ప్రభాస్ బ్రేక్ ఫాస్ట్.  బ్రౌన్ రైస్ - ఓట్స్ - సలాడ్స్ - బ్రొకలి - పాస్టా.. ఇది లంచ్. వర్కవుట్స్ తర్వాత హాఫ్ స్కూప్ ప్రొటీన్ పౌడర్.. సూప్తో గానీ పాలతో గానీ తీసుకుంటాడట ప్రభాస్.  వామప్తో పాటు.. యోగ - డంబుల్స్ - స్ట్రెచింగ్ - క్రాస్ ఫిట్స్ - ప్లయోమెట్రిక్స్  ఇలా రకరకాల ఎక్సర్ సైజులతో తన బాడీని తీర్చుదిద్దుకుంటున్నాడట. ఇక ప్రతిరోజు ఉదయం - సాయంత్రం గంటన్నరపాటు వ్యాయాయం   ఇవన్నీ షరా మామూలే.

కాగా ఈశ్వర్ చిత్రంతో తెరంగేట్రం చేసిన  ప్రభాస్  వర్షం, ఛత్రపతి, బిల్లా తదితర సినిమాల్లో తన టాలెంట్ను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, డార్లింగ్ చిత్రాలతో  క్లాస్,  మాస్ ఏదయినా తనకు తిరుగులేదని  నిరూపించుకున్నాడు. ఇక ఆ తర్వాత  బాహుబలితో  ప్రభంజనాన్నే సృష్టించాడు.  పూర్తి ఫిట్నెస్ బాడీతో.. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కన్నుకుట్టే రేంజ్లో ప్రభాస్, బాహుబలి-1లోని శివుడు పాత్ర కోసం తన బరువును 130 కిలోలకు పెరిగిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement