
‘పెంపుడు కుక్క పిల్ల’.. అనగానే ముద్దుగా మన కాళ్లకు అడ్డుపడే బుజ్జి కుక్కపిల్ల మనకు గుర్తుకువస్తుంది. అయితే దీనికి భిన్నంగా 45 కిలోల బరువైన భారీ కుక్క పిల్లను మీరు ఎప్పుడైనా చూశారా? దాని ఆకారం చూసి కూడా దానిని ఒడిలోకి తీసుకుని దాని యజమాని మురిసిపోతుంటాడు.
ఆరడుగుల పొడవు, దాదాపు 45 కేజీల బరువున్న ఈ బుల్ డాగ్ పేరు రోల్ఫ్. భారీ ఆకారం ఉన్నప్పటికీ అది బుజ్జి కుక్క పిల్ల మాదిరిగానే ప్రవర్తిస్తుంటుంది. దాని యజమాని క్రెయిగ్ కూడా దానిని ఒడిలో పెట్టుకుని మురిసిపోతుంటాడు. దాని చేష్టలు చూసి, దీనికి ఇంకా చిన్నతనం పోలేదని అందరికీ చెబుతుంటాడు.
క్రెయిగ్ కొన్నేళ్ల క్రితం స్ట్రోక్‌తో నడవలేకపోయేవాడు. అదే సమయంలో రోల్ఫ్‌ను ఇంటికి తీసుకువచ్చాడు. రోల్ఫ్ రాకతో తన జీవితమే మారిపోయిందని. క్రెయిగ్ చెప్పాడు. రోల్ఫ్ అతని జీవితాన్ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకువచ్చేందుకు సహాయపడిందట. తాను అనారోగ్యం నుంచి కోలుకున్నానంటే దానికి రోల్ఫ్ కారణమని క్రెయిగ్ చెబుతుంటాడు. సాధారణంగా శునకాలు వయసే పెరిగేకొద్దీ తమ చేష్టలను తగ్గిస్తుంటాయి. అదే సమయంలో తమ యజమానిపై ప్రేమను కురిపిస్తాయి. అయితే రోల్ఫ్ విషయంలో దాని వయసు, ఆకారం పెరిగినా అది పిల్ల చేష్టలను ఇంకా మానలేదట.
Comments
Please login to add a commentAdd a comment