మనిషి భూమి నలుచెరగులా తిరిగాడని, ఇక చూడాల్సినది ఏమీ లేదని అనుకుంటే అది తప్పే అవుతుంది. నేటికీ భూమిపై అన్వేషించేందుకు చాలా రహస్యాలు దాగివున్నాయి. 375 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇటీవలే శాస్త్రవేత్తలు భూమికి గల 8వ ఖండం అయిన జిలాండియాను కనుగొన్నారు. ఈ ఖండం చాలా పెద్దది. పలు చిన్న దేశాలకు ఇందులో వసతి కల్పించవచ్చు. ఈ ఖండానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది చాలా ఏళ్లుగా దాగున్న ఖండం అని చెబుతారు. 2017 సంవత్సరం వరకు ఈ ఖండం గురించి ఎవరికీ తెలియదు. అయితే ఈ ఏడాది కొందరు శాస్త్రవేత్తలు దీని గురించి ప్రస్తావించడంతో ప్రపంచం దృష్టి ఈ ఖండంవైపు మళ్లింది. ఈ 8వ ఖండం 49 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని పలు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. దీని ఉనికి విషయానికొస్తే ఈ ఖండం దాదాపు 55 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఖండంలోని 94 శాతం భూభాగం నీటిలో మునిగిపోయింది. 6 శాతం భూమి మాత్రమే అందుబాటులో ఉంది. ఇది న్యూజిలాండ్ మాదిరిగా కనిపిస్తుంది. ఈ ఖండం చాలా ప్రత్యేకమైనది. అగ్నిపర్వత శిలలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కనిపించే జంతువులు, జీవులు ప్రపంచంలోని ఇతర జీవులకు భిన్నంగా కనిపిస్తాయి. ఈ ఖండంలో దాగున్న రహస్యాలను వెలికితీసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: భారత్‌లో ఆఫ్ఘన్ ఎంబసీ మూసివేత!
Comments
Please login to add a commentAdd a comment