ఢిల్లీ: యమునా నది ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. బుధవారం రికార్డ్ స్థాయిని దాటిందని అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం 4 గంటల సమయంలో యమునా నది ఢిల్లీ ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ వద్ద 207 మీటర్ల మేర ప్రవహించింది. అదే.. సాయంత్రం 4 గంటలకు వచ్చేసరిగా మరో 0.71 పెరిగి 207.71గా నమోదైందని సెంట్రల్ వాటర్ కమీషన్(సీడబ్ల్యూసీ) తెలిపింది.
దీంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు త్వరగా ఖాలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏ మాత్రం వేచి చూడరాదని తెలిపారు. నది ప్రవాహాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని పరిమిత స్థాయిలో విడుదల చేయాలని కేంద్ర హూం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
Arvind Kejriwal's SOS To Centre As Yamuna Flows At All-Time High https://t.co/sUT5bOloRM pic.twitter.com/YNjWK8z8lp
— NDTV News feed (@ndtvfeed) July 12, 2023
యమునా నది బుధవారం రికార్డ్ స్థాయిని దాటిందని అధికారులు తెలిపారు. 1978 నాటి 207.49 మీటర్లను దాటింది. దీంతో సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు త్వరగా ఖాలీ చేయాలని కోరారు. యమునా నది ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతానికి దగ్గరగా ఉన్న వేల మందిని ఇప్పటికే పునరావాస ప్రాంతాల్లోకి తరలించామని తెలిపారు. నదీ సమీప ప్రాంతాల్లో రాకపోకలపై అధికారులు నిషేధాజ్ఞాలు జారీ చేశారు.
"Beds Stacked Vertically": Desperation Kicks In As Water Enters Delhi Houses@Priyanshi50 reports pic.twitter.com/0VxpYdjZMg
— NDTV (@ndtv) July 12, 2023
'దేశ రాజధానికి వరద సూచన ప్రపంచ దేశాలకు సరైన మెసేజ్‌ను ఇవ్వదు. ఢిల్లీ ప్రజలను కలిసి కాపాడదాం. ఈ రోజు రాత్రికి యమున నది 207.72కు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ తెలిపింది.' త్వరలో ఢిల్లీలో జీ-20 సమావేశం జరగనున్న నేపథ్యంలో యుమునా వరదను త్వరగా తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కేజ్రీవాల్ కోరారు.
Central Water Commission predicts 207.72 meter water level in Yamuna tonite. Not good news for Delhi.
— Arvind Kejriwal (@ArvindKejriwal) July 12, 2023
There have been no rains in Delhi last 2 days, however, levels of Yamuna are rising due to abnormally high volumes of water being released by Haryana at Hathnikund barrage.… pic.twitter.com/3D0SI2eYUm
గత రెండు రోజులుగా ఢిల్లీలో వర్షం రాకపోయినా యమునా నది వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఢిల్లీకి పైన ఉన్న హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరఖండ్‌లో వర్షాల కారణంగా వరద యమునకు పోటెత్తుతోంది. ఢిల్లీ పైన ఉన్న హర్యానాలోని హత్నీకుండ్ డ్యామ్ నుంచి నీటిని అధికంగా విడుదల చేయడం వల్ల యుమున నది ప్రవాహం పెరుగుతోంది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన కేజ్రీవాల్.. ఆ డ్యామ్ నుంచి పరిమితంగా నీటిని విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.
#WATCH | Water level of river Yamuna continues to rise in Delhi. Visuals from Old Railway Bridge.
— ANI (@ANI) July 12, 2023
Today at 8 am, water level of the river was recorded at 207.25 metres at the Bridge, inching closer to the highest flood level - 207.49 metres. The river is flowing above the… pic.twitter.com/e46LLHdeVe
యమునా నది కరకట్టలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం సరైన చర్యలను తీసుకుంటోందని ఢిల్లీ రెవెన్యూ మంత్రి అతిషి తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించామని వెల్లడించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ప్రభుత్వాలు హామీలు ఇవ్వడం తప్పా క్షేత్ర స్థాయిలో చేసిందేమీ లేదని ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు.
Mathura, Uttarakhand | The water level of the Yamuna River is increasing due to rain. All the police stations along the banks of the river have been instructed to increase vigilance in the area. Coordination is also being established with other agencies so that if there is… pic.twitter.com/lHHAVVTn6f
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 11, 2023
ఇదీ చదవండి: Yamuna Rivar: డేంజర్ మార్క్ దాటి మహోగ్రంగా ప్రవహిస్తున్న యమునా.. ఢిల్లీ హై అలర్ట్..
Comments
Please login to add a commentAdd a comment