evacuated
-
సిరియా నుంచి బయటపడిన 75 మంది భారతీయులు
-
Israel-Hamas war: వెళ్లిపోవాల్సిందే...రఫా ప్రజలకు మరోసారి ఇజ్రాయెల్ అల్టిమేటమ్
రఫా(గాజా స్ట్రిప్): గాజా దక్షిణాన ఉన్న చిట్టచివరి పెద్ద పట్టణం రఫాలో లక్షలాది మంది జనం ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. రఫాను ఖాళీచేసి వెళ్లాలని జనాలకు ఇజ్రాయెల్ సైనికబలగాలు మరోసారి ఆదేశించాయి. ఉత్తర దిశ నుంచి మొదలెట్టి దక్షిణం దిశగా భూతల దాడులతో ఆక్రమణలు, దాడులను ఇజ్రాయెల్ సైన్యం కొనసాగిస్తోంది. అమెరికా, ఇతర మిత్రదేశాలు దూకుడు తగ్గించాలని మొత్తుకుంటున్నా ఇజ్రాయెల్ తన దాడులను ఆపట్లేదు. హమాస్ సాయుధుల ప్రతిదాడులతో శనివారం రఫా శివారుప్రాంతాలు భీకర రణక్షేత్రాలుగా మారిపోయాయి. రఫా తూర్పున మూడింట ఒక వంతు భూభాగంలో జనాలను ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఇప్పటికే ఖాళీచేయించింది. రఫా మొత్తాన్ని ఖాళీచేయించే దుస్సాహసానికి దిగితే మానవతా సాయం చాలా కష్టమవుతుందని, అమాయక పౌరుల మరణాలు మరింత పెరుగుతాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది. -
మణిపూర్‌లో ఆరని కాష్టం.. మళ్ళీ అల్లర్లు
ఇంఫాల్: నాలుగు నెలల క్రితం మణిపూర్‌లో రగిలిన హింస తాలూకు కాష్టం ఇంకా మండుతూనే ఉంది. తాజాగా వారం రోజుల క్రితం ఆగస్టు 29న మరోసారి ఇంఫాల్‌లో హింసాకాండ రగులుకుంది. ఈ హింసలో మరో 8 మంది మరణించగా 20 మంది గాయపడ్డారు. దీంతో ఇంఫాల్‌లో మిగిలిన కుకీ కుటుంబాలను బలవంతంగా కొండ ప్రాంతాలకు తరలించాయి సాయుధ దళాలు. మెయిటీలు అత్యధికంగా నివసించే పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని లంబులానే ప్రాంతం నుండి అక్కడ మిగిలి ఉన్న స్వల్ప సంఖ్యాకులైన కుకీలను బలవంతంగా కొండప్రాంతానికి తరలించాయి అక్కడి భద్రతా దళాలు. శుక్రవారం అర్ధరాత్రి సాయుధ దళాలు తమ ఇంటిని తలుపులను బలంగా కొట్టి నిద్రలో ఉన్నవారికి ఎక్కడికి వెళ్ళేది చెప్పకుండా తరలించారని అన్నారు అక్కడ నివసించే ఓ పెద్దాయన. లంబులానే ప్రాంతం నుండి తరలించబడింది రెవరెండ్ ప్రిమ్ వైఫే, హెజాంగ్ కిప్జెన్ తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 1,2 తేదీల్లో అర్ధరాత్రి అందరూ నిద్రలో ఉండగా కేంద్ర భద్రతా దళాలు కనీసం తమ వస్తువులను వెంట తెచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా కట్టుబట్టలతోనే తమను బలవంతంగా బయటకు లాక్కుని వచ్చారని అక్కడే ఉన్న బులెట్ ప్రూఫ్ వాహనాల్లోకి ఎక్కించి కుకీలు ఎక్కువగా నివసించే కంగ్పోక్పి జిల్లాలోని మోట్‌బంగ్ ప్రాంతానికి తరలించారని అన్నారు. కేంద్ర భద్రతా దళాలు మాకు భద్రతా కల్పించాల్సింది పోయి ఇలా బలవంతంగా మమ్మల్ని తరలించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాము. భారతదేశం లాంటి మహోన్నత దేశం సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడటంలో విఫలమై సంఘ వ్యతిరేక శక్తుల ప్రలోభాలకు లొంగిపోయి పౌరులకు భద్రత కల్పించడంలో మన వ్యవస్థ దారుణంగా విఫలమైందని అన్నారు. ఈ బలవంతపు తరలింపులో భద్రతా దళాలు మొత్తం 10 కుటుంబాలకు చెందిన 24 మందిని తరలించామని భద్రతా దళాలు చెబుతున్నాయి. ఆగస్టు 27న లంబులానే ప్రాంతంలో అల్లరి మూకలు మూడు పాతబడ్డ ఇళ్లను దహనం చేశారని మిగిలిన వారికి కూడా ప్రమాదం పొంచి ఉందని సమాచారం రావడంతో వారిని హుటాహుటిన అక్కడి నుండి సురక్షితమైన ప్రాంతానికి తరలించామని తెలిపారు. మెయిటీలకు గిరిజన తెగగా గుర్తింపునిచ్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించిన నేపథ్యంలో మే 3న మణిపూర్‌లో అల్లర్లు చెలరేగాయి. నెలరోజులకు పైగా కొనసాగిన ఈ హింసాకాండలో 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా సుమారు 50000 మంది తమ ఇళ్లను విడిచిపోయారు. రాష్ట్రమంతటా ప్రస్తుతం పరిస్థితి సద్దుమణిగినట్టే అనిపించినా ఈ మధ్యనే పశ్చిమ ఇంఫాల్‌లో మళ్ళీ అల్లర్లు జరగడంతో ఇంఫాల్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇది కూడా చదవండి: సర్జికల్ స్ట్రైక్ హీరో చేతికి మణిపూర్ అల్లర్ల బాధ్యతలు -
డేంజర్లో ఢిల్లీ.. కేజ్రీవాల్ కీలక ప్రకటన..
ఢిల్లీ: యమునా నది ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. బుధవారం రికార్డ్ స్థాయిని దాటిందని అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం 4 గంటల సమయంలో యమునా నది ఢిల్లీ ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ వద్ద 207 మీటర్ల మేర ప్రవహించింది. అదే.. సాయంత్రం 4 గంటలకు వచ్చేసరిగా మరో 0.71 పెరిగి 207.71గా నమోదైందని సెంట్రల్ వాటర్ కమీషన్(సీడబ్ల్యూసీ) తెలిపింది. దీంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు త్వరగా ఖాలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏ మాత్రం వేచి చూడరాదని తెలిపారు. నది ప్రవాహాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని పరిమిత స్థాయిలో విడుదల చేయాలని కేంద్ర హూం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. Arvind Kejriwal's SOS To Centre As Yamuna Flows At All-Time High https://t.co/sUT5bOloRM pic.twitter.com/YNjWK8z8lp — NDTV News feed (@ndtvfeed) July 12, 2023 యమునా నది బుధవారం రికార్డ్ స్థాయిని దాటిందని అధికారులు తెలిపారు. 1978 నాటి 207.49 మీటర్లను దాటింది. దీంతో సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు త్వరగా ఖాలీ చేయాలని కోరారు. యమునా నది ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతానికి దగ్గరగా ఉన్న వేల మందిని ఇప్పటికే పునరావాస ప్రాంతాల్లోకి తరలించామని తెలిపారు. నదీ సమీప ప్రాంతాల్లో రాకపోకలపై అధికారులు నిషేధాజ్ఞాలు జారీ చేశారు. "Beds Stacked Vertically": Desperation Kicks In As Water Enters Delhi Houses@Priyanshi50 reports pic.twitter.com/0VxpYdjZMg — NDTV (@ndtv) July 12, 2023 'దేశ రాజధానికి వరద సూచన ప్రపంచ దేశాలకు సరైన మెసేజ్‌ను ఇవ్వదు. ఢిల్లీ ప్రజలను కలిసి కాపాడదాం. ఈ రోజు రాత్రికి యమున నది 207.72కు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ తెలిపింది.' త్వరలో ఢిల్లీలో జీ-20 సమావేశం జరగనున్న నేపథ్యంలో యుమునా వరదను త్వరగా తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కేజ్రీవాల్ కోరారు. Central Water Commission predicts 207.72 meter water level in Yamuna tonite. Not good news for Delhi. There have been no rains in Delhi last 2 days, however, levels of Yamuna are rising due to abnormally high volumes of water being released by Haryana at Hathnikund barrage.… pic.twitter.com/3D0SI2eYUm — Arvind Kejriwal (@ArvindKejriwal) July 12, 2023 గత రెండు రోజులుగా ఢిల్లీలో వర్షం రాకపోయినా యమునా నది వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఢిల్లీకి పైన ఉన్న హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరఖండ్‌లో వర్షాల కారణంగా వరద యమునకు పోటెత్తుతోంది. ఢిల్లీ పైన ఉన్న హర్యానాలోని హత్నీకుండ్ డ్యామ్ నుంచి నీటిని అధికంగా విడుదల చేయడం వల్ల యుమున నది ప్రవాహం పెరుగుతోంది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన కేజ్రీవాల్.. ఆ డ్యామ్ నుంచి పరిమితంగా నీటిని విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. #WATCH | Water level of river Yamuna continues to rise in Delhi. Visuals from Old Railway Bridge. Today at 8 am, water level of the river was recorded at 207.25 metres at the Bridge, inching closer to the highest flood level - 207.49 metres. The river is flowing above the… pic.twitter.com/e46LLHdeVe — ANI (@ANI) July 12, 2023 యమునా నది కరకట్టలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం సరైన చర్యలను తీసుకుంటోందని ఢిల్లీ రెవెన్యూ మంత్రి అతిషి తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించామని వెల్లడించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ప్రభుత్వాలు హామీలు ఇవ్వడం తప్పా క్షేత్ర స్థాయిలో చేసిందేమీ లేదని ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు. Mathura, Uttarakhand | The water level of the Yamuna River is increasing due to rain. All the police stations along the banks of the river have been instructed to increase vigilance in the area. Coordination is also being established with other agencies so that if there is… pic.twitter.com/lHHAVVTn6f — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 11, 2023 ఇదీ చదవండి: Yamuna Rivar: డేంజర్ మార్క్ దాటి మహోగ్రంగా ప్రవహిస్తున్న యమునా.. ఢిల్లీ హై అలర్ట్.. -
ముమ్మరంగా 'ఆపరేషన్ కావేరి'.. సూడాన్ నుంచి మరో 135 మంది తరలింపు
సూడాన్ అంతర్గత యుద్ధంలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ పేరుతో చర్యలు చేపట్టింది. భారత వాయుసేన, నావికా దళాల ద్వారా దశల వారీగా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా పూడాన్ నుంచి మూడో బ్యాచ్ కూడా బయల్దేరింది. సూడాన్ నుంచి మరో 135 మంది భారతీయులతో రెండో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ C-130J విమానం సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నట్లు విదేశీవ్యవహారాల సహాయమంత్రి వి మురళీధరన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అంతకుముందు మొదటి బ్యాచ్‌లో భాగంగా భారత నావికాదళానికి చెందిన ‘ఐఎన్ఎస్ సుమేధ’ ద్వారా 278 మంది ప్రయాణికులు సూడాన్ పోర్టు నుంచి సౌదీకి చేరుకున్నారని విదేశీ వ్యవహారాలశాఖ పేర్కొంది. రెండో భాచ్‌లో 148 మంది భారతీయులను తొలి విమానంలో స్వదేశానికి తరలించినట్లు తెలిపింది. అయితే వీరిలో 160 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. కాగా సూడాన్‌లో 3 వేల మందికిపైగా భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. Third batch comprising 135 Indians from Port Sudan arrived in Jeddah by IAF C-130J aircraft. Onward journey to India for all who arrived in Jeddah will commence shortly. #OperationKaveri pic.twitter.com/OHhC5G2Pg8 — V. Muraleedharan (@MOS_MEA) April 26, 2023 -
Operation Kaveri: సూడాన్‌ను వీడిన 278 మంది భారతీయులు
న్యూఢిల్లీ: హింస, అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సూడాన్ నుంచి భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కావేరి’ మొదలైంది. భారత నౌకాదళానికి చెందిన ‘ఐఎన్ఎస్ సుమేధ’ నౌక తొలి విడతగా 278 భారతీయులతో మంగళవారం సూడాన్ పోర్టు నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాకు బయలుదేరింది. విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఈ మేరకు ట్వీట్ చేశారు. వారిని భారత్ చేర్చేందుకు జెడ్డాలో రెండు విమానాలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ఆక్రమణలో సూడాన్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ మరోవైపు.. సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లోని నేషనల్ హెల్త్ ల్యాబ్ ఆక్రమణకు గురైందని ఐక్యరాజ్యసమితి మంగళవారం వెల్లడించింది. వైరి పక్షాలైన ఆర్మీ, ఆర్ఎస్ఎఫ్(ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్)లో ఒకరు ఈ ల్యాబ్‌ను ఆధీనంలోకి తీసుకున్నట్లు తెలిపింది. 12 రోజులుగా ఆగని ఆధిపత్య పోరుతో సామాన్యులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న వేళ ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూడాన్ ప్రతినిధి డాక్టర్ నీమా సయీద్ అబిడ్ అన్నారు. ల్యాబ్‌లో కలరా, మీజిల్స్, పోలియో తదితర వ్యాధికారక వైరస్లు, బ్యాక్టీరియాలున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ల్యాబ్‌కు అతి సమీపంలోనే ఆర్మీ, ఆర్ఎస్ఎఫ్ భీకర పోరు సాగిస్తున్నాయి. సూడాన్‌లోని మూడో వంతు అంటే 1.6 కోట్ల మందికి తక్షణం సాయం అవసరమని ఐరాస అంచనా వేసింది. -
సుమీ నుంచి సురక్షితంగా బయటకు
న్యూఢిల్లీ: రష్యా భీకర దాడులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ నగరం సుమీలో చిక్కుకుపోయిన విద్యార్థులకు, భారత్‌లోని వారి తల్లిదండ్రులకు పెద్ద ఊరట లభించింది. నగరంలో ఉన్న మొత్తం 694 మంది విద్యార్థులను బస్సుల్లో సురక్షిత ప్రాంతానికి తరలించారు. మంగళవారం వీరంతా అక్కడికి 175 కి.మీ.ల దూరంలోని పోల్టావాకు చేరుకున్నారు. అక్కడి నుంచి రైళ్ల ద్వారా పశ్చిమ ఉక్రెయిన్‌కు తరలిస్తామని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ చెప్పారు. అక్కడి నుంచి ఆపరేషన్ గంగ కార్యక్రమంలో భాగంగా అందరినీ విమానాల్లో స్వదేశానికి తీసుకువస్తామన్నారు. అయితే, ఏ బోర్డర్ పాయింట్ వద్ద నుంచి ఈ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయం ఆయన తెలపలేదు. యుద్ధ తీవ్రతరమవుతున్న ప్రాంతంలో ఉక్రెయిన్, రష్యా ఆర్మీ సాయంతో మానవీయ కారిడార్ల గుండా విద్యార్థుల తరలింపు ప్రక్రియ సురక్షితంగా కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. ఇలా ఉండగా, ఉక్రెయిన్ నుంచి రొమేనియాలోని సుసీవా అనే ప్రాంతానికి చేరిన 410 మంది భారతీయులను రెండు విమానాల్లో స్వదేశానికి తీసుకువస్తున్నట్లు విమానయాన శాఖ తెలిపింది. మైకోలైవ్‌లో చిక్కుకుపోయిన 52 మంది నావికులను సురక్షిత ప్రాంతానికి తీసుకువచ్చారు. (చదవండి: పాక్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం) -
యుద్ధానికి బ్రేక్ వేసింది అందుకే! తరలించేందుకు సహకరిస్తాం!
Russia Says In UN Security Council meeting: ఉక్రెయిన్ పై రష్యా పది రోజులుగా దాడి కొనసాగిస్తూనే ఉంది. దీంతో ఉక్రెయిన్‌లో ప్రధాన నగరాలు వైమానిక క్షిపణులు, బాంబుల దాడులతో అత్యంత దయనీయంగా మారాయి. ఈ మేరకు రష్యా ఉక్రేయిన్‌లో చిక్కుకున్న విదేశీయులను, భారతీయులను తరలించే నిమిత్తం యుద్ధానికి బ్రేక్ వేసింది కూడా. అంతేగాక ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను, ఇతర విదేశీయులను తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి తెలియజేసింది. పైగా వారిని తరలించడానికి తూర్పు ఉక్రెయిన్ నగరాలైన ఖార్కివ్, సుమీకి వెళ్లడానికి రష్యా బస్సులు క్రాసింగ్ పాయింట్ల వద్ద సిద్ధంగా ఉన్నాయని కూడ స్పష్టం చేసింది. ఐరోపాలో అతి పెద్దదైన ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడి చేయడంతో అంతర్జాతీయ భద్రతా మండలి అల్బేనియా, ఫ్రాన్స్, ఐర్లాండ్, నార్వే, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ వంటి 15 దేశాలతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విదేశీయులను శాంతియుతంగా తరలించేందుకు రష్యా సైన్యం అన్ని విధాలా కృషి చేస్తోందని రష్యా రాయబారి రాయబారి వాసిలీ నెబెంజియా తెలిపారు. ఉక్రెయిన్ జాతీయవాదులు తూర్పు ఉక్రెయిన్‌లోని ఖార్కివ్, సుమీ నగరాల్లో 3,700 మంది భారతీయ పౌరులను బలవంతంగా ఉంచుతున్నారని ఆయన ఆరోపించారు. ఉక్రెయిన్ శాశ్వత ప్రతినిధి, ఐక్యరాజ్యసమితి రాయబారి సెర్గి కిస్లిత్సా రష్యా రాయబారి నెబెంజియాతో మాట్లాడుతూ.."దయచేసి అసత్య ప్రచారాలను ఆపండి. విదేశీ విద్యార్థులు ఆందోళన చెందుతున్న ప్రాంతాలను విడిచిపెట్టడానికి సురక్షితమైన కారిడార్‌ను నిర్ధారించేలా సాయుధ దళాలకు (రష్యా) విజ్ఞప్తి చేయండి. అని కోరారు. అంతేకాదు మీరు నిజంగా ఉక్రెయిన్ రాజధానితో సంబంధంలో ఉంటే అక్కడ ఏమి జరుగుతుందో మీకు బాగా తెలుసు" అని వ్యగ్యంగా అన్నారు. (చదవండి: జెలెన్ స్కీ తీవ్ర ఆవేదన.. బాంబులు వేసేందుకే ఇలా చేశారా..) -
అఫ్గాన్ నుంచి భారత్‌కు వచ్చిన 146 మందిలో ఇద్దరికి కరోనా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా డెల్టా వేరియంట్ కలకలం, మరోవైపు భారత్‌లో కరోనా మహమ్మారి మూడో దశ తరుముకొస్తున్న తరుణంలో కీలక పరిణామం ఆందోళన పుట్టిస్తోంది. అఫ్గానిస్తాన్ సంక్షోభంతో మన దేశానికి తిరిగి వచ్చిన ప్రయాణీకుల్లో ఇద్దరికి కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలం రేపింది. సోమవారం అఫ్గానిస్తాన్‌నుంచి నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన 146 మందిలో ఇద్దరికి కోవిడ్-19 సోకింది. ఈవి షయాన్ని ఢిల్లీ ప్రభుత్వ నోడల్ ఆఫీసర్ రాజీందర్ కుమార్ ధృవీకరించారు. విదేశీయులకు అమలు చేస్తున్న ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు నిర్వహించగా ఈ విషయం తేలిందన్నారు. వీరిని ఢిల్లీలోకి లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. అయితే బాధితుల వివరాలు వెల్లడి కాలేదు. మరోవైపు తాలిబన్లకు వ్యతిరేకంగా అఫ్గన్ల ఆందోళన, కాబూల్ విమానాశ్రయంలో గుంపులు గుంపులుగా తరలివచ్చిన నేపథ్యంలో అక్కడి కరోనా వ్యాప్తి పరిస్థితిపై ఆందోళన నెలకొంది. మరోవైపు తాలిబన్ల పరిస్థితి ఏంటనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు తాలిబన్లు మాస్క్ ధరించలేదంటూ స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ విమర్శలను గుర్తు చేసుకుంటున్నారు. చదవండి : Afghanistan: తీవ్ర పరిణామాలు, అమెరికాకు తాలిబన్ల వార్నింగ్! ఇక అఫ్గానిస్తాన్ తాలిబన్ల ఆధీనంలోకి రావడం మొదలు జనం బెంబేలెత్తిపోతున్నారు. దీంతో సాధ్యమైనంత త్వరగా దేశం విడిచి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజుకు రెండు విమానాల ద్వారా అక్కడ చిక్కుకున్న తమ పౌరులను తరలించేందుకు ఇండియా అనుమతి పొందింది. ఇందులో భాగంగా కాబూల్ విమానాశ్రయంనుండి దోహా మీదుగా 146 మంది భారతీయులతో కూడిన విమానం సోమవారం ఉదయం దేశ రాజధానికి చేరుకున్న సంగతి తెలిసిందే. తొలివిడతలో ఆదివారం మూడు వేర్వేరు విమానాలలో 329 మంది పౌరులతో సహా దాదాపు 400 మంది తిరిగి వచ్చారు. వీరిలోభారత పౌరులతో పాటు సిక్కులు, అఫ్గన్ హిందువులున్నారు. అలాగే అఫ్గాన్‌లో భారత రాయబారి, ఇతర దౌత్యవేత్తలతో సహా దాదాపు 180 మంది ప్రయాణికులను సురక్షితంగా ఇప్పటికే భారత్‌కు చేరుకున్నారు. చదవండి : Afghanistan: తొలి ఫత్వా జారీ చేసిన తాలిబన్లు.. అనుకున్నదే అయింది! -
Mallanna Sagar: ముల్లె సర్దుకున్న.. ఎళ్లిపోతావున్న
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు నర్సమ్మ. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో ఇల్లు, వ్యవసాయ భూమి కోల్పోయింది. కోల్పోయిన ఇంటికి అధికారులు పరిహారం అందించారు కానీ, సాగు భూమి 1.7 ఎకరాలకు సంబంధించిన పరిహారం అందించలేదు. దీంతో రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని వడ్డెర కాలనీలోనే నివాసం ఉంటోంది. మంగళవారం అధికారులు ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించడంతో ఖాళీ చేసింది. ఊరిని వదిలిపెట్టి పోతున్నా అంటూ కన్నీటి పర్యంతం అయింది. ఆ భూమికి డబ్బులు ఇచ్చి మా కుటుంబాన్ని అదుకోవాలని అధికారులను వేడుకుంది. సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో 50 టీఎంసీల సామర్థ్యంతో కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ పనులు చివరి దశకు చేరడంతో ముంపు గ్రామాలను పూర్తి స్థాయిలో ఖాళీ చేయిస్తున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌లో 8 గ్రామ పంచాయతీలలో 16 గ్రామాలు ముంపు నకు గురవుతున్నాయి. ముంపు గ్రామాల్లో 5,618 కుటుంబాలు నివాస గృహాలు, భూమి కోల్పోతున్నట్లు గుర్తించారు. పరిహారం 90% వరకు అందించారు. ఒంటరి మహిళలు, పురు షులు, పలువురికి ఎలాంటి పరిహారం అందక పోవడంతో అక్కడే నివాసం ఉన్నారు. కొముర వెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్ట్‌లోకి త్వరలో నీటిని వదలనుండటంతో ముంపు గ్రామాలను పూర్తి స్థాయిలో ఖాళీ చేయిస్తున్నారు. రెండు రోజు లుగా అధికారులు డీసీఎంలను పంపించి నివాసితులను మరోచోటకు పంపిస్తున్నారు. మంగళవారం 25 మంది నిర్వాసితులకు త్వరలో డబ్బులు అందజేస్తాం అని చెప్పి ఖాళీ చేయించారు. ఒక పక్కన గృహాలు ఖాళీ చేయిస్తూనే, మరో పక్క జేసీబీలతో ఇళ్లను నేలమట్టం చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు ఊరి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. మళ్లీ కలుసుకుంటామో లేదో అని రోదించారు. ఇంట్లోనుంచి వస్తూ గుమ్మాలను, గోడలను అప్యాయంగా తడుముకుంటూ వెళ్లడం అందరినీ కంటతడి పెట్టించింది. -
రాత్రికి రాత్రే ఊరు ఖాళీ
తొగుట(దుబ్బాక): కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింది ముంపు గ్రామం రాంపురం మదిర వడ్డెర కాలనీ వాసులను సోమవారం రాత్రికి రాత్రే అధికారులు ఖాళీ చేయించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ కాలనీలో సుమారు 75 కుటుంబాలు నివాసముంటున్నాయి. అందులో మెజార్టీ కుటుంబాలు ఇప్పటికే గ్రామం నుంచి వెళ్లి పోగా సోమవారం రాత్రి 30 డీసీఎంలు తీసుకుని తహసీల్దార్ బాల్‌రెడ్డి, ఆర్ఐ రవీందర్ కాలనీకి వచ్చారు. కాగా తమకు నష్టపరిహారం పూర్తిస్థాయిలో చెల్లించకుండా ఎలా ఖాళీ చేయిస్తారంటూ నిర్వాసితులు అధికారులతో గొడవకు దిగారు. అర్ధరాత్రి తాము ఎక్కడికి వెళ్లేదంటూ మహిళలు, పురుషులు బోరున విలపించారు. అర్హులైన వారికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లింస్తుందంటూ అధికారులు వారికి నచ్చజెప్పారు. రెండు మూడు రోజుల్లో రిజర్వాయర్‌లోకి నీరు వదిలేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారులు వారికి వివరించారు. ఎట్టకేలకు వడ్డెర కాలనీలోని సుమా రు 30 కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. -
ఆయుధాల డిపోలో భారీ మంటలు
మాస్కో: రష్యాలో మందు గుండు సామాగ్రి డిపోలో భారీ మంటలు చెలరేగాయి. మాస్కోకు ఆగ్నేయంగా ఉన్న రియాజాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. దాంతో అధికారులు రియాజాన్ చుట్ట పక్కల ఉన్న 10 గ్రామాల నుంచి జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక మీడియా తెలిపింది. నివేదికల ప్రకారం ఆర్మ్స్ డిపో సమీపంలో మందపాటి పొగ గాలిలో పైకి లేవడాన్ని చూడవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోలో బూడిద ఆకాశం నుంచి పడటం గమనించవచ్చు. సమీప పొలంలోని మంటలు గాలి ప్రసారం వల్ల డిపోకి తగలడంతో మంటలు చెలరేగినట్లు రష్యా మిలిటరీ టాస్(టీఏఎస్ఎస్) వార్తా సంస్థ పేర్కొంది. (చదవండి: బస్సులో మంటలు.. 13 మంది సజీవదహనం) Rusya'nın Ryazan bölgesinde bulunan askeri depolarda art arda büyük patlamalar meydana geldi. pic.twitter.com/1bg4Uq6EVv — diktatör_yobaz (@zelihagulep1966) October 7, 2020 ఈ ఘటనలో ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం గానీ సంభవించినట్లు నివేదికలు లేవు. ఇక ఈ ప్రమాదంపై రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ స్పందించింది. ప్రమాదం సంభవించిన మోటారు మార్గాన్ని మూసి వేస్తున్నామని.. చుట్టు పక్కల ఐదు కిలోమీటర్ల మేర 10 గ్రామాలను ఖాళీ చేయించామని తెలిపింది. -
మిచిగాన్‌ను ముంచెత్తిన వరద: అత్యవసర పరిస్థితి
వాషింగ్టన్: ఇప్పటికే కరోనా వైరస్ సంక్షోభంతో విలవిల్లాడుతున్న అమెరికాలోని మిచిగాన్ మరో తీవ్ర ప్రమాదంలో చిక్కుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మిచిగాన్‌ను అసాధారణమైన వరద ముంచెత్తింది. వరద ఉధృతికి ఈడెన్‌విల్లే, శాన్ఫోర్డ్ ఆనకట్టలు తెగిపోయాయి. దీంతో రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వేగంగా పెరుగుతున్న నీరు ఆనకట్టలను ముంచెత్తింది. రికార్డు స్థాయిలో వరదనీరు ముంచెత్తడంతో సమీప ప్రాంతాలన్నీ జల దిగ్భంధనంలో చిక్కుకున్నాయి. ఈడెన్ విల్లే, శాన్ఫోర్డ్, మిడ్ ల్యాండ్ నగరాలను ఖాళీ చేయించారు. సుమారు 10,000 మందిని సురక్షిత ప్రారంతాలకు తరలించారు. అటు నేషనల్ వెదర్ సర్వీస్ కూడా దీన్ని ‘ప్రాణాంతక పరిస్థితి’ గా పేర్కొంది. DAM BURST: Residents who live along two lakes and a river in Michigan urged to evacuate after dam fails following days of heavy flooding across parts of the Midwest. https://t.co/EwlVQl6Fdm pic.twitter.com/HfDKWkulDz — ABC News (@ABC) May 20, 2020 రాబోయే 12 నుండి 15 గంటలలో, మిడ్‌లాండ్ దిగువప్రాంతం సుమారు 9 అడుగుల లోతు నీటిలో చిక్కుకోవచ్చని మిచిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మెర్ మంగళవారం చెప్పారు. ఇలాంటి ప్రమాదాన్ని ఎపుడూ చూడలేదనీ, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఖాళీ చేయాలని ప్రజలను ఆమె కోరారు. అటు మిడ్‌ల్యాండ్ ప్రధాన కార్యాలయం ఖాళీ చేశారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి అవసరమైన సిబ్బంది మాత్రమే అక్కడ ఉన్నారు. మరోవైపు 500 సంవత్సరాల తరువాత 1986లో ఏర్పడిన వరద పరిస్థితి రానుందని, టిట్టాబావాస్సీ నది నీటి మట్టం 38 అడుగుల రికార్డు ఎత్తుకు పెరగనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
గోవాలో విషపూరిత గ్యాస్ లీక్.. ఊరు మొత్తం ఖాళీ
-
విషపూరిత గ్యాస్ లీక్.. ఊరు మొత్తం ఖాళీ
పనాజీ : గోవాలో విషపూరిత గ్యాస్ లీక్ కావటంతో ఓ ఊరు మొత్తం ఖాళీ చేయాల్సి వచ్చింది. అమ్మోనియా గ్యాస్‌ను తీసుకెళ్తున్న ఓ ట్యాంకర్ ప్రమాదానికి గురై గ్యాస్ లీక్ కాగా.. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు దగ్గరుండి మరీ గ్రామస్థులను పొరుగు ప్రాంతాలకు పంపించి వేశారు. గురువారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురికాగా, వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేయిస్తున్నారు. వాస్కో పట్టణం నుంచి పనాజీకి అమ్మోనియా గ్యాస్‌ను తీసుకెళ్తున్న ఓ ట్యాంకర్ ఉదయం 3గంటల సమయంలో చికాలిమ్ గ్రామం వద్ద హైవేపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ కావటంతో డ్రైవర్ అధికారులకు సమాచారం అందించాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఊరిని ఖాళీ చేయించారు. అంతా గాఢ నిద్రలో ఉండగా ఘటన చోటు చేసుకున్నప్పటికీ.. త్వరగతిన అప్రమత్తం కావటంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. ఆ ఇద్దరు మహిళలు ప్రమాదం నుంచి బయటపడ్డారన్నారు. ఇక గ్రామం వద్ద క్రాసింగ్ ఏర్పాటు చేసిన అధికారులు.. మరో దారి గుండా వాహనాలను మళ్లిస్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ టీం అక్కడి పరిస్థితిని సమీక్షిస్తోంది. గ్రామంలో 300 కుటుంబాలు ఉన్నాయని.. ప్రస్తుతం వారికి పొరుగు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో వసతి ఏర్పాటు చేశామని డిప్యూటీ కలెక్టర్ మహదేవ్ తెలిపారు. పరిస్థితి చక్కబడ్డాక వారందరినీ తిరిగి గ్రామంలోకి అనుమతిస్తామని ఆయన చెప్పారు. -
కరాచీ యూనివర్సిటీని ఖాళీ చేయించారు
కరాచీ: పాకిస్థాన్‌లోని కరాచీ విశ్వవిద్యాలయాన్ని బుధవారం అధికారులు ఖాళీ చేయించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో మూడు బాంబులున్నాయన్న సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకొని విద్యార్థులు, సిబ్బందిని యూనివర్సిటీ నుండి బయటకు పంపారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, పోలీసు సిబ్బంది బాంబులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. బాంబులున్నాయన్న వార్తలతో విద్యార్థులు, సిబ్బంది ప్రాణభయంతో యూనివర్సిటీ బయటకు పరుగులు తీశారని మీడియా సంస్థ డాన్ వెల్లడించింది. గత నెల పాక్‌లోని బచాఖాన్ యూనివర్సిటీపై జరిగిన ఉగ్రదాడిలో 24 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
బీబీసీ కార్యాలయం వద్ద బాంబు కలకలం
లండన్: ప్రపంచ ప్రఖ్యాత న్యూస్ ఛానెల్ బీబీసీ ప్రధాన కార్యాలయం వద్ద బాంబు కలకలం చెలరేగింది. సెంట్రల్ లండన్ లోని ఛానెల్ ఆఫీసు వద్ద ఓ అనుమానిత వాహనం గంటలకొద్ది నిలిచిఉండటంతో అందులో బాంబులు ఉన్నాయనే అనుమానం అక్కడి సిబ్బందిని వణికించింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బీబీసీ ఆఫీసుతోపాటు చుట్టుపక్కల కార్యాలయాలను ఖాళీచేయించారు. అనుమానిత కారును అణువణువూ పరిశోధించిన బాంబు స్క్వాడ్ చివరికి పేలుడు పదార్థాలేవీ లేవని తేల్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవలి పారిస్ దాడులు, అంతకు ముందు చార్లిస్ హెబ్డో పత్రికా కార్యాలయంపై ఉగ్రపంజా ఘటనల దృష్ట్యా ప్రధాన నగరాల్లోని అన్ని పత్రికా, టీవీ ఛానెళ్ల వద్ద నిఘా పెంచిన సంగతి తెలిసిందే. -
శ్రీకాకుళంజిల్లా తీరప్రాంతంలో అలజడి