Operation Kaveri: 3rd Batch Of 135 Indians Reaches Saudi Arabia - Sakshi
Sakshi News home page

Operation Kaveri: ముమ్మరంగా 'ఆపరేషన్ కావేరి'.. సూడాన్‌ నుంచి మరో 135 మంది తరలింపు

Published Wed, Apr 26 2023 10:59 AM | Last Updated on Wed, Apr 26 2023 11:17 AM

Operation Kaveri: 3rd Batch Of 135 Indians Reaches Saudi Arabia - Sakshi

సూడాన్‌ అంతర్గత యుద్ధంలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్‌ కావేరి’ పేరుతో చర్యలు చేపట్టింది.  భారత వాయుసేన, నావికా దళాల ద్వారా దశల వారీగా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా పూడాన్ నుంచి మూడో బ్యాచ్‌ కూడా  బయల్దేరింది.

సూడాన్‌ నుంచి మరో 135 మంది భారతీయులతో రెండో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ C-130J విమానం సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నట్లు విదేశీవ్యవహారాల సహాయమంత్రి వి మురళీధరన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

అంతకుముందు మొదటి బ్యాచ్‌లో భాగంగా భారత నావికాదళానికి చెందిన ‘ఐఎన్ఎస్ సుమేధ’ ద్వారా 278 మంది ప్రయాణికులు సూడాన్‌ పోర్టు నుంచి సౌదీకి చేరుకున్నారని విదేశీ వ్యవహారాలశాఖ పేర్కొంది. రెండో భాచ్‌లో 148 మంది భారతీయులను తొలి విమానంలో స్వదేశానికి తరలించినట్లు తెలిపింది. అయితే వీరిలో 160 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. కాగా సూడాన్‌లో 3 వేల మందికిపైగా భారతీయులు ఉన్నట్లు గుర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement