రఫా(గాజా స్ట్రిప్): గాజా దక్షిణాన ఉన్న చిట్టచివరి పెద్ద పట్టణం రఫాలో లక్షలాది మంది జనం ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. రఫాను ఖాళీచేసి వెళ్లాలని జనాలకు ఇజ్రాయెల్ సైనికబలగాలు మరోసారి ఆదేశించాయి. ఉత్తర దిశ నుంచి మొదలెట్టి దక్షిణం దిశగా భూతల దాడులతో ఆక్రమణలు, దాడులను ఇజ్రాయెల్ సైన్యం కొనసాగిస్తోంది.
అమెరికా, ఇతర మిత్రదేశాలు దూకుడు తగ్గించాలని మొత్తుకుంటున్నా ఇజ్రాయెల్ తన దాడులను ఆపట్లేదు. హమాస్ సాయుధుల ప్రతిదాడులతో శనివారం రఫా శివారుప్రాంతాలు భీకర రణక్షేత్రాలుగా మారిపోయాయి. రఫా తూర్పున మూడింట ఒక వంతు భూభాగంలో జనాలను ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఇప్పటికే ఖాళీచేయించింది. రఫా మొత్తాన్ని ఖాళీచేయించే దుస్సాహసానికి దిగితే మానవతా సాయం చాలా కష్టమవుతుందని, అమాయక పౌరుల మరణాలు మరింత పెరుగుతాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment